14 March 2023

కాశ్మీరీ వ్యక్తి ముస్తఫా-ఇబ్న్-జమీల్ 500-మీటర్ల పేపర్ స్క్రోల్‌పై చేతితో దివ్య ఖురాన్ రాసాడు. Kashmiri Man Writes Quran by Hand on a 500-Metre Scroll

 

ఉత్తర కాశ్మీర్‌లోని బందిపోరా జిల్లాకు చెందిన 26 ఏళ్ల ముస్తఫా-ఇబ్న్-జమీల్ కేవలం మూడు నెలల వ్యవధిలో 500 మీటర్ల పొడవైన పేపర్ స్క్రోల్‌పై చేతితో పవిత్ర ఖురాన్‌ను రాశాడు.ముస్తఫా-ఇబ్న్-జమీల్ ఢిల్లీలోని ఒక కర్మాగారం నుండి కాలిగ్రఫీ కోసం ప్రత్యేక ఆర్ట్ పేపర్‌ మరియు దానిపై రాయడం కోసం ప్రత్యేక కాలిగ్రఫీ ఇంక్‌ను పొందాడు.

జమీల్ నస్క్ టైప్‌ఫేస్‌ని ఉపయోగించి కాలిగ్రఫీ భాగాన్ని పూర్తి చేయటానికి మూడు నెలలు పట్టింది. జమీల్ ప్రకారం, ఈ ప్రాజెక్ట్కు  ఢిల్లీలో రూ. 2.5 లక్షలకు పైగా ఖర్చు అయినది. జమీల్, "ఖురాన్ కాపీని వ్రాయడం నా లక్ష్యం" అని పేర్కొన్నాడు, దానికోసం ప్రేత్యేకంగా కాలిగ్రఫీని అభ్యసించాడు. తన కళాత్మక వృత్తిని అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నానని, ప్రస్తుతం అనేక ప్రాజెక్టులను రూపొందిస్తున్నట్లు జమీల్ తెలిపారు.

జమీల్, చెన్నైకి చెందిన NGO లింకన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుండి తన పనికి గుర్తింపు పొందాడు. కాశ్మీర్‌లోని యువకులు కాలిగ్రఫీ నేర్చుకునేలా తన సాధన ప్రోత్సహిస్తుందని జమీల్ ఆశాభావం వ్యక్తం చేశారు.

 

-(PTI నుండి ఇన్‌పుట్‌లతో)

No comments:

Post a Comment