మిడిల్ ఈస్ట్ మరియు అరబ్
ప్రాంతాలలో మాసహారతి Masaharatis అని పిలువబడే సెహ్రీ
ఖాన్‌లు, రంజాన్ సెహ్రీ కోసం ముస్లింలను మేల్కొలపడం చేస్తారు.
మాసహారతి అంటే పవిత్ర
మాసం రంజాన్ లో ఉపవాసం ఉన్నవారిని మేల్కొల్పేవారు. భారతదేశం మరియు దక్షిణాసియా
ప్రాంతంలో, వారిని సెహ్రీ
ఖాన్ అని పిలుస్తారు.
ఆధునిక సాంకేతికత యుగం లో
కూడా ఈ సంప్రదాయం సజీవంగా కొనసాగుతోంది. ముస్లిం సంప్రదాయాలు మరియు సంస్కృతిని
కాపాడటం మరియు చరిత్రను స్మరించుకోవడంలో భాగంగా ప్రజలు దీనిని చూస్తారు మరియు
ఇష్టపడతారు.
రంజాన్ సందర్భంగా, సెహ్రీ ఖాన్‌లు తెల్లవారుజామున
ఉపవాసం ఉన్నవారు నిద్ర నుండి లేచి, సెహ్రీని సిద్ధం చేసేందుకు తమ డ్రమ్‌ల బీట్‌కు
అనుగుణంగా స్థానిక పాటలు పాడతారు. ఇప్పటికీ చాలా
మంది పాత కాలపు వారు షెరీ ఖాన్‌ల పిలుపు “నిద్ర నుండి లేవండి” కోసం వేచి ఉంటారు,
అయితే, మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్ సంప్రదాయానికి
మధ్యప్రాచ్యంలో మరియు టర్కీ మరియు ఈజిప్ట్ వంటి దేశాలలో ప్రాముఖ్యత ఇవ్వబడింది; రంజాన్ సందర్భంగా
ఉదయం వేకప్ కాల్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్ సంప్రదాయo అరబ్
దేశాలలో:
మదీనాలో:
ఇస్లామిక్ ప్రపంచంలో, రంజాన్ నెలలో ఉపవాసం
ఉన్నవారిని తెల్లవారుజామున నిద్రలేపే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. హిజ్రీ 2వ సంవత్సరంలో
ఉపవాసం తప్పనిసరి అయిన తరువాత, మదీనాలోని ప్రజలు తెల్లవారుజామున ప్రజలను ఎలా మేల్కొలపాలి అని
తెలుసుకోవాలని భావించారు.
చారిత్రాత్మకంగా, మొదటి మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్ హజ్రత్ బిలాల్ హబాషి అని అందరికి తెలుసు. ఇస్లాం యొక్క మొదటి మ్యూజిన్ muezzin అయిన హజ్రత్ బిలాల్‌కు తెల్లవారుజామున ప్రార్థనల కోసం ముస్లింలను మేల్కొలిపే పనిని అప్పగించారు. ఉపవాస దీక్ష కోసం తెల్లవారుజామున మదీనా వీధుల్లో ఆధ్యాత్మిక స్వరం వినిపించిన తొలి వ్యక్తి హజ్రత్ బిలాల్.
సెహ్రీ కోసం ప్రజలను
మేల్కొలపడానికి మాసహారతి Masaharatis లేదా సెహ్రీ
ఖాన్ వారు పట్టణాలు మరియు నగరాల చుట్టూ తిరిగేటప్పుడు మండే కట్టెలను burning sticks మోసుకెళ్లేవారు.
ఈ పద్ధతి మదీనాలో ప్రాచుర్యం పొందింది మరియు కాలక్రమేణా చాలా మంది ప్రజలు కూడా
దీనిని అనుసరించారు.
మదీనా తర్వాత, మాసహారతి Masaharatis లేదా సెహ్రీ ఖాన్ బృందం అరేబియాలోని ఇతర
నగరాల్లోని ప్రజలను కూడా మేల్కొల్పింది. ప్రజలు ఈ సంప్రదాయాన్ని అనుసరించడం
ప్రారంభించారు మరియు ఇది ఇస్లామిక్ ప్రపంచం అంతటా వ్యాపించింది. మక్కాలో
మాసహారతిని జంజామి Zamzami అంటారు. జంజామి Zamzami ఒక లాంతరు తీసుకొని నగరం చుట్టూ తిరుగుతాడు, తద్వారా వ్యక్తి
శబ్దానికి మేల్కొనకపోతే, జంజామి లాంతరు కాంతికి మేల్కొంటాడు.
సుడాన్లో:
మాసహారతి తెల్లవారుజామున ప్రార్థనల సమయంలో పిలవాలనుకున్న వ్యక్తులందరి
జాబితాను కలిగి ఉన్న ఒక పిల్లవానితో కలిసి
సుడాన్ వీధుల్లో తిరుగుతాడు. మాసహారతి-పిల్లవాని ద్వయం ప్రతి ఇంటి ముందు నిలబడి ఉపవాసం కోసం ఆ ఇంటి
వాసుల పేరును పిలుస్తుంది మరియు వారు వీధి మూలలో
నిలబడి, డ్రమ్ యొక్క బీట్‌తో
అల్లాను స్తుతిస్తారు. రంజాన్ మాసం చివరిలో,
ప్రజలు వారికి
బహుమతులు ఇస్తారు.
టర్కీ లో:
టర్కీలో, ఉపవాసం ఉన్న ముస్లింలను తెల్లవారుజామున డప్పులు వాయిస్తూ నిద్రలేపే సంప్రదాయం ఇప్పటికీ సజీవంగా ఉంది మరియు అది టర్కీ సంస్కృతిలో భాగమైంది. రంజాన్ చంద్రుడు కనిపించిన వెంటనే, డప్పులు వాయిస్తూ ఇతరులను నిద్రలేపే వాలంటీర్లు, పవిత్ర మాస ఆగమనాన్ని సూచించడానికి సాంప్రదాయ దుస్తులలో మసీదుల ప్రాంగణంలో గుమిగూడి డప్పులు వాయిస్తారు.
సెహ్రీలో డ్రమ్స్ వాయించే ఈ సంప్రదాయం ఒట్టోమన్ కాలిఫేట్ యుగంలో టర్కీకి వచ్చింది. ప్రస్తుత ఆధునిక టర్కీలో, ఈ సంప్రదాయాలు అధికారిక స్థాయిలో ఆదరించబడుతున్నాయి. దీంతో సెహ్రీకి డ్రమ్మర్‌ల సంఖ్య ఏటా పెరుగుతోంది. రంజాన్‌లో ఇతరులను మేల్కొలిపే టర్కీ కళాకారుల కు (నిద్రలేపే వాలంటీర్లు) అధికారిక జీతం లేదా వేతనాలు లభించవు, కానీ ప్రజలు డబ్బును బహుమతిగా ఇవ్వడానికి సంతోషిస్తారు మరియు వారు దానిని 'క్షమాపణ కోరే బహుమతి'గా భావిస్తారు. రంజాన్ ప్రారంభంలో, ఒట్టోమన్-యుగం దుస్తులలో టర్కిష్ డ్రమ్మర్లను ఇస్తాంబుల్ చుట్టూ చూడవచ్చు. టర్కీలో తెల్లవారుజామున ముస్లింలను మేల్కొలపడంలో 2,000 కంటే ఎక్కువ డ్రమ్మర్ గ్రూపులు ఉన్నాయి.
మీకు ఆశ్చర్యం కలగవచ్చు కానీ ఈజిప్టులో ఒక రాజు ఉన్నాడు, ఆ రాజు తెల్లవారుజామున తన ప్రజలను మేల్కొలపడానికి రాత్రిపూట బయటకు వెళ్లేవాడు. ఈ పాలకుని చరిత్రలో ఉత్బా ఇబ్న్ ఇషాక్ అని పిలుస్తారు. 19వ శతాబ్ద కాలంలో ఉత్బా ఇబ్న్ ఇషాక్ కైరో వీధుల్లో తిరిగి "నిద్రపోతున్న వారు లేచి అల్లాను ఆరాధించండి" అంటూ ప్రజలను కవితాత్మకంగా మేల్కొలిపిన మొదటి వ్యక్తి.
భారతదేశం మరియు
పాకిస్తాన్‌లో కొంతమంది షరాబ్‌లు Shahrabs ఉదయాన్నే
నిద్రలేచి పాటలు మరియు కీర్తనలు పాడుతూ అందరిని లేపడం మన అందరికి తెలుసు.
కాలక్రమేణా వారి సంఖ్య తగ్గింది.
No comments:
Post a Comment