29 January 2023

రబియా గుల్నుస్ సుల్తాన్ (1642-1715): ఎ ఫర్గాటెన్ సుల్తానా Rabia Gülnüş Sultan(1642-1715)A forgotten Sulthaana

 

రబియా గుల్నుస్  సుల్తాన్ (1642–1715) ఆటోమన్ చక్రవర్తి సుల్తాన్ మెహ్మద్IV ( 1648–1687) యొక్క గ్రీకు హసేకి లేదా సామ్రాజ్ని మరియు ముస్తఫాII (1695–1703) మరియు అహ్మద్III(1703–1730) యొక్క వాలిడే సుల్తాన్‌/రాజమాత.  రబియా గుల్నుస్  సుల్తాన్, వెనీషియన్ పాలనలో ఉన్న క్రీట్ ద్వీపంలోని రెథిమ్నోలో యూజీనీగా జన్మించింది.

గుల్నుస్  సుల్తాన్ ప్రభావం 17వ నుండి 18వ శతాబ్దపు ఆటోమన్  సామ్రాజ్యం అంతటా వ్యాపించింది. 1664లో రబియా గుల్నుస్  సుల్తాన్, హసేకిగా మారినప్పుడు, 1687-1695 వరకు ఒట్టోమన్ సుల్తానా  మరియు 1715లో మరణించే వరకు ఆటోమన్ సామ్రాజ్యం అంతటా పాలనా వ్యవహారాలు మరియు దాతృత్వ ప్రాజెక్టులు రెండింటిలోనూ ఆధిపత్యం చెలాయించింది.

రబియా గుల్నుస్  సుల్తాన్ ను "ఒట్టోమన్ రాచరిక మహిళల్లో అత్యంత ప్రభావశీలి" అని ముజాఫర్ ఓజ్‌గులేస్  పిలిచారు. మునుపటి రాజమాతలు అయిన  హుర్రెమ్ మరియు తుర్హాన్ సుల్తాన్‌ల వలే గుల్నూస్ సుల్తాన్ కూడా మిక్కిలి ప్రభావం కలది.  విద్యా ప్రోత్సాహక రంగం లో గుల్నుస్ సుల్తాన్‌ ప్రభావం పరిమితం అయినప్పటికీ  మక్కాలో వైద్యరంగ వికాసం లో  గుల్నుస్ ప్రభావం కలదు.

1550-1551లో మరొక హసేకి అయిన హుర్రెమ్ సుల్తాన్ (మ. 1558) అడుగుజాడల్లో మక్కాలో ఆసుపత్రిని నిర్మించిన మొదటి ఒట్టోమన్ సామ్రాజ్య మహిళ రబియా గుల్నుస్  సుల్తాన్. 1679లో రబియా గుల్నుస్  సుల్తాన్ నిర్మించిన మహిళల దార్ అల్-షిఫా (ఆసుపత్రి) గురించి చాలా మందికి  తక్కువగా తెలుసు.

ఇటీవల, చరిత్రకారుడు ముజాఫర్ ఓజ్‌గులేస్ తన 2017 పుస్తకం “ఫిమేల్ పాట్రోనేజ్ అండ్ ది ఆర్కిటెక్చరల్ లెగసీ ఆఫ్ గుల్నుస్  సుల్తాన్‌”లో గుల్నుస్  సుల్తాన్ యొక్క వాస్తుకళా ప్రోత్సాహాన్ని వివరించాడు.   ఆటోమన్ సామ్రాజ్యంలోని పట్టణ నగరాలతో పాటు  మరియు అరుదుగా ప్రాంతీయ నగరాల్లో కనిపించే  మహిళల దార్ అల్-షిఫా పై దృష్టి సారించబడినది.

గుల్నుస్  సుల్తాన్ ఆసుపత్రి పవిత్ర నగరాల్లోని ఒట్టోమన్ మహిళా వైద్య సంస్థలపై తనదైన  ముద్ర వేసింది. అబ్బాసిడ్ కాలంలో ఖైజురాన్ (మ. 789) మరియు జుబైదా (మ. 831) వంటి సామ్రాజ్య మహిళలు  "బావులు మరియు త్రాగు నీటి  వసతులు” తరువాత కాలం లో షాఘబ్ (మ. 933)  పవిత్ర నగరాల్లో "వైద్య సౌకర్యాలు" ఏర్పాటు చేసిన ఘనత పొందినది.  

ఒట్టోమన్ సుల్తాన్‌లు సాధారణంగా "ప్రధాన పట్టణ కేంద్రాలలో" ఆసుపత్రులను నిర్మించేవారు. కాని కొందరు రాజరిక స్త్రీలు ప్రాంతీయ నగరాల్లో ఆసుపత్రుల భవనాలను నిర్మిoచారు. 16వ శతాబ్దంలో మక్కాలో మొదటి ఆసుపత్రిని హుర్రెమ్ సుల్తాన్ నిర్మించగా,   1573లో గ్రాండ్ విజియర్ సోకుల్లు మెహమెట్ పాషా మరియు వంద సంవత్సరాల తర్వాత గుల్నూస్ సుల్తాన్ ఫిమేల్  హాస్పటల్స్ నిర్మించారు. హజ్ మార్గంలో గుల్నుస్  సుల్తాన్, సూప్ కిచెన్, ఆసుపత్రి మరియు ప్రాథమిక పాఠశాల కాంప్లెక్స్ నిర్మించినది. దీనివల్ల మక్కా తీర్థయాత్ర చేసే అనేక ఈజిప్టు అనేక గ్రామాల ప్రజలు లాభం పొందారు.  

గుల్నూస్ సుల్తాన్ మహిళల దార్ అల్-షిఫా మక్కాలో ప్రాముఖ్యత పొందినది. మక్కా నివాసులతో పాటు అనేకమంది హజ్ యాత్రికులు హాస్పటల్ ఉపయోగించుకునేవారు. పదిహేడవ శతాబ్దంలో "మహిళల సుల్తానేట్" సమయంలో గుల్నుస్ సుల్తాన్ యొక్క మహిళల దార్ అల్-షిఫా ప్రాముఖ్యత పొందినది.

పదిహేడవ శతాబ్దంలో, ఒట్టోమన్ ఇంపీరియల్ మహిళలు  ఆసుపత్రులకు  ప్రోత్సాహం, దాతృత్వ ధోరణిని కొనసాగించినారు మరియు ప్రజలకు అందుబాటులో ఉండే ఆరోగ్య సంరక్షణను మెరుగుపరిచినారు.ఆటోమన్ సామ్రాజ్య సరిహద్దులను దాటి పవిత్ర నగరాల వరకు విస్తరించిన వైద్య దాతృత్వానికి సామ్రాజ్య స్త్రీలు ప్రాముఖ్యత ఇచ్చారు.  అబాటౌయ్ మరియు అల్-హస్సనీ ప్రకారం, ఆరోగ్య సంరక్షణ, తీర్థయాత్ర మార్గానికి మించి, ఆటోమన్ సామ్రాజ్య నగరాల్లో ప్రజారోగ్య అభివృద్ధికి మహిళలు కేంద్రంగా ఉన్నారని సూచిస్తుంది..

గుల్నుస్ సుల్తాన్ స్థాపించిన మహిళల దార్ అల్-షిఫాలో స్త్రీ-పురుష వైద్యులు నియమించబడి వారికి వేతనం సుల్తాన్ సులేమాన్ మసీదు కాంప్లెక్స్‌లో (1548-1549) నియమించిన "వైద్య పాఠశాల అధిపతి" కంటే ఎక్కువ మొత్తం ఉండేది. దార్ అల్-షిఫాలో “ఉన్నతమైన అర్హతలు కలిగిన నైపుణ్యం కలిగిన వైద్యుడు" మరియు నైపుణ్యం కలిగిన శస్త్రవైద్యుడు" ఉండేవారు.

గుల్నుస్ సుల్తాన్ స్థాపించిన మహిళల దార్ అల్-షిఫా లో వందలాది మంది స్త్రీ-పురుషులు  "వైద్య, పరిపాలనా మరియు ఇతర  విధుల"లో నియమించబడ్డారు. స్త్రీ-పురుష వైద్యులకు మరియు  ఇతర వైద్య సిబ్బందికి వేతన విషయం లో వివక్షత ఉండేది కాదు.

1679లో గుల్నుస్ సుల్తాన్ స్థాపించిన మహిళల  దార్ అల్-షిఫా వైద్య సంస్థ లో  వైద్య విధానాలు మరియు ఆధ్యాత్మికత మధ్య ఒక విలక్షణమైన సంబంధo ఉండేది. గుల్నుస్ సుల్తాన్ తన ఆసుపత్రిలో సిబ్బంది కోసం ఒక మతపరమైన అధిపతిని, అలాగే రోగుల కోసం ప్రార్థనలు చదివేవారిని నియమించింది. వైద్యసిబ్బంది ధర్మబద్ధంగా మరియు తమ విధుల పట్ల ఎల్లప్పుడూ శ్రద్ధ చూపేవారు. ప్రార్థనలు పఠించేవారిగా ఆసుపత్రిలో  యోగ్యమైన మరియు పవిత్రమైన వారిని నియమించేవారు.  ఆసుపత్రిలో ఉద్యోగులు, అంతేకాకుండా, వారి నైతిక లక్షణాలను కూడా పరిపూర్ణం గా ఉండాలని గుల్నుస్ సుల్తాన్ భావించారు.

 15వ శతాబ్దపు చివరినాటి సుల్తాన్ మెహ్మెత్ II ఫాతిహ్ (d.1481) మరియు బయేజిద్ II కాలం నాటి ఆటోమన్ ఆస్పత్రులు రోగులకు ఆహారo  మరియు ఔషధాలను ఉచితంగా ఇచ్చేవి.  ఆసుపత్రికి అవసరమైన మౌలిక సదుపాయాలను గుర్తించి వాటిని సమకూర్చేవారు

1679 లో స్థాపించిన గుల్నుస్ సుల్తాన్ దార్ అల్-షిఫా ఆరోగ్య సంరక్షణ పై సమగ్ర దృష్టిని ప్రదర్శిస్తుంది. 17వ శతాబ్దంలో గుల్నుస్ సుల్తాన్ ప్రదర్శించిన వైద్యపరమైన దాతృత్వం పవిత్ర నగరంలో ఆరోగ్య సంరక్షణను గణనీయంగా పెంచినది.

 

No comments:

Post a Comment