మీకు తెలుసా?
భారతదేశంలో ఇస్లామిక్ అధ్యయనాల యొక్క విభిన్న అంశాలను ప్రచారం చేయడంలో ముస్లిమేతర పండితులు ముఖ్యమైన పాత్ర పోషించారు.
Ø మొదటి పర్షియన్ భాషా వార్తాపత్రిక ఇరాన్ నుండి రాలేదు, రాజా రామ్ మోహన్ రాయ్ ద్వారా కలకత్తా నుండి ప్రచురించబడింది.
Ø లక్నోకు చెందిన మున్షీ నవల్ కిషోర్ తన ప్రసిద్ధ ప్రెస్‌లో పవిత్ర ఖురాన్‌ను ముద్రించడమే కాకుండా మదర్సాలకు స్టడీ మెటీరియల్‌ను కూడా అందించాడు.
మున్షీ నవల్ కిషోర్ తన
స్వంత ప్రెస్ స్థాపించి దాని ద్వారా ఇండో-ఇస్లామిక్ సంస్కృతిని ప్రచారం చేశాడు.
ఉర్దూ, అరబిక్ మరియు
పర్షియన్ సాహిత్యంతో పాటు,
ఖురాన్, అహదీత్, ఇస్లామిక్
న్యాయశాస్త్రం, వివరణ, వేదాంతశాస్త్రం
మరియు ఇస్లామిక్ శాస్త్రాలు మరియు తత్వశాస్త్రంపై పుస్తకాలను ప్రచురించాడు.మున్షి నవల్ కిషోర్ 1857 తర్వాత భారతదేశంలోని మేధో మరియు సాంస్కృతిక
వారసత్వాన్ని తన ప్రెస్ ద్వారా రక్షించడంలో కీలక పాత్ర పోషించాడు.
మున్షి నవల్ కిషోర్
అరబిక్, ఎక్సెజెటిక్ exegetic రచనలు, న్యాయశాస్త్రం
మరియు ఫత్వాలు, డిక్షనరీలు, పర్షియన్ భాష
మరియు సాహిత్యంపై పుస్తకాలు, సంస్కృత రచనలు మరియు గ్రంథాల నుండి ఉర్దూలోకి అనువాదాలు, కథలు మరియు
ఇతిహాసాలు మరియు ఉర్దూ జర్నలిజాన్ని తన ప్రెస్ ద్వారా, అవధ్ వార్తాపత్రిక ద్వారా ప్రచారం
చేయడంలో ప్రముఖ పాత్ర వహించాడు.
మాలిక్ రామ్ (1906-1993) ఇస్లామిక్ అధ్యయనాల యొక్క వివిధ అంశాలపై పనిచేసిన ప్రసిద్ధ పండితులలో ఒకరు.
మాలిక్ రామ్ ఇస్లాంలో
లింగ అధ్యయనాలు మరియు కవిత్వంపై పనిచేశాడు. మాలిక్ రామ్ పెర్షియన్ అరబిక్ మరియు ఉర్దూ
పండితుడు. మాలిక్ రామ్ ప్రధాన ఆసక్తి గాలిబ్. మాలిక్ రామ్ గాలిబ్
పై 'తల్మజా-ఎ-ఘాలిబ్', 'అయారే గాలిబ్' (1969), 'ఫసన్-ఎ-ఘాలిబ్' (1997), 'గుఫ్తార్-ఎ-ఘాలిబ్' (1985) రాశాడు.
మాలిక్ రామ్ 1951లో యునైటెడ్
ఇండియా ప్రెస్, లక్నో
ప్రచురించిన “ఔరత్ ఔర్ ఇస్లామీ తాలిం” ను
ఆంగ్లంలోకి అనువదించాడు, ఇందులో ఇస్లామిక్
సంస్కృతి మరియు చట్టంలో మహిళల స్థితి మరియు స్థానాన్నివివరించాడు.
మాలిక్ రామ్ రాసిన మరో పుస్తకం 'తజ్కిరా-ఇ-ముస్రీన్'. ఈ పుస్తకం, వాస్తవానికి సంస్మరణలుగా వ్రాసిన వ్యాసాల సమాహారం మరియు నాలుగు సంపుటాలుగా ప్రచురించబడింది. రావల్పిండి యొక్క అల్-ఫాత్ పబ్లికేషన్స్ ద్వారా ఒక సంపుటిలో ప్రచురించబడింది. అసలు నాలుగు సంపుటాలు 1967 మరియు 1977 మధ్య మరణించిన ఉర్దూ యొక్క ప్రముఖ రచయితల జీవితాలను వివరించాయి.
Ø పవిత్ర ఖురాన్‌ను
తెలుగులోకి అనువదించే మొదటి ప్రయత్నం అనంతపూర్‌లోని ప్రభుత్వ కళాశాలలో భాషా
శాస్త్ర అధ్యాపకుడు డాక్టర్ చిల్కూరి నారాయణరావు (1890-1952) చేత చేయబడింది.
1925లో చిలుకూరి నారాయణ రావుగారి “ఖురాన్ షరీఫ్” మద్రాసు లో ప్రచురణ జరిగింది. డాక్టర్ చిల్కూరి నారాయణరావు అనువాదం తెలుగు మాట్లాడే ముస్లింలతో పాటు ముస్లిమేతరులపై కూడా గణనీయమైన ప్రభావాన్ని చూపింది.
Ø మంగళ్ A. బుచ్, బాబా గోవింద్, డా. వి. మోహన్ మొదలగు పండితులు ఇస్లామిక్ అద్యాయనాలలో తమ వంతు సహకారం అందించారు.
Ø ప్రొఫెసర్ కె.ఎస్. రామకృష్ణారావు (జ.1932) ఇస్లాం ప్రవక్త ముహమ్మద్ (స) జీవితంపై “ముహమ్మద్, ఇస్లాం ప్రవక్త” అనే పుస్తకాన్ని రచించారు. 32 పేజీలతో కూడిన “ముహమ్మద్, ఇస్లాం ప్రవక్త” అనే పుస్తకo ఆరు భాగాలుగా విభజించబడింది, ఆరు భాగాలు పాఠకులకు ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) జీవితంలోని విభిన్న కోణాలను వెల్లడించే ఆరు అధ్యాయాలుగా ఉన్నవి.
Ø బంగ్లా బాష లో ఖురాన్ అనువాదకులలో గిరీష్
చంద్ర సేన్ మొదటి సంపూర్ణ అనువాదకులు.
Ø ఖురాన్ తమిళ్ అనువాదకులలో షేక్ ముస్తఫా,
బెరువాల శ్రీలంక, అబ్దుల్ హమీద్ భకావి ముఖ్యులు.
Ø ప్రొఫెసర్ సత్య దేవ్ వర్మ సంస్కృతం లో 1984
లో ఖురాన్ అనువదించినారు.
భారతదేశంలోని ముస్లిమేతర
పండితులు ఇస్లామిక్ అధ్యయనాల సహకారంలో గొప్ప కృషి చేసారు మరియు వారు దివ్య ఖురాన్, తఫ్సీర్, హదీసులు
న్యాయశాస్త్రం (ఫిఖ్), ప్రవక్త జీవిత
చరిత్ర (సిరా), నాత్ రచన
(ప్రవక్త మొహమ్మద్(స)ను ప్రశంసించే కవిత్వం) మరియు ఇస్లామిక్ చరిత్రపై పెద్ద
సంఖ్యలో రచనలు చేసారు.
విభిన్న విశ్వాసాలు ఉన్న
దేశంలో ప్రజల మధ్య సోదరభావం పెంచుటలో ముస్లిమేతరుల సహకారం ముఖ్యమైనది. జ్ఞానం
ఆధారంగా సర్వమత అవగాహనను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది..
No comments:
Post a Comment