23 March 2023

అన్సార్ హర్వాణి: నేతాజీ సుభాస్ నమ్మకస్తుడు, మేనేజర్ Ansar Harvani: Netaji Subhas’ confidant, man manager

 


"అతను (నేతాజీ సుభాష్ చంద్రబోస్) విడుదలైనప్పుడు, అతను నన్ను (అన్సార్ హర్వాణి) మరియు ప్రబోధ్ చంద్రను లాహోర్ నుండి టెలిగ్రామ్ ద్వారా తనను(నేతాజీ సుభాష్ చంద్రబోస్)  కలవడానికి కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా)కి రమ్మని ఆహ్వానించాడు.. అది జనవరి 1941 ప్రారంభంలో, అతను(నేతాజీ సుభాష్ చంద్రబోస్)  నాతో ఇలా చెప్పాడు. అత్యంత శాంతియుతంగా మరియు అహింసాత్మక పద్ధతిలో రాజకీయ కారణాలతో జైలుకు వెళ్ళేందుకు గాంధీ, వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ప్రారంభించబోతున్నారు. అయితే జూన్ నెలాఖరులోపు రుతుపవనాలు ప్రారంభమయ్యేలోపు ఏదో పెద్ద సంఘటన  జరగబోతుంది, మరియు వీలైనoత  ఎక్కువ విద్యార్థి సంఘాలు జైళ్ల వెలుపల ఉండేలా చూడండి...... అతను (నేతాజీ సుభాష్ చంద్రబోస్) ఇండియన్ నేషనల్ ఆర్మీ  అధిపతిగా యూరప్‌కు వెళ్ళతాడని నేను ఊహించలేదు.. "

పై సంఘటనను అన్సార్  హర్వాణి తన జ్ఞాపకాలలో గుర్తు చేసుకున్నారు. అయితే అన్సార్ హర్వాణి ఎవరు? చరిత్ర పుస్తకాల కు ఎక్కని విప్లవకారుడు. అన్సార్ హర్వాణి, నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు గట్టి మద్దతుదారు, అన్సార్ హర్వాణి తల్లి అతనికి సలహా ఇచ్చింది, "నీకు  మంచి వ్యక్తిగత భవిష్యత్తు కావాలంటే సుభాస్‌ని విడిచిపెట్టి గాంధీతో  చేరు”.  కానీ, మాతృభూమిని ప్రేమించే వారు వ్యక్తిగత భవిష్యత్తుగురించి ఆలోచించగలరా?

అన్సార్ 1920ల మధ్యలో విద్యార్థిగా స్వాతంత్య్ర పోరాటంలోపాల్గొన్నాడు.. మొదట్లో, నెహ్రూ,  అన్సార్ ని బాగా ఆకట్టుకున్నారు, కాని అన్సార్ కి సుభాస్‌లో నాయకుడు దొరికాడు. అన్సార్ గుర్తుచేసుకున్నాడు, “విద్యార్థి నాయకుడిగా, నన్ను  జవహర్‌లాల్‌ను బాగా ఆకట్టుకున్నాను. కానీ, సుభాస్ బోస్ యొక్క మిలిటెన్సీ నన్ను మరింత ఆకట్టుకుంది.

అన్సార్ హర్వాణి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం మరియు వక్తృత్వ నైపుణ్యం ఉత్తరప్రదేశ్ నుండి అత్యంత ప్రజాదరణ పొందిన యువ నాయకులలో అన్సార్ హర్వాణిని ఒకరిగా చేసింది. స్వాతంత్ర్య పోరాటంలో విద్యార్థులను సంఘటితం చేసేందుకు 1936లో ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF) ఏర్పాటులో అన్సార్ ముఖ్య పాత్ర పోషించారు. అన్సార్ సుబాస్ కు బాగా దగ్గర అయిన సమయం అది. అన్సార్ ఇలా వ్రాశారు, “కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాస్ బోస్ ఎన్నిక విద్యార్థుల ఉద్యమానికి ఊతమిచ్చింది. బోస్ కు యువశక్తిపై అపారమైన విశ్వాసం ఉంది.. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆహ్వానాన్ని అంగీకరించవద్దని స్థానిక కాంగ్రెస్ కమిటీలు సూచించినప్పటికీ బోస్, స్టూడెంట్స్ ఫెడరేషన్ Students’ Federation ఏర్పాటు చేసిన  సమావేశాల్లో ప్రసంగించడమే కాదు,  స్టూడెంట్స్ ఫెడరేషన్ స్థానిక మరియు ప్రాంతీయ విద్యార్థుల నాయకులతో వ్యక్తిగత సంబంధాన్ని ఏర్పరచుకున్నారు.

విద్యార్థి నాయకులలో అన్సార్, సుభాస్‌కు అత్యంత సన్నిహితుడు. "కాంగ్రెస్ అధ్యక్షుడిగా సుభాస్ రెండవసారి పోటీ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు, యుపి నుండి అన్సార్  మరియు పంజాబ్ నుండి ప్రబోధ్ చంద్ర సలహా కోసం కలకత్తాకు బోస్ చే  పిలిపించబడినారు.

సుభాసు చంద్ర బోస్ , కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బలవంతంగా రాజీనామా చేయవలసి వచ్చిన తరువాత, స్వాతంత్ర్య ప్రతిజ్ఞ Independence pledge కూడా సవరించబడింది, ఈ చర్య నేతాజీచే ఆమోదించబడలేదు. సుభాస్‌కు ప్రజల మద్దతు తెలపడానికి, కాంగ్రెస్ సమావేశాన్ని నిర్వహించబోతున్న రోజున అన్సార్, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి సుభాసు చంద్ర బోస్ ను  లక్నోకు ఆహ్వానించారు. కాంగ్రస్ ఏర్పాటు చేసిన సమావేశానికి చాలా మంది కాంగ్రెస్ ప్రముఖులు హాజరు కావాల్సి ఉన్నందున ప్రెస్, అన్సార్ సమావేశాన్ని పెద్దగా పట్టించుకోలేదు.కాని  కాంగ్రెస్ సమావేశం కు ప్రజలు చాలా పలుచగా హాజరైనారు. అయితే "ప్రక్కనే ఉన్న పార్కులో (అన్సార్) అధ్యక్షత వహించిన సమావేశానికి సుభాస్ చంద్ర బోస్ ను భారీ ఊరేగింపుగా తీసుకువెళ్లారు మరియు బోస్ యువత మరియు విద్యార్థులతో నిండిన  భారీ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగించారు.."

రామ్‌ఘర్‌ Ramgarh సెషన్‌లో ప్రపంచ యుద్ధంలో సహాయం చేయడానికి బ్రిటిష్ వారితో రాజీని ప్రకటించాలని కాంగ్రెస్ నాయకత్వం భావిస్తూన్నట్లు సుభాస్ చంద్ర బోస్,  అన్సార్‌తో చెప్పారు. రామ్‌ఘర్‌కు చేరుకోవాలని, అదే రోజు అక్కడ రాజీ వ్యతిరేక సదస్సుకు సిద్ధం కావాలని బోస్, అన్సారీని కోరారు. స్వామి సహజానంద సరస్వతి, ధనరాజ్ శర్మలను కూడా సదస్సుకు తీసుకు రావాలని బోస్ కోరారు. కాని ఇది అంత తేలికైన పని కాదు.

అన్సారి,  రామ్‌ఘర్ కు చేరుకున్నప్పుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బిర్లా వంటి పారిశ్రామికవేత్తల డబ్బుతో '"కాంగ్రెస్ సెషన్ కోసం ఒక విశాలమైన టౌన్‌షిప్ నిర్మించబడింది".

స్వామి సహజానంద్ ఒక చిన్న గుడారంలో బస చేసారు. అయితే, సుభాస్ కోసం జనాల ప్రేమను స్వామి సహజానంద్ చూశాడు.సుభాస్ హాజరయ్యే సమావేశం కోసం  టౌన్‌షిప్‌ని నిర్మించడానికి వేలాది మంది కిసాన్ మరియు ఆదివాసీ వాలంటీర్లు పొరుగు అడవుల నుండి గడ్డిని సేకరించారు. వాలంటీర్లు కందిపప్పు మరియు బియ్యంతో కూడిన ఆహారాన్ని భుజించారు  మరియు ఆధునిక భారతీయ చరిత్రలో కనీవినీ విధంగా సమావేశం కోసం  పగలు మరియు రాత్రి పనిచేశారు.

”సమావేశం నిర్ణీత రోజున, బోస్  ముందుగానే వచ్చారు. అన్సార్ ఇలా అన్నారు:నేను బోస్, సమావేశ శిబిరం చుట్టూ తిరిగాము. పారిశుధ్య సౌకర్యాలను పరిశీలించి  బోస్ కొన్ని మెరుగుదలలు సూచించి వెళ్లిపోయారు.” విద్యార్థులు, రైతులు మరియు గిరిజనులు సుభాస్‌కు తమ హృదయపూర్వక మద్దతు ఇవ్వడంతో సుభాస్ నిర్వహించిన రాజీ వ్యతిరేక సదస్సు,  అసలు కాంగ్రెస్ సెషన్ కంటే ఎక్కువ మందిని ఆకర్షించింది. అన్సార్‌ మళ్లీ సుభాస్‌కు మాస్టర్‌ ప్లానర్‌గా నిరూపించుకున్నాడు. సుభాస్‌కు మద్దతునిచ్చిన మరియు ఫార్వర్డ్ బ్లాక్ అని పిలువబడే కాంగ్రెస్ వర్గానికి చెందిన ప్రముఖ నాయకులలో అన్సార్‌ ఒకరు.

భారత దేశ విముక్తి జపాన్, జెర్మనీ వంటి విదేశాల మద్దతు పొందటానికి బోస్ దేశం విడిచిపెట్టాడు. అన్సార్‌ అరెస్టు చేయబడినాడు. సుభాస్ చంద్ర బోస్ గురించి భారతీయులకు ఎలాంటి వార్త అందని సమయం అది. "సుభాస్ బోస్ మరియు అతని జాతీయ సైన్యం యొక్క కార్యకలాపాల గురించి (జైలులో ఉన్నప్పుడు) మాకు కమ్యూనిస్ట్ పేపర్ల నుండి వార్తలు రావడం ఆసక్తికరంగా ఉంది, వారు అతన్ని దేశద్రోహిగా మరియు జర్మన్లు మరియు జపనీయుల ఐదవ కాలమిస్ట్‌గా చిత్రీకరించారు." అని అన్సార్‌ అన్నాడు.

అలీపూర్ జైలులో జాతీయవాదులు జపాన్ దాడి పట్ల ఉత్సాహంగా ఉన్నారు. “1943లో క్రిస్మస్ పండుగ సందర్భంగా, కొన్ని జపాన్ విమానాలు కలకత్తా మీద బాంబులను విసిరాయి. జపాన్, సుభాస్ బోస్‌కు మిత్రులు కాబట్టి జపాన్ విమానాలను స్వాగతిస్తూ జైలు లోని భారత జాతీయవాదులు బందే మాతరంఅని అరిచారు.

చివరకు 1946లో విడుదలైనప్పుడు, విచారణకు ముందే అనేక మంది INA సైనికులను ఉరితీశారని ప్రపంచానికి తెలియజేసిన మొదటి వ్యక్తి అన్సార్. అన్సార్ ఇలా అన్నాడు, “నేను అలీపూర్ జైలులో  ఉన్న సమయంలో భారత జాతీయ సైన్యంINAలోని కనీసం ఇద్దరు వీర సైనికులు 'జై హింద్' అని నినాదాలు చేస్తూ ఉరితీయబడ్డారు. సుభాస్ బోస్‌ను నేతాజీ అని సంబోధించారని మరియు కొత్త జాతీయ వందనం జై హింద్అని చెప్పారని మేము వారి నుండి మొదటిసారి తెలుసుకున్నాము.

విభజన రూపంలో కాంగ్రెస్ అంగీకరించిన రాజీని అన్సార్ వ్యతిరేకించారు.

No comments:

Post a Comment