తరావీహ్ ప్రార్థన రంజాన్ నెల రాత్రులలో జరిపే ప్రత్యేక ప్రార్ధనలలో ఒకటి.
పవిత్ర రంజాన్ మాసంలో, ముస్లింలు ప్రతి రోజు, ఇషా నమాజ్ తర్వాత తారావీహ్ అని పిలువబడే ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.రంజాన్ నెలలో, ముస్లింలు అనేక ఐచ్ఛిక రకాత్ ప్రార్థనలను చేయడానికి మరియు దివ్య ఖురాన్ పఠనాన్ని వినడానికి రాత్రిపూట ప్రార్ధన వరుసలో ఉంటారు.
తారావీహ్ అనేది అరబిక్ పదం నుండి ఉద్భవించింది, దీని అర్థం "విశ్రాంతి మరియు రిలాక్స్ “to rest and relax आराम और ठहरना ", ఇది ఇస్లామిక్ ధ్యానం యొక్క ప్రత్యేక రూపంగా పరిగణించబడుతుంది.
తరావీహ్ మూలాలు:
తన జీవితపు చివరి సంవత్సరంలో, ప్రవక్త ముహమ్మద్ (స) ఒక రాత్రి బయటకు వచ్చి తరావీహ్ నమాజు చేసారు. ఆ రాత్రి, కొంతమంది ప్రవక్త(స)తో కలిసి ప్రార్థించారు. రెండవ రాత్రి సమయంలో, ఎక్కువ మంది ప్రజలు తరావీహ్‌లో చేరారు. మూడవ రాత్రి కూడా మరింత ఎక్కువ మంది హాజరయ్యారు. నాల్గవ రాత్రి, మసీదు నిండిపోయింది మరియు ప్రజలు ప్రవక్త(స) రాక కోసం వేచి ఉన్నారు.
అయితే ప్రవక్త(స) మసీదు కు రాకుండా ఇంట్లో స్వయంగా ప్రార్థనలు చేశారు. మరుసటి రోజు ఫజ్ర్ తర్వాత, ప్రవక్త(స)ఇలా అన్నారు: "మీకు ఇది విధిగా చేయబడుతుందని నేను భయపడ్డాను తప్ప మీ వద్దకు బయటకు రాకుండా ఏదీ నన్ను నిరోధించలేదు." (ముస్లిం)
ఖలీఫా అబూ బకర్ కాలం నుండి ఖలీఫా ఉమర్ కాలం ప్రారంభం వరకు,
ప్రజలు వ్యక్తిగతంగా లేదా చిన్న సమూహాలలో తరావీహ్
ప్రార్థనలు చేసేవారు. తరువాత, ఖలీఫ్ ఉమర్ ఒక ఇమామ్ వెనుక అందరినీ నిలబెట్టారు వారు 8 రకాత్లు నమాజు చేశారు. చివరికి,
అది 20 రకాత్‌లకు పెంచారు.
రావీహ్-రకాత్‌ల సంఖ్య:
సహీహ్ అల్ బుఖారీ హదీసు ప్రకారం, తరావీహ్ నమాజు ఎనిమిది రకాతులు. ప్రవక్త (స) ఎనిమిది రకాతుల తరావీహ్ నమాజుకు నాయకత్వం వహించారు. తరావీహ్ ప్రార్థనలో చిన్నది రెండు రకాత్‌లు మరియు పెద్దది 20 రకాత్‌లు.
ఖలీఫ్ ఒమర్ బిన్ అబ్దులాజీజ్ (క్రీ.శ. 717 నుండి 720) కాలంలో మదీనా ప్రజలు 36 రకాత్‌ల తరావీహ్ నమాజును పాటించారు.
తరావీహ్ యొక్క బహుమతులు:
తరావీహ్ నమాజు చేయడం వల్ల అనేక ప్రతిఫలాలు ఉన్నాయి. ప్రవక్త(స) ఇలా అన్నారు: "ఎవరైతే రంజాన్ సమయంలో ప్రార్థన (రాత్రి ప్రార్థన) కోసం ఈమాన్ (విశ్వాసం)తో, ప్రతిఫలం కోసం ఎదురు చూస్తాడో, అతని/ఆమె మునుపటి పాపాలన్నీ క్షమించబడతాయి." (బుఖారీ మరియు ముస్లిం)
రంజాన్ మాసంలో సత్కార్యాలకు ఎక్కువ ప్రతిఫలం లబించడం తో తరావీహ్ యొక్క
ప్రతిఫలం మరింత ఎక్కువగా ఉంటుంది. ప్రవక్త ఇలా అన్నారు: “(ఈ నెల)లో ఏదైనా (ఐచ్ఛిక) సత్కార్యాలు చేయడం ద్వారా ఎవరైనా
(అల్లాహ్‌కు) చేరువ అవుతారో, వారు ఏ సమయంలోనైనా విధిగా(ఫర్జ్) చేసిన పనికి సమానమైన
ప్రతిఫలాన్ని అందుకుంటారు మరియు విధిగా obligatory, విధిని నిర్వర్తించే obligatory deed వారు ( ఈ నెల) ఏ సమయంలోనైనా డెబ్బై బాధ్యతలను
నిర్వర్తించినందుకు ప్రతిఫలాన్ని అందుకుంటారు.-ఇబ్న్ ఖుజమా ibnKhuzaymah)
మసీదు లేదా ఇంటి వద్ద తరావీహ్‌ప్రార్థనలు:
తరావీహ్‌ను మసీదులలో ప్రార్థన చేయడం వల్ల ఇంట్లో చేయడం కంటే ఎక్కువ రివార్డులు లభిస్తాయి. తరావీహ్‌ను ఇంట్లో, ఒంటరిగా లేదా కుటుంబం మరియు స్నేహితులతో కలిసి ప్రార్థన చేయవచ్చు.
తరావిహ్-హదీసులు:
ప్రవక్త(స) రంజాన్లో తరావిహ్ ఆచరించారు మరియు తన సహచరులను
కూడా దీనిని చేయమని ప్రోత్సహించారు.
·
"అల్లాహ్ రంజాన్
మాసo లో ఉపవాసం మీపై విధిగా చేసాడు మరియు
రాత్రులలో ప్రార్థనలో పాల్గోవటం ఒక
అభ్యాసం" అని ప్రవక్త (స) చెప్పారు అని
అబ్దుల్-రౌమాన్ ఇబ్న్ -అఫ్ (ర) వివరించారు.
·
ప్రవక్త(స) తన
సహచరులందరినీ రాత్రిపూట ప్రార్థనలో పాల్గొనమని ప్రోత్సహించారని అబూ హురైరా
వివరించాడు.
· ప్రవక్త (స) ఇంకా ఇలా అంటారు, "రంజాన్ సందర్భంగా రాత్రి ప్రార్థనలో ఎవరైతే విశ్వాసం మరియు ప్రతిఫలం ఆశించి పాల్గొంటారో, వారి మునుపటి పాపాలు క్షమించబడతాయి."
అల్లాహ్(SWT) మనకు మార్గనిర్దేశం చేసి, ఈ ఆశీర్వాద నెల నుండి ఎక్కువ ప్రయోజనాలను పొందటానికి మరియు
మన పాపాలన్నిటిని క్షమించి, మనకు సహాయo చేయుగాక.
-గల్ఫ్ న్యూస్ సౌజన్యం తో
No comments:
Post a Comment