సృష్టి ప్రారంభంలో, దేవుడు ఆదమ్ మరియు హవాలను సృష్టించాడు మరియు వారిని స్వర్గంలో స్థిరపరిచాడు. దేవుడు ఆదమ్‌తో ఇలా అన్నాడు, 'ఓహ్ ఆదమ్ నువ్వు, నీ భార్య, స్వర్గం లో ఉండండి. కోరిన ఫలం తినండి. కాని ఆ చెట్టు దగ్గిరకు మాత్రం పోవద్దు. పోయారంటే మీరు చెడ్డవారిలో చేరిపోతారు.' (దివ్య ఖురాన్ 7:19)
"మా ప్రభూ, మేము మా ఆత్మలకు అన్యాయం
చేసాము: మీరు మమ్మల్ని క్షమించి, మాపై దయ చూపకపోతే, మేము నష్టపోయినవారిలో
ఉంటాము." (దివ్య ఖురాన్ 7:23)
ఇది సృష్టి సమయంలో జరిగిన సంఘటన కాదు, వాస్తవానికి, ఇందులో మానవాళికి లోతైన పాఠాన్ని కలిగి ఉంది. పాఠం ఏమిటంటే, ప్రతి వ్యక్తి కి ఈ ప్రపంచంలో నిషేధించబడిన చెట్టు ఉంది మరియు వ్యక్తి దానికి దూరంగా ఉండాలి. నిషిద్ధ చెట్టు వద్దకు వచ్చే వ్యక్తి స్వర్గంలోకి ప్రవేశించక పోయే ప్రమాదం ఉంది. ఇది సృష్టి ప్రారంభంలో దేవుడు ఉంచిన ఉదాహరణ.
మనం తరచుగా వ్యక్తుల గురించి, విషయాల గురించి, సమాజం గురించి, ఆఖరకు వాతావరణం గురించి కూడా ఫిర్యాదు చేస్తాము. కానీ ఇది చాలా చెడ్డ అలవాటు. ఫిర్యాదు అనేది నిజంగా మన పాలిట "నిషిద్ధ చెట్టు". దీన్ని మనం అర్థం చేసుకోవాలి.
ప్రవక్త అబ్రహం జీవితం నుండి మనకు ఒక ఉదాహరణ లభిస్తుంది. నాలుగు వేల సంవత్సరాల క్రితం, ప్రవక్త ఇబ్రహీం తన భార్య హజ్రా మరియు అతని కుమారుడు ఇస్మాయిల్‌ను అరేబియా ఎడారిలో ఉంచి సిరియాకు తిరిగి వచ్చాడు. తరువాత, ఇస్మాయిల్ పెద్దయ్యాక జుర్హుమ్ తెగకు చెందిన స్త్రీని వివాహం చేసుకున్నాడు. కొన్ని సంవత్సరాల తరువాత, ఇబ్రహీం వారిని సందర్శించి ఇస్మాయిల్ భార్యను కలిశాడు. చాలా క్లిష్ట పరిస్థితుల్లో జీవిస్తున్నానని, తాను పడుతున్న కష్టాలన్నింటి గురించి ఇస్మాయిల్ భార్య ఫిర్యాదు చేసింది. ఇబ్రహీం ఈ క్రింది సందేశాన్ని ఇస్మాయిల్‌కు అందజేయమని ఆమెను కోరాడు, ‘మీ గుమ్మం/ద్వారం మార్చండి.’ ఇస్మాయిల్ తర్వాత తన భార్య నుండి విడిపోయి మరొక స్త్రీని వివాహం చేసుకున్నాడు.
కొంత సమయం తరువాత, హజారత్ ఇబ్రహీం తన కుటుంబాన్ని కలవడానికి తిరిగి వచ్చాడు. ఇస్మాయిల్ దూరంగా ఉన్నాడు మరియు ఇస్మాయిల్ కొత్త భార్య, ఎటువంటి ఫిర్యాదులు లేకుండా లబించిన ప్రతిదానికీ కృతజ్ఞతలు తెలిపింది.. ఇది విన్న హజారత్ ఇబ్రహీం ఆమెతో ఇలా అన్నాడు, "ఇస్మాయిల్ ఇంటికి వచ్చినప్పుడు, 'మీ ద్వారం ఉంచుకోండి' అని నా సందేశాన్ని అతనికి తెలియజేయండి." (సహీహ్ అల్-బుఖారీ) హజారత్ ఇబ్రహీంకు సంబంధించిన ఈ సంఘటన విశ్వాసులు సానుకూలతను కలిగి ఉండాలని చూపిస్తుంది
ఈ ప్రపంచంలో, స్వర్గానికి ప్రవేశం ఇవ్వబడే నఫ్సుల్ ముత్మైనా (శాంతితో ఉన్న ఆత్మ, సంతృప్త ఆత్మ)గా మారడానికి మనం కృషి చేయాలి. అశాంతి, ఎప్పుడు ఫిర్యాదులను చేయడం ద్వారా మనం నఫ్సుల్ ముత్మైనా సాధించలేము. తరచుగా ఫిర్యాదు చేయడం అలవాటుగా మారరాదు. దానివల్ల మనం శాంతి పొందలేము.
నఫ్సుల్ ముత్మైనా (శాంతితో ఉన్న ఆత్మ, సంతృప్త ఆత్మ) కు ముహమ్మద్ ప్రవక్త(స) ఒక ఉదాహరణగా నిలిచారు. క్రీ.శ.622లో ముహమ్మద్ ప్రవక్త(స) మక్కా నుండి వలస వచ్చి మదీనా చేరుకున్నారు.. ప్రవక్త(స) మదీనా చేరుకున్నప్పుడు, మదీనా లో. "ఓ ప్రజలారా, దాతృత్వంలో ఒక ఖర్జూరం ఇవ్వడం ద్వారా అయినా మిమ్మల్ని మీరు అగ్ని నుండి రక్షించుకోండి." అని తన మొదటి ఉపన్యాసం ఇచ్చారు
అప్పటి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. ప్రవక్త(స) తన దేశం నుండి బహిష్కరించబడ్డారు. చాలా కాలం హింసించబడ్డారు ప్రత్యర్థులు అతన్ని ఆర్థికంగా నాశనం చేయడానికి, అతనితో అన్ని సంబంధాలను తెంచుకుని, నిస్సహాయ స్థితికి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేశారు.
మదీనా చేరుకోగానే ఇంతకాలం తాను అనుభవించిన గత దారుణాల గురించి, శత్రుత్వాల గురించి ఒక్క మాట కూడా ప్రవక్త(స)మాట్లాడలేదు. తన అణచివేతను వివరించే ప్రసంగం చేయలేదు బదులుగా, ప్రజల దృష్టిని చాలా పెద్ద సమస్య- దేవునికి జవాబుదారీతనం, పరలోకం యొక్క సమస్య మరియు తీర్పు పైకి మళ్లించారు:
ప్రతికూలంగా ఉండే అలవాటు, మనోవేదనలు ఒకరి వ్యక్తిత్వాన్ని నాశనం చేస్తాయి.. ప్రతికూలత అంతర్గత వ్యక్తిత్వాన్ని క్షీణింపజేయడానికి సరిపోతుంది.
ఫిర్యాదు చేసే
అలవాటు నుండి మనం ఎలా బయటపడగలం?
ఇస్లాం ప్రవక్త(స) ఇలా అన్నారు: "దేవుని స్మరణతో పెదవులు తడిగా ఉన్నవారు ఉత్తమ వ్యక్తులు." దీని అర్థం ఏమిటి. కలిగి ఉన్న దాని పై దృష్టి పెట్టాలి. లేని దాని పై కాదు.
దేవునికి
కృతజ్ఞతలు చెప్పడానికి కలిగి ఉన్న దాని పై దృష్టి పెట్టండి. ఫిర్యాదులకు కారణం ఉన్నప్పటికీ సానుకూలంగా
ఉండటానికి ఇది గొప్ప మార్గం.
No comments:
Post a Comment