అంతర్జాతీయ మహిళా
దినోత్సవం సందర్భంగా, సమాజంలో గణనీయమైన
కృషి చేసిన కొందరు ముస్లిం మహిళల జాబితా:
1.సలీహా అబిద్ హుస్సేన్Saliha Abid Hussain:
సలీహా అబిద్ హుస్సేన్ (1913 - 1988) ఉర్దూ రచయిత్రి.
అజ్రా, రేఖ్తా, యాద్‌గరే హలీ
బాత్ చీత్ మరియు జేన్ వాలోన్ కి యాద్ అతిహై Azra,
Rekhta, Yadgaray hali Baat Cheet and Jane Walon ki Yad AtiHai
సలీమా ప్రముఖ రచనలు. సలీమా రచనలలో స్త్రీవాదంతో సహా అనేక అంశాలు ఉన్నాయి. సలీమా
తన రచనలే కాకుండా ట్రిపుల్ తలాక్ వంటి అంశాలకు వ్యతిరేకంగా మాట్లాడారు.
1983లో, సలీహా అబిద్ హుస్సేన్ కు పద్మశ్రీ అవార్డు లబించినది. ఆసక్తిగల పాఠకులు 1993లో సుఘ్రా మెహదీ వ్రాసిన మరియు ప్రచురించబడిన సలీహా అబిద్ హుస్సేన్ జీవిత చరిత్ర చదవగలరు.
2) మోఫిదా అహ్మద్ Mofida Ahmed:
మోఫిదా అహ్మద్ (1921-2008) భారత జాతీయ
కాంగ్రెస్‌కు చెందిన భారతీయ రాజకీయవేత్త. మోఫిదా అహ్మద్ అస్సాం యొక్క మొదటి మహిళా
పార్లమెంటు, లోక్‌సభ
సభ్యురాలు మరియు భారతదేశంలో పార్లమెంటు సభ్యురాలు అయిన మొదటి కొద్దిమంది ముస్లిం
మహిళల్లో ఒకరు.
మోఫిదా అహ్మద్ జోర్హాట్ టౌన్‌లో జన్మించింది మరియు తన విద్యను ప్రైవేట్‌గా కొనసాగించింది. తరువాత మోఫిదా అహ్మద్ అస్సామీ పత్రికలకు వ్యాసాలు అందించింది. మోఫిదా అహ్మద్ 1946-49లో జోర్హాట్‌లోని రెడ్‌క్రాస్ సొసైటీలో జాయింట్ సెక్రటరీగా మరియు 1957-58 మధ్య గౌరవ హోదాలో నేషనల్ సేవింగ్స్ స్కీమ్‌లో పనిచేశారు. మోఫిదా అహ్మద్ 1953లో గోలాఘాట్‌లో కాంగ్రెస్ మహిళా విభాగం ప్రారంభమైనప్పటి నుండి 1956 వరకు దానికి కన్వీనర్‌గా ఉన్నారు.
3) ముంతాజ్ జహాన్ హైదర్ Mumtaz Jahan Haider:
ముంతాజ్ హైదర్ అలీఘర్
ఉమెన్స్ కాలేజీకి మొదటి ప్రిన్సిపాల్. 1931లో లక్నో విశ్వవిద్యాలయం నుండి ఆంగ్లంలో
గ్రాడ్యుయేషన్ మరియు పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన మొదటి విద్యార్థినిలలో ముంతాజ్
హైదర్ కూడా ఒకరు.
ముంతాజ్ జహాన్ హైదర్ లక్నో లో ఒక సంవత్సరం బోధన పూర్తి చేసిన తర్వాత, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం UKలోని లీడ్స్‌కు వెళ్లి తిరిగి అలీఘర్‌కు వచ్చారు. 1935లో, ముంతాజ్ జహాన్ కెమిస్ట్రీ విభాగాధిపతి మరియు రెండు దశాబ్దాలుగా తన సీనియర్ అయిన మిస్టర్ హేదర్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ముంతాజ్ జహాన్ హైదర్ 1940లో మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేసి ముప్పై ఒక్క సంవత్సరాలు పాటు సేవలందించారు.
4) బేగం ఖుద్సియా
ఐజాజ్ రసూల్Begum Qudsia Aizaz Rasul:
బేగం ఖుద్సియా ఐజాజ్ రసూల్ (1909 - 2001) భారత రాజ్యాంగ సభలోని ఏకైక ముస్లిం మహిళ. 1937లో U.P లెజిస్లేటివ్ అసెంబ్లీ కు రిజర్వ్‌డ్ కాని స్థానం నుండి విజయవంతంగా పోటీ చేసిన ఎన్నికైన అతికొద్ది మంది మహిళల్లో ఒకరు. 1952 వరకు శాసనసభలో సభ్యురాలు గా కొనసాగినది.
బేగం ఖుద్సియా
ఐజాజ్ రసూల్ 1937 నుండి 1940 వరకు కౌన్సిల్
డిప్యూటీ ప్రెసిడెంట్ పదవిని నిర్వహించారు మరియు 1950 నుండి 1952-54 వరకు కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా
పనిచేశారు. బేగం ఖుద్సియా ఐజాజ్ రసూల్ భారతదేశంలో కౌన్సిల్‌లో ప్రతిపక్ష నాయకురాలిగా పనిచేసిన
మొట్టమొదటి మహిళ మరియు ప్రపంచంలోనే మొదటి ముస్లిం మహిళ.
1946లో, బేగం ఖుద్సియా ఐజాజ్ రసూల్ భారత రాజ్యాంగ
సభకు ఎన్నికయ్యారు మరియు చివరకు చేరిన 28 మంది ముస్లిం లీగ్ సభ్యులలో ఒకరు. అసెంబ్లీలో
ఉన్న ఏకైక ముస్లిం మహిళ. 1950లో, భారతదేశంలో
ముస్లిం లీగ్ రద్దు చేయబడింది మరియు బేగం ఐజాజ్ రసూల్ కాంగ్రెస్‌లో చేరారు. బేగం
ఐజాజ్ రసూల్ 1952-54లో రాజ్యసభకు
ఎన్నికయ్యారు మరియు 1969 నుండి 1989 వరకు ఉత్తర
ప్రదేశ్ శాసనసభ సభ్యురాలు.
1969 మరియు 1971 మధ్య, బేగం ఐజాజ్ రసూల్ సాంఘిక సంక్షేమం మరియు మైనారిటీల మంత్రిగా ఉన్నారు. 2000లో, బేగం ఐజాజ్ రసూల్ కు పద్మ భూషణ్ లభించింది
5) సల్మా బేగంSalma Begum:
ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్
జిల్లా దిబాయి అనే చిన్న పట్టణానికి చెందిన ముస్లిం కుటుంబంలో జన్మించిన సల్మా
బేగం సంస్కృతంలో పీహెచ్‌డీ చేసిన ప్రపంచంలోనే మొదటి
ముస్లిం మహిళ (1969).
సంస్కృతంలో సల్మా బేగం పరిశోధనా థీసిస్ 'సంస్కృత నాటకాలలో
కథానాయికల రకాలు'పై ఉంది. సల్మా
బేగం చదువు తర్వాత
అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో సంస్కృత విభాగంలో బోధించారు.
No comments:
Post a Comment