19 March 2023

పవిత్ర కాబాను కడగడానికి గులాబీలను ఉత్పత్తి చేసే-తైఫ్ Taif produces Roses to wash Holy Kaaba

 


ఒకప్పుడు ముహమ్మద్ ప్రవక్త(స)ను చంపడానికి ప్రయత్నించిన పశ్చిమ సౌదీ అరేబియాలోని తైఫ్ నగరం  ఇప్పుడు పవిత్ర కాబాను కడగడానికి గులాబీలను ఉత్పత్తి చేసే నగరం గా మారింది.

తైఫ్-అప్పుడు:

ఇస్లామిక్ చరిత్రలో 619 AD – (విచారకరమైన సంవత్సరం)ది ఇయర్ ఆఫ్ గ్రీఫ్. ప్రవక్త(స) తన ఇద్దరు బలమైన మద్దతుదారులను కోల్పోయారు. ఒకరు ప్రవక్త (స) భార్య మరియు విశ్వాసుల మాత ఖదీజా(ర.అ)  మరొకరు ప్రవక్త (స) పిన తండ్రి/Uncle అబూ తాలిబ్(ర.అ).

ప్రవక్త(స)పట్ల మక్కా వాసుల ప్రవర్తన కఠినంగా, క్రూరంగా మరియు క్షమించరానిదిగా ఉండిపోయింది. ఖురైష్ నాయకులు,  ముస్లింలను హింసించడం తారాస్థాయికి చేరుకుంది. ప్రవక్త(స) ఇస్లాం సందేశాన్ని (అల్లాహ్ యొక్క ఏకత్వం – సర్వశక్తిమంతుడు) అనే ఇస్లాం సందేశాన్ని మక్కా దాటి బోధించాలని నిర్ణయించుకున్నారు. అందుకు ప్రవక్త(స) తన జన్మస్థలం నుండి 50 మైళ్ల దూరంలో ఉన్న తైఫ్ నగరం ను  ఎన్నుకొన్నారు.

ప్రవక్త(స) మక్కా నుండి తైఫ్ వరకు నడక ద్వారా ప్రయాణం చేసారు. తైఫ్ ప్రజలు జ్ఞానవంతులు మరియు వారు ఇస్లాం సందేశాన్ని విశ్వసిస్తారు మరియు అంగీకరిస్తారు అని ప్రవక్త(స) భావించారు. తైఫ్ చేరుకున్న, ప్రవక్త(స) నగరంలోని ప్రధాన తెగ బను తాకిఫ్ యొక్క ముఖ్యులను కలుసుకున్నారు మరియు విగ్రహారాధనను విడిచిపెట్టి ఇస్లాంను స్వీకరించమని వారిని కోరారు. తైఫ్ వాసులు ప్రవక్త(స) పిలుపును అంగీకరించడానికి నిరాకరించడమే కాకుండా, పట్టపగలు ప్రవక్త(స) పై రాళ్ళు విసరటానికి  ఒక గుంపును కూడా ప్రోత్సహించారు.

మక్కా నుండి తైఫ్ ప్రయాణంలో ప్రవక్త(స)తో పాటు జైద్ బిన్ హరితహ్ (ర.అ) కూడా ఉన్నారు. గుంపు రాళ్లు రువ్వడంతో ఇద్దరికీ గాయాలయ్యాయి. తైఫ్ భూమి వారి పాదాల రక్తంతో తడిచింది..

పాదాల నుండి రక్తస్రావంతో  తిరస్కరించబడిన ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఒక బండపై విశ్రాంతి తీసుకొని అల్లాహ్‌ను ప్రార్థించారు. ప్రవక్త(స) తైఫ్ ప్రజలను శిక్షించమని లేదా వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని అల్లాహ్‌ను అడగలేదు.

ఆ సమయంలో దేవదూత జిబ్రీల్ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) వద్దకు వచ్చి, ప్రవక్త(స)కోరుకుంటే, తైఫ్ ప్రజల చుట్టూ ఉన్న రెండు పర్వతాలను కూల్చివేసి వాటిని చూర్ణం చేసి, తైఫ్ ప్రజలను  శిక్షించమని అల్లాహ్ ఒక దేవదూతను ఆదేశించగలడని అన్నారు.

కానీ తైఫ్ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోవడానికి బదులుగా, కరుణామూర్తి అయిన ప్రవక్త(స) దేవదూత జిబ్రీల్‌తో  " ఒకే దేవుడైన అల్లాహ్‌ను ఆరాధించే మరియు అల్లాహ్ కు భాగస్వాములను ఆపాదించని వ్యక్తులను తైఫ్ ప్రజల వారసుల నుండి అల్లా లేపుతాడని నేను ఆశిస్తున్నాను." అని అన్నారు

సర్వశక్తిమంతుడైన అల్లాహ్  తన ప్రవక్త(స)ను నిరాశపరచలేదు. నేడు 12, 00,000 మంది జనాభా కల తైఫ్‌ నగరం లో ప్రధానంగా ముస్లింలు ఉన్నారు.

తైఫ్-ఇప్పుడు:

ముస్లింలు అధికంగా ఉండే తైఫ్ నగరం, సౌదీ అరేబియా వేసవి రాజధాని. తైఫ్  నగరం ద్రాక్ష, దానిమ్మ, అత్తి పండ్లు, గులాబీలు మరియు తేనెకు ప్రసిద్ధి చెందింది. సౌదీ అరేబియాలో నివసించే వారు తైఫ్‌ని దాని చల్లని వాతావరణం మరియు దాని పర్వతాల అందమైన దృశ్యాల కోసం సందర్శించడానికి ఇష్టపడతారు.

తైఫ్ యొక్క అనుకూలమైన వాతావరణం దాదాపు వెయ్యి గులాబీ ఫార్మ్స్ rose farms కు నిలయంగా ఉంది. వాడి మహర్మ్ నుండి అల్-హదా Wadi Mahram to Al-Hada వరకు సుగంధ పుష్పాలు విస్తరించి ఉన్నాయి. మొదట, వాడి మహరామ్ లోయలో తరువాత అల్ హదాలో, చివరకు 2,500 మీటర్ల ఎత్తులో నగరానికి దక్షిణాన పర్వతాలు ఉన్న అల్ షాఫాలో గులాబీ పొదలు వికసిస్తాయి,

ప్రతి వసంత ఋతువులో గులాబీలు తైఫ్‌ నగరంలో వికసిస్తాయి, ప్రతి సంవత్సరం సుమారు 300 మిలియన్ల పూలు వికసిస్తాయి. అవి సౌది అరేబియా  రాజ్యం యొక్క విస్తారమైన ఎడారి ప్రకృతి దృశ్యాన్ని స్పష్టమైన మరియు సువాసనగల గులాబీ రంగులోకి మారుస్తాయి. బహుశా అందుకే తైఫ్ నగరం గులాబీల నేపథ్యంతో అనేక పండుగలను నిర్వహిస్తుంది.

సంవత్సరానికి ఒకసారి, తైఫ్ నగరం యొక్క అల్ రుదాఫ్ పార్క్ యొక్క ఒక కార్నర్ గులాబీ గ్రామంగా మారుతుంది. ఈ అద్భుతమైన నేపధ్యంలో, డ్యాన్స్‌లు, నాటకాలు మరియు ప్రదర్శనలు గులాబీలకు అంకితం చేయబడ్డాయి, గులాబీ రైతులు మరియు ఉత్పత్తిదారుల ప్రదర్శనలతో పాటు, పార్క్‌ లోని కొన్ని భాగాలను పూల తివాచీలతో  కప్పుతారు. 

తైఫ్ రోజ్ ఫెస్టివల్, రెండవ ఎడిషన్‌, గులాబీల అతిపెద్ద బాస్కెట్‌గా గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను నెలకొల్పింది. బాస్కెట్‌లో 84,450 రకాల గులాబీలు ఉన్నాయి, దీనికి 168 గంటల కంటే ఎక్కువ సమయం పట్టింది మరియు తైఫ్‌కు చెందిన 190 మంది యువకులు మరియు మహిళలు దీనిని తయారు చేయడంలో సహకరించారు.

ప్రతి వసంతకాలంలో, రైతులు అందమైన గులాబీ రేకులను కోయడానికి పొలాలకు వెళతారు. చేతితో కోసిన పుష్పాలను బుట్టలలో సేకరించిన తర్వాత, వాటిని స్థానిక డిస్టిలరీలకు తీసుకువెళతారు, అక్కడ పువ్వులు ఎంచబడి బరువైన రాగి అలంబిక్స్‌లో స్వేదనం చేయబడతాయి. తయారు చేయబడిన సుగంధ రోజ్  ఆయిల్ ఉమ్రా మరియు హజ్ కోసం రాజ్యాన్ని సందర్శించే మిలియన్ల మంది ముస్లింలలో ప్రసిద్ధి చెందింది. మక్కాలోని పవిత్ర కాబా గోడలను శుభ్రం చేయడానికి కూడా అదే ఉపయోగించబడుతుంది

కొన్ని శతాబ్దాల క్రితం గులాబీ రేకులు తైఫ్ నగరంలో స్వేదనం చేయబడేవి కావు  బదులుగా, వాటిని సేకరించి, ఒంటెల కారవాన్ ద్వారా ముస్లిం పవిత్ర నగరమైన మక్కాకు రవాణా చేసేవారు. అక్కడ నైపుణ్యం కలిగిన భారతీయ డిస్టిల్లర్లు, రోజ్  పువ్వులను సున్నితంగా ప్రాసెస్ చేసి విలువైన రోజ్ ఆయిల్ ను తీయడం చేసేవారు.

వార్ద్ తైఫీ Wardh Taifi: 

తైఫ్‌లో రోసా దమస్సేనా త్రిగింటిపేటలా అనే గులాబీ రకం ఉంది - దీనిని వార్ద్ తైఫీ అని పిలుస్తారు. 30 రేకుల వార్ద్ తైఫీ,  తైఫ్‌కు ఎలా వచ్చిందనేది మిస్టరీగా మిగిలిపోయింది. ప్రసిద్ధ బల్గేరియన్ కజాన్లిక్ గులాబీకి సారూప్యతతో, కొందరు దీనిని సౌదీ అరేబియాకు ఒట్టోమన్ టర్క్స్ తీసుకువచ్చారని చెబుతారు, వారు ఒకప్పుడు అరేబియా ద్వీపకల్పంలో విస్తారమైన సామ్రాజ్యాన్ని పాలించారు. మరికొందరు ఇది షిరాజ్ మరియు కషన్ లేదా భారతదేశం చుట్టూ ఉన్న పెర్షియన్ గులాబీ తోటల నుండి వచ్చిందని పేర్కొన్నారు.

ఇది సౌదీ అరేబియాలోని ఎత్తైన ప్రాంతాలకు ఎలా వచ్చిందనే దానితో సంబంధం లేకుండా, ఇస్లామిక్ ప్రపంచంలో గౌరవించే కొన్ని రోజ్ సుగంధాలు ఉన్నాయి.

ఇస్లామిక్ సంస్కృతితో తైఫ్ గులాబీ ముడిపడి ఉంది. అత్యధిక నాణ్యత గల తైఫ్ గులాబీ నూనెను ఉపయోగింఛి  మక్కాలోని గ్రాండ్ మసీదులో కల  పవిత్ర కాబాను రెండుసార్లు ఉత్సవంగా కడగడం జరుగుతుంది.

హజ్ సమయంలో, కిస్వాపై  రోజ్ వాటర్‌తో చల్లుతారు, అలాగే 1453లో ఇస్తాంబుల్‌ను జయించిన తర్వాత, సుల్తాన్ మెహ్మెట్ II ఆయ సోఫియాను హగియ సోఫియా మసీదుగా మార్చడానికి ముందు రోజ్ వాటర్‌తో కడిగారు.


తైఫ్ గులాబీ/స్వర్గ పుష్పము/ఫ్లవర్ ఆఫ్ హెవెన్:

ఇస్లాంలో, గులాబీని స్వర్గపు పువ్వు అని పిలుస్తారు. కొంతమంది గులాబీలను మానవ ఆత్మ యొక్క చిహ్నాలుగా గ్రహిస్తారు కాబట్టి, గులాబీ యొక్క అందమైన సువాసన ఆధ్యాత్మికతతో ముడిపడి ఉంటుంది. 

11వ శతాబ్దపు గౌరవనీయమైన పర్షియన్ వైద్యుడు ఇబ్న్ సినా గుండె మరియు మెదడుపై గులాబీ సువాసన యొక్క చికిత్సా ప్రభావాన్ని నొక్కిచెప్పిన మొదటి శాస్త్రవేత్తలలో ఒకరు. ఇబ్న్ సినా ఇలా రాశాడు:"దాని సున్నితమైన సువాసన కారణంగా, గులాబీ ఆత్మను సంబోధిస్తుంది."

తైఫ్ గులాబీ చాలా అరుదైనది కాబట్టి - 10,000 మరియు 15,000 మధ్య చేతితో ఎంచుకున్న తైఫ్ గులాబీలు కేవలం చిన్న నూనెను మాత్రమే సృష్టిస్తాయి. - తైఫ్ రోజ్ ఆయిల్ ను అతిథి మణికట్టుపై రాయడం ద్వారా సత్కరించడం లేదా కొత్తగా పెళ్లయిన జంటకు వివాహ బహుమతిగా తైఫ్ రోజ్ ఆయిల్ సీసా బహుమతిని ఇవ్వడం జరుగుతుంది.

మొరాకో, సిరియా, భారతదేశం మరియు ఫ్రాన్స్ వంటి దేశాలు తైఫ్ కంటే చాలా పెద్ద పరిమాణంలో డమాస్క్ గులాబీని పండిస్తారు. అయినప్పటికీ, తైఫ్ యొక్క గులాబీలు వంట, టీ మరియు కాఫీలలో ఉపయోగిoచే  మరియు పెర్ఫ్యూమ్‌లో ఉపయోగించే విలువైన రోజ్ ఆయిల్‌ను ఉత్పత్తి చేస్తాయి.

 తైఫ్ నగరం ఫ్రాన్స్‌కు మైళ్ల దూరంలో ఉన్నప్పటికీ, 'లా వీ ఎన్ రోజ్' అనే పదం తైఫ్ గులాబీలు జీవితంలో ఒక్కసారైనా అనుభవించాల్సిన ప్రకాశించే అందాన్ని మరియు ఆనందాన్ని వ్యక్తపరుస్తాయి.


సౌజన్యం:సౌదీ గెజిట్ మరియు బైట్ అల్ ఫాన్ @BaytAlFann

No comments:

Post a Comment