షరియా ప్రకారం మహిళలకు వారి తల్లిదండ్రులు, భర్త మరియు కొడుకుల ఆస్తిలో వాటా ఇచ్చిన మొదటి ధర్మం ఇస్లాం.
పవిత్ర ఖురాన్ నిర్దేశించిన విధంగా
మహిళలు - తల్లి, సోదరి, భార్య, కుమార్తె, మనవరాలు, మునిమనవరాలు, సవతి సోదరి, అమ్మమ్మ మరియు నాయినమ్మలు
వారసత్వంగా వాటాలు పొందాలని ముస్లిం
వ్యక్తిగత చట్టం ఆదేశించిందని ఇస్లామిక్ పండితులు తెలిపారు.
"ఒక మహిళను ఆమె భర్త అణచివేతకు గురిచేసి, ఆమె హక్కులను హరిస్తే ఖులా ద్వారా వివాహాన్ని రద్దు చేసుకునే హక్కు మరియు అధికారంను ఇస్లామిక్ షరియా ఆ మహిళకు ఇచ్చింది."
“షరియత్ అప్లికేషన్ యాక్ట్ 1937 ప్రకారం రెండు పార్టీలు ముస్లింలుగా ఉన్న కేసులు మరియు
నికాహ్, ఖులా, ఫస్ఖ్, తఫ్రీక్, తలాక్, ఇద్దత్, నఫ్కా, వారసత్వానికి, విల్, హిబా, విలాయత్, రిజాత్, హజానత్ మరియు
వక్ఫ్, సంబంధించిన
కేసులు ముస్లిం వ్యక్తిగత చట్టం ప్రకారం మాత్రమే నిర్ణయించబడాలి అని పేర్కొనబడినవి.
No comments:
Post a Comment