18 March 2023

విశ్వాసి తన తప్పులను ఒప్పుకుంటాడు మరియు దిద్దుబాటులు చేస్తాడు A believer of Islam confesses mistakes and makes course correction

 

ఇస్లామిక్ బోధనలు మన దైనందిన జీవితంలో వ్యక్తులతో ఎలా వ్యవహరించాలి  అనేదానిపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయి. ప్రవక్త(స) ఇలా పేర్కొన్నారు : "నేను ఉత్తమమైన మర్యాదలను పరిపూర్ణం చేయడానికి పంపబడ్డాను". ముస్లింలుగా, మనలో ప్రతి ఒక్కరూ, ఇతరులతో  ఎలా వ్యవహరిoచాలో  తెలుసుకోవాలి. మన మంచి ప్రవర్తన, వ్యవహారాలు,  మనం ఇతరులచే అంగీకరించబడేలా, ప్రేమించబడేలా మరియు మెచ్చుకునేలా చేయగలవు.

మనుషులకు రకరకాల కోరికలు ఉంటాయి. సమాజంలో మనుగడ సాగించాలంటే, కలతపెట్టే పరిస్థితులు, ప్రతికూల భావోద్వేగాలను అనుభవించడానికి ఒక వ్యక్తి సిద్దంగా ఉండాలి. మనం  క్రమం తప్పకుండా స్వీయ ప్రతిబింబం లేదా ఆత్మపరిశీలన self-reflection or introspection లో పాల్గొనడం చాలా ముఖ్యం.

రోజువారీ ఆత్మపరిశీలన ఇస్లాం యొక్క ప్రవక్త (స) యొక్క సున్నత్ లేదా జీవన విధానం లో ఒక భాగం. తరచుగా స్వీయ పరిశీలన మన ప్రవర్తన, మాటలు మరియు ఉద్దేశాలను పరిశీలించడానికి మరియు ఇస్లాం యొక్క ఆదర్శాలకు అనుగుణంగా జీవించడంలో మనకు సహాయపడుతుంది.క్రమం తప్పకుండా ఆత్మపరిశీలన చేసుకోవడం వల్ల మనం ఏదైనా చెడు వర్గంలో నిమగ్నమై ఉన్నామో లేదో తనిఖీ చేయడంలో సహాయపడుతుంది.

ఇస్లాంలో, వైన్ తీసుకోవడం, వడ్డీ వ్యాపారం చేయడం, హత్య చేయడం, వ్యభిచారం చేయడం మరియు పంది మాంసం తినడం వంటివి నిషేధించబడ్డాయి. ముస్లింలందరు  ఈ చర్యలకు దూరంగా ఉండాలి. ఇస్లాం వాటిని నిషేధించినందున వీటిని 'అన్యాయమైన చెడులు unjustified evils’' అని పిలుస్తారు. విశ్వాసులు వాటిని ఏ విధంగానూ సమర్థించలేరు.

దివ్య ఖురాన్‌లోని ఈ క్రింది ఆయత్ ఆత్మపరిశీలన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది:

·        నిశ్చయంగా దైవభీతి కలవారు, తమతో షైతాన్ తరుఫున ఏదన్నా చెడు ప్రేరేపణ కలిగినప్పుడు వెంటనే తెరుకొంటారు, అప్పటికప్పుడే వారికి దిశా నిర్దేశం అయిపోతుంది”-7:201.

కాబట్టి ఆత్మపరిశీలన అనేది దైవభీతికి సంబంధించినది. మీరు దేవుణ్ణి కనుగొన్నప్పుడు, మీరు దేవుణ్ణి సర్వశక్తిమంతుడిగా, సృష్టికర్తగా, తీర్పు దినానికి ప్రభువుగా కనుగొంటారు. ఈ భావన మిమ్మల్ని చాలా జాగ్రత్తగా చేస్తుంది మరియు  ఏదో ఒక రోజు మీరు దేవుని ముందుకు తీసుకురాబడతారని గ్రహిస్తారు.. దేవుడు ఈ ప్రపంచాన్ని పరీక్షా స్థలంగా సృష్టించాడు మరియు ఈ ప్రపంచంలోని ప్రతి మానవుడు పరీక్షకు గురయ్యాడు.

దేవుని గ్రంధం దివ్య ఖురాన్, చదివినప్పుడు, ఇద్దరు దేవదూతలు దైవిక పరిశీలకులుగా మన చర్యలు మరియు ఉద్దేశాలను రికార్డ్ చేయడంలో బిజీగా ఉన్నారని తెలుసుకుంటాము. ఈ రికార్డు దేవునికి సమర్పించబడుతుంది మరియు దాని ప్రకారం మనకు బహుమతి లేదా శిక్షించబడటం జరుగుతుంది.

 తప్పులు చేయడం మానవ స్వభావం, కానీ తప్పును అంగీకరించకపోవడమే నిజమైన తప్పు. నిజమైన విశ్వాసి తప్పులు చేయడని కాదు. బదులుగా, అతను తప్పు చేసినట్లు గుర్తించినప్పుడు, వెంటనే, ‘నేను తప్పు చేశానుఅని అంటాడు.తప్పును ఒప్పుకోవడం మనల్లి శుద్ధి చేసే ఆధ్యాత్మిక స్నానం వంటిది. ఇది స్థిరమైన మరియు నిజాయితీగల ఆత్మపరిశీలన ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.

 వర్తమానాన్ని ప్రతిబింబించడం/పరిశీలన ద్వారా మీరు భవిష్యత్తులో శిక్షను నివారించవచ్చు. మరణానికి ముందు జీవితాన్ని ప్రతిబింబించడం/పరిశీలన వలన మరణం తర్వాత పరిణామాలను అనుభవించకుండా నిరోధించవచ్చు. కాబట్టి, విశ్వాసం, ఇస్లాం, భగవంతుని గురించి తెలుసుకోవడం మరియు దైవభక్తి అన్నీ ఆత్మపరిశీలనపై ఆధారపడి ఉంటాయి. ఆత్మపరిశీలన/ ప్రతిబింబించకపోతే ఇస్లాం ఉనికిలో ఉండదు. ఆత్మపరిశీలన లేకుండా, ముస్లిం ఉనికిలో ఉండడు.


No comments:

Post a Comment