31 March 2023

భారత స్వాతంత్ర్య పోరాటంలో అజ్మీర్ దర్గా పాత్ర Ajmer Dargah’s role in Indian Freedom Struggle

 



"దర్గా (అజ్మీర్ షరీఫ్) నిస్సందేహంగా ఒక ప్రమాద-కేంద్రంగా ఉంది.... దేశద్రోహం, దర్గాకే పరిమితమైంది మరియు అక్కడ ఏమి జరుగుతుందో దానికి రుజువు పొందడం చాలా కష్టం." పై వాఖ్యలు 1922లో ఇంటెలిజెన్స్ అధికారులు బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించిన రహస్య నివేదిక నుండి.

దర్గాలు, పుణ్యక్షేత్రాలు, సూఫీ కేంద్రాలు భారత స్వాతంత్య్ర పోరాటంలో అగ్రగామిగా ఉన్నాయి. అజ్మీర్ దర్గా జాతీయవాద కార్యకలాపాలకు కేంద్రంగా పనిచేసింది కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం దర్గాలో కార్యకలాపాలపై నిఘా పెట్టింది. 

జలియన్‌వాలాబాగ్ దురంతం తర్వాత ఏర్పాటైన అధికారిక కమిటీ తన నివేదికలో భారతీయులు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజా తిరుగుబాటుకు ప్రణాళికలు వేస్తున్నట్లు తెలియజేసింది. మౌలానా అబ్దుల్ బారీ ఫిరంగిమహ్లీ నేతృత్వంలో  జాతీయవాదులు అజ్మీర్ ఉర్స్‌లో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రణాళికను చర్చించారు.

బ్రిటిష్ ప్రభుత్వ గూఢచారులు అజ్మీర్ దర్గా లో జరిగే జాతీయవాద కార్యకలాపాలపై ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు తెలియజేసేవారు. 1920లో, ఈద్గా వద్ద జరిగిన ఒక సమావేశానికి 5,000 మందికి పైగా హాజరయ్యారని అందులో లాలా చంద్ కరణ్ మాట్లాడుతూ బ్రిటిష్ వారు గోహత్యను ప్రోత్సహించడం, పంజాబ్‌లో ప్రజలను ఊచకోత కోయడం మరియు ముస్లింలు మరియు హిందువుల మధ్య అనైక్యతకు కారణమైనందున బ్రిటిష్ వారితో పోరాడాలని ప్రజలను కోరారు అని ప్రభుత్వ గూఢచారులు నివేదించారు.

అజ్మీర్ దర్గాకు చెందిన పేష్ ఇమామ్ బ్రిటీష్ వారి ఓటమి కోసం ప్రార్థించాడని, ఆ తర్వాత మౌల్వీ మొయినుద్దీన్ విదేశీ పాలకులు తమకు ఇచ్చిన బిరుదులను త్యజించమని ప్రజలను కోరినట్లు అదే నివేదికలో  ప్రభుత్వ గూఢచారులు పేర్కొనారు.

1921లో  వచ్చిన మరొక నివేదిక ప్రకారం శుక్రవారం ప్రార్థనల సమయంలో దర్గాలో బ్రిటిష్ వ్యతిరేక ప్రసంగాలు జరుగుతున్నాయి.

1922లో, ఇంటెలిజెన్స్ అధికారులు దర్గా వద్ద జరిగే ఉర్స్ జాతీయవాద ఆలోచనలను చర్చించడానికి జాతీయవాదులు సమావేశమయ్యే సందర్భం అని నివేదించారు. 

1922 నాటి ఇంటెలిజెన్స్ నివేదికలో అత్యంత విస్పోటక సమాచారం ఉంది. రాజ్‌పుతానాలోని ముస్లింలు మరియు హిందువులు,   అజ్మీర్‌కు చెందిన మౌల్వీ మొయినుద్దీన్‌ పట్ల  విధేయత ప్రమాణం చేశారని గూడాచారి నివేదిక పేర్కొంది. మౌల్వీ మొయినుద్దీన్‌ సూచనల మేరకు రాజ్‌పుతానాలోని ముస్లింలు మరియు హిందువులు కలసి ఐఖ్యంగా బ్రిటిష్ వారిపై యుద్ధానికి సిద్ధమయ్యారు. జమియాత్ ఉల్-థాబా అనే సాయుధ ఉగ్రవాద సంస్థ స్థాపించబడింది మరియు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఆయుధాలు సేకరించబడ్డాయి. జమియత్ ఉల్-థాబా ఒక తీర్మానాన్ని ఆమోదించింది మరియు బ్రిటిష్ వారు మతం మరియు దేశానికి శత్రువులని మరియు వారి పై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది.

స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడిచాయి మరియు మనలో చాలా మందికి దేశ  స్వాతంత్ర్యం సాధించడంలో అజ్మీర్ దర్గా పాత్ర గురించి తెలియదు.

 

No comments:

Post a Comment