6 December 2023

రఫీక్ 'రూసీ'- బ్రిటీష్‌ వారిని తరిమికొట్టడానికి సోవియట్ సహాయం కోరిన- తాష్కెంట్ మిలిటరీ స్కూల్ విద్యార్ధి - Rafiq ‘Roosi’, Tashkent Military Schooler, Who Sought Soviet Help to Oust British

 





 

బ్రిటిష్ వలస పాలకులను తరిమికొట్టేందుకు సలహాలు కోరేందుకు సోవియట్ యూనియన్‌కు వెళ్లిన మొదటి భారతీయ విప్లవకారులలో ఒకరు అయిన రఫీక్ రూసీని తాష్కెంట్‌లోని ఇండియన్ మిలిటరీ ట్రైనింగ్ స్కూల్‌లో చేరిన మొదటి వ్యక్తి  లేదా  తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, వ్యవస్థాపక సభ్యుడు అనికూడా పిలవవచ్చు.  రఫీక్ రూసీ దాదాపు ఒక సంవత్సరం పాటు  జరిపిన పెషావర్ కుట్ర కేసులో విచారణ అనంతరం జైలు శిక్ష అనుభవించారు.

 

రఫీక్ 'రూసీ' అహ్మద్ నాలుగు దశాబ్దాల క్రితం మరణించాడు.  నేటికి రఫీక్ 'రూసీ' అహ్మద్ వారసులు భోపాల్ లో 'రూసిస్' గా ప్రసిద్ధి చెందారు. మూడు సంవత్సరాల పాటు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పోరాడిన తర్వాత, కామ్రేడ్ రఫీక్  అహ్మద్ 'రూసీ' 1982లో 93 సంవత్సరాల వయస్సులో, భోపాల్‌లో మరణించాడు.

 

1920లో ఖిలాఫత్ ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పుడు, ఢిల్లీలోని ఖిలాఫత్ కమిటీ ఒక సమావేశాన్ని ప్రకటించింది మరియు ఖిలాఫత్ ఉద్యమం బ్రిటీష్ వారి నుండి భారతదేశాన్ని విముక్తి చేయడానికి పిలుపునిచ్చిందని భావించి భోపాలీల ఒక బృందం ఢిల్లీకి వెళ్లింది.

 

ఢిల్లీకి వెళ్ళిన భోపాలీల బృందం లో రఫీక్  అహ్మద్ రూసీతో అఫ్తాబ్ అలీ ఖాన్, మహ్మద్ అలీ, అబ్దుల్ హయీ, మాస్టర్ మష్కూర్, మహ్మద్ ఖాన్, అహ్మద్ కబీర్ అహ్మద్, మహ్మద్ షఫీ మరియు మహ్మద్ అక్తర్ మొదలగు వారు కలరు.

 

 భోపాలీల బృందం తమలోని ఒక బ్రిటిష్  గూఢచారిని తరిమి కొట్టినది మరియు బ్రిటీష్ వారికి సన్నిహితుడు అగు  డిల్లీలో ఢిల్లీలోని జామా మసీదు ఇమామ్‌ ప్రార్థనలకు నాయకత్వం వహించకుండా నిలిపివేసినది.

 

ఖిలాఫత్ ఉద్యమం అనేది  టర్కిష్ కాలిఫేట్ పట్ల బ్రిటీష్ వైఖరికి వ్యతిరేకంగా చేసిన పిలుపు అని తెలుసుకున్నప్పుడు, రఫీక్  అహ్మద్ రూసీ సహచరులు కొందరు భోపాల్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నారు. మిగిలిన వారు రూసీ తో సహా  ఆఫ్ఘనిస్తాన్ రాజు అమానుల్లా ఖాన్ ఇచ్చిన ఉత్సాహభరితమైన పిలుపుతో ముగ్ధులై "హిజ్రత్" (వలస)తో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నారు మరియు కాబూల్‌కు బయలుదేరారు.

 

రూసీ బృందం పెషావర్ నుండి సరిహద్దు దాటి ఆఫ్ఘనిస్తాన్‌లోకి ప్రవేశించి, జలాలాబాద్ మీదుగా కాబూల్ వైపు వెళ్లారు. ఆఫ్ఘన్ రాజు అమానుల్లా ఖాన్‌ను వారిని సాదరం గా ఆహ్వానించి వారిని జబల్ అల్-సిరాజ్ (సైనిక స్థావరంగా ఉపయోగించిన మాజీ ప్యాలెస్)కి పంపమని ఆదేశించాడు. ఆఫ్ఘన్ ఎమిర్ వారికి ఉద్యోగాలు ఇస్తానని వాగ్దానం చేసినప్పుడు, ఆ సాకుతో ఎమిర్ వారిని బ్రిటిష్ వారికి అప్పగిస్తాడని భావించి రూసీ బృందం జబల్ అల్-సిరాజ్ నుండి తప్పించుకుని, ప్రతిరోజూ 30 నుండి 40 మైళ్ల వరకు కాలినడకన ప్రయాణించి, కష్టతరమైన పర్వతాలు మరియు ప్రమాదకరమైన ఎడారులను దాటి టర్కిస్తాన్ సరిహద్దుకు చేరుకుంది, ఆపై మజార్-ఇ-షరీఫ్ మరియు ఘోర్ మీదుగా టెర్మెజ్ చేరుకుంది. టెర్మెజ్‌లో, తన దేశం ప్రపంచ కార్మికులకు తలుపులు తెరిచిందని చెప్పిన రష్యన్ కమాండర్ యొక్క ఆవేశపూరిత ప్రసంగాన్ని వారు విన్నారు. రూసీ బృందం కమాండర్‌ను కలుసుకున్నారు మరియు రష్యన్ కమాండర్ సహాయంతో తాష్కెంట్ వెళ్లారు.

 

రఫీక్ అహ్మద్ (రూసీ) నాయకత్వం లోని నలుగురు 'ముహాజిర్లు' (వలసదారులు) మే 1920లో కాబూల్ చేరుకున్నారు. వారికి మంచి ఆదరణ లభించింది మరియు కాబూల్‌కు కొంత దూరంలో ఉన్న జబల్ ఉస్-సిరాజ్ (జబల్ అల్-సిరాజ్)లో బస చేశారు. నలుగురు 'ముహాజిర్లు' (వలసదారులు) తర్వాత వచ్చిన ఇతరులను కూడా అక్కడికి తీసుకువచ్చారు మరియు జూలై ప్రారంభం నాటికి దాదాపు రెండు వందల మంది జబల్ ఉస్-సిరాజ్ (జబల్ అల్-సిరాజ్) వద్ద ఉన్నారు.

 

తాష్కెంట్‌లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపన తర్వాత, భారత దేశం లో కమ్యూనిస్ట్ ఉద్యమ పునాదులను స్థాపించడానికి కొంతమంది భారతీయ 'ముహాజీర్లు' భారతదేశానికి తిరిగి రావాలని నిర్ణయించారు

 

మార్చి 1922 చివరి నాటికి, రఫీక్ అహ్మద్ రూసీ తో సహా పది మంది పెద్ద సమూహం పామీర్ మార్గం ద్వారా భారతదేశానికి బయలుదేరింది. "ఖరోగ్ వద్ద వారు తమను తాము చిన్న సమూహాలుగా విభజించుకున్నారు మరియు వారిలో కొందరు మినహా అందరు చిత్రాల్ లేదా భారతదేశంలోని వాయువ్య ప్రాంతంలోని గిరిజన ప్రాంతాలకు చేరుకోవడంలో విజయం సాధించారు. కానీ, దాదాపు వారందరినీ భారత పోలీసులు పట్టుకున్నారు మరియు పెషావర్ కుట్ర కేసులో విచారించారు.

 

రఫీక్ అహ్మద్ రూసీ దాదాపు ఏడాది పాటు జైలు శిక్ష అనుభవించారు. రూసీని పెషావర్ కుట్ర కేసులో (మాస్కో తాష్కెంట్ కుట్ర కేసులో క్రౌన్ వర్సెస్ అక్బర్ షా మరియు మరో ఏడుగురు) అక్టోబర్ 1922 చివరి వారంలో అరెస్టు చేసి మే 18న విడుదల చేశారు.

 

రూసీ -నిరాడంబరమైన నేపథ్యం:

రూసీ మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత, రూసీ తప్పిపోయిన జ్ఞాపకాలలో కొంత భాగం 1986లో ఖాజీ వాజ్ది-ఉల్-హుస్సేనీ పుస్తకం "బర్కతుల్లా భూపాలీ"లో ప్రచురించబడింది

 

1818 నుండి 1947 వరకు బ్రిటిష్ పాలనలో భోపాల్ నవాబులచే పరిపాలించబడినది, ఆ తర్వాత అది ఇండియన్ యూనియన్‌లో భాగమైంది; రఫీక్ అహ్మద్ రూసీ, పూర్వీకుల ఇల్లు భోపాల్ పాత క్వార్టర్స్‌లో కలదు.

 

రూసీ నిరాడంబరమైన నేపథ్యం నుండి వచ్చారు మరియు రూసీ రష్యా నుండి తిరిగి వచ్చినప్పుడు, భోపాల్ చివరి పాలకుడు నవాబ్ హమీదుల్లా ఖాన్ యొక్క వంటశాల అధిపతిగా ఉద్యోగం పొందాడు. . చాలా కాలం తర్వాత, రూసీ కుమారుడు జమీల్ తన స్వంత రెస్టారెంట్‌ మూన్‌లైట్ను ప్రారంభించినప్పుడు, రూసీ అందులో కుమారునికి సహాయం చేయడం ప్రారంభించాడు.

 

జమీల్ భార్య, సౌలత్ మరియు రూసీ సోదరి, రఫియా-ఉన్-నిసా, రూసీతో గడిపిన కుటుంబంలో ఇప్పుడు జీవించి ఉన్న ఇద్దరు సభ్యులు. రఫియా-అన్-నిసా తన ఎనభైల చివరలో ఉంది మరియు మాట్లాడలేడు. రూసీ రష్యా నుండి తిరిగి వచ్చిన ఐదు దశాబ్దాల తర్వాత 1969లో సౌలత్ కోడలుగా ఆ కుటుంబంలో వచ్చింది..

 

సౌలత్, ప్రకారం  తన మామ రూసీ పగటిపూట హోటల్‌లో ఉంటాడు మరియు రాత్రులు రాస్తూ గడిపేవాడు, ఎనిమిదేళ్లుగా అలా చేయడం చూశాను అన్నది... రూసీ రచనలు చాలా వరకు మనకు దొరకకపోవడం దురదృష్టకరంఅని సౌలత్ విలపించింది. 1923లో వ్లాదిమిర్ లెనిన్‌పై పుస్తకాన్ని రాసిన మొదటి భారతీయుల్లో రూసీ కూడా ఉన్నారని చూపించడానికి సౌలత్ వార్తాపత్రిక క్లిప్పింగ్‌ను  చూపించినది..

 

సోవియట్ ల్యాండ్ మ్యాగజైన్ 1966-1967లో రూసీ పై ఒక కథనాన్ని ప్రచురించినప్పుడు రూసీ యొక్క సుదీర్ఘ అజ్ఞాత కాలం చాలా హఠాత్తుగా ముగిసింది. రూసీ న్యూఢిల్లీలోని సోవియట్ రాయబార కార్యాలయానికి ఆహ్వానించబడ్డాడు మరియు మాస్కోకు రష్యా ఆహ్వానంపై వెళ్ళాడు..

 

రఫీక్ అహ్మద్ రూసీ కోడలు సౌలత్ రూసీ వస్తువులను సురక్షితంగా  జాగ్రత పరిచినది. - ముఖ్యంగా సెప్టెంబర్-అక్టోబర్ 1967లో గ్రేట్ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం యొక్క 50వ వార్షికోత్సవానికి హాజరయ్యేందుకు సోవియట్ యూనియన్‌కు రూసీ చేసిన పర్యటనకు సంబంధించినవి

 

 రూసీ, రష్యా నుండి తిరిగి వచ్చిన దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత, న్యూ ఢిల్లీలో సోవియట్ రాయబారిని కలవడానికి రఫిక్ అహ్మద్ రూసీ  ఆహ్వానించబడ్డాడు. 1967లో, రూసీ గ్రేట్ అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం యొక్క 50వ వార్షికోత్సవంలో పాల్గొనడానికి రష్యాకు వెళ్లాడు. తర్వాత 1972లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చొరవ మేరకు స్వాతంత్ర్య సమరయోధుడిగా గౌరవ వేతనం పొందారు.

 

మాస్కోలో, రూసీ రష్యన్ విప్లవకారులతో కలిసి చేసిన పోరాటానికి బంగారు పతకాన్ని అందుకున్నాడు. పతకం అందుకున్న అనంతరం రూసీ పేట్రియాట్ వార్తాపత్రికతో మాట్లాడుతూ జైలులో మగ్గి అక్కడ మరణించిన విప్లవకారులే తన కంటే పతకం కు అర్హులని అన్నారు.

 

నా సహచరులు ఇరవై మంది అక్కడ పోరాడి చనిపోయారు. వీరంతా ధైర్యవంతులు... ఈ గౌరవానికి నాకంటే ఎక్కువ వారు అర్హులని నేను భావిస్తున్నాను," అని రూసీ చెప్పాడు.

 

కెర్కిలో (ఆధునిక తుర్క్‌మెనిస్తాన్‌లో) 36 మంది భారతీయులతో పాటు రూసీ,  మరికొందరు రష్యన్‌, తుర్క్మెన్ విప్లవకారులతో పాటు ఒక నెలకు పైగా బందీగా ఉంచబడ్డాడు. బ్రిటీష్ వారు విప్లవకారులను ఎలా చిత్రహింసలకు గురిచేశారో రూసీ గుర్తు చేసుకొన్నాడు..

 

1967లో రూసీ తన రష్యన్ పరటన లో  లెనిన్ సమాధిని సందర్శించి పుష్పగుచ్ఛం ఉంచారు. రూసీ, న్యూ ఏజ్ వార్తాపత్రికతో మాట్లాడుతూ, లెనిన్ ఒకసారి ఒక సమావేశంలో ప్రసంగించడం చూశానని, అయితే తానూ అనారోగ్యంతో బాధపడుతున్నందున లెనిన్ ను తన భారతీయ సహచరులతో కలిసి వ్యక్తిగతంగా కలవలేకపోయాడని మరియు ఇది తనకు గొప్ప దురదృష్టమని అన్నారు. న్యూ ఏజ్ వార్తాపత్రిక రూసీ ని పొడవైన మరియు శక్తివంతమైన వ్యక్తిగా అభివర్ణించింది.

 

రూసీ మాస్కోలోని ఇతర విప్లవకారులతో తిరిగి కలిశారు; వారిలో మరియా ఫోర్టస్ కూడా ఉన్నారు. మరియా ఫోర్టస్ మాస్కోలోని కమ్యూనిస్ట్ యూనివర్శిటీ ఆఫ్ ది టాయిలర్స్ ఆఫ్ ది ఈస్ట్‌లో రూసీ ఉపాధ్యాయురాలిగా ఉంది మరియు మరియా ఫోర్టస్ భారతీయ విద్యార్థులందరినీ వారి పేర్లతో జ్ఞాపకం చేసుకుంది. మరియా ఫోర్టస్, రూసీని గుర్తించి, ఇతర భారతీయ విప్లవకారుల గురించి అడిగారు. రూసీ ప్రతి-విప్లవ బృందాలకు వ్యతిరేకంగా పోరాటంలో పాల్గొన్న పాత కమ్యూనిస్ట్ అయిన అవనేస్ బరాటోవ్‌ను కూడా కలిశాడు.

 

APN బోర్డ్ (నోవోస్టి ప్రెస్ ఏజెన్సీ) ఆతిథ్యం ఇచ్చిన రూసీ, రెడ్ ఆర్మీతో కలిసి పోరాడిన కెర్కీని మరియు తాష్కెంట్‌ను సందర్శించారు, అక్కడ రూసీపిల్లలకు ఉర్దూ బోధించే పాఠశాలను దర్శించాడు.

 

సౌలత్‌ వద్ద  ఫోర్టస్ మరియు బరాటోవ్‌తో కలిసి ఉన్న రెండు ఫోటోలు మరియు రూసీతాష్కెంట్ మరియు కెర్కీ సందర్శనల వివరాలు ఉన్నాయి. ఆ సంవత్సరం తరువాత, రూసీ న్యూ ఢిల్లీలోని సోవియట్ రాయబారి N.M. పెగోవ్ చేత మరొక పతకాన్ని పొందాడు.

 

1972లో, భారతదేశ స్వాతంత్ర్య రజతోత్సవ వేడుకలను జరుపుకోవడానికి భారత ప్రభుత్వంచే న్యూఢిల్లీకి ఆహ్వానించబడిన కొద్దిమంది స్వాతంత్ర్య సమరయోధులలో రూసీ కూడా ఒకరు

 

1923లో రఫిక్ అహ్మద్ రష్యా నుండి తిరిగి వచ్చినప్పుడు, ప్రజలు అతన్ని 'రూసీ' అని పిలవడం ప్రారంభించారు. "రూసీ,  అక్కడ ఉన్న అగ్రశ్రేణి భారతీయ మరియు రష్యన్ విప్లవకారులతో భుజాలు కలిపి నడిచేవాడు. రూసీ తన ప్రాణాలను పణంగా పెట్టి జైలు పాలయ్యాడు. కానీ రూసీ దాని గురించి ఎవరితోనూ మాట్లాడలేదు, రష్యాలో అక్కడ తన బస గురించి గొప్పగా చెప్పుకోలేదు.. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, రూసీ తనను తాను స్వాతంత్ర్య సమరయోధునిగా పేర్కొనలేదు మరియు ఆర్ధిక ప్రయోజనాలు పొందలేదు

 

సౌలత్ కుమారుడు ఇప్పుడు ఫ్యామిలీ రెస్టారెంట్‌ను నడుపుతున్నాడు, ఇది మొఘలాయ్ వంటకాలను అందిస్తుంది. రూసీ మరణించినప్పుడు ఎనిమిదేళ్ల వయసులో ఉన్న సౌలత్ కుమార్తె బుష్రా, తన తాతగారి కాగితాలను భద్రపరచాలని యోచిస్తోంది.

.

 


No comments:

Post a Comment