15 December 2023

సుభాస్ చంద్రబోస్ జపాన్‌కు వ్యతిరేకంగా "ఇండియన్ మెడికల్ మిషన్"ని చైనాకు పంపినప్పుడు When Subhas Chandra Bose sent the “Indian Medical Mission” to China against Japan

 


జపనీస్ దండయాత్రకు వ్యతిరేకంగా చైనా ప్రజలకు సహాయం చేయడానికి నిధులను సేకరించే ప్రయత్నంలో జూన్ 12, 1938న అఖిల భారత చైనా దినోత్సవాన్ని పాటించారని మీకు తెలుసా?

1937 - 1938 సంవత్సరం లో చైనా పట్ల జపాన్ యొక్క శత్రుత్వం గరిష్ట స్థాయికి చేరుకుంది. జపాన్ వారి క్రూరత్వం కు నిరసనగా, చైనా పౌరుల పట్ల జపాన్ అధికార యంత్రాంగం యొక్క సంవత్సరాల తరబడి అణచివేతకు మరియు అధికార దుర్వినియోగానికి వ్యతిరేకంగా న్యూయార్క్‌లో అంతర్జాతీయ చైనా సహాయ కమిటీని ఏర్పాటు చేశారు.

భారతదేశంలో, కూడా ఏకాభిప్రాయంతో, భారత జాతీయ కాంగ్రెస్ సభ్యులు చైనా పట్ల తమ సంఘీభావాన్ని ప్రదర్శించారు. కాంగ్రెస్  వాదులు అన్ని జపనీస్ వస్తువులను  బహిష్కరించారు మరియు నిషేధం విధించారు.

అమెరికన్ జర్నలిస్ట్, ఆగ్నెస్ స్మెడ్లీ, చైనీస్ కమ్యూనిస్ట్ జనరల్, ఝూ డితో కలిసి, చైనాకు వైద్య సహాయం పంపమని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకి అత్యవసర విజ్ఞప్తి చేశారు.వారి విజ్ఞప్తిని నెహ్రు అంగీకరించారు మరియు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ "ఇండియన్ మెడికల్ మిషన్"ను రూపొందించారు.

సుభాస్ బాబు 30 జూన్ 1938న ఒక పత్రికా ప్రకటన ద్వారా ప్రజలకు ఒక విజ్ఞప్తి చేసారు. బోస్ 22,000 రూపాయల నిధిని సేకరించి స్వచ్ఛంద వైద్యుల బృందాన్ని మరియు అంబులెన్స్‌ని చైనాకు పంపడానికి ఏర్పాటు చేశారు.

డాక్టర్ బెజోయ్ కుమార్ బసు (కోల్‌కతా), డాక్టర్ ఎంఆర్ చోల్కర్ (నాగ్‌పూర్), డాక్టర్ మదన్ మోహన్‌లాల్ అటల్ (అలహాబాద్, నాయకుడు), డాక్టర్ దేబేష్ ముఖర్జీ (కోల్‌కతా) & డాక్టర్ ద్వారకానాథ్ కొట్నీస్ (మహారాష్ట్ర)తో 5 మంది భారత వైద్యుల బృందం ఏర్పాటు చేయబడింది.

సుభాష్ చంద్రబోస్ ఒక ప్రకటనలో, “చైనాకు అంబులెన్స్ యూనిట్‌ను పంపాలన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రతిపాదనను చైనా ప్రభుత్వం అంగీకరించిందని భారతదేశంలోని చైనా కాన్సులేట్ ద్వారా నాకు సమాచారం అందించబడింది. ఏర్పాట్లతో ముందుకు సాగడం మరియు వైద్య మిషన్‌ను వీలైనంత త్వరగా పంపడం ఇప్పుడు అవసరం. జూన్ 12న దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా చైనా డేను విజయవంతంగా జరుపుకున్నారు, అద్భుతమైన స్పందనకు నేను ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నేను ఈ ఆలోచనను హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నాను మరియు జూలై 7, 8 మరియు 9వ తేదీలను చైనా ఫండ్ డేలుగా నిర్ణయించాను. నిధుల సేకరణ కోసం ఈ రోజుల్లో ఇంటెన్సివ్ డ్రైవ్ చేయాలని నేను దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ సంస్థలను అభ్యర్థిస్తున్నాను. వైద్య మిషన్‌ను కనీసం ఒక సంవత్సరం పాటు పనిలో ఉంచడానికి సేకరణలు సరిపోతాయని నేను ఆశిస్తున్నాను.

చివరగా, పూర్తి సన్నద్ధమైన అంబులెన్స్ కోసం ఫోర్డ్‌తో ఇప్పటికే ఆర్డర్‌లు చేయబడ్డాయని ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నారు, అంబులెన్స్లను  ఫోర్డ్‌ వారు నేరుగా హాంకాంగ్‌కు పంపుతారు. వైద్య సిబ్బందితో కలిసి అంబులెన్స్ భారతదేశం యొక్క సానుభూతి మరియు చైనీస్ ప్రజల పట్ల మంచి సంకల్పానికి చిహ్నంగా ఉంటుంది. ప్రజల ప్రతిస్పందన  కాంగ్రెస్‌కు మరియు భారత దేశానికి విలువైనదిగా ఉంటుందని నేను హృదయపూర్వకంగా ఆశిస్తున్నాను మరియు విశ్వసిస్తున్నాను అని అన్నారు.

సెప్టెంబర్ 1938, సుభాష్ చంద్రబోస్ అధ్యక్షతన, కాంగ్రెస్ ఐదుగురు వైద్యులతో కూడిన వైద్య బృందానికి ఆమోదం తెలిపింది. జట్టులో అలహాబాద్‌కు చెందిన డాక్టర్ మదన్ మోహన్‌లాల్ అటల్ (భారత వైద్య మిషన్ డిప్యూటీ లీడర్), నాగ్‌పూర్‌కు చెందిన ఎం. చోల్కర్, షోలాపూర్‌కు చెందిన దావర్కనాథ్ కోట్నీస్, కోల్‌కతాకు చెందిన బెజోయ్ కుమార్ బసు మరియు దేబేష్ ముఖర్జీ ఉన్నారు.

డాక్టర్ రానెన్ సేన్‌ను మొదట ఈ మిషన్‌కు ఎంపిక చేశారు, అయితే రానెన్ సేన్‌ కమ్యూనిస్ట్‌గా ఉన్నందున చైనాకు వెళ్లేందుకు బ్రిటిష్ ప్రభుత్వం అనుమతించలేదు. కాబట్టి డాక్టర్ సేన్, డాక్టర్ బెజోయ్ కుమార్ బసును ఎంపిక చేయమని సుభాష్ చంద్రబోస్‌ను సూచించాడు మరియు డాక్టర్ బెజోయ్ కుమార్ బసును బొంబాయికి పంపాడు, అక్కడ నుండి మెడికల్ మిషన్ సభ్యులు చైనాకు బయలుదేరారు

వుహాన్‌లోని హాంకౌ నౌకాశ్రయానికి భారత వైద్య మిషన్ బృందం తొలిసారిగా చైనా చేరుకుంది. ఆ తర్వాత వారిని యాన్‌నాన్‌కు పంపారు, అక్కడ వారికి మావో జెడాంగ్, ఝు దే మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఇతర అగ్ర నాయకులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ వైద్యులు చైనాలోని వివిధ ప్రాంతాల్లో క్షతగాత్రులు మరియు అనారోగ్యంతో ఉన్న చైనీయులకు చికిత్స చేయడంలో తదుపరి నాలుగు సంవత్సరాలు గడిపారు.

డాక్టర్ ముఖర్జీ, డాక్టర్ చోలేకర్ మరియు డాక్టర్ అటల్ ఆరోగ్య కారణాలు మరియు ఇతర కారణాల వల్ల భారతదేశానికి తిరిగి వచ్చారు. ఐదుగురు సభ్యుల బృందంలో భాగంగా ఉన్న డాక్టర్ కోట్నిస్ వయస్సు 28 సంవత్సరాలు, గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి మొబైల్ క్లినిక్‌లలో పని చేస్తూ దాదాపు 5 సంవత్సరాలు చైనాలో ఉన్నారు.

భారతీయ వైద్య బృందం లోని డాక్టర్ కోట్నిస్ మినహా అందరూ, భారతదేశానికి తిరిగి వచ్చారు. డాక్టర్ కోట్నిస్, చైనీస్ నర్సు క్వో క్వింగ్లాన్ ప్రేమించి పెళ్లి చేసుకోన్నాడు మరియు   వారికి యిన్హువా అనే కుమారుడు ఉన్నాడు. యిన్హువా అంటే భారతదేశం (యిన్) మరియు చైనా (హువా). యిన్హువా జన్మించిన మూడు నెలల తర్వాత, డాక్టర్ కోట్నిస్‌కి  మూర్ఛ వ్యాధి సోకింది. 1942 డిసెంబరు 932 ఏళ్ల చిన్న వయస్సులో డాక్టర్ కోట్నిస్‌ మూర్ఛ వ్యాధితో మరణించాడు.

తిరిగి వచ్చిన తర్వాత, డాక్టర్ బెజోయ్ కుమార్ బసు వివిధ సమాజ సేవ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నారు. 1958లో, డాక్టర్ బెజోయ్ కుమార్ బసు  ఆక్యుపంక్చర్ కళలో ప్రావీణ్యం సంపాదించడానికి చైనాకు తిరిగి వెళ్ళాడు. 1959లో భారతదేశంలో డాక్టర్ బెజోయ్ కుమార్ బసు  చే కోల్‌కతాలో ఆక్యుపంక్చర్ విధానం ప్రవేశపెట్టబడినది.

1973లో డాక్టర్ బసును ఆక్యుపంక్చర్ అనస్థీషియాలో అవగాహన పొందడానికి మరియు నైపుణ్యాన్ని పొందేందుకు చైనా ప్రభుత్వం ఆహ్వానించింది. డాక్టర్ బసు పర్యటనలు భారత్, చైనాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేశాయి. 1973లో, డాక్టర్ బసు డాక్టర్ ద్వారకానాథ్ కోట్నిస్ మెమోరియల్ కమిటీ (DKMC)ని ఏర్పాటు చేసి వైద్య మిషన్ ద్వార ప్రజలకు ఆరోగ్య సేవల విలువలను ప్రచారం చేశారు.

1988లో ఇండియన్ మెడికల్ మిషన్ మెమోరియల్ మ్యూజియం నిర్మించబడింది, ఇక్కడ వేలాది మంది యువకులకు ఇండియన్ మెడికల్ మిషన్ గురించి అవగాహన కల్పించారు. ద్వారకానాథ్ కోట్నీస్ వారసత్వం భారతీయ మరియు చైనా ప్రజల హృదయాలలో కొనసాగుతుంది.

 

 

No comments:

Post a Comment