14 December 2023

అబ్దుల్ కదిర్ ఖాన్: న్యాయవాది, పండితుడు మరియు లివర్‌పూల్ ముస్లిం సమాజ స్థాపకుడు Abdul Kadir Khan: Lawyer, Scholar, and Founder of Liverpool’s Muslim Community

 


 

అబ్దుల్ కదీర్ ఖాన్ ఆగ్రా కళాశాల విద్యార్థి. అబ్దుల్ కదీర్ ఖాన్ పూర్వీకులు  ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలో ఉన్న ఖాన్‌పూర్ ఎస్టేట్ మన్‌సబ్దార్‌గా మొఘలుల క్రింద  పనిచేసినారు.  

అబ్దుల్ కదీర్ ఖాన్ పూర్వీకులు 1857లో మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో ముఖ్యమైన పాత్ర పోషించారు మరియు బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. 1857లో జరిగిన మొదటి స్వాతంత్ర్య సంగ్రామంలో అబ్దుల్ ఖాదిర్ ఖాన్ తండ్రి, తాత మరియు మేనమామ ముఖ్యమైన పాత్ర పోషించారు

అబ్దుల్ కదిర్ ఖాన్ లండన్ లోని న్యాయ కళాశాల మిడిల్ టెంపుల్‌లో చేరి, 1897లో బారిస్టర్ అయ్యాడు.

అబ్దుల్ కదిర్ ఖాన్ లివర్‌పూల్ ముస్లిం ఇన్‌స్టిట్యూట్ (LMI)లో అరబిక్, ఉర్దూ మరియు పర్షియన్ భాషలను బోధించాడు. లివర్‌పూల్ ముస్లిం ఇన్‌స్టిట్యూట్ (LMI) పత్రిక 'ది క్రెసెంట్'లో ప్రచురించబడిన అబ్దుల్ కదిర్ ఖాన్ ఉపన్యాసాలలో 'ది పిల్‌గ్రిమేజ్ టు మక్కా', 'థియాలజీ ఆఫ్ నమాజ్', 'స్టడీ ఆఫ్ అరబిక్', 'Religious Forms and Ceremoniesమతపరమైన రూపాలు మరియు వేడుకలు' ముఖ్యమైనవి.

అబ్దుల్ కదిర్ ఖాన్ లివర్‌పూల్ ముస్లిం ఇన్స్టిట్యూట్ స్కూల్ నిర్వహణ కమిటీలో సబ్యుడు మరియు లివర్‌పూల్ ముస్లిం ఇన్‌స్టిట్యూట్ (LMI) నిర్మించే మసీదు కోసం అనేక డిజైన్‌లను సూచించాడు.  అబ్దుల్ కదిర్ ఖాన్ లివర్‌పూల్ ముస్లిం ఇన్స్టిట్యూట్ డిబేటింగ్ సొసైటీలో క్రియాశీల సభ్యుడు.

అబ్దుల్ కదిర్ ఖాన్ లివర్‌పూల్ మసీదు మరియు లివర్‌పూల్‌కి  అనుబంధంగా ఉన్న లండన్‌లోని మొదటి ఆపరేటింగ్ మసీదు రెండింటిలోనూ ఈద్-ఉల్-అధా ప్రార్థనలకు నాయకత్వం వహించాడు. అబ్దుల్ కదిర్ ఖాన్ చాలా కాలం పాటు లివర్‌పూల్ మసీదు ఇమామ్‌గా కూడా పనిచేశాడు మరియు శుక్రవారం ప్రార్థనలకు నాయకత్వం వహించాడు.

లివర్‌పూల్ ముస్లిం ఇన్‌స్టిట్యూట్ మరియు మసీదులో కొన్నాళ్లు పనిచేసిన తర్వాత, అబ్దుల్ కదిర్ ఖాన్ భారతదేశానికి తిరిగి వచ్చి, మీరట్ జిల్లాలోని కోఠిలో నివసించాడు మరియు  అలహాబాద్  న్యాయస్థానంలో న్యాయవాద వృత్తిని చేపట్టాడు. .

అబ్దుల్ కదీర్ ఖాన్ కుమారుడు ఫజల్ ఉర్ రెహ్మాన్ ఖాన్ ఉత్తర ప్రదేశ్ లోని వివిధ జిల్లాలలో డిప్యూటీ కలెక్టర్ గా పనిచేసాడు..

 

No comments:

Post a Comment