ఇస్లాం జీవితంలోని వివిధ అంశాలలో
పురుషులు మరియు స్త్రీల సమానత్వాన్ని నొక్కి చెబుతుంది. ఇస్లాంపురుషుల వలే హక్కులు మరియు బాధ్యతలను కూడా మహిళలకు ప్రసాదించినది..
·
ఆధ్యాత్మిక సమానత్వం:
ఇస్లాం స్త్రీ-పురుషుల ఆధ్యాత్మిక
సమానత్వాన్ని స్పష్టంగా గుర్తిస్తుంది. దివ్య ఖురాన్‌లో, సూరా అల్-ఇమ్రాన్ (3:195)లో "వారి ప్రభువు వారి ప్రార్ధనను
ఆమోదించాడు.’నేను ఎవరి కర్మనూ వృధా కానివ్వను- వారు పురుషులులైనా సరే, స్త్రీలు అయిన సరే! మీరంతా
ఒకే రాశికి చెందినవారు. "
పురుషులు మరియు మహిళలు ఇద్దరూ తమ
పనులకు సమానంగా జవాబుదారీగా ఉంటారని మరియు ఒకే ఆధ్యాత్మిక ప్రతిఫలానికి అర్హులని పై
ఆయత్ చెబుతుంది. దైవంతో సంబంధాన్ని కోరుకునే విషయానికి వస్తే ఇస్లాం స్త్రీ-పురుషుల
మధ్య తేడాను గుర్తించదు.
·
విద్యా హక్కులు:
ఇస్లాం స్త్రీ-పురుషులు ఇరువురు
విద్యనూ అబ్యసించమని చెప్పుతుంది.స్త్రీ-పురుషులు ఇద్దరికీ జ్ఞాన సాధనను ప్రోత్సహిస్తుంది.
ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) విద్య యొక్క ప్రాముఖ్యతను నొక్కి
చెప్పారు, "జ్ఞానాన్ని సంపాదించడం ప్రతి ముస్లింకు విధిగా ఉంటుంది." విద్యనూ
ఆర్జించే బాధ్యత పురుషులు మరియు మహిళలు ఇద్దరికీ వర్తిస్తుంది, ఇస్లాంలో విద్య యొక్క ప్రాముఖ్యతను
తెలియజేస్తుంది.
చరిత్ర అంతటా, వేదాంతశాస్త్రం మరియు న్యాయశాస్త్రం నుండి సైన్స్ మరియు సాహిత్యం వరకు వివిధ రంగాలలో గణనీయమైన కృషి చేసిన అనేక మంది ప్రముఖ ముస్లిం మహిళా పండితులు ఉన్నారు.
·
ఆర్థిక సాధికారత:
ఇస్లాం మహిళలకు ఆర్థిక హక్కులను
కల్పిస్తుంది, స్త్రీలకు తమ ఆస్తిని స్వంతం చేసుకునే మరియు నిర్వహించుకునే హక్కు, వ్యాపారంలో పాల్గొనడం మరియు ఆర్థిక
కార్యకలాపాల్లో పాల్గొనడం వంటి హక్కులు ఉన్నాయి. ఖురాన్ స్పష్టంగా చెబుతుంది, ‘భర్తలకు భార్యలపై హక్కులున్నట్లే శాస్త్రం ప్రకారం భార్యలకు కూడా వారిపై హక్కులు
ఉన్నాయి. " (ఖురాన్ 2:228)
ప్రవక్త ముహమ్మద్(స) యొక్క మొదటి భార్య, హజ్రత్ ఖదీజా, ఒక విజయవంతమైన వ్యాపారవేత్త..
·
సామాజిక మరియు చట్టపరమైన సమానత్వం:
న్యాయం మరియు చట్టపరమైన హక్కుల
విషయాలలో, ఇస్లాం పురుషులు మరియు స్త్రీల మధ్య సమానత్వాన్ని నిర్ధారిస్తుంది. స్త్రీ-పురుషులు
ఇరువురు సమానమైన న్యాయానికి అర్హులు మరియు
ఇస్లాం లింగం ఆధారంగా తేడా చూపరాదు.. ఖురాన్ సమ న్యాయం యొక్క సూత్రాన్ని నొక్కి
చెబుతుంది, "ఓ విశ్వసించినవారలారా, మీరు తల్లిదండ్రులకు మరియు బంధువులకు
వ్యతిరేకమైనప్పటికీ, అల్లాహ్‌కు సాక్షులుగా ఉండండి, న్యాయంలో స్థిరంగా ఉండండి."
(ఖురాన్ 4:135)
ఇస్లాం కూడా వివాహం, విడాకులు మరియు వారసత్వం వంటి సమస్యలను పరిష్కరిస్తూ మహిళల పట్ల న్యాయమైన ప్రవర్తన కొరకు మార్గదర్శకాలను అందిస్తుంది. ఇస్లాం స్త్రీలను అణచివేస్తుందనే అపోహ తప్పు.
ఇస్లాం, జీవితంలోని అన్ని అంశాలలో స్త్రీ
పురుషుల మధ్య సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. ఇస్లాం స్త్రీ-పురుషుల మద్య సమానమైన
మరియు సమగ్రమైన సమాజాన్ని పెంపొందించడంలో
సహాయపడుతుంది.
No comments:
Post a Comment