21 January 2023

ఇస్లాం స్వర్ణయుగానికి సింధు లోయ సహకారం

 


 

ఇస్లామిక్ 'స్వర్ణయుగం' అనేది చరిత్రలో 8-14 శతాభ్దాల వరకు కొనసాగినది.  ఈకాలంలో పొరుగు ప్రపంచంతో ముస్లింల యొక్క అధిక మేధో సంపర్కం వలన  వివిధ విజ్ఞాన శాస్త్రాలలో అసమానమైన ప్రగతికి దారితీసింది.గతంలో బైజాంటైన్ లెవాంట్ మరియు సస్సానిడ్ పర్షియా పై విజయం ముస్లిం ప్రపంచానికి  మేధో పురోగతి యొక్క గొప్ప కొత్త రంగాలకు పరిచయం చేసింది.

711 CEలో సింద్ విజయం తరువాత ముస్లింలు దక్షిణాసియాలో విస్తరించారు. సింద్ లోయ ప్రాంతం  విజ్ఞాన సాధనకు అత్యంత ముఖ్యమైన ప్రాంతాలలో ఒకటిగా అభివృద్ధి చెందినది 

8 శతాబ్దం ప్రారంభంలో ఇస్లాం దక్షిణాసియా అంతటా వ్యాపించడంతో, సింధు లోయ ముస్లిం ప్రపంచానికి పుష్కలంగా అందించే విజ్ఞానం ప్రాంతంగా ఉద్భవించింది. సింధ్ విజయం విస్తరిస్తున్న ముస్లిం సామ్రాజ్యం మరియు సింధు లోయ మధ్య విజ్ఞాన ద్వారం తెరిచింది, దీని ఫలితంగా మేధోపరమైన ఆలోచనలు, జ్ఞానం, అభ్యాసాలు మరియు అభ్యాసకుల గొప్ప మార్పిడి జరిగింది.

711 CEలో సింధ్ ఆక్రమణ  తరువాత సింధ్లో ఇస్లామిక్ వేదాంత అధ్యయనాల ప్రారంభం సింధు నది ఒడ్డున మన్సూరా నగరాన్ని స్థాపించిన తర్వాత వేగంగా ప్రారంభమైంది. సింధ్ త్వరలో వేదాంత అధ్యయనాలకు, ప్రత్యేకించి హదీత్ (ప్రవక్త, సల్లల్లాహు అలైహివ సల్లం యొక్క సంప్రదాయాలు) కోసం ఒక ఫౌంటెన్గా మారింది.

వేదాంతశాస్త్రం మరియు సాహిత్యం:

సింధు లోయ నుండి ఇస్లామిక్ ప్రపంచంలో కీర్తిని సంపాదించిన తొలి వ్యక్తులలో చరిత్రకారుడు అబూ మషర్ అల్-సింధీ (. 786 CE) ఒకడు. అబూ మషర్ సింధ్ నుండి బానిసగా మదీనాకు వచ్చాడు, అక్కడ అబూ మషర్ త్వరలోనే స్వేచ్ఛను పొంది అప్పటి బాగ్దాద్ ఖలీఫాచే పోషించబడ్డాడు.

9 శతాబ్దపు ప్రసిద్ధ జీవితచరిత్ర రచయిత ఇబ్న్ నదీమ్ తన ప్రసిద్ధ పుస్తకం కితాబ్ అల్-ఫిహ్రిస్ట్ [ది బుక్ కేటలాగ్]లో అబూ మషర్ అల్-సింధీని ఉటంకిస్తూ, అబూ మషర్, కితాబ్ అల్-మఘాజీ [బుక్ ఆఫ్ కాంక్వెస్ట్స్] వ్రాసినట్లు కీర్తించాడు, ఇది ప్రవక్త జీవితం మరియు  సైనిక విజయాలపై   పై రాసిన అసాధారణమైన పుస్తకం. అబూ మషర్ రచనలు అబూ మషర్ కి "ఇమామ్ అల్-ఫాన్" (కళల నాయకుడు) బిరుదును అందించాయి మరియు స్వర్ణయుగం యొక్క మేధావులలో అతి ప్రసిద్దుడుగా కిర్తిoచబడినాడు. అబూ మషర్ అంత్యక్రియల ప్రసిద్ధ ఖలీఫ్ హరున్ అల్-రషీద్ ఆద్వర్యం లో జరిగినవి. 

అబూ మషర్ను వేదాంత జ్ఞానంలో అధిగమించిన ఏకైక వ్యక్తి అబూ మషర్‌   కుమారుడు ముహమ్మద్ బిన్ అబూ మషర్ అల్-సింధీ (765-861 CE). బాగ్దాద్లో తండ్రి వద్ద శిక్షణ పొందిన  ముహమ్మద్ బిన్ అబూ మషర్ అల్-సింధీ, ఒక పండితుడు మరియు వేదాంతవేత్తగా అయ్యాడు. ముహమ్మద్ బిన్ అబూ మషర్ వద్ద చదువుకోవటానికి ముస్లిం ప్రపంచం నలుమూలల నుండి విద్యార్ధులు వచ్చేవారు. ముహమ్మద్ బిన్ అబూ మషర్ విద్యార్ధులలో అబూ ఇసా అల్-తిర్మిది, అల్-తబారి, అబూ హతీమ్ అల్-రాజీ మరియు ఇబ్న్ అబీ అల్-దున్యా వంటి ప్రసిద్ధ ఇస్లామిక్ వ్యక్తులు ఉన్నారు.

వేదాంతవేత్త రిజా లేదా రాజా అల్-సింధీ (. 837 CE) పర్షియాలోని ఇస్ఫారైన్ నగరానికి వెళ్లి హదిత్ అధ్యయనంలో ఉన్నత ప్రతిష్టను పొందారు.  అక్కడ రాజా అల్-సింధీ రచనలు మరియు అధ్యయనాలు రాజా అల్-సింధీకి "రుక్న్ మిన్ అర్కాన్ అల్-హదీత్" (హదీసు స్తంభాలలో ఒకటి) అనే బిరుదును అందించాయి. రిజా మనవడు ముహమ్మద్ (821-899 CE) కూడా అత్యుత్తమ వేదాంతవేత్త మరియు ప్రముఖ హదీత్ పుస్తకం సహీహ్ ముస్లింపై ముస్తాఖరాజ్ అనే ఉప కథనాన్ని రచించాడు.

ప్రసిద్ధ సూఫీ బయాజిద్ -బిస్తామి (డి. 848 CE) యొక్క బోధకుడు అబూ అలీ అల్-సింధీ. సూఫీలలో బయాజిద్ -బిస్తామి "సుల్తాన్ అల్-అరిఫీన్” (జ్ఞానవాద రాజు)గా పేరు గాoచినాడు. బయాజిద్ తన ఫనా (స్వీయ-నాశనం) భావనకు ప్రసిద్ధి చెందాడు మరియు భావన అబూ అలీ అల్-సింధీ,  అల్-బిస్తామీకి బోధించాడని నమ్ముతారు. అల్-సింధీ బౌద్ధ మతo నుంచి ముస్లిం గా మారిన  వ్యక్తి అని నమ్ముతారు, అల్-సింధీ నిర్వాణ భావనను అధ్యయనం చేశాడు మరియు అల్-బిస్తామీకి తన జ్ఞానాన్నిభోదించాడు.

సింధు లోయకు చెందిన వేదాంతవేత్తలలో అత్యంత ప్రసిద్ధుడు ఇమామ్ అవ్జాయ్. (707-774 CE). ఇమామ్ అవ్జాయ్ మూలాలు చర్చనీయాంశమైనప్పటికీ, కొంతమంది పండితులు యెమెన్ లోని 'అవ్జాయ్' అనే అరబ్ తెగకు పర్యాయపదంగా ఉన్నందున యెమెన్  అని నిర్ధారించారు,  కొంతమంది చరిత్రకారులు పేరు అవ్జా గ్రామం నుండి ఉద్భవించిన నిస్బా (ఆపాదింపు) అని నమ్ముతారు. 10 శతాబ్దపు ప్రసిద్ధ చరిత్రకారుడు జురా అల్-దామిష్కీ కూడా అవ్జాయ్, సింధ్ నుండి వచ్చినవాడు అని అవ్జాయ్ అనే పేరు సింధ్ గ్రామాన్ని సూచిస్తుందని మరియు తెగను కాదని పేర్కొన్నాడు.

ఇమామ్ అవ్జాయ్ ఇస్లామిక్ ప్రపంచంలో ఖ్యాతిని కలిగి ఉన్నాడు. ఇమామ్ అవ్జాయ్ యుక్తవయస్సు కంటే ముందే వేదాంత జ్ఞానాన్ని పొందాడు మరియు పదమూడేళ్ల వయస్సులో న్యాయపరమైన సమస్యలపై సాధికారికత సంపాదించాడు.

ఇమామ్ అవ్జాయ్ తన కాలంలో అత్యంత ప్రశంసలు పొందిన న్యాయనిపుణులు మరియు పండితులలో ఒకరిగా, సంప్రదాయాల సేకరణ మరియు సంకలనంలో మార్గదర్శకుడిగా పేరు పొందాడు.  ఇమామ్ అవ్జాయ్ 7,000 కంటే ఎక్కువ చట్టపరమైన అంశాలను నిర్ణయించడమే కాకుండా, ఇస్లామిక్ న్యాయశాస్త్రంపై రెండు పుస్తకాలను కూడా రాశాడు. ఇమామ్ అవ్జాయ్ స్వంత ఆలోచనా విధానాన్ని కలిగి ముస్లిం అండలూసియాలో పేరు పొందాడు.

చారిత్రక రికార్డుల ప్రకారం, ఇస్లామిక్ 'స్వర్ణయుగం' లో 70 కంటే ఎక్కువ ఇతర వ్యక్తులు తమ నిస్బాహ్లతో సింధు లోయతో సంభంధం కలిగి ఉన్నారు. వారు వేదాంతశాస్త్రం మరియు సాహిత్యంలో అగ్రగామిగా ఉన్నారు.

 యుద్ధం:

సింధు లోయ నుండి పాద సైనికులు, ఆర్చర్లు మరియు అశ్విక దళాన్ని నియమించే ఆచారం పెర్షియా లో  కలదు. ఇదే విధమైన నియామక పద్ధతిని సస్సానియన్లు అనుసరించారు. వారు సింధు లోయలోని సంచార జాట్ సమాజం నుండి పెద్ద సంఖ్యలో పురుషులను తమ సైనికులుగా నియమించుకొన్నారు. సస్సానిడ్ సైన్యంలో సైనికులుగా నియమించబడ్డ జాట్లు పర్షియాలో రోడ్లు, వాణిజ్యం మరియు రవాణా మార్గాలను రక్షించడానికి కూడా పనిచేశారు.

రషీదున్ కాలిఫేట్ చేతిలో సస్సానిద్ సామ్రాజ్యానికి లభించిన ఘోర పరాజయాల తరువాత, అరబిక్లో జుట్ అని పిలువబడే జాట్లు ఇస్లాంను అంగీకరింఛి  ముస్లిం సైన్యాలలో చేరినారు. 711 CEలో సింధు లోయ ఉమ్మయద్ కాలిఫేట్ చేతుల్లోకి వచ్చినప్పుడు, జాట్పురుషులు,  ముస్లిం సైన్యం లో భర్తీ చేయబడ్డారు.

ప్రారంభ ఇస్లామిక్ యుగంలో జాట్లు ప్రాముఖ్యమైన స్థానాన్ని పొందారు.  జాట్లు ఖలీఫ్ అలీ (601-661 CE) ద్వారా అత్యంత కీలకమైన మరియు రాజకీయంగా ముఖ్యమైన బస్రా నగరం మరియు రాజ ఖజానాల రక్షణ కోసం నియమించబడినారు. చరిత్రకారుడు అల్-తబ్బారి (839-923 CE) తన 33 సంపుటంలో అల్-సింధీ ఇబ్న్ బుఖ్తాషా అనే యోధుడు జనరల్ వాసిఫ్ అల్-టర్కీ యొక్క కుడి పార్శ్వాలకు నాయకత్వం వహించడం గురించి పేర్కొన్నాడు. ఇది 862 CE లో అనటోలియా పై జరిగిన  మొట్టమొదటి ముస్లిం దాడుల్లో ఒకటి.

మెడిసిన్:

దక్షిణాసియా ప్రాచిన కాలం నుంచి ఔషధ శాస్త్రాల నిలయంగా పరిగణించబడినది  మరియు ఔషధ మూలికల సేకరణకు ప్రధాన ప్రాంతంగా పేరుగాంచినది. అబ్బాసిద్ కాలిఫేట్ మరియు సింధు లోయ, అలాగే దక్షిణ ఆసియా కు మధ్య మేధోసంబంధo  ప్రారంభమై  ఇస్లామిక్ ఔషధ విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందినది.

యాహ్యా అల్-బర్మాకి (. 806 CE) సింధు లోయకు ఔషధ మూలికలను సేకరించడానికి మరియు దక్షిణాసియాను అధ్యయనం చేయడానికి ఒక బృందం ను పంపినాడు. సింధ్ నుండి ముస్లిమేతర పండితులు మరియు శాస్త్రాల ప్రతిపాదకుల ప్రతినిధి బృందం బర్కమిద్ విజరుల Barkamid Vizirs ఆహ్వానం మేరకు బాగ్దాద్కు సంస్కృత పుస్తకాలు మరియు గ్రంథాలను తీసుకువచ్చినది.   

వైద్య రంగంలో ప్రసిద్దులు అయిన  ఇబ్న్ డాన్ మరియు మంకా సిందు లోయకు చెందినవారే. 

ఇబ్న్ దాన్ వైద్యశాస్త్రంలో నిష్ణాతుడైన పండితుడు, ఇబ్న్ దాన్ అబ్బాసిద్ హాస్పిటల్ (బిమరిస్తాన్) యొక్క ప్రధాన వైద్యునిగా నియమించబడ్డాడు మరియు బాగ్దాద్లోని మెడిసినల్ స్కూల్కి చీఫ్గా ఉన్నాడు. 

ఇబ్న్ దాన్ రచించిన మరియు అరబిక్లోకి అనువదించిన అనేక ఔషధ గ్రంథాలలో 404 వ్యాధులు మరియు వాటి లక్షణాలు, ఔషధ మూలికలు, పాముల విషం యొక్క బహుళ రూపాలు,పాము  విషాలకు సంబంధించిన మందులు, గర్భాలpregnancie గురించిన పుస్తకాలు, జంతువుల వ్యాధులు మరియు పిల్లల వ్యాధులపై మరియు స్త్రీలకు  సంక్రమించే వ్యాధుల గురించి ప్రస్తావించినాడు.

ఖలీఫ్ హరున్ అల్ రషీద్ (763-809 CE) ఆదేశానుసారం పండితుడు మంకా సంస్కృత వైద్య విజ్ఞానం యొక్క రెండు అత్యంత ముఖ్యమైన పురాతన సంకలనాలను(కంపెండంస్) సుశ్రుత సంగ్రహం మరియు చరక సంగ్రహం అనువదించినప్పుడు ఔషధ విజ్ఞానం యొక్క గొప్ప మార్పిడి జరిగింది, రెండూ ప్రాచీన దక్షిణాసియాలోని ఆయుర్వేద వైద్యంలో అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి.

శస్త్రచికిత్స, ఔషధం మరియు విషాలకు సంబంధించిన అనేక రకాల విషయాలతో వ్యవహరించిన గ్రంథాలు, ఔషధ ప్రపంచంపై వారి అవగాహనను విస్తరించడంలో తొలి ముస్లిం వైద్యులకు బాగా సహాయపడింది.

ఖగోళ శాస్త్రం:

సింధ్ నుండి ప్రధాన ప్రాముఖ్యత కలిగిన మరొక వ్యక్తి కంకా అని పిలువబడే ఖగోళ శాస్త్రవేత్త. కంకా ఖలీఫ్ హరున్ అల్-రషీద్ మరియు ఖలీఫ్ అల్-మామున్ (786-833 CE) కోర్టులలో పనిచేశాడు.

కన్కా యొక్క రచనలు వివిధ శాస్త్రాలలో ఉన్నప్పటికి కంకా ఇస్లామిక్ ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి దక్షిణ ఆసియా ఖగోళ శాస్త్రంపై ముస్లిం ఖగోళ శాస్త్రవేత్తలకు అత్యంత వివరణాత్మక మరియు సమర్థవంతమైన వివరణ అందించడం.

 కొంతమంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, హరున్ అల్-రషీద్ ఆదేశానుసారం, భారతీయ గణిత శాస్త్రజ్ఞుడు బ్రహ్మగుప్తుడు దక్షిణాసియాలోని అత్యుత్తమ గణిత మరియు ఖగోళ రచనలలో ఒకటైన బ్రహ్మ సిద్ధాంతాన్ని అరబిక్లోకి అనువదించమని కంకాను ఆదేశించాడు.

ఖగోళ శాస్త్రవేత్త అల్-ఫజారీ Al-Fazari  (. 746 CE) అనేక ఖగోళ శాస్త్ర గ్రంథాలను అనువదించినాడు.  అల్-ఫజారీ అనువదించిన ప్రసిద్ద గ్రంధం యొక్క  అరబిక్ పేరు జిజ్ అల్ సింధ్- హింద్.

అల్-ఫజారీ యొక్క జిజ్ అల్ సింధ్-హింద్ Zij al Sindh-Hind అనేది దక్షిణాసియా, పెర్షియన్ మరియు గ్రీకు ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం యొక్క కలయిక ద్వారా సృష్టించబడిన ఒక గ్రంథం మరియు ఖగోళ శాస్త్రవేత్తలు మరియు గణిత శాస్త్రజ్ఞులలో ప్రాముఖ్యతను పొందింది.

ఆల్-ఖ్వారిజ్మీ (780-850 CE), బీజగణితాన్ని రూపొందించడానికి బాధ్యత వహిస్తాడు. అల్-ఫజారీ టెక్స్ట్ నుండి జిజ్ అల్ సింధ్-హింద్ యొక్క సంస్కరణను కూడా ఆల్-ఖ్వారిజ్మీ చేసాడు. అబ్బాస్ ఇబ్న్-ఫర్నాథ్ Abbas Ibn-Farnath అనే బెర్బర్ పాలీమాత్ దీనిని స్పెయిన్కు తీసుకువెళ్లాడు, అక్కడ అది క్రైస్తవ ప్రపంచాన్ని బాగా ప్రభావితం చేస్తుంది.

జిజ్ అల్ సింధ్-హింద్ యొక్క మరొక స్పానిష్ వెర్షన్ అబెర్ల్యాండ్ ఆఫ్ బాత్ (1080-1152 CE) ద్వారా లాటిన్లోకి అనువదించబడింది మరియు క్రిస్టియన్ యూరప్కు ప్రయోజనం చేకూర్చినది.

మరొక స్పానిష్ పాలీమాత్ తన పుస్తకం యొక్క రచనలో జిజ్ అల్ సింద్-హింద్ను ఉపయోగించుకుంటాడు, ఇది మక్కా దిశను కనుగొనడం, ప్రార్థన సమయాలను ఏర్పాటు చేయడం మరియు ఇస్లామిక్ క్యాలెండర్ కోసం ఉపయోగించాల్సిన చంద్రుని దృశ్యమానత గురించి విచారించడం వంటి ముఖ్యమైన పనుల కోసం ఉపయోగించబడుతుంది. 

జిజ్ అల్ సింద్-హింద్ బెన్ ఎజ్రా Ben Ezra అనే యూదుడు హిబ్రు భాషలో అనువదించాడు. మరొక స్పానిష్ యూదుడు పెట్రస్ అల్ఫోన్సీ దానిని ఇంగ్లాండ్కు తీసుకువెళ్లాడు.

బ్రహ్మ సిద్ధాంతం యొక్క అనువాదమే కాకుండా కంకా,  ఖగోళ శాస్త్ర విజ్ఞానంపై ది బుక్ ఆఫ్ నేటివిటీస్, ది బుక్ ఆఫ్ నముదర్ ఫర్ ది ఏజెస్, ది గ్రేట్ బుక్ ఆఫ్ కంజంక్షన్స్ మరియు ది స్మాల్ బుక్ ఆఫ్ కంజంక్షన్స్ The Book of Nativities, The Book of Namudar for the Ages, The Great Book of Conjunctions, and The Small Book of Conjunctions వంటి అనేక పుస్తకాలను రచించాడని నమ్ముతారు. కన్కా ముస్లిం ఖగోళ ప్రపంచంలో గొప్ప గౌరవప్రదమైన స్థానాన్ని ఆక్రమించాడు.

 గణితం:

జిజ్ అల్ సింధ్-హింద్ కారణంగా ముస్లింలు పొందిన అతి పెద్ద ప్రయోజనం ఏమిటంటే, అరబ్బులు "అర్కం అల్-హిందీ Arqam al-Hindi " లేదా భారతీయ సంఖ్యలు అని పిలిచే దక్షిణాసియా యొక్క సంఖ్యా వ్యవస్థను పొందటం.

భారతీయ సంఖ్యలు దశాంశ సంజ్ఞామానం వ్యవస్థపై ఆధారపడి ఉన్నాయి, ఇది బేస్ టెన్ సిస్టమ్, ఇక్కడ లెక్కింపు సరిగా ఉంటుంది. ముఖ్యమైన ముస్లిం పాలీమాత్లు భారతీయ సంఖ్యా విధానాన్ని అవలంబించారు మరియు దాని నుండి ఎక్కువ ప్రయోజనం పొందడమే కాకుండా దానిని పరిపూర్ణం చేయడానికి ప్రయత్నించారు.

ప్రసిద్ధ బహుభాషావేత్త అల్-ఖ్వారిజ్మీ యొక్క సంకలనం మరియు వ్యవకలనం” ముస్లింలకు సహాయం చేయడమే కాకుండా లాటిన్లోకి అనువదించబడి  యూరప్లోకి వెళ్లడం జరిగింది తద్వారా  పాశ్చాత్య దేశాలకు  గణిత శాస్త్ర పరిజ్ఞానం అందించినది. 

అల్-ఉకుదిసి, అబూ అల్-వఫా మరియు అల్-నసావి వంటి ముస్లిం శాస్త్రజ్ఞులు భారతీయ సంఖ్యలపై మాన్యుస్క్రిప్ట్లు మరియు గ్రంథాలను రచించారు. 12 శతాబ్దానికి, ముస్లిం ప్రపంచం పూర్తిగా కొత్త సంఖ్యా వ్యవస్థతో నిండిపోయింది, ఎందుకంటే పాశ్చాత్యులు దానికి అలవాటు పడుతున్నారు, జీవితంలోని ప్రతి అంశాన్ని అధ్యయనం నుండి వ్యాపారం వరకు మార్చారు మరియు కొత్త యుగానికి నాంది పలికారు.

ముగింపు:

9 శతాబ్దపు తరువాత సింధు లోయలో అబ్బాసిద్ ఖలీఫేట్ యొక్క అధికారం క్షీణించడం ప్రారంభమైంది. 10 వ శతాబ్ది ప్రారంభంలో సింధు లోయలో అబ్బాసిడ్ పాలన పూర్తిగా అంతరించిపోయింది. పూర్వపు అబ్బాసిడ్ భూభాగాలు రెండు రాష్ట్రాలుగా చీలిపోయాయి: ఉత్తరాన బను సమాస్ కింద ముల్తాన్ ఎమిరేట్ మరియు హబ్బరిడ్స్ కింద దక్షిణాన ఎమిరేట్ మన్సూరా.

చిన్న బలహీన రాష్ట్రాల పెరుగుదల ఇస్మాయిలీ బోధకులు గొప్ప శక్తిని అందించినది మరియు వారు చివరికి ముల్తాన్ ఎమిరేట్ను స్వాధీనం చేసుకోగలిగారు మరియు వారి ప్రాంతీయ ప్రభావాన్ని విస్తరించారు. ఇది ఒకప్పుడు బాగ్దాద్లోని అబ్బాసిడ్ పాలకుల స్థానం,  ఈజిప్ట్ ఫాతిమిడ్ పాలకుల స్థానం తో భర్తీ చేయబడింది, సింధు లోయ యొక్క సంబంధాన్ని టైగ్రిస్ మరియు గల్ఫ్ నుండి,  నైలు మరియు ఎర్ర సముద్రానికి మార్చారు.

అస్థిర రాజకీయ పరిస్థితులు సింధూ లోయ మరియు దాని తక్షణ పశ్చిమ పొరుగు దేశాల మధ్య పెద్ద మొత్తంలో వేదాంత మరియు మేధోసంబంధాన్ని కొనసాగించడానికి అనుమతించలేదు, ఇది సహజంగా కాలక్రమేణా క్షీణించింది.

11 శతాబ్దంలో మరియు తర్వాత మధ్య ఆసియా నుండి టర్కో-మంగోల్ యుద్దవీరుల ఆవిర్భావం మరోసారి సింధు లోయను పశ్చిమ దిశగా అనుసంధానం చేసింది మరియు దక్షిణాసియా మరియు ముస్లింల మధ్య మేధో మరియు వేదాంతపరమైన సంబంధాలను ప్రారంభించి, పండితుల పరస్పర చర్య యొక్క కొత్త శకాన్ని తీసుకువచ్చింది. ఇస్లామిక్ ప్రపంచంలో  ఇది ఐదు శతాబ్దాల పైగా క్రియాశీలంగా ఉంది.

 

No comments:

Post a Comment