28 March 2023

చారిత్రాత్మిక ఇస్లామిక్ మాన్యుస్క్రిప్ట్‌లు మరియు అరుదైన కళాఖండాల రిపోజిటరీ రాజస్థాన్- టోంక్‌లోని రాజస్థాన్ ప్రభుత్వ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అరబిక్ & పెర్షియన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (APRI)

 


జైపూర్:

రాజస్థాన్‌లోని టోంక్‌లో గల  రాజస్థాన్ ప్రభుత్వ మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అరబిక్ & పెర్షియన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (APRI) చారిత్రక ఇస్లామిక్ మాన్యుస్క్రిప్ట్‌లు, పత్రాలు, పుస్తకాలు మరియు అరుదైన కళాఖండాల రిపోజిటరీగా నిలిచింది..

జైపూర్‌కు దక్షిణంగా 103 కి.మీ దూరంలో ఉన్న టోంక్, స్వాతంత్ర్యానికి ముందు పూర్వపు రాజ్‌పుతానాలో ఏకైక ముస్లిం రాచరిక రాజ్యం. నవాబులు పండితులను ఆదరించి, పట్టణంలో నివసించడానికి వారిని ఆహ్వానించినందున టోంక్ కళ మరియు సంస్కృతికి ప్రధాన కేంద్రంగా పరిగణించబడింది. చాలా మంది కవులు, కళాకారులు మరియు చరిత్రకారులు టోంక్‌లో నివసించడానికి వచ్చారు మరియు దానిని మేధావులు మరియు నిపుణుల కేంద్రంగా మార్చారు. అదనంగా, ఇస్లామిక్ మత బోధకులు టోంక్ పట్టణంలో దివ్య ఖురాన్ ఉపన్యాసాలు మరియు బోధనల సంస్కృతిని స్థాపించారు.

 1978లో రాజస్థాన్ ప్రభుత్వం యొక్క స్వతంత్ర డైరెక్టరేట్‌గా మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ అరబిక్ & పెర్షియన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (APRI) APRI, స్థాపించబడింది, హిస్టరోగ్రఫి/historiography, ప్రాచ్యశాస్త్రం/orientology మరియు ఇస్లామిక్ అధ్యయనాల యొక్క అరుదైన సేకరణను కలిగి ఉంది మరియు 8,000కు పైగా చేతితో వ్రాసిన సంపుటాలను కలిగి ఉంది.

భారతదేశం మరియు విదేశాల నుండి అనేక పరిశోధకులు మధ్యయుగ కాలానికి చెందిన మాన్యుస్క్రిప్ట్‌లను అధ్యయనం చేయడానికి APRI, ను సందర్శిస్తున్నారు. అంతేకాకుండా, ఉపరాష్ట్రపతిలు, గవర్నర్లు మరియు కేంద్రమంత్రులు వంటి ప్రముఖులు ఈ సంస్థను సందర్శించి APRI, గొప్ప సేకరణను చూశారు.

చారిత్రక పుస్తకాల నిధిలో, ప్రధాన ఆకర్షణలలో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఆటోగ్రాఫ్ చేసిన  17వ శతాబ్దపు బోల్డ్ నక్ష్ కాలిగ్రఫీలో ఉన్న పవిత్ర ఖురాన్ కాపీ,  11వ శతాబ్దానికి చెందిన హమాయిల్ షరీఫ్ Hamail Shareef  (పవిత్ర ఖురాన్‌పై వ్యాఖ్యానం) మరియు ఒకే రన్నింగ్ టెక్స్ట్‌తో ఐదు సబ్జెక్ట్‌లను కలిగి ఉన్న 19వ శతాబ్దానికి చెందిన అన్వాన్-ఉల్-షరాఫ్ Unwan-ul-Sharaf  కలవు. APRI వద్ద 2014లో టోంక్‌లో తయారు చేయబడిన పవిత్ర ఖురాన్ యొక్క ప్రపంచంలోనే అతిపెద్ద కాపీ కూడా కలదు.

పూర్వపు టోంక్ రాచరిక రాజ్యం లోని  సైడియా లైబ్రరీ లోగల చాలా అరుదైన పుస్తకాలు మరియు మాన్యుస్క్రిప్ట్‌లు తరువాతి కాలం లో APRI లోనికి మార్చబడినవి. టోంక్ యొక్క మూడవ నవాబ్ మహమ్మద్ అలీ ఖాన్ ఈ పుస్తకాలను సేకరించాడు.

APRIలోని పుస్తకాల సేకరణ ను ఉత్తర ప్రదేశ్‌లోని రాంపూర్‌లోగల  ప్రసిద్ధ రజా లైబ్రరీ మరియు పాట్నాలోని ఖుదా బక్ష్ ఓరియంటల్ లైబ్రరీలో ఉన్న వాటితో సమానంగా ర్యాంక్ చేయవచ్చు. మొఘల్ కాలం నాటి ప్రసిద్ధ పుస్తకాలు, షాజహన్నామా మరియు తుజుక్-ఇ-జహంగిరి Shahjahannama and Tuzuk-i-Jahangiri కాపీలు కూడా APRI సేకరణలో ఉన్నాయి. అదనంగా, ఇన్స్టిట్యూట్ టోంక్ యొక్క అదాలత్ షరా షరీఫ్ Adalat Sharah Shareef  (కానానికల్ canonical కోర్టులు) యొక్క సుమారు లక్ష తీర్పులను కలిగి ఉంది, అవి అనేక సంపుటాలుగా ప్రచురించబడ్డాయి. అంతేకాకుండా, టోంక్ రాజ్యం కు  సంభంధం ఉన్న రాజస్థాన్ రాజకీయ మరియు సాంస్కృతిక చరిత్రకు సంబంధించిన అనేక పత్రాలు ఉన్నాయి.

APRI లోని పుస్తకాల మరియు మాన్యుస్క్రిప్ట్‌ల పరిరక్షణ మరియు డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ నాలుగు సంవత్సరాల క్రితం ప్రారంభించబడింది, అయితే కోవిడ్ మహమ్మారి సమయంలో అది మందగించింది. మాన్యుస్క్రిప్ట్‌ల పరిరక్షణ మరియు డిజిటలైజేషన్ ప్రాజెక్ట్ పనులు మందగించినప్పటికీ  ఇటివల ఖట్టతి (కాలిగ్రఫీ) కళ మరియు చార్ బైట్ (నాలుగు చరణాలు) ప్రదర్శనలను ప్రోత్సహించడానికి APRI అనేక వరుస కార్యక్రమాలు, సెమినార్‌లు మరియు పండుగలను నిర్వహిస్తోంది.

మార్చి 15 నుండి 19,2023 వరకు నిర్వహించబడిన ఐదు రోజుల కాలిగ్రఫీ ఆర్ట్ ఫెస్టివల్‌లో పెద్ద సంఖ్యలో నిపుణులు పాల్గొన్నారు మరియు దేశంలోని 40 మంది నిపుణులతో ఇన్సానియత్ కా పైఘమ్ (మానవత్వం యొక్క సందేశం) అనే అంశంపై మూడు రోజుల సెమినార్ నిర్వహించబడింది. ఈ కర్క్రమాలు భారీ స్పందనను పొందాయి మరియు విద్యార్థులు, పరిశోధకులు మరియు ప్రజల భాగస్వామ్యానికి సాక్ష్యంగా నిలిచాయి.

ఫ్రాన్స్ నుండి పరిశోధనా బృందం మరియు జోర్డాన్ మరియు ఇరాన్ నుండి ఇస్లామిక్ మాన్యుస్క్రిప్ట్‌లపై వ్యక్తిగత పరిశోధకులు APRI సంస్థను క్రమం తప్పకుండా సందర్శిస్తున్నారు.

ఆపివేసిన అరబిక్ మరియు పర్షియన్ భాషలలో తరగతులు పునఃప్రారంభం, రాజస్థాన్ మహోత్సవ్ సందర్భంగా పొడిగింపు ఉపన్యాసాల నిర్వహణ, వివిధ విభాగాలలో అరుదైన మాన్యుస్క్రిప్ట్‌లు మరియు కళాఖండాలను ప్రదర్శించడానికి APRI సంస్థ ప్రాంగణంలో  పబ్లికేషన్ మరియు మ్యూజియం బ్లాక్‌ను నిర్మించనున్నట్లు రాజస్తాన్ ముఖ్యమంత్రి ప్రకటించారు. 

No comments:

Post a Comment