20 March 2023

క్లియోపాత్రా-ఈజిప్ట్ రాణి 51–30 BC

 

ఈజిప్ట్ రాణి క్లియోపాత్రా పూర్తి పేరు  క్లియోపాత్రా VII థియా ఫిలోపేటర్.  క్లియోపాత్రా  (జననం 70/69 BC, ఆగస్టు 30 BCలో అలెగ్జాండ్రియాలో మరణం) క్లియోపాత్రా, ఈజిప్షియన్ రాణిగా  చరిత్రలో ప్రసిద్ధి చెందింది మరియు జూలియస్ సీజర్ ప్రేమికురాలు lover మరియు తరువాత మార్క్ ఆంటోనీ భార్యగా ప్రసిద్ది చెందినది.  

51 BCలో క్లియోపాత్రా,తన తండ్రి టోలెమీ XII మరణంతో ఈజిప్ట్ రాణి అయ్యింది మరియు క్లియోపాత్రా తన ఇద్దరు సోదరులు టోలెమీ XIII (51–47) మరియు టోలెమీ XIV (47–44) మరియు కుమారుడు టోలెమీ XV సీజర్ (44–30)తో కలిసి అలెగ్జాండ్రియా ఈజిప్ట్ పాలించినది.

ఆక్టేవియన్ (భవిష్యత్ చక్రవర్తి అగస్టస్) యొక్క రోమన్ సైన్యాలు తమ సంయుక్త దళాలను ఓడించిన తరువాత, ఆంటోనీ మరియు క్లియోపాత్రా ఆత్మహత్య చేసుకున్నారు మరియు రోమన్ ఆధిపత్యంలోకి ఈజిప్ట్  వచ్చింది. క్లియోపాత్రా రోమన్ రాజకీయాలను ప్రభావితం చేసింది.

ఈజిప్టును పాలించిన మాసిడోనియన్ రాజవంశస్తుడు  కింగ్ టోలెమీ XII ఔలెట్స్ యొక్క కుమార్తె, క్లియోపాత్రా.  టోలెమీ వంశమును అలెగ్జాండర్ ది గ్రేట్ యొక్క సైనిక   జనరల్ టోలెమీ స్థాపించాడు. జనరల్ టోలెమీ,  ఈజిప్ట్ రాజు టోలెమీI సోటర్ అయ్యాడు. క్లియోపాత్రా మాసిడోనియన్ సంతతికి చెందినది మరియు ఈజిప్షియన్ బాషను నేర్చుకోంది మరియు క్లియోపాత్రా ఐసిస్ దేవత యొక్క సజీవ స్వరూపంగా కూడా పేర్కొనబడినది.

 

టోలెమీ XII 51BCలో మరణించినప్పుడు, సింహాసనం అతని చిన్న కుమారుడు టోలెమీ XIII మరియు కుమార్తె క్లియోపాత్రా VIIకి చేరింది. అప్పటి వంశాచారం ప్రకారం తండ్రి మరణించిన వెంటనే టోలెమీ XIII మరియు కుమార్తె క్లియోపాత్రా VIIఇద్దరూ(అక్కా-తమ్ముడు వివాహం చేసుకున్నారు అని చెప్పబడినది. ( బహుశా ఇది  నిరూపించబడలేదు.)

18 ఏళ్ల క్లియోపాత్రా, ఆమె సోదరుడి (టోలెమీ XIII) కంటే దాదాపు ఎనిమిది సంవత్సరాలు పెద్దది, ఆధిపత్య పాలకురాలిగా మారింది. అంతర్గత రాజకీయ కారణాల వల్ల క్లియోపాత్రా ఈజిప్ట్ వదిలి  సిరియాకు పారిపోవలసి వచ్చింది, అక్కడ క్లియోపాత్రా సైన్యాన్ని సేకరించినది మరియు 48 BCలో ఈజిప్ట్ యొక్క తూర్పు సరిహద్దులో ఉన్న పెలుసియం వద్ద తన సోదరుడిని (టోలెమీ XIII) ఎదుర్కొనేందుకు తిరిగి వచ్చింది. పెలుసియంలో టోలెమీ XIII నుండి ఆశ్రయం పొందిన రోమన్ జనరల్ పాంపీ హత్య మరియు జూలియస్ సీజర్ రాక తాత్కాలిక శాంతిని తెచ్చిపెట్టింది.

క్లియోపాత్రా తన సింహాసనాన్ని తిరిగి పొందాలంటే, తనకు రోమన్ మద్దతు అవసరమని లేదా మరింత ప్రత్యేకంగా, జూలియస్ సీజర్ మద్దతు అవసరమని గ్రహించింది. ఒకరిని ఒకరు (క్లియోపాత్రా-జూలియస్ సీజర్) ఉపయోగించుకోవాలని నిశ్చయించుకున్నారు. జూలియస్ సీజర్ తన సింహాసనాన్ని నిలుపుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లియోపాత్రా తన సింహాసనాన్ని నిలుపుకోవాలని మరియు వీలైతే, టోలెమీల వైభవాన్ని పునరుద్ధరించాలని మరియు దక్షిణ సిరియా మరియు పాలస్తీనాలను కలిగి ఉన్న టోలెమీ రాజ్యoను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని నిశ్చయించుకుంది.

జూలియస్ సీజర్ మరియు క్లియోపాత్రా ప్రేమికులుగా మారారు మరియు శీతాకాలంలో అలెగ్జాండ్రియాపై  ముట్టడి  చేశారు. రోమన్ బలగాలు తరువాతి వసంతకాలంలో వచ్చాయి మరియు టోలెమీ XIII పారిపోయి నైలు నదిలో మునిగి ఆత్మహత్య చేసుకొన్నాడు.  క్లియోపాత్రా, అప్పుడు తన సోదరుడు టోలెమీ XIVని వివాహం చేసుకుంది మరియు అలెగ్జాండ్రియా కు  రాణి అయినది. జూన్ 47 BCలో క్లియోపాత్రా, టోలెమీ సీజర్‌ లేదా టోలెమీ ఫిలడెల్ఫస్ (అలెగ్జాండ్రియా ప్రజలు అతన్ని  సిజారియన్ లేదా "చిన్న సీజర్" అని పిలుస్తారు)కు జన్మనిచ్చింది. అయితే దీనికి రుజువులు లేవు.

పాంపియన్ వ్యతిరేకతను అణిచివేయడానికి సీజర్‌కు రెండు సంవత్సరాలు పట్టింది. సీజర్‌, రోమ్‌కు తిరిగి వచ్చిన వెంటనే, 46 BCలో, విదేశీ శత్రువు (టోలెమీ XIII) పై విజయం సాధించిన సందర్భం లో   నాలుగు-రోజుల విజయోత్సవాన్ని జరుపుకున్నాడు. విజయోత్సవo లో  క్లియోపాత్రా యొక్క చెల్లెలు మరియు శత్రు సోదరి అర్సినోను ఊరేగించారు.

క్లియోపాత్రా తన భర్త-సోదరుడు husband-brother మరియు కొడుకు టోలెమీ ఫిలడెల్ఫస్ తో కలిసి రోమ్‌ రాజ్య పర్యటన చేసింది. టైబర్ నదికి ఆవల ఉన్న సీజర్ ప్రైవేట్ విల్లాలో క్లియోపాత్రాకు వసతి కల్పించబడింది మరియు జూలియన్ సీజర్ చెందిన జూలియన్ కుటుంబానికి చెందిన పూర్వీకురాలు వీనస్ జెనెట్రిక్స్ ఆలయంలో క్లియోపాత్రా బంగారు విగ్రహాన్ని ప్రతిష్ఠించబడినది. 44 BCEలో సీజర్ హత్యకు గురైనప్పుడు క్లియోపాత్రా రోమ్‌లో ఉంది.

రోమ్ నుంచి క్లియోపాత్రా, అలెగ్జాండ్రియాకు తిరిగి వచ్చిన వెంటనే, 44 BCEలో, క్లియోపాత్రా సహ పాలకుడు టోలెమీ XIV మరణించాడు. క్లియోపాత్రా, తన శిశు కుమారుడు టోలెమీ XV సీజర్‌తో కలిసి పరిపాలించింది. 42 BCలో ఫిలిప్పీ యుద్ధంలో, సీజర్ యొక్క హంతకులు చంపబడినప్పుడు, మార్క్ ఆంటోనీ, సీజర్ యొక్క మేనల్లుడు, వారసుడిగా ఉన్న బాల ఆక్టేవియన్ Octavian స్థానం లో అధికారానికి వారసుడు అయ్యాడు.

 రోమ్ యొక్క తూర్పు భూభాగాలు  మార్క్ ఆంటోనీ,నియంత్రణ లోనికి వచ్చాయి. మార్క్ ఆంటోనీ, సీజర్ హత్య తర్వాత క్లియోపాత్రా పాత్రను వివరించడానికి క్లియోపాత్రా ను రోముకు పిలిపించాడు.

క్లియోపాత్రా ఆసియా మైనర్‌లోని టార్సస్‌కు బహుమతులతో బయలుదేరింది, ఆంటోనీ నిరీక్షణను పెంచడానికి క్లియోపాత్రా తన రాకను ఆలస్యం చేసింది. క్లియోపాత్రా,  రోమన్ దేవత ఐసిస్ దుస్తులను ధరించి ఒక పడవలో  సిడ్నస్ Cydnus నదిపై పడవలో ప్రయాణించడం ద్వారా రోమ్ నగరంలోకి ప్రవేశించింది. గ్రీక్ దేవుడు డియోనిసస్ తో తనను తాను సమానం చేసుకున్న మార్క్  ఆంటోనీ మనసు క్లియోపాత్రా దోచుకున్నది.

ఇటలీలో యువ ఆక్టేవియన్ young Octavian యొక్క పెరుగుతున్న ప్రాబల్యం కు వ్యతిరేకంగా తన భర్త ప్రయోజనాలను కాపాడుకోవడానికి కృషి చేస్తున్న భార్య ఫుల్వియాను మరచిపోయి, ఆంటోనీ అలెగ్జాండ్రియాకు తిరిగి వచ్చాడు. ఆంటోనీ క్లియోపాత్రాను "రక్షిత" సార్వభౌమాధికారిగా protected” sovereign  కాకుండా స్వతంత్ర చక్రవర్తిగా independent monarch పరిగణించాడు.

అలెగ్జాండ్రియాలో, క్లియోపాత్రా మరియు ఆంటోనీ కలసి సుఖంగా జీవించారు. కొంతమంది చరిత్రకారులు దీనిని అసభ్యత మరియు మూర్ఖత్వంతో కూడిన జీవితంగా వ్యాఖ్యానించగా  మరికొందరు  వారిని ఆధ్యాత్మిక దేవుడు డియోనిసస్ యొక్క ఆరాధనకు అంకితమైన జీవితాలుగా భావించారు.

40BCలో క్లియోపాత్రా కవలలకు జన్మనిచ్చింది, వారికి  అలెగ్జాండర్ హీలియోస్ మరియు క్లియోపాత్రా సెలీన్ అని పేరు పెట్టారు. ఇటలీకి తిరిగి రావడానికి ఆంటోనీ అప్పటికే అలెగ్జాండ్రియాను విడిచిపెట్టాడు. రోమ్ లో  ఆంటోనీ, యువ  ఆక్టేవియన్‌తో తాత్కాలిక పరిష్కారాన్ని చేసుకొన్నాడు. ఈ పరిష్కారంలో భాగంగా, ఆంటోనీ,  ఆక్టేవియన్ సోదరి ఆక్టేవియాను (అప్పటికే మార్క్ ఆంటోని మొదటి భార్య ఫుల్వియా మరణించినది) వివాహం చేసుకున్నాడు.

మూడు సంవత్సరాల తర్వాత ఆంటోనీ మరియు ఆక్టేవియన్ విభేదాలతో కాపురం చేయలేక ఆంటోనీ తూర్పుకు తిరిగి వచ్చి క్లియోపాత్రాను  తిరిగి కలుసుకున్నాడు. పార్థియన్ సైనిక యాత్రకు ఆంటోనికి, క్లియోపాత్రా ఆర్థిక సహాయం అవసరం. దానికి బదులుగా క్లియోపాత్రా, ఈజిప్ట్ యొక్క తూర్పు సామ్రాజ్యంలో చాలా వరకు తిరిగి ఇవ్వాలని అభ్యర్థించింది. ఇందులో సిరియా మరియు లెబనాన్ మరియు జెరిఖోలోని గొప్ప బాల్సమ్ తోటలు కూడా ఉన్నాయి.

ఆర్మేనియాను తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లుగానే ఆంటోనీ, పార్థియన్ సైనిక యాత్ర విఫలమైంది. 34BCలో ఆంటోనీ అలెగ్జాండ్రియాలో  విజయవంతమైన పునరాగమనాన్ని జరుపుకున్నాడు. దీని తర్వాత "అలెగ్జాండ్రియా విరాళాలు" అని పిలువబడే ఒక వేడుక జరిగింది. వెండి వేదికపై బంగారు సింహాసనాలపై కూర్చున్న క్లియోపాత్రా మరియు ఆంటోనీలను చూసేందుకు జనాలు జిమ్నాసియంకు తరలివచ్చారు, వారి పిల్లలు వారి పక్కన కొద్దిగా దిగువ సింహాసనాలపై కూర్చున్నారు. ఆంటోనీ, సీజరియన్/టోలెమీ సీజర్‌ లేదా టోలెమీ ఫిలాడేల్ఫస్ ను (అలెగ్జాండ్రియా  ప్రజలు అతన్ని   సిజారియన్ లేదా చిన్న సీజర్ అని పిలుస్తారు)  సీజర్ కుమారుడిగా ప్రకటించాడు. దీనితో  సీజర్ తన కుమారుడు మరియు వారసుడిగా దత్తత తీసుకున్న ఆక్టేవియన్‌ దత్తతను చట్టవిరుద్ధంగా   ప్రకటించి బహిష్కరించాడు.

క్లియోపాత్రా రాజుల రాణిగా, సిజేరియన్ రాజుల రాజుగా కీర్తించబడ్డారు. అలెగ్జాండర్ హీలియోస్‌కు అర్మేనియా మరియు యూఫ్రేట్స్ అవతల ఉన్న భూభాగాన్ని, అతని శిశు సోదరుడు infant brother టోలెమీకి పశ్చిమాన ఉన్న భూములను ప్రదానం చేశారు. అలెగ్జాండర్ హీలియోస్‌, టోలెమీకు ల సోదరి, క్లియోపాత్రా సెలీన్  ను సిరేన్‌కు పాలకురాలుగా నియమించాడు.

రోమ్ నుండి ఇది అంతా చూస్తున్న ఆక్టేవియన్‌కు, ఆంటోనీ ప్రణాళిక   స్పష్టంగా అర్థమైంది. ఆంటోనీ కు వ్యతిరేకంగా ప్రచార యుద్ధం మొదలైంది. ఆక్టేవియన్ వెస్టల్ వర్జిన్స్ ఆలయం నుండి ఆంటోనీ యొక్క వీలునామాను (లేదా అతను ఆంటోనీ యొక్క సంకల్పం అని పేర్కొన్నాడు) స్వాధీనం చేసుకున్నాడు. వీలునామా ప్రకారం ఆంటోనీ ఒక విదేశీ మహిళ(క్లియోపాత్ర)కు రోమన్ ఆస్తులను ప్రసాదించడమే కాకుండా ఈజిప్టులో క్లియోపాత్ర పక్కన ఆంటోనీ పాతిపెట్టబడాలి. ఆంటోనీ రాజధానిని రోమ్ నుండి అలెగ్జాండ్రియాకు బదిలీ చేయాలని భావించినట్లు పుకారు త్వరగా వ్యాపించింది.

ఆంటోనీ మరియు క్లియోపాత్రా 32-31 BC శీతాకాలాన్ని గ్రీస్‌లో గడిపారు. రోమన్ సెనేట్, ఆంటోనీని తరువాతి సంవత్సరానికి అతని కాబోయే కాన్సులేట్‌ను రద్దు చేసింది మరియు క్లియోపాత్రాపై యుద్ధం ప్రకటించింది. సెప్టెంబరు2, 31 BCన ఆంటోనీ మరియు క్లియోపాత్రా సంయుక్త దళాలకు  మరియు  ఆక్టేవియన్ దళాలకు మద్య జరిగిన నావల్ బాటిల్ ఆఫ్ ఆక్టియం, ఈజిప్షియన్లకు విపత్తుగా మారింది.

ఆంటోనీ మరియు క్లియోపాత్రా ఈజిప్ట్‌కు పారిపోయారు మరియు ఆంటోనీ తన చివరి యుద్ధంలో పోరాడటానికి బయలుదేరినాడు. క్లియోపాత్రా చనిపోయిందని తప్పుడు వార్తను అందుకున్న ఆంటోనీ కత్తి మీద పడ్డాడు. ఆంటోనీ స్వయంగా క్లియోపాత్రా ను ఆక్టేవియన్‌తో సంధి కుదుర్చుకోమని చెప్పి మరణించాడు.

క్లియోపాత్రా ఆంటోనీని పాతిపెట్టి ఆత్మహత్య చేసుకుంది. క్లియోపాత్రా మరణం పై విబిన్న కధనాలు కలవు. దైవిక రాజరికానికి చిహ్నంగా ఉన్న ఆస్ప్ ద్వారా క్లియోపాత్రా తనను తాను చంపుకుందని నమ్ముతారు. చనిపోయేనాటికి  క్లియోపాత్రా కు 39 ఏళ్లు మరియు 22 సంవత్సరాలు రాణిగా మరియు 11 సంవత్సరాలు ఆంటోనీ భాగస్వామినిగా ఉన్నది. క్లియోపాత్రా-ఆంటోని  కోరుకున్నట్లుగా వారు కలిసి ఖననం చేయబడ్డారు మరియు వారితో పాటు రోమన్ రిపబ్లిక్ ఖననం చేయబడింది.

 

క్లియోపాత్రా ఖ్యాతి – యుగయుగాలుగా Cleopatra through the ages:

ఈజిప్ట్‌ చరిత్రలో అనేక వందల మంది రాణులు కలరు.  వారు ఈజిప్ట్‌ లో ప్రసిద్ధి చెందినప్పటికీ, బయట ప్రపంచంలో వారి గురించి ఎక్కువ తెలియదు. రాజవంశ యుగం ముగియడంతో మరియు చిత్రలిపి వర్ణనhieroglyphic script కోల్పోయినందున, రాణుల కథలు మరచిపోయాయి మరియు వారి స్మారక చిహ్నాలు ఈజిప్ట్ ఇసుక కింద ఖననం చేయబడ్డాయి.

క్లియోపాత్రా అత్యంత అక్షరాస్యత కలిగిన కాలం లో జీవించింది మరియు ఆమె చర్యలు రోమన్ సామ్రాజ్యం పై ప్రభావం చూపాయి.ఆక్టేవియన్ (భవిష్యత్ చక్రవర్తి అగస్టస్) రోమన్ చరిత్ర ను తనకు అనుకూలంగా తను పాలించే హక్కును నిర్ధారించే విధంగా నమోదు చేయాలని నిర్ణయించుకున్నాడు. దీనిని సాధించడానికి, ఆక్టేవియన్ (భవిష్యత్ చక్రవర్తి అగస్టస్) తన స్వీయ జీవిత చరిత్రను ప్రచురించాడు మరియు రోమ్ యొక్క అధికారిక రికార్డులను సెన్సార్ చేశాడు. క్లియోపాత్రా తన అధికార పోరాటంలో కీలక పాత్ర పోషించినందున, క్లియోపాత్రా కథ దానిలో అంతర్భాగంగా భద్రపరచబడింది. కానీ అది కేవలం రెండు ఎపిసోడ్‌లకు తగ్గించబడింది. జూలియస్ సీజర్ మరియు మార్క్ ఆంటోనీతో,  క్లియోపాత్రా సంబంధాలు రోమన్ కులీన యుద్ద పురుషులను ప్రలోభపెట్టిన అనైతిక విదేశీ మహిళగా గుర్తుంచబడ్డాయి.

క్లియోపాత్రా పాశ్చాత్య సంస్కృతిలోకి గౌరవప్రదమైన మరణం ద్వారా మంచి చేసిన దుష్ట జీవితం యొక్క కథగా చెప్పబడింది మరియు పునర్విమర్శించబడింది.

ప్లూటార్క్ యొక్క సమాంతర జీవితాలుPlutarch’s Parallel Lives, జాక్వెస్ అమియోట్ (1559) ద్వారా గ్రీకు నుండి ఫ్రెంచ్‌లోకి మరియు సర్ థామస్ నార్త్ (1579) ద్వారా ఫ్రెంచ్ నుండి ఆంగ్లంలోకి అనువదించబడి, షేక్స్‌పియర్ నాటకం ఆంటోనీ మరియు క్లియోపాత్రా (1606-07) వెనుక ప్రేరణగా పనిచేసింది. షేక్స్పియర్ నుండి క్లియోపాత్రా-నేపథ్య కళ-నాటకాలు, కవిత్వం, పెయింటింగ్స్ మరియు ఒపేరాల సంపద వచ్చింది.


640 CEలో ఈజిప్టును అరబ్ ఆక్రమణ తర్వాత ముస్లిం పండితులు, క్లియోపాత్రా  వ్యక్తిత్వం ను అద్యయనం చేసారు. ముస్లిముల దృష్టిలో క్లియోపాత్రా పండితురాలు మరియు శాస్త్రవేత్త, ప్రతిభావంతులైన తత్వవేత్త మరియు రసాయన శాస్త్రవేత్త.

ప్రాచీన చరిత్రలో టోలెమిక్ క్వీన్ క్లియోపాత్రా VII లేదా క్లియోపాత్రా, జీవితం సౌందర్యానికి, శృంగార జీవితానికి ప్రతీకగా నిలిచినది. అయితే క్లియోపాత్రా చిత్రణ తూర్పున చాలా భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకించి ఇస్లామిక్ మూలాల్లో, క్లియోపాత్రా సమర్థత మరియు విజయవంతమైన పాలకురాలిగా గుర్తుపెట్టుకోవడం మనం చూస్తాము.

మధ్యయుగ అరబిక్ ప్రపంచంలో మహిళలు శక్తివంతంగా ఉండేందుకు ప్రోత్సహించబడ్డారు. ఇస్లామిక్ ప్రపంచం లో అనేక మంది మహిళలు రాజ్యాలను పాలించారు, ఇంకా అనేక మంది మహిళలు శాస్త్రీయ మరియు మేధావులుగా పెద్ద సంఖ్యలో ఉన్నారు.

ఇస్లామిక్ మూలాధారాల ప్రకారం  క్లియోపాత్రా, ఔషధం, భాషలు మరియు రసవాదంలో ప్రతిభావంతురాలు అని చెప్పబడినది.అరబ్ చరిత్రకారుడు ఇబ్న్ బత్రీక్ Ibn Baṭrīq’s తన 'యూనివర్సల్ హిస్టరీ'లో క్లియోపాత్రా గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు:"ఆమె [క్లియోపాత్రా] అలెగ్జాండ్రియాలో అనేక గొప్ప భవనాలను మరియు అనేక అద్భుతమైన వస్తువులను నిర్మించింది, [ఆమె] [క్లియోపాత్రా] మొజాయిక్ పనిని పరిచయం చేసింది మరియు "శని దేవాలయం the Temple of Saturn " అని పిలువబడే గంభీరమైన ఆలయాన్ని నిర్మించింది. క్లియోపాత్రా ఈజిప్ట్ నైలు జలాలను అదుపులో ఉంచడానికి ఇఖ్మిమ్ నగరంలో హైడ్రోమీటర్‌ను నిర్మించారు. ఆ తర్వాత అన్సినా పట్టణంలో మరో నిలోమీటర్‌ను నిర్మించింది”

ఇబ్న్ బత్రీక్ నిజానికి మార్క్ ఆంటోనీని ' క్లియోపాత్రా లెఫ్టినెంట్'గా పేర్కొన్నాడు.

ఇబ్న్ బత్రీక్ కధనమును  7వ శతాబ్దం CEలో, ఈజిప్ట్‌ ను ముస్లింల స్వాధీన సమయంలో ఉన్న న జాన్ ఆఫ్ నికియో అనే ఈజిప్షియన్ బిషప్ యొక్క రచనలు దృవీకరించాయి. జాన్ ఆఫ్ నికియో, క్లియోపాత్రాను ఇలా వర్ణించాడు:

“...ధైర్యం మరియు శక్తితో  క్లియోపాత్రా సాధించిన విజయాలు గొప్పవి.  గొప్పది. క్లియోపాత్రా ను ముందుండి నడిపించిన రాజులు ఎవరూ లేరు. క్లియోపాత్రా, అలెగ్జాండ్రియా నగరం యొక్క శ్రేయస్సు కోసం గొప్ప పనులను అమలు చేసింది. మరియు ముఖ్యమైన సంస్థలను సృష్టించింది.

జాన్ ఆఫ్ నికియో ప్రకారం, క్వీన్ క్లియోపాత్రా ప్రతిభావంతురాలు మరియు  అద్భుతమైన మరియు అనితరమైన సాధ్యం అయిన ఒక పాలకురాలు.

క్లియోపాత్రా యొక్క ప్రసిద్ధ అందం ఇస్లామిక్ మూలాలలో ఎప్పుడూ ప్రస్తావించబడలేదు.అరబిక్ మూలాలు క్లియోపాత్రా ను  అత్యంత మేధో మరియు అత్యంత సామర్థ్యం గల మహిళ అని తెలియజేస్తాయి. ఇస్లామిక్ ప్రపంచం ఆమెను సమర్థుడైన చక్రవర్తి మరియు పండితునిగా గుర్తుచేసుకుంది.


20వ శతాబ్దంలో క్లియోపాత్రా కథ భద్రపరచబడింది మరియు సినిమా ద్వారా మరింత అభివృద్ధి చేయబడింది. థెడా బారాTheda Bara (1917), క్లాడెట్ కోల్‌బర్ట్ (1934) మరియు ఎలిజబెత్ టేలర్ (1963)తో సహా చాలా మంది నటీమణులు క్లియోపాత్రా రాణి పాత్రను పోషించారు. క్లియోపాత్రా యొక్క సమ్మోహన సౌందర్యం కాస్మెటిక్స్ నుండి సిగరెట్‌ల వరకు అనేక రకాల ఉత్పత్తులను విక్రయించడానికి ఉపయోగించబడింది. 20వ శతాబ్దపు చివరిలో కొంతమంది ఆఫ్రికన్ అమెరికన్ పండితులు క్లియోపాత్రాను నల్లజాతి ఆఫ్రికన్ హీరోయిన్‌గా స్వీకరించారు.


ఉపసంహారం:

17 సంవత్సరాల వయస్సులో, క్లియోపాత్రా ఈజిప్ట్ రాణి అయ్యింది మరియు తనకు 39 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు పాలించింది. పురాతన ఈజిప్షియన్ మరియు పార్థియన్లు, హీబ్రూలు, మెడీస్, ట్రోగ్లోడైట్స్, సిరియన్లు, ఇథియోపియన్లు మరియు అరబ్బుల భాషలతో సహా తొమ్మిది భాషలు మాట్లాడే క్లియోపాత్రా బహుభాషాకోవిదురాలు. క్లియోపాత్రా ప్రపంచంలోని ఏ పుస్తకమైనా చదవగలిగేది.

క్లియోపాత్రా భౌగోళికం, చరిత్ర, ఖగోళ శాస్త్రం, అంతర్జాతీయ దౌత్యం, గణితం, రసవాదం, వైద్యం, జంతుశాస్త్రం, ఆర్థిక శాస్త్రం మరియు మరిన్ని వంటి అనేక విషయాలలో కూడా చాలా పరిజ్ఞానం కలిగి ఉంది. క్లియోపాత్రా యొక్క అనేక పుస్తకాలు అగ్నిప్రమాదంలో ధ్వంసమైనప్పటికీ, క్లియోపాత్రా రూపొందించిన కొన్ని మూలికా నివారణలు మరియు సౌందర్య చిట్కాలు ఇంకా మనుగడలో ఉన్నాయి.

క్లియోపాత్రా వివిధ భాషలపై తనకున్న  పరిజ్ఞానం సహాయం తో ఇప్పుడు లబించని  అనేక ప్రాచీన తాళపత్ర గ్రంధాలను అద్యయనం చేసింది.   శాస్త్రాలు మరియు వైద్యంపై క్లియోపాత్రా ప్రభావం క్రైస్తవ మతం యొక్క ప్రారంభ శతాబ్దాలలో అత్యంత గౌరవించబడింది మరియు క్లియోపాత్రా ను  మానవ చరిత్రలో అసమానమైన మహిళ గా  చేసింది.

 


No comments:

Post a Comment