మార్చి
7, 1941, టర్కీలో ఉన్న బ్రిటీష్ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఇద్దరు స్పెషల్
ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్‌లు (SOE), లండన్‌లోని ప్రధాన మంత్రి కార్యాలయం
నుండి అధికారిక సమాచారం అందుకున్నారు. అధికారిక ఆర్డర్‌ను చదివిన తర్వాత, కమ్యూనికేషన్
నిజమో కాదో నిర్ధారించడానికి మరియు ధృవీకరణ పొందడానికి SOEలు ఇద్దరూ వారి ప్రధాన కార్యాలయాన్ని సంప్రదించారు
బ్రిటిష్ ఇంటెలిజెన్స్ అధికారులు
ఆర్డర్ యొక్క ప్రామాణికతను నిర్ధారించడానికి ఒక కారణం ఉంది. ఇంటెలిజెన్స్
అధికారులు, రాజకీయ నాయకుడిని హత్య చేయాలని ఆదేశించిన అరుదైన ఆదేశాలలో ఇది ఒకటి.
భారత రాజకీయ నాయకుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను కనుగొని చంపాలని ఆదేశం లో ఉంది..
నేతాజీని హత్య చేయాలన్న ఆదేశం
జనవరి, 1941లో, బోస్ నిఘా ఉంచబడిన గృహం vigil home నుండి అదృశ్యమయ్యారు, అక్కడ బోస్ ను బ్రిటిష్ వారు
గృహనిర్బంధంలో ఉంచారు. బోస్ ఏప్రిల్‌లో జర్మనీకి చేరుకోవడానికి భారతదేశం, ఆఫ్ఘనిస్తాన్
మరియు USSR గుండా ప్రయాణించాడు. బోస్ ఆఫ్ఘనిస్తాన్‌లో
ఉన్నారని, మిడిల్ ఈస్ట్ ద్వారా జర్మనీకి
చేరుకోవాలని యోచిస్తున్నారని బ్రిటిష్ ఇంటెలిజెన్స్ మార్చిలో నివేదించింది
ఇంటెలిజెన్స్ కూడా జర్మనీ సహాయంతో
బోస్ చేత భవిష్యత్తులో సైన్యం ఏర్పరచే అవకాశం ఉందని నివేదించింది. బ్రిటిష్
సామ్రాజ్యానికి ఇది ఆందోళనకరమైన పరిస్థితి. ఎవరు సవాలు చేయని విధంగా బోస్ శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని
సవాలు చేశారు.
బ్రిటీష్ ఇంటెలిజెన్స్ అధికారులు
బోస్ యొక్క స్థానాన్ని మరియు మార్గాన్ని గుర్తించడానికి కొన్ని వారాలపాటు
ప్రయత్నించి వైఫల్యాన్నిపొందారు.. బోస్ మిడిల్ ఈస్ట్ మీదుగా మార్గాన్ని
తీసుకోలేదు మరియు మాస్కో నుండి బెర్లిన్‌కు విమానంలో వెళ్లడానికి ఆఫ్ఘనిస్తాన్
నుండి మాస్కో వెళ్ళారు.
బ్రిటిష్
సామ్రాజ్యం భయం నిరాధారమైనది కాదు. నేతాజీ నిజానికి సైన్యాన్ని ఏర్పాటు చేసి
చరిత్రలో సాటిలేని రీతిలో యుద్ధం చేశారు
ఈ
సంఘటన బ్రిటీష్ వారు,
భారతీయ నాయకులందరిలో బోస్‌కు
అత్యంత భయపడ్డారనే వాస్తవాన్ని కూడా నిర్ధారిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వంచే హత్యకు
ఆదేశించబడిన ఏకైక భారతీయ నాయకుడు బోస్ మాత్రమె. గాంధీ, నెహ్రూ, ఆజాద్, పటేల్
లేదా భారతదేశంలోని స్వాతంత్ర్య పోరాటంలో మరే ఇతర ప్రముఖ నాయకుడికి కూడా ఇవ్వని గౌరవం బ్రిటిష్ వారు బోస్ కు ఇచ్చారు.,
మూలం: Heritage
Times, by Saquib SalimJanuary 22,
2021
.
.
.
No comments:
Post a Comment