16 March 2023

కాన్‌స్టాంటినోపుల్‌పై ముస్లింల విజయం: చరిత్రలో కొత్త యుగం ఆవిష్కరణకు దారి తీసింది. The conquest of Constantinople by the Muslims: heralding a new era in Histroy

 



 

మే 29, 1453న టర్క్‌లు కాన్‌స్టాంటినోపుల్‌ను ఆక్రమించడం టర్కిష్, ఇస్లామిక్ చరిత్ర మరియు ప్రపంచ చరిత్రలో ఒక మలుపు.

ఇస్లాం యొక్క ఆవిర్భావ సమయంలో ప్రపంచంలో రెండు శక్తివంతమైన రాజ్యాలు ఉన్నాయి: ఇరాన్ మరియు ఇరాక్‌లను పాలించే పెర్షియన్ సామ్రాజ్యం మరియు ఆసియా మైనర్, సిరియా, ఈజిప్ట్ మరియు బాల్కన్‌లలో పాలించే తూర్పు రోమన్ (బైజాంటైన్) సామ్రాజ్యం. 

ఇస్లాం యొక్క రెండవ ఖలీఫా అయిన ఉమర్ బిన్ ఖత్తాబ్ సమయంలో పర్షియన్ సామ్రాజ్యం ముస్లింలచే జయించబడినది మరియు పెర్షియన్ సామ్రాజ్యం యొక్క భూభాగాలను ముస్లిములు స్వాధీనం చేసుకున్నారు. సిరియా మరియు ఈజిప్టులు ముస్లింలు స్వాధీనం చేసుకున్న మొదటి రెండు బైజాంటైన్ ప్రాంతాలు.

రబ్బులచే "కోస్టాంటినియా"గా సూచించబడిన, తూర్పు రోమన్ సామ్రాజ్యం (బైజాంటైన్) యొక్క రాజధాని కాన్స్టాంటినోపుల్ ను స్వాధీనం చేసుకోవాలనేది ముస్లింలకు ఆదర్శంగా మారింది.

ఖలీఫా మువావియా కాలం నుండి కాన్స్టాంటినోపుల్‌ను జయించటానికి ముస్లింలు కృషి చేశారు. 670లో కాన్స్టాంటినోపుల్‌ నగరాన్ని జయించటానికి   ఖలీఫా  ముయావియా తర్వాత తదుపరి ఖలీఫా అయిన యాజిద్ I ఆధ్వర్యంలో ముస్లిం సైన్యం పంపబడింది. ఆ సమయంలో సజీవంగా ఉన్న మహమ్మద్ ప్రవక్త(స) యొక్క కొంతమంది సహచరులు కూడా సైన్యంలో పాల్గొన్నారు. వారిలో ఒకరు ఖలీద్ ఇబ్న్ జైద్, అతను ఈ రోజు టర్క్‌లలో "ఐయూప్ సుల్తాన్" అని పిలువబడ్డాడు మరియు ఖలీద్ ఇబ్న్ జైద్ పేరు మీద టర్కీ లోని ఇస్తాంబుల్ జిల్లాలో ఒక సమాధి ఉంది. 80 ఏళ్లు పైబడిన ఖలీద్ ఇబ్న్ జైద్ కాన్స్టాంటినోపుల్‌ ముట్టడిలో పాల్గొన్నాడు. ముట్టడి విఫలమైంది. ఇస్లామిక్ సైన్యం అంటువ్యాధి విరేచనాలతో ఆనారోగ్యం పాలయినది మరియు ముట్టడి ఎత్తివేయబడింది. ఖలీద్ ఇబ్న్ జైద్ మరణించాడు మరియు నగర గోడల దిగువన ఖననం చేయబడ్డాడు.

తరువాత, ఉమయ్యద్ ఖలీఫా  అబ్ద్ అల్-మాలిక్ 715లో మరోసారి కాన్స్టాంటినోపుల్‌ నగరాన్ని ముట్టడించేందుకు తన కుమారులు సులేమాన్ మరియు మస్లామాలను పంపాడు. మస్లామా సోదరుడు సులేమాన్ ఏజియన్ సముద్రం మీదుగా మరియు మస్లామా అనటోలియా మీదుగా కాన్స్టాంటినోపుల్‌ నగరాన్ని చుట్టుముట్టాడు. కాన్స్టాంటినోపుల్‌ నగరం పూర్తిగా జయించబడలేదు. అయినప్పటికీ, మస్లామా  సైన్యం ఇస్తాంబుల్ యొక్క పెద్ద పొరుగు ప్రాంతాలలో ఒకటైన గలాటాను స్వాధీనం చేసుకుంది మరియు మస్లామా ఏడు సంవత్సరాలు అక్కడే ఉన్నాడు.

కొన్ని శతాబ్దాల తరువాత, 4వ ఒట్టోమన్ సుల్తాన్, యల్డిరిమ్ బయెజిద్ Yıldırım Bayezid మరియు అతని మనవడు సుల్తాన్ మురాద్II నగరాన్ని చాలాసార్లు ముట్టడించారు. అయితే, ఇతర శత్రువుల దాడుల కారణంగా, ప్రతి ప్రయత్నంలో ముట్టడి ఎత్తివేయబడింది.

ఇస్తాంబుల్ వ్యూహాత్మకంగా ముఖ్యమైన ప్రదేశంలో మాత్రమే కాకుండా, చాలా అందమైన ప్రకృతి దృశ్యాన్ని కూడా కలిగి ఉంది. ఫ్రాన్స్ చక్రవర్తి నెపోలియన్ చెప్పినట్లుగా, "భూమి ఒకే రాజ్యంగా ఉంటే, ఇస్తాంబుల్ దాని రాజధానిగా ఉంటుంది." ఇస్తాంబుల్ నేటికీ అలాగే ఉంది.

కాన్స్టాంటినోపుల్ యొక్క విజయం పై 7వ ఒట్టోమన్ సుల్తాన్, మెహ్మెద్ II పూర్తి విశ్వాసం గా ఉన్నాడు. 21 ఏళ్ల మరియు మేధావి చక్రవర్తి సుల్తాన్, మెహ్మెద్ II పగలు మరియు రాత్రి ముట్టడి ప్రణాళికలను సిద్ధం చేశాడు. మెహ్మెద్ II ఆ సమయంలో అతిపెద్దది అయిన వేగవంతమైన శీతలీకరణ ఫిరంగిని కనుగొన్నాడు మరియు తక్కువ వ్యవధిలో బోస్పోరస్ యొక్క యూరోపియన్ వైపు కోటను నిర్మించమని ఆదేశించాడు. కాన్స్టాంటినోపుల్ నగరం చుట్టూ నిఘా పెంచాడు. ఆ రోజుల్లో, కాన్‌స్టాంటినోపుల్‌లో నివసిస్తున్న ఆర్థడాక్స్‌లు తమపై కాథలిక్ ఒత్తిడికి భయపడేవారు. సామ్రాజ్యం జయించిన ప్రతిచోటా క్రైస్తవులకు మతపరమైన స్వేచ్ఛను మంజూరు చేసినందున ఒట్టోమన్లను వారు రక్షకులుగా చూసినారు. ప్రధాన మంత్రి, గ్రాండ్ డ్యూక్ లౌకాస్ నోటరాస్ ఒకసారి ఇలా అన్నాడు, "నేను లాటిన్ మిట్రే కంటే నగరం [కాన్స్టాంటినోపుల్] మధ్యలో టర్కిష్ తలపాగాను చూడాలనుకుంటున్నాను."

సుల్తాన్ మెహ్మద్ II యొక్క నౌకాదళం గోల్డెన్ హార్న్ ముఖద్వారం మీదుగా విస్తరించి ఉన్న రక్షణ గొలుసు కారణంగా నగరంలోకి ప్రవేశించలేకపోయినప్పుడు, సుల్తాన్ మెహ్మద్ II అనేక నౌకలను సముద్రంలోకి తిప్పమని ఆదేశించాడు మరియు నగర ముఖ్య కేంద్రంపై  దాడి చేశాడు. రోజుల తరబడి నగర గోడలపై ఫిరంగులు పేల్చారు. 53 రోజుల ముట్టడి తరువాత, బైజాంటైన్ సైనికులు చివరకు లొంగిపోయారు.

ఒక చేతిలో కత్తి పట్టుకుని యుద్ధంలో మరణించిన చివరి బైజాంటైన్ చక్రవర్తి కాన్స్టాంటైన్ XI పాలియోలోగోస్ Constantine XI Palaiologos మృతదేహం నగర గోడలపై కనుగొనబడింది. బైజాంటైన్ చక్రవర్తి పట్ల గౌరవాన్ని చూపుతూ, సుల్తాన్ మెహ్మద్ II ధైర్యమైన శత్రువు(బైజాంటైన్ చక్రవర్తి )ను ఖననం చేయడానికి అనుమతి ఇచ్చాడు.


కాన్‌స్టాంటినోపుల్‌ను జయించడం ముస్లింలకు మార్గం సుగమం చేసింది. ఒట్టోమన్లు ఇప్పుడు సురక్షితంగా ఉన్నారు, ముస్లిం సైన్యాలు వియన్నా వరకు చేరుకున్నాయి. ఇస్లాం ఐరోపాలో ప్రవేశపెట్టబడింది మరియు అనేక బాల్కన్ కమ్యూనిటీలు ముస్లింలుగా మారాయి.


సుల్తాన్ మెహ్మద్II, యువ చక్రవర్తిగా మొత్తం ఇస్లామిక్ ప్రపంచంలో అసాధారణమైన గుర్తింపు పొందారు. నేటికీ, ముస్లింలలో సుల్తాన్ మెహ్మద్ IIను కృతజ్ఞతతో స్మరించుకోని వారుండరు.

ఈ విజయం తరువాత సుల్తాన్ మెహ్మద్ II మనవడు సెలిమ్I ఖలీఫా  బిరుదు పొందాడు. కాన్స్టాంటినోపుల్‌ను జయించడం ద్వారా ఒట్టోమన్ సుల్తానుల నాయకత్వాన్ని మొత్తం ముస్లిం ప్రపంచం అంగీకరించింది.


కాన్‌స్టాంటైన్I వంటి పెద్ద చక్రవర్తి స్థాపించిన ప్రపంచంలోని అత్యంత అందమైన మరియు ముఖ్యమైన నగరాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని ముస్లిములు గర్వంగా దానికి  కాన్స్టాంటినియా  అనే పేరు ఉపయోగించారు. ఈ పేరుతో నాణేలు మరియు పుస్తకాలు జారీ చేయబడ్డాయి.

 

కాన్‌స్టాంటినోపుల్‌ను ముస్లిములు జయించడం ప్రపంచ చరిత్రలో ఒక ముఖ్యమైన మలుపు. లాటిన్ ప్రజలు (ఇటాలియన్, స్పానిష్, కాటలాన్ మరియు ఫ్రెంచ్) ముట్టడిని గౌరవానికి సంబంధించిన సమస్యగా భావించారు మరియు మతపరమైన భేదాలతో సంబంధం లేకుండా క్రైస్తవ చరిత్రలోని ముఖ్యమైన నగరాన్ని రక్షించడానికి వచ్చారు. వారు వీరోచితంగా బైజాంటైన్ చక్రవర్తి తరుఫున పోరాడారు, అయినప్పటికీ ఓడిపోయారు.


మెహ్మెద్ ది కాంకరర్ లాటిన్ సైన్యాలను  బందీగా తీసుకోలేదు మరియు వారిని  ఇంటికి తిరిగి వెళ్ళడానికి అనుమతించాడు. ఆరబిక్ విజ్ఞానం, శాస్త్రీయ విజ్ఞానంమరియు ఇస్లామిక్ స్వర్ణ యుగ ప్రగతి  కాన్‌స్టాంటినోపుల్‌ గుండా ఐరోపాకు ప్రసరించి ఐరోపాలో కొత్త ఆవిష్కరణలకు మార్గం సుగమం అయినది.. ఇది ఐరోపా పునరుజ్జీవనోద్యమానికి దారితీసింది.


కాన్‌స్టాంటినోపుల్‌ విజయం అనటోలియా మరియు బాల్కన్‌లలో టర్క్స్‌లకు భూభాగ విస్తరణకు తోడ్పడినది. ఇస్తాంబుల్/కాన్‌స్టాంటినోపుల్‌,  ఈజిప్ట్ మరియు హంగేరీ రెండింటినీ జయించటానికి కీలకమైనది.

కాన్‌స్టాంటినోపుల్‌/ఇస్తాంబుల్‌ విజయం టర్కిష్ ఒట్టోమన్ రాజ్యాన్ని సామ్రాజ్యంగా మార్చింది. క్రిమియా, వల్లాచియా, బోస్నియా మరియు అల్బేనియా వంటి ప్రాంతాలను కలిగి ఉన్న మెహ్మెద్ ది కాంకరర్‌ను యూరోపియన్లు రోమన్ చక్రవర్తిగా గుర్తించారు. ఇటాలియన్లు తమ విభజించబడిన దేశాన్ని ఏకం చేయగల హీరోగా భావించారు. ఒట్టోమన్, బైజాంటైన్ మరియు రోమన్ అనే మూడు కిరీటాలను కలిగి ఉన్న పతకాలపై సుల్తాన్ మెహ్మద్ II యొక్క చిత్రపటాన్ని జారీ చేయాలని ఫ్లోరెన్స్ డ్యూక్ ఆదేశించాడు. ఒట్టోమన్ చక్రవర్తి ఇస్తాంబుల్‌లోని గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి యొక్క పాట్రియార్క్‌ ను నియమించాడు, ఆ సమయంలో అది ఖాళీగా ఉంది.

గ్రీకు ఆర్థోడాక్స్ చర్చి ఆర్థడాక్స్ యొక్క రక్షకుడిగా, మెహ్మెద్ ది కాంకరర్‌ కాథలిక్కులకు వ్యతిరేకంగా బలాన్ని పొందాడు. ముస్లింలు ఒక నగరాన్ని జయించినప్పుడు, మతపరమైన విధిగా, వారు మొదటి శుక్రవారం నాడు కలిసి ప్రార్థన చేయాలి. యుద్ధ చట్టానికి అనుగుణంగా, ఇస్తాంబుల్ నగరం యొక్క అతిపెద్ద చర్చి హగియా సోఫియా మసీదుగా మార్చబడింది, అయితే ఇతర చర్చిలు అలాగే ఉన్నాయి. ఒట్టోమన్లు స్థానిక ప్రజలను హింసించలేదు పట్టుకోలేదు మరియు వారు టర్కీ సామ్రాజ్య పౌరులుగా మారారు. స్థానికుల ఆస్తులను స్వాధీనం చేసుకోలేదు.

సుల్తాన్ మెహ్మద్ II ఇస్తాంబుల్ నగరం అభివృద్ధి చెందాలని కోరుకున్నాడు. ఒట్టోమన్లు ఇస్తాంబుల్ నగరాన్ని అభివృద్ధి చేశారు. బాల్కన్ మరియు అనటోలియా నుండి నైపుణ్యం కలిగిన జనాభా అక్కడ స్థిరపడ్డారు. టర్కులు  ఇస్తాంబుల్ నగరం పై తమ ముద్రను వేసారు.

 

No comments:

Post a Comment