4 March 2023

భారతీయ పారిశ్రామికీకరణకు నాయకత్వం వహించిన జమ్‌సెట్జీ, నుస్సర్వాన్‌జీ టాటా (Jamsetji Nusserwanji Tata)

 

జమ్‌సెట్జీ టాటా గా ప్రసిద్ది చెందిన  జమ్‌సెట్జీ, నుస్సర్వాన్‌జీ టాటా (జననం మార్చి 2, 1839, నవ్సారి, గుజరాత్, భారతదేశం మరియు మే 19, 1904న బాడ్ నౌహీమ్, జర్మనీ లో మరణించారు) టాటా గ్రూప్‌ను స్థాపించిన భారతీయ దాత మరియు వ్యవస్థాపకుడు. జమ్‌సెట్జీ టాటా పారిశ్రామిక ప్రయత్నాలు భారతదేశాన్ని పారిశ్రామిక దేశాల లీగ్‌లోకి తీసుకురావడానికి సహాయపడ్డాయి.

పార్సీ కుటుంబంలో జన్మించిన జమ్‌సెట్జీ, నుస్సర్వాన్‌జీ టాటాకు మొదటి సంతానం మరియు ఏకైక కుమారుడు. 1858లో ఎల్ఫిన్‌స్టోన్ కాలేజీ, బొంబాయి (ఇప్పుడు ముంబై) నుండి పట్టా పొందిన తరువాత, జమ్‌సెట్జీ తన తండ్రి నుస్సర్వాన్‌జీ టాటా యొక్క ఎగుమతి-వర్తక సంస్థలో చేరాడు మరియు జపాన్, చైనా, యూరప్ మరియు యునైటెడ్ స్టేట్స్‌లో దాని శాఖలను స్థాపించడంలో సహాయం చేశాడు.

1868లో జమ్‌సెట్జీ టాటా  ఒక వ్యాపార సంస్థను స్థాపించారు, అది తరువాత టాటా గ్రూప్‌గా పరిణామం చెందింది. 1872లో జమ్‌సెట్జీ టాటా  పత్తి తయారీపై దృష్టి సారించాడు మరియు తదనంతరం నాగ్‌పూర్, బొంబాయి మరియు కూర్లాలో పత్తిమిల్లులను స్థాపించాడు. జమ్‌సెట్జీ టాటా  సంస్థలు సమర్థతకు, మెరుగైన కార్మిక-రక్షణ విధానాలకు మరియు ఫైబర్ యొక్క ఉత్తమ గ్రేడ్‌లను ప్రవేశపెట్టడానికి ప్రసిద్ధి చెందాయి. జమ్‌సెట్జీ టాటా  1906లో టాటా పవర్ కంపెనీగా అవతరించిన బొంబాయి-ప్రాంత జలవిద్యుత్ కేంద్రాలను స్థాపించాడు.

1901లో జమ్‌సెట్‌జీ టాటా  భారతదేశపు మొట్టమొదటి భారీ-స్థాయి ఇనుప కర్మాగారంను  టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ (ఇప్పుడు టాటా స్టీల్)ని స్థాపించాడు. జమ్‌సెట్‌జీ టాటా  కుమారులు, సర్ దొరాబ్జీ జమ్‌సెట్‌జీ టాటా (1859-1932) మరియు సర్ రతన్‌జీ టాటా (1871-1932) ఆధ్వర్యంలో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ భారతదేశంలో ప్రైవేట్ యాజమాన్యంలోని అతిపెద్ద ఉక్కు తయారీదారుగా మారింది. ఉక్కు మరియు జలవిద్యుత్ శక్తి మాత్రమే కాకుండా వస్త్రాలు, రసాయనాలు, వ్యవసాయ పరికరాలు, ట్రక్కులు, లోకోమోటివ్‌లు మరియు సిమెంట్ మొదలగు అనేక కంపెనీలను స్థాపించబడినవి.  జమ్‌సెట్జీ టాటా యొక్క ఇతర వాణిజ్య వెంచర్లలో భారతదేశంలోని మొదటి విలాసవంతమైన హోటల్ తాజ్ మహల్ ప్యాలెస్ కూడా ఉంది. 1904లో జమ్‌సెట్జీ మరణం తర్వాత, జమ్‌సెట్జీ కుటుంబం టాటా గ్రూప్‌పై నియంత్రణను కలిగి ఉంది మరియు 21వ శతాబ్దం ప్రారంభంలో 100 కంటే ఎక్కువ కంపెనీలను కలిగి ఉన్న ప్రపంచ సమ్మేళనం global conglomerate గా ఉంది.

ప్రముఖ దాతగా జమ్‌సెట్జీ 1892లో J.N. టాటా ఎండోమెంట్ స్థాపించినాడు  ఇది భారతీయ విద్యార్థులను ఉన్నత విద్యను అభ్యసించడానికి ప్రోత్సహించింది. 1898లో జమ్‌సెట్జీ టాటా బెంగుళూరు (బెంగళూరు)లో పరిశోధనా సంస్థ కోసం భూమిని విరాళంగా ఇచ్చాడు మరియు జమ్‌సెట్జీ టాటా కుమారులు అక్కడ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌ను స్థాపించారు (1911). టాటా కుటుంబం భారతదేశంలో సాంకేతిక విద్య మరియు శాస్త్రీయ పరిశోధన యొక్క అత్యంత ముఖ్యమైన ప్రైవేట్ వ్యవస్థాపకులుగా మారింది.

No comments:

Post a Comment