ఇస్లాం యొక్క ఆవిర్భావ సమయంలో ప్రపంచంలో రెండు శక్తివంతమైన రాజ్యాలు ఉన్నాయి: ఇరాన్ మరియు ఇరాక్‌లను పాలించే పెర్షియన్ సాసానియన్ సామ్రాజ్యం మరియు ఆసియా మైనర్, సిరియా, ఈజిప్ట్ మరియు బాల్కన్‌లలో పాలించే తూర్పు రోమన్ (బైజాంటైన్) సామ్రాజ్యం.
అరేబియాలో ముస్లింల పెరుగుదల సమయం లో పర్షియా లోని ససానియన్ సామ్రాజ్యం రాజకీయ, సామాజిక, ఆర్థిక మరియు సైనిక బలహీనతలతో అస్థిరతకు లోను అయింది. ఒకప్పుడు ప్రధాన ప్రపంచ శక్తిగా ఉన్న ససానియన్ సామ్రాజ్యం, బైజాంటైన్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా దశాబ్దాల యుద్ధం తర్వాత తన మానవ మరియు భౌతిక వనరులను కోల్పోయి అస్థిరతకు లోనయింది.
628లో ససానియన్ కింగ్ ఖోస్రో II ఉరితీయబడిన తర్వాత ససానియన్ రాజ్య అంతర్గత రాజకీయ పరిస్థితి త్వరగా క్షీణించింది. తదనంతరం, తరువాతి నాలుగు సంవత్సరాలలో పది మంది కొత్త హక్కుదారులు సింహాసనాన్ని అధిష్టించారు. 628-632 నాటి ససానియన్ అంతర్యుద్ధం తరువాత, ససానియన్ సామ్రాజ్యం ఇకపై బలంగా లేదు. ముస్లిం దాడికి ముందు సస్సానియన్ సామ్రాజ్యం రాజకీయ అస్థిరతనును ఎదుర్కొన్నది.
633 నుండి 654 AD వరకు రాషీదున్ కాలిఫేట్ కాలంలో ఇరాన్ పై అరబ్ ఆక్రమణ లేదా ముస్లిం ఆక్రమణ జరిగింది. పర్షియా పై ముస్లింల విజయం సాసానియన్ సామ్రాజ్యం అంతానికి దారితీసింది మరియు ఇరాన్‌లో జొరాస్ట్రియన్ మతం పతనానికి దారితీసింది.
ఇస్లాం యొక్క రెండవ ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ సమయంలో పర్షియన్ సామ్రాజ్యం ముస్లింలచే జయించబడినది మరియు పెర్షియన్ సామ్రాజ్యం యొక్క భూభాగాలను ముస్లిములు స్వాధీనం చేసుకున్నారు.
633లో జనరల్ ఖలీద్ ఇబ్న్ వాలిద్ అద్వర్యం లో ముస్లిo సైన్యం సస్సానిద్ రాజ్య రాజకీయ మరియు ఆర్థిక కేంద్రంగా ఉన్న సస్సానిద్ భూభాగం అయిన మెసొపొటేమియా(అప్పుడు దీనిని అసోరిస్తాన్ యొక్క ససానియన్ ప్రావిన్స్ అని పిలుస్తారు; ఇది దాదాపు ఆధునిక ఇరాక్‌కు అనుగుణంగా ఉంది) ను జయించినారు. అయితే ముస్లిం జనరల్ ఖలీద్‌ను లెవాంట్‌లోని బైజాంటైన్ ఫ్రంట్‌కు బదిలీ చేసిన తర్వాత, ముస్లింలు సస్సానియన్ల ఎదురుదాడిలో ముస్లిములు తమ ఆస్తులు మరియు వస్తువులను కోల్పోయారు.
ముస్లిముల రెండవ దాడి 636లో సాద్ ఇబ్న్ అబీ వక్కాస్ ఆధ్వర్యంలో జరిగింది, ఇరుపక్షాల మద్య జరిగిన ఖాదిసియా యుద్ధంలో పశ్చిమ ఇరాన్ పై ససానియన్ నియంత్రణ శాశ్వతoగా కోల్పోయింది. జాగ్రోస్ పర్వతాలు రాషీదున్ కాలిఫేట్ మరియు సస్సానిద్ సామ్రాజ్యం మధ్య సహజ గోడ మరియు సరిహద్దుగా మారాయి. అయితే ఈ ప్రాంతంపై పర్షియన్లు క్రమం తప్పకుండా దాడులు చేసిన పర్యవసానంగా, ఖలీఫ్ ఉమర్ 642లో ససానియన్ సామ్రాజ్యంపై పూర్తి దాడికి ఆదేశించాడు, ఇది 651లో ససానియన్లను పూర్తిగా ఆక్రమించడానికి దారితీసింది. ఖలీఫా ఉమర్ ఇరాన్ (ససానియన్ సామ్రాజ్యం) ను త్వరితగతిన జయించడం ద్వార ఒక గొప్ప సైనిక మరియు రాజకీయ వ్యూహకర్తగా నిలదొక్కుకున్నాడు. 644లో, ఉమర్‌ను యుద్ధంలో బంధించి అరేబియాకు బానిసగా తీసుకువచ్చిన పర్షియన్ హస్తకళాకారుడు అబూ లు'లుయా ఫిరూజ్ హత్య చేశాడు.
ఇరానియన్లు తమను జయించిన అరబ్బులకు/ముస్లిములకు వ్యతిరేకంగా చాలా కాలo గట్టిగా పోరాడారు. 651 నాటికి, కాస్పియన్ ప్రావిన్సులు (తబరిస్తాన్) మరియు ట్రాన్సోక్సియానా మినహా ససానియన్/ఇరానియన్ భూభాగంలోని చాలా పట్టణ ప్రాంతాలు అరబ్/ముస్లిం సైన్యాల అధికారం మరియు నియంత్రణలోకి వచ్చాయి. ససానియన్ లోని అనేక ప్రాంతాలు అరబ్బులకు వ్యతిరేకంగా పోరాడాయి; అయితే విజయవంతం కాలేదు.
అరబ్బులు/ముస్లిములు దేశంలోని చాలా ప్రాంతాలపై నియంత్రణను ఏర్పాటు చేసుకున్నప్పటికీ, అరబ్ గవర్నర్‌ను చంపడం మరియు వారి కోటలపై దాడి చేయడం ద్వారా అనేక ససానియన్ నగరాలు తిరుగుబాటుకు దిగాయి. అరబ్బులు/ముస్లిములు సైనిక మద్దతు విప్లవాన్ని అణిచివేసి ఇస్లామిక్ నియంత్రణను సాధించినారు. బుఖారా ప్రాంతం లో తిరుగుబాటును అరబ్బులు/ముస్లిములు హింసాత్మక అణచివేసారు. ఇరాన్/ ససానియన్ ప్రజలు క్రమంగా ఇస్లాంలోకి మారడం జరిగింది.జొరాస్ట్రియన్ గ్రంధాలను తగులబెట్టారు మరియు చాలా మంది పూజారులు ఉరితీయబడ్డారు.రాజకీయ, ఆర్థిక మరియు కారణాలతో ఇస్లాంను చాలా మంది స్వీకరించారు. ఇస్లాం మధ్యయుగం చివరిలో ఇరాన్/ససానియన్ లో ప్రధాన మతంగా మారింది
పెర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకునే వ్యూహాత్మక ప్రణాళిక 642 ప్రారంభంలో పూర్తయింది. ఖలీఫా ఉమర్, ఇస్ఫహాన్‌పై దాడి చేయడానికి ముస్లిం దళాల కమాండర్ గా అబ్దుల్లా ఇబ్న్ ఉత్మాన్‌ను నియమించాడు. హమదాన్ స్వాధీనం చేసుకున్న తర్వాత, నుమాన్ ఇస్ఫాహాన్ నగరానికి 350+ కిలోమీటర్లు ఆగ్నేయంగా ముస్లిం సైన్యంతో కదిలి షహర్వరాజ్ జాదుయిహ్ Shahrvaraz Jadhuyih మరియు ఇతర ప్రముఖ ససానియన్ జనరల్స్ ఆధ్వర్యంలోని ససానియన్ సైన్యాన్ని ఓడించాడు. ఈ దాడిలో షహర్వరాజ్ జాదుయిహ్, మరో ససానియన్ జనరల్‌తో పాటు మరణించారు.
ఇస్ఫహాన్‌లో విజయం సాధించిన తర్వాత, నుమాన్ ఇస్ఫాహాన్ నగరాన్ని ముట్టడించాడు; అక్కడ అబూ మూసా అషారీ మరియు అహ్నాఫ్ ఇబ్న్ కైస్ ఆధ్వర్యంలో బుస్రా మరియు కుఫా నుండి వచ్చిన తాజా దళాలతో ముస్లిం సైన్యం బలోపేతం చేయబడింది. కొన్ని నెలల పాటు ముట్టడి కొనసాగింది మరియు చివరకు, ఇస్ఫాహాన్ నగరం లొంగిపోయింది.
651లో, హమదాన్ నుండి 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇరాన్‌లోని “రే” నగరం కు ఈశాన్యం వైపు నుమాన్ Nu’man ముస్లిం సైన్యం కదిలి తీవ్ర ప్రతిఘటన తర్వాత వదిలివేయబడిన నగరాన్ని ముట్టడించాడు. నుమాన్ తర్వాత 240 కిలోమీటర్లు ఈశాన్యంగా “కోమ్” నగరం వైపు సైన్యం తో కదిలాడు. పెద్ద ప్రయత్నం తరువాత “ఇస్ఫహాన్” ప్రాంతం యొక్క బయటి సరిహద్దు అయిన “కోమ్” లోoగి పోయినది.
ఇంతలో, “హమదాన్” మరియు “రే” లో తిరుగుబాటు చెలరేగింది. తిరుగుబాటును అణిచివేసేందుకు మరియు ఇస్ఫాహాన్ యొక్క పశ్చిమ సరిహద్దులను జయించడానికి నిహావాండ్‌లో ముస్లిం కమాండర్‌గా ఉన్న దివంగత నుమాన్ ఇబ్న్ ముఖారిన్ సోదరుడు నుయామ్ ఇబ్న్ ముఖారిన్‌ను, ఖలీఫా ఉమర్ పంపాడు. ఇస్ఫహాన్ నుండి హమదాన్ వైపు నుఅయిమ్ Nu’aym ముస్లిం సైన్యం తో కదిలాడు. యుద్ధం జరిగింది మరియు హమదాన్ మళ్లీ ముస్లిం సైన్యం స్వాధీనం చేసుకుంది. Nu'am నుయామ్ తర్వాత “రే” వైపుకు కదిలాడు.
“రే” లో కూడా పర్షియన్లు ప్రతిఘటించారు
కాని “రే” నగరాన్ని ముస్లింలు తిరిగి స్వాధీనం చేసుకున్నారు. పెర్షియన్ పౌరులు
శాంతి కోసం ప్రయత్నించారు మరియు జిజియా చెల్లించడానికి అంగీకరించారు. కాస్పియన్ సముద్రానికి దక్షిణంగా
ఉన్న “రే” తర్వాత Nu'am నుయామ్
ఉత్తరాన తబరిస్తాన్ వైపు వెళ్లారు. తబరిస్తాన్ పాలకుడు కాలిఫేట్‌తో శాంతి
ఒప్పందంపై సంతకం చేశాడు. ఈ విధంగా ఇరాన్/ ససానియన్ సామ్రాజ్యం
పూర్తిగా అరబ్/ముస్లిముల పరం అయినది.
No comments:
Post a Comment