23 March 2023

కాంగ్రెస్‌ కంటే ముందే నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పిలుపు పై జమియత్‌-ఇ-ఉలేమా Jamiat-i-Ulemaస్పందించింది

 


"జామియాత్-ఎ-ఉలేమాJamiat-i-Ulema యొక్క లక్ష్యం ఎప్పుడూ సంపూర్ణ స్వాతంత్ర్యం. సంపూర్ణ స్వాతంత్ర్యం ను అది తన మతపరమైన, రాజకీయ మరియు నైతిక హక్కుగా పరిగణిస్తుంది మరియు ఈ హక్కుకు అడ్డుగా ఉన్న దేనిని అది భరించలేదు." ఇది సెప్టెంబరు 1939లో జమియాత్-ఇ-ఉలేమా-ఇ-హింద్Jamiat-i-Ulema-i-Hind వర్కింగ్ కమిటీ చేసిన ప్రకటన సారాంశం.

మౌలానా అహ్మద్ సయీద్ నేతృత్వంలో జరిగిన సమావేశం తర్వాత మీరట్‌లోని రాజ్ ప్రింటర్స్ ఈ ప్రకటనను ప్రచురించింది. యూరప్‌లో రెండవ ప్రపంచ యుద్ధం ఆరంభం తర్వాత జమియాత్ తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడానికి ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ఉద్యమం కోసం ప్రచారం చేశారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ మొదలైనవారు బోస్ తో విభేదించారు మరియు చివరకు బోస్‌ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది, కాని ఉలేమా, ముఖ్యంగా దేవబంద్ పాఠశాలకు చెందిన వారు బోస్‌ తో పూర్తిగా ఏకీభవించారు.

జమియాత్‌కు చెందిన ప్రముఖ నాయకుడు మౌలానా నూర్ ఉద్-దిన్ బిహారీ, కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన   తర్వాత బోస్ ఏర్పాటు చేసిన ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. మౌలానా బీహారీ, ఢిల్లీ ఫార్వర్డ్ బ్లాక్ చీఫ్‌గా ఎన్నికయ్యారు మరియు 1940లో జైలు పాలయ్యారు.

మౌలానా ఉబైదుల్లా సింధీ ప్రచారం మరియు బోస్‌తో సమావేశాలు చక్కగా రికార్డ్  చేయబడ్డాయి. మౌలానా ఉబైదుల్లా సింధీ ఒక ప్రముఖ దేవబంది మౌలానా. జర్మనీ మరియు జపాన్ నుండి తన రేడియో ప్రసారాల సమయంలో, బోస్. ముఫ్తీ కిఫయతుల్లా మరియు జమియాత్ యొక్క కొంతమంది నాయకుల వెనుక నిలబడి సమర్ధన ఇవ్వాలని భారతీయులను కోరారు.

 భారతదేశంలో బ్రిటీష్ యుద్ధ ప్రయత్నాలకు వ్యతిరేకంగా బహిరంగంగా ముందుకు వచ్చిన మొదటి పెద్ద సంస్థలలో జమియాత్-ఇ-ఉలేమా ఒకటి.  సెప్టెంబరు 1939లో, బ్రిటీష్ ప్రభుత్వం జమియాత్ సమావేశానికి సంబంధించిన సాహిత్యం మరియు ప్రచార సామగ్రిని నిషేధించాలని నోటీసు ఇచ్చింది. జర్మనీకి వ్యతిరేకంగా తమ యుద్ధానికి మద్దతు ఇవ్వాలని బ్రిటిష్ వారు భారతీయులను కోరారు. కాంగ్రెస్ ఇంకా ఈ అంశంపై చర్చిస్తున్న సమయంలో, జమియాత్ బ్రిటిష్ వారిని ఎదిరించాలని ప్రజలను కోరుతూ ఒక ప్రకటనతో వచ్చింది. ఇది నేతాజీ సుభాస్, మౌలానా ఉబైదుల్లా మరియు రాష్ బిహారీ బోస్ బోధించిన వాటికి సరిగ్గా అనుగుణంగా ఉంది.

ఫార్వర్డ్ బ్లాక్ యొక్క గణనీయమైన నాయకత్వం మరియు క్యాడర్ జమియాత్-ఎ-ఉలేమా నుండి వచ్చిన వాస్తవాన్ని చరిత్రకారులు కాదనలేరు. జమియాత్-ఎ-ఉలేమా సబ్యులు, నేతాజీ సుభాస్‌కు మద్దతు ఇచ్చారు. సుభాస్ కోరుకున్న ఉద్యమాన్ని జమియాత్ ఉలేమ్ మరియు అహ్రార్,   ప్రారంభించారు మరియు అందుకు  వారు ఆగస్ట్ 1942 వరకు వేచి ఉండలేదు.

మౌలానా హుస్సేన్ అహ్మద్ మదానీ, మౌలానా ముహమ్మద్ దౌద్ ఘజ్నవీ, మౌలానా నూర్ ఉద్-దిన్ బిహారీ, మౌలానా హబీబ్ ఉర్ రహ్మాన్ లుధియాన్వీ వంటి ఉలేమాలు మరియు ఇతరులు కాంగ్రెస్ క్విట్ ఇండియా తీర్మానానికి ముందు జైలు పాలయ్యారు. ఆసక్తికరంగా, క్విట్ ఇండియా తీర్మానమును కాంగ్రెస్,   మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అధ్యక్షతన ఆమోదించినది. మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ స్వయంగా జమియాత్-ఎ-ఉలేమా యొక్క పెద్ద నాయకుడు.   

 

No comments:

Post a Comment