11 December 2023

బీబీ సోఘ్రా: ఒక మహోన్నతమైన పరోపకారి Bibi Soghra: A Towering Philanthropist

 



బీబీ సోఘ్రా బీహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలోని బీహార్‌షరీఫ్‌ కు చెందిన             ప్రసిద్ధ పరోపకారి. బీబీ సోఘ్రా బీహార్-ముంగేర్ జిల్లాలోని హసౌరి అనే చిన్న గ్రామంలో 1815లో అబ్దుల్ సమద్ యొక్క సంపన్న కుటుంబంలో జన్మించింది. బీబీ సోఘ్రా తన ప్రాథమిక విద్యను స్థానిక మదర్సాలో పూర్తి చేసింది. తరువాత, ఉర్దూ, హిందీ, అరబీ, ఫార్సీ మరియు ఇంగ్లీషులో డిగ్రీని పొందినది.

బీబీ సోఘ్రా కు 21సంవత్సరాల వయస్సులో మౌల్వీ అబ్దుల్ అజీజ్‌తో వివాహం జరిగింది. అబ్దుల్ అజీజ్ తల్లిదండ్రులు-ఫజల్ ఇమామ్ మరియు బీబీ జహూరాన్‌ ధనవంతులు.. అబ్దుల్ అజీజ్ బ్రిటిష్ పాలనలో ప్రభుత్వ ఉద్యోగి. కానీ 1857లో భారతదేశం యొక్క మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో, ప్రభుత్వ సేవకు రాజీనామా చేసి  బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య యుద్ధంలో చేరాడు.

బీబీ సోఘ్రా-అబ్దుల్ అజీజ్ దంపతులకు ఖదీరన్ అనే అందమైన కుమార్తె జన్మించినది. ఖదీరన్ ఇంట్లోనే  విద్యాభ్యాసం చేసినది.  తరువాత, ఖదీరన్ కు వివాహం జరిగింది.వివాహం జరిగిన తరువాత కొంతకాలానికి ఖదీరన్ క్షయవ్యాధితో మరణించినది. ఖదీరన్ అకాల మరణం తల్లితండ్రులు అబ్దుల్ అజీజ్ మరియు బీబీ సోఘ్రాలను విచారగ్రస్తులను చేసింది.

కుమార్తె మరణం వలన కలిగిన  విచారం తో అబ్దుల్ అజీజ్ అనారోగ్యానికి గురిఅయి కొన్నేళ్ల తర్వాత మరణించాడు. భర్త అబ్దుల్ అజీజ్ మరణం తర్వాత బీబీ సోఘ్రా ఒంటరిగా మిగిలిపోయింది. ఒంటరితనాన్ని అధిగమించడానికి, బీబీ సోఘ్రా స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో బిజీగా ఉండాలని నిర్ణయించుకుంది. బీబీ సోఘ్రా 1896లో సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్‌ను ఏర్పాటు చేసి, వక్ఫ్‌కు మోటవల్లి (మేనేజర్)గా బాధ్యతలు చేపట్టారు.

సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్, బీహార్‌లోని పాట్నా, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, దర్భంగా, నలంద, నవాడా, గయా, షేక్‌పురా (బార్బిఘా) మరియు భాగల్‌పూర్ వంటి వివిధ జిల్లాల్లో విస్తరించి ఉంది. సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్ బీహార్‌లోని సంపన్న ఎస్టేట్‌లలో ఒకటి. బీబీ సోఘ్రా ముజఫర్‌పూర్ మరియు బీహార్‌షరీఫ్‌లలో వారసత్వ గృహాలను కలిగి ఉంది.

సోఘ్రా వక్ఫ్ ఎస్టేట్ కింద అనేక విద్యా మరియు సంక్షేమ సంస్థలు ఇప్పటికీ పనిచేస్తున్నాయి.

1. పురాతన మదరసా అజీజియా బీహార్ షరీఫ్ 1896లో పాట్నాలో స్థాపించబడింది. మదర్సా అజీజియా విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు హాస్టల్ సౌకర్యాలను కలిగి ఉన్న ఒక ప్రసిద్ధ విద్యా కేంద్రం.

2. కాగ్జి మొహల్లాలో ఉన్న సోఘ్రా హై-స్కూల్ 1917లో స్థాపించబడింది మరియు ఇప్పటికీ పనిచేస్తోంది. ఇంతకుముందు ఈ పాఠశాలను సోఘ్రా గ్రోయింగ్ ఇంగ్లీష్ హై స్కూల్ అని పిలిచేవారు. ఇది మైనారిటీ-అనుబంధ పాఠశాల మరియు పట్టణంలో రెండవఉత్తమ పాఠశాల.

3. 1978లో సోఘ్రా కళాశాల స్థాపించబడింది. ఇది ఎనిమిది ఎకరాల భూమిలో విస్తరించి ఉంది. 1981లో, కళాశాల మగద్ విశ్వవిద్యాలయంచే గుర్తించబడింది సోఘ్రా కళాశాల ప్రభుత్వ ఆమోదం పొందిన మైనారిటీ కళాశాల; పాట్నాలోని పాట్లీపుత్ర విశ్వవిద్యాలయం క్రింద పనిచేస్తుంది..

4. ఖురాది మొహల్లాలోని జామా మసీదు దగ్గర పెద్ద డార్మిటరీ. ఇది బాగా నిర్వహించబడుతోంది మరియు నేటికీ పనిచేస్తుంది.

వక్ఫ్నామాలో పేర్కొన్న కనీసం ఐదు మసీదుల నిర్వహణ మరియు సరైన పనితీరును బీబీ సోఘ్రా స్వయంగా చూసుకున్నారు:

i. షాహి జామా మసీద్, బీహార్షరీఫ్, పుల్ పార్

ii. జామా మసీదు, మురారాపూర్, బీహార్షరీఫ్

iii. బుఖారీ మసీదు, కాగ్జి మొహల్లా, బీహార్షరీఫ్

iv. మోహినీ మసీదు, మోహిని, నలంద

v. జామా మసీదు, హసౌరి, షేక్‌పురా

బీబీ సోఘ్రా ఎస్టేట్ పేదలకు వైద్య మరియు ఆరోగ్య సంరక్షణ, విద్యార్ధులు మరియు పండితులకు, ఆసుపత్రులు మరియు మదర్సాల నిర్వహణ ఆర్థిక సహాయం అందిస్తుంది. .

సోఘ్రా ఎస్టేట్ మొత్తం వార్షిక ఆదాయంలో 40% మదరసా అజీజియా పొందుతుంది. మదర్సా అజీజియా చాలా పురాతనమైనది మరియు పెద్ద సంఖ్యలో విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకు హాస్టల్ సౌకర్యాలు మరియు క్యాంపస్‌లో ఒక మసీదు కలిగి ఉన్న విద్యా కేంద్రం.

1908లో 97 సంవత్సరాల వయస్సులో బీబీ సోఘ్రా మరణించినది. జామా మసీదు, బీహార్ షరీఫ్, నలంద ప్రాంగణంలో బీబీ సోఘ్రా ఖననం చేయబడింది.

 

No comments:

Post a Comment