సయ్యద్ మెహదీ ఇమామ్ 1902లో నియోరా (పాట్నా జిల్లా)లో నాలుగు తరాల పాటు
న్యాయ మరియు విద్యా వృత్తులలో ప్రసిద్ధి చెందిన ఒక న్యాయవాద కుటుంబం లో జన్మించారు.
మెహదీ ఇమామ్ తండ్రి సయ్యద్ హసన్ ఇమామ్
చిన్న వయస్సులోనే మెహదీ ఇమాన్‌ను విద్య
కోసం ఇంగ్లాండ్‌కు పంపాడు. మెహదీ ఇమామ్ ఆక్స్‌ఫర్డ్‌లోని డ్రాగన్ ప్రిపరేటరీ
స్కూల్‌లో తన ప్రారంభ విద్యను అబ్యసించారు.. మెహదీ ఇమామ్ ఎనిమిదేళ్ల వయసులో గ్రీకు
నేర్చుకోవడం ప్రారంభించాడు. మరియు అందులో త్వరగా ప్రావీణ్యం సంపాదించాడు. 1915లో మెహదీ
ఇమామ్ ప్రసిద్ధ హారోడ్ పబ్లిక్ స్కూల్‌లో చేరాడు.
మెహదీ ఇమామ్ ఆక్స్‌ఫర్డ్ నుండి BA డిగ్రీతో
పట్టభద్రుడయ్యాడు. 1925లో మెహదీ ఇమామ్ బారిస్టర్‌గా తన
చదువును పూర్తి చేశాడు. 1925 నుండి 1957 వరకు మెహదీ ఇమామ్ పాట్నా హైకోర్టులో
న్యాయవాది వృత్తిని చేపట్టారు. మెహదీ
ఇమామ్ బీహార్ ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా నియమితులయ్యారు, 1946లో
జాతీయ స్వాతంత్ర్యం కోసం ఉద్యమ సమయం లో తన ప్రభుత్వ పదవిని వదులుకున్నారు.
మెహదీ ఇమామ్,
జస్టిస్ సర్ సయ్యద్ ఫజల్ అలీ కుమార్తెను వివాహం చేసుకున్నారు. మెహదీ ఇమామ్ కుమారుడు ఫైజిFaizy చిన్న
వయస్సులో బారిస్టర్ డిగ్రీని పొంది ఇంగ్లాండ్ నుండి తిరిగి వచ్చిన తర్వాత, చాలా
విషాదకర పరిస్థితుల్లో మరణించాడు కుమారుని మరణమును మెహదీ ఇమామ్ దంపతులు భరించలేకపోయారు.
మెహదీ ఇమామ్ సాహిత్య సేవ:
మెహదీ ఇమామ్ దివ్య ఖురాన్‌లోని మొత్తం 30 విభాగాలను (పారాస్) ఆంగ్లంలో కవితా రూపంలోకి అనువదించారు. మెహదీ ఇమామ్ 1965లో మక్కాకు తీర్థయాత్ర చేసాడు మరియు మదీనా నగరాన్ని కూడా సందర్శించాడు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత మెహదీ ఇమామ్ ఆంగ్లంలో "ఫ్లైట్ టు మక్కా" అనే పుస్తకాన్ని రాశాడు.
మెహదీ ఇమామ్‌కు ఆంగ్ల కవిత్వం అంటే
చాలా ఇష్టం. సయ్యద్ మెహదీ ఇమామ్ కూడా షేక్‌స్పియర్ నాటకాల ద్వారా బాగా
ప్రభావితమయ్యాడు 1937లో మెహదీ ఇమామ్ కవిత్వం మరియు
తత్వశాస్త్రం కలిగి ఉన్న కవితల సంకలనాన్ని ప్రచురించాడు. ఈ సంకలనానికి “Poetry of the Invisible పోయిట్రీ ఆఫ్ ది ఇన్విజిబుల్" ప్రచురించారు.
మెహదీ ఇమామ్ కవితలలో సూఫీ
తత్వశాస్త్రం యొక్క అంశాలు ఉన్నాయి మరియు భాష చాలా అద్భుతంగా ఉంటుంది,
మెహదీ ఇమామ్ వ్రాసిన మరియు ఆంగ్లంలో
ప్రచురించబడిన రెండవ పుస్తకం, "సీన్స్ ఫ్రమ్ ఇండియన్ మిథాలజీScenes from Indian Mythology ".
రెండవ ప్రపంచ యుద్ధ సమయము లో, మెహదీ ఇమామ్ "ది డ్రామా ఆఫ్
ప్రిన్స్ అర్జున్ The Drama
of Prince Arjun "అనే
పుస్తకం ఆంగ్లంలో ప్రచురించబడింది. “ది
డ్రామా ఆఫ్ ప్రిన్స్ అర్జున్” ఈ పుస్తకంలో మెహదీ ఇమామ్ భగవద్గీత
యొక్క తాత్విక అంశాలను చాలా చక్కగా వివరించారు.
సయ్యద్ మెహదీ ఇమామ్ రచన ఐదు సంపుటాలతో
కూడిన "సావిత్రి" అనే సిరీస్ యొక్క . సావిత్రి మొదటి సంపుటం 1980లో
ప్రచురించబడింది. సావిత్రి మొదటి సంపుటం లో (సావిత్రి) మెహదీ ఇమామ్ సాహిత్య మరియు తాత్విక
శ్రేష్ఠత యొక్క శిఖరాన్ని తాకారు.
మెహదీ ఇమామ్ యొక్క రచనలు చాలా వరకు
ముద్రించబడ లేదు. మెహదీ ఇమామ్ రాసిన వ్యాసాలలో ప్రముఖమైనది. “గీత
మరియు వేదాల రహస్యాలు“Secrets of the Gita and the Vedas”.
సయ్యద్ మెహదీ ఇమామ్ వ్యక్తిత్వం ప్రగతిశీలమైనది.
సయ్యద్ మెహదీ ఇమామ్ పండితుడు మాత్రమే కాదు, దేశభక్తుడు కూడా. సయ్యద్ మెహదీ ఇమామ్ 1957లో, పాట్నా
హైకోర్టులో విజయవంతమైన ప్రాక్టీస్‌ను విడిచి శ్రీ అరబిందో ఆశ్రమానికి బస చేసేందుకు
వెళ్లాడు.
తన జీవితపు చివరి కాలంలో మెహదీ ఇమామ్
అనేక దేశాలు పర్యటించారు. ఎక్కడికి వెళ్లినా భారతీయ కవిత్వం, తత్వశాస్త్రంపై
ఉపన్యాసాలు ఇచ్చేవారు.
మెహదీ ఇమామ్ చివరి రోజులు అనారోగ్యం
మరియు ఇతర సమస్యలతో నిండి ఉన్నాయి. అనారోగ్యం తీవ్రమయినప్పుడు, మెహదీ
ఇమామ్ పాట్నా ఆసుపత్రిలో చేరాడు, అక్కడ మార్చి 19, 1987న
మరణించాడు. మెహదీ ఇమామ్ తన స్వంత ఇంటి (‘నషేమాన్’) ఆవరణలో ఖననం చేయబడినాడు.
No comments:
Post a Comment