13 December 2023

సంపన్నులైన ముస్లింలలో పెరిగిన కొత్త ట్రెండ్ పవిత్ర నగరమైన మదీనాలో నికాహ్ జరుపుకోటం

 



దైవిక దీవెనలు కోరుతూ మదీనాలోని ప్రవక్త(స) సమాధి దగ్గర నికాహ్ వేడుకను నిర్వహించే సంపన్న ముస్లింల సంఖ్య ఇటివల పెరుగుతోంది. మదీనాలో వివాహం కు  విలాసవంతమైన అలంకరణలు లేదా గొప్ప విందు అవసరం లేకుండా వివాహ వేడుక ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. వధూవరుల కుటుంబాలు నిఖా నిర్వహణ కోసం స్థానిక కాజీ సహాయం తీసుకొంటారు, ప్రార్థనలు చేస్తారు మరియు సాధారణ భోజనం చేస్తారు. మరుసటి రోజు వలిమా నిర్వహిస్తారు.

మక్కాలో ఉమ్రా చేసే అవకాశం మదీనాలో వివాహం చేసుకోవాలనుకునే వారికి అదనపు బోనస్. ఈ వివాహాలు దాతృత్వానికి అవకాశం కల్పిస్తాయి మరియు పవిత్ర స్థలాలను సందర్శించడానికి సన్నిహితులు మరియు బంధువులను అనుమతిస్తాయి.

ఇటివల కాలం లో ప్రవక్త(స) సమాధి దగ్గర నికా జరిపే సంపన్న ముస్లింలు అధిక  సంఖ్యలో ఉన్నారు. ప్రధాన ఉద్దేశ్యం, దైవిక ఆశీర్వాదాలను పొందడం.

"నికాహ్ అనేది పవిత్ర ప్రవక్త(స) యొక్క ముఖ్యమైన సున్నత్ మరియు ఒక ముస్లిం వివాహం చేసుకోవడానికి ప్రవక్త మసీదు కంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు.

ప్రవక్త(స) సమాధి దగ్గర పెళ్లికి విలాసవంతమైన అలంకరణ లేదు, గొప్ప విందు అవసరం లేదు. వధూవరుల బంధువులు ఇద్దరూ రెండు నమాజ్‌ల మధ్య పవిత్ర మసీదుకు చేరుకుంటారు. స్థానిక కాజీ నికాహ్ నిర్వహించిన తర్వాత ప్రార్థనలు చేస్తారు, సాధారణ భోజనం లేదా విందు కోసం హోటల్‌కు చేరుకుంటారు, ఉమ్రా కోసం మక్కాకు ప్రయాణించి,  ఉమ్రాః అనంతరం ఇంటికి తిరిగి వస్తారు

ఉమ్రా చేసే అవకాశం మదీనాలో నికాహ్ జరుపుకోవడానికి ఇష్టపడే వ్యక్తులకు బోనస్‌గా వస్తుంది. వార్షిక హజ్ కాకుండా, ఉమ్రా ఏడాది పొడవునా చేయవచ్చు. హజ్ ఆచారాలను పూర్తి చేయడానికి ఐదు రోజులు పడుతుంది, కాబా సమీపంలో మరియు మక్కాలోని పవిత్ర మసీదు ప్రాంగణంలో ఉమ్రా ఆచారాలను రెండు గంటల్లో పూర్తి చేయవచ్చు.

మదీనాలో నికాహ్ దాతృత్వం చేయడానికి అవకాశం ఇస్తుంది. మదీనాలో జరిగే నికాహ్ వేడుకకు ఆహ్వానించే చాలా మంది సన్నిహితులు మరియు బంధువులు ఆర్థిక పరిమితుల కారణంగా ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం మసీదును సందర్శించడానికి లేదా మక్కాలో ఉమ్రా చేయలేరు. ఈ విధంగా వారు పవిత్ర స్థలాలను సందర్శించడానికి మరియు పవిత్రమైన ఆచారాలను నిర్వహించడానికి అవకాశం పొందుతారు

నిఖా తరువాత వధూ-వరులు ఇంటికి తిరిగి వచ్చి ఆ తరువాత హనీ-మూన్ కి వెళతారు, వారు ఎక్కడికి వెళ్లినా దైవానుగ్రహం వారిని కాపాడుతుందని ఆశిస్తున్నారు

No comments:

Post a Comment