ముందుమాట:
తమను తాము 'ముస్లింలు' అని పిలుచుకునే కొంతమంది
వ్యక్తుల అసహనం మరియు హింసాత్మక కార్యకలాపల
ద్వారా ఇస్లాం, ప్రస్తుతం హింసాత్మక మతంగా గుర్తించబడింది.
హింసాత్మక విధానం ద్వారా మాత్రమే తమ లక్ష్యాలను సాధించవచ్చని వీరు బావిస్తున్నారు.
అయితే ఇది నిజం కాదు.
తమను తాము 'ముస్లింలు' అని పిలుచుకునే కొందరు
వ్యక్తుల యొక్క ప్రవర్తన లేదా చర్యలకు ఇస్లాం ప్రతిబించదు. ఇస్లాం లో విశ్వాసo కలిగి ఉండి అత్యున్నత నైతికవిలువలను
కలిగిన వ్యక్తులను ముస్లింలు అంటారు. ముస్లింల ప్రవర్తనను ఇస్లామిక్ సూత్రాల ద్వారా నిర్ణయించబడాలి అంతియేగాని
దానికి బిన్నంగా ఉండరాదు.
తమను తాము 'ముస్లింలు' అని పిలుచుకునే
వ్యక్తులు హింసాత్మక మార్గాలను అవలంబిస్తే, వారి చర్యలకు వారే వ్యక్తిగతంగా బాధ్యత వహించాలి
కాని ఇస్లాం కాదు. అటువంటి వ్యక్తుల చర్యలు ఇస్లామిక్‌గా పరిగణించబడవు.
ఇస్లాంలో శాంతి:
‘ఇస్లాం’ అనే పదం అరబిక్ మూల పదం ‘సిల్మ్’ నుండి వచ్చింది.
మూల పదం‘సిల్మ్’ మరియు ఇస్లాం
అనే పదం రెండూ శాంతిని సూచిస్తాయి. ఇస్లాం యొక్క అన్ని బోధనలు ప్రత్యక్షంగా లేదా
పరోక్షంగా శాంతి పై ఆధారపడి ఉన్నాయి. ‘శాంతి యే ఇస్లాం’ అని, ‘శాంతి దాత దేవుడు’ (అల్-బుఖారీ) అని చెప్పే మహమ్మద్ ప్రవక్త బోధనలుఉన్నాయి.
అదేవిధంగా, మరొక హదీత్
(ముహమ్మద్ ప్రవక్త యొక్క బోధనలు మరియు సూక్తులు) ప్రకారం “ఎవరి నాలుక మరియు చేతుల
నుండి, ప్రజలు
సురక్షితంగా ఉంటారో అతను ముస్లిం గా” పరిగణిoచబడతాడు.
దివ్య ఖురాన్‌లో
వివరించబడిన దేవుని లక్షణాలలో ఒకటి ‘అస్-సలామ్’, అంటే ‘శాంతి మరియు భద్రత’. అనగా దేవుడు శాంతి/సత్య
స్వరూపుడు అని అర్థం. దివ్య ఖురాన్‌లో, దైవిక
మార్గదర్శకత్వం 'శాంతి/రుజు/సత్యమార్గం'తో పోల్చబడింది.(5:16)
ఇస్లాం మరియు
దాదాపు అన్ని ఇతర మతాలు స్వర్గాన్ని శాశ్వతమైన ఆదర్శంగా మరియు ప్రతి మనిషి యొక్క
అంతిమ లక్ష్యంగా చేస్తాయి. దివ్య ఖురాన్ స్వర్గాన్ని 'శాంతి నిలయం' అని
పిలుస్తుంది.(10: 25) స్వర్గంలోని
ప్రజలు ఒకరికొకరు శాంతిని కోరుకుంటారని కూడా చెప్పబడింది. ఇది ఒక ఆదర్శ
సమాజంలో శాంతి యొక్క ప్రాముఖ్యతకు మరొక సూచన.
ఇస్లాంలో శాంతి ఒక
ప్రమాణం మరియు యుద్ధం ఒక మినహాయింపు. ఇస్లాం యొక్క అన్ని
బోధనలు మరియు ఇస్లాం యొక్క ప్రవక్త(స) జీవితం దీనికి సాక్ష్యం. దేవుడు
కఠినత్వానికి బదులు సౌమ్యతను అనుగ్రహిస్తాడని ఒక హదీసు అంటుంది అంటే హింస కంటే శాంతియుత విధానం మేలైనది.
దివ్య ఖురాన్‌లో శాంతి:
దివ్య ఖురాన్
నిస్సందేహంగా శాంతి గ్రంధం. ఇది యుద్ధం మరియు హింసను భోదించే గ్రంధం కాదు. దివ్య ఖురాన్ లోని అన్ని భోధనలు శాంతికి
సంబంధించినవి. దివ్య ఖురాన్ మొదటి సురా(అధ్యాయం):-“అనంత కరుణామయుడు, అపార
కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంబిస్తున్నాను అని మొదలవుతుంది మరియు ఈ ఆయత్ దివ్య ఖురాన్‌లో 114 సార్లు పునరావృతం
చేయబడింది. ఈ గ్రంథo మనకు దేవుడు పంపిన
గొప్పగ్రంధం. దివ్య ఖురాన్ గ్రంధం “దేవుని దయ మరియు దేవుని సూచన”. ఈ మొత్తం పుస్తకం యొక్క ఇతివృత్తం దేవుని
కరుణ.
ఘర్షణ లేదా
సంఘర్షణ కంటే శాంతి మార్గం చాలా ఉత్తమమైనది. దేవుని చట్టం ప్రకారం, మానవజాతి సయోధ్య
ద్వారా మాత్రమే విజయాన్ని సాదిస్తుంది. ప్రవక్త (స) భార్య ఆయిషా(ర) మాట్లాడుతూ, ప్రవక్త(స) యొక్క
విధానం ఎల్లప్పుడూ సులభమైన మార్గాన్ని ఎంచుకోవడమేనని చెప్పారు-(అల్-బుఖారీ).
ఘర్షణ లేని
విధానం, సులభమైన విధానం. దూకుడును,
దూకుడుతో ఎదుర్కోవడం కన్నా సహనంతో దూకుడును ఎదుర్కోవడం ఉత్తమం. ఆశించిన ఫలితాలను సాధించడంలో శాంతి ఎల్లప్పుడూ తేలికైన మార్గం.
ప్రవక్త(స) శాంతి దూత:
ఇస్లాం అనేది
ప్రవక్త ముహమ్మద్(స) ద్వారా ప్రకటించబడిన మరియు ప్రవక్త(స) జీవితంకు ఉదాహరణగా చెప్పబడిన ధర్మం. మహమ్మద్ ప్రవక్త(స)
శాంతి కి ప్రవక్త, హింసకి ప్రవక్త కాదు. దివ్య ఖురాన్‌లో, అతన్ని 'మానవజాతి పట్ల దయ' అని పిలుస్తారు.
ముహమ్మద్
ప్రవక్త(స) శాంతిని ప్రేమించే వ్యక్తి. ముహమ్మద్ ప్రవక్త(స) యొక్క శాంతి, స్వభావం
ఉన్నతమైనది మరియు ముహమ్మద్ ప్రవక్త(స) ఒక బిడ్డకు హరాబ్ అనిగాక హసన్ (మంచితనం) అని పెట్టమని మార్గనిర్దేశం
చేశాడు. ముహమ్మద్ ప్రవక్త(స) శాంతిని కోరుకోన్నాడు మరియు తన అనుచరులు ప్రజల కోసం
మంచి పనులు చేయాలని, వారు మరణం మరియు
విధ్వంసం కాక శాంతి మరియు శ్రేయస్సు సందేశo గా అందించాలని అన్నాడు.
ప్రవక్త(స) నాయకత్వంలో
సైనిక కార్యకలాపాలు:
ప్రవక్త(స)
జీవితంలో జరిగిన యుద్ధాలు యాదృచ్ఛికం మరియు అసాధారణమైన పరిస్థితులలో మాత్రమే. ఈ
యుద్ధాలను కొంతమంది ప్రవక్త(స) జీవిత చరిత్ర రచయితలు అతనిని శాంతి ప్రవక్తగా
చూపించే బదులు హింస ప్రవక్తగా చిత్రీకరించారు.
ప్రవక్త (స)
కాలంలో జరిగిన యుద్ధాలు అరబ్ తెగల మధ్య ఉన్న సంస్కృతికి సంబంధించినవి. ప్రవక్త (స)యొక్క
పుట్టుకకు ముందు, మదీనాలోని రెండు
ప్రధాన తెగల మధ్య వివాదం కొనసాగింది, ఈ యుద్ధం 120 సంవత్సరాలు కొనసాగిందని మరియు వేలాది మంది
ప్రజలు ఈ యుద్ధాలలో మరణించారని చెబుతారు, వీటిలో ప్రముఖమైనది బుత్ Buath యుద్ధం పేరుతో
పిలువబడింది. -( ప్రవక్త జీవిత చరిత్ర- ఇబ్న్ ఇషాక్)
అరేబియా, అనేక
విభిన్న తెగలచే విభజించబడిన సమయంలో ప్రవక్త ముహమ్మద్(స) జన్మించారు. విభిన్న తెగలు ఒక్కొక్కటి అనేక వంశాలు కలిగి ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. చిన్న చిన్న
విషయాలకే తెగలు మరుయు కులాల మధ్య తగాదాలు జరిగేవి. ఈ సంస్కృతి కారణంగా, ప్రవక్త(స)
అనుచరులు మరియు వారి ప్రత్యర్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. ప్రవక్త(స) జీవిత చరిత్ర
రచయితలు యుద్ధాలుగా ప్రదర్శించిన చాలా సంఘటనలను చిన్న చిన్న వాగ్వివాదాలుగా
వర్గీకరించవచ్చు.
ప్రవక్త(స)
శాంతియుత పద్ధతిలో మానవాళికి, దేవుని మార్గదర్శకత్వాన్ని తెలియజేసే పిలుపును ప్రారంభించాడు.
ప్రవక్త(స) మక్కాలో ప్రవక్తగా ఉన్న పదమూడు సంవత్సరాలలో తన బోధనలను వ్యతిరేకించిన
వారిపై లేదా తనను మరియు తన అనుచరులను అణచివేసిన వారిపై ఎన్నడూ హింసాత్మక చర్య జరపలేదు.
ముహమ్మద్ ప్రవక్త(స) మక్కాలో ఉన్నప్పుడు, అతని బోధనలు ఎల్లప్పుడూ ఓర్పు,శాంతి మరియు సహనం భోదించినవి.
ప్రవక్త(స) మరియు
అతని అనుచరులు, ఖురైష్ తెగ వారి మూడు
సంవత్సరాల సామాజిక బహిష్కరణను ఎదుర్కొని కష్టాలను ఓపికగా భరించారు. ప్రవక్త(స)
ప్రత్యర్థులు ప్రవక్త(స)ను చంపడానికి పన్నాగం పన్నినప్పుడు, ప్రవక్త(స) నిశ్శబ్దంగా
మక్కా నుండి తన సహచరులతో కలిసి మదీనాకు వలస వెళ్ళారు. తన అనుచరులకు కూడా వలస
వెళ్ళమని సలహా ఇచ్చారు.
మదీనాలో కూడా, అతని
ప్రత్యర్థులు ప్రవక్త(స) మరియు అతని జీవితాన్ని దుర్భరంగా మార్చడానికి
చేయగలిగినదంతా చేశారు. అటువంటి సమయంలో ఈ క్రింది ఆయత్ వెలువడింది.
“ఏమిటి?
ఆడిన మాట తప్పిన వారితో, ప్రవక్త(స)ను
రాజ్యం నుండి వెళ్లగొట్టే దుస్సాహాసానికి ఒడిగోట్టిన వారితో మీరు పోరాడరా?మొదటిసారి
మీపై కయ్యానికి కాలు దువ్వింది కూడా వారే కదా! ఏమిటి వారంటే మీకు భయమా? నిజానికి
మీరు భయపడవలసినది దైవానికే. మీరుగనుక విశ్వాసులయతే(ఈ యదార్ధాన్ని
గ్రహించండి)”. -(9:13)
పై
ఆయత్ విశ్వాసులను దాడి చేస్తే పోరాడటానికి అనుమతించింది. ఈ అనుమతి షరతులతో
కూడుకున్నది. ఈ శత్రుత్వాల ఫలితంగా బద్ర్ మరియు ఉహద్ అనే రెండు యుద్ధాలు జరిగాయి.
ఈ యుద్ధాల తర్వాత
ప్రవక్త(స) తన ప్రత్యర్థులు 10,000 మంది సైన్యంతో మదీనా వైపు వెళ్తున్నారని తెలుసుకున్నప్పుడు, ప్రవక్త(స) మదీనా వెలుపల
కందకం తవ్వటం అనే తప్పించుకునే వ్యూహాన్ని ఉపయోగించాడు. ఈ వ్యూహం కారణంగా సాయుధ
పోరాటం నివారించబడింది.
ప్రవక్త(స) యొక్క మిషన్:
ప్రవక్త(స)
మానవాళికి దేవుని సందేశాన్ని అందించడo అనే దైవిక లక్ష్యంలో ఉన్నారు. పరిస్థితులు
సామరస్యంగా మరియు శాంతియుతంగా ఉన్నప్పుడు మాత్రమే కమ్యూనికేషన్ యొక్క ఏదైనా మిషన్
విజయవంతమవుతుంది. శాంతి వాతావరణం కోసం, అన్ని అడ్డంకులను పట్టుదలతో ఎదుర్కోవలసి
ఉంటుంది.
ప్రవక్త(స) యొక్క
ప్రత్యర్థులు, ప్రవక్త(స)ను మరియు అతని అనుచరులను చిన్న చిన్న సమస్యలపై యుద్ధంలో
పాల్గొనమని నిరంతరం రెచ్చగొట్టేవారు కానీ ప్రవక్త(స) మరియు అతని సహచరులు ఎల్లప్పుడూ
ఘర్షణను అధిగమించడానికి శాంతి,ఓర్పు మరియు
సహనం యొక్క దైవిక బోధనలను పాటించేవారు. దివ్య ఖురాన్ ఇలా చెబుతోంది: “వారెప్పుడు
యుద్ధ జ్వాలలను రేపినా, దేవుడు దాన్ని అర్పివేస్తుంటాడు.”-(5:64)
ప్రత్యర్థుల
అన్ని షరతులను ప్రవక్త(స) అంగీకరించి హుదైబియా ఒప్పందం చేసుకోన్నారు. కాని హుదైబియా
ఒప్పందాన్ని ప్రవక్త(స)ప్రత్యర్థులు ఉల్లంఘించారు. పలితంగా జరిగిన
యుద్దo లో ప్రవక్త(స) ప్రత్యర్థులు ఒడిపోయి,
లొంగిపోయారు. ప్రవక్త(స), వారు ఎన్ని దారుణాలు
చేసినప్పటికీ వారిని తన అనుచరులు అవమానించటానికి కూడా అనుమతించలేదు మరియు బదులుగా సాధారణ క్షమాభిక్ష
ను ప్రకటించారు: "వెళ్ళండి. మీరు స్వేచ్ఛగా ఉన్నారు"
నిజమైన దృక్కోణం:
23 సంవత్సరాల
ప్రవచనాత్మక జీవితాన్ని మనం నిష్పాక్షికంగా అధ్యయనం చేస్తే, ప్రవక్త ముహమ్మద్(స) శాంతి ప్రవక్త
అని ఖచ్చితంగా స్పష్టమవుతుంది. ప్రవక్త(స) యొక్క యుద్ధాలను, చరిత్రలోని ఇతర
యుద్ధాలతో పోల్చినట్లయితే,
ప్రవక్త(స) యొక్క
మిషన్ అహింసాత్మకమైనది మరియు జరిగిన యుద్ధాలు అసాధారణమైన పరిస్థితులలో
రక్షణాత్మకమైనవి అని స్పష్టమవుతుంది.
యుద్ధం Battle /
War |
పీరియడ్ |
యుద్ధ కాల వ్యవధి |
మరణాలు |
రెండవ ప్రపంచ యుద్ధం |
1939–1945 |
6సంవత్సరాలు |
దాదాపు 65 మిలియన్ల మంది |
అమెరికన్ సివిల్ వార్ |
1861-1865 |
4సంవత్సరాలు |
సుమారు 500,000 మంది |
పానిపట్ యుద్ధం |
14, జనవరి 1761 |
ఒక రోజు |
100,000మంది పైగా |
గల్ఫ్ యుద్ధం |
ఆగస్టు,1990- ఫిబ్రవరి,1991 |
7 నెలలు |
25,000 మంది |
ఇరాక్ యుద్ధం |
మార్చి.2003- డిసెంబర్,2011 |
8½ సంవత్సరాలు |
35,000 |
బద్ర్, ఉహుద్, హునైన్ యుద్ధాలు కలిపి |
13మార్చి, 624, 23మార్చి, 625 జనవరి, 630 |
1 ½ రోజు |
1018 |
చరిత్రలో జరిగిన
అనేక ఇతర యుద్ధాల మరణాలతో పోల్చినప్పుడు బద్ర్, ఉహుద్, హునైన్ యుద్ధాలలో మరణించిన వారి సంఖ్య చాలా తక్కువ.
చరిత్ర నుండి
ఇచ్చిన ఇతర యుద్ధాల నమూనాతో పోల్చితే, ప్రవక్త చేసిన రక్షణాత్మక యుద్ధాలలో (బద్ర్, ఉహుద్ మరియు హునైన్) జరిగిన వాస్తవ పోరాటం
యొక్క మొత్తం వ్యవధి కేవలం 1½ రోజులకు సమానం. ఈ అన్ని యుద్ధాలలో మొత్తం మృతుల సంఖ్య 1018.
ప్రవక్త(స)
జీవితంపై నిష్పాక్షికమైన అవగాహన లేకపోవడం వల్ల, ముస్లిం జీవిత చరిత్ర రచయితలు ఆ సమయంలో ఉన్న
ఆచారాలు మరియు సంస్కృతిని విస్మరించడం ద్వారా వాస్తవాలను తప్పుగా చూపించారు. మరోవైపు, ప్రవక్త (స)యొక్క
లౌకిక జీవిత చరిత్రకారులు ప్రవక్త(స) జీవితంలోని ప్రధాన సంఘటనలను విస్మరింఛి కొన్ని అసాధారణమైన సంఘటనలపై దృష్టి పెట్టాలని
ఎంచుకున్నారు. వారు ప్రవక్త(స) జీవితాన్ని యోధుడైన ప్రవక్త(స)గా చిత్రించారు. వారు ప్రవక్త(స)
జీవితాన్ని ముస్లిం సంస్కృతికి భిన్నంగా ఇస్లామిక్ ఉగ్రవాదం, ప్రవక్త(స) యొక్క బోధనల ఫలితమని భావించారు.
ప్రవక్త(స) యొక్క
నిజమైన నిరాడంబరమైన వ్యక్తిత్వం చాలా మంది ప్రవక్త(స) జీవిత చరిత్రకారులకి లోపభూయిష్టంగా కనిపించింది. ప్రవక్త(స) యొక్క వ్యకిత్వం,
వారి దృష్టిలో గొప్ప విజేతలు మరియు యోధుల కంటే తక్కువగా
కనిపించింది. అందువల్ల ప్రవక్త(స) జీవిత చరిత్రకారులు, తమ ప్రవక్త(స) ను ఒక యోధునిగా ప్రదర్శించారు, అది వారి
దృష్టిలో ఉన్నతమైన చిత్రం.
అయితే, ప్రవక్త(స) యొక్క
ఈ చిత్రం పూర్తిగా నిరాధారమైనది మరియు స్వీయ-కల్పనతో కూడినది. నిజానికి, ప్రవక్త(స)
శాంతిని ప్రేమించే వ్యక్తి. ప్రవక్త(స) పోరాడడం ద్వారా కాక ప్రేమ, కరుణతో ప్రజల హృదయాలను గెలుచుకోవడం జరిగింది. ప్రవక్త(స) సందేశం శ్రోతలకు
నూతనోత్తేజం కలిగించినది.
“ఓ విశ్వసించిన వారలారా!
దైవ ప్రవక్త మీకు జీవితాన్నిచ్చే విషయం
వైపు పిలిచినప్పుడు మీరు దైవం మరియు దైవ ప్రవక్త పిలుపునకు సానుకూలంగా
స్పందించండి. తెలుసుకోండి! దేవుడు మనిషికి-అతని మనసుకి మద్య అడ్డుపడతాడు. మీరంతా
ఆయన వద్దకే సమీకరించబడతారు.” దివ్య ఖురాన్ (8: 24)
ప్రవక్త(స) యొక్క
మిషన్ చక్రవర్తులు మరియు రాజుల కంటే భిన్నమైనదని దివ్య ఖురాన్ యొక్క అవగాహన నుండి
స్పష్టంగా తెలుస్తుంది. ప్రవక్త(స) లక్ష్యం ప్రజలను పరిపాలించడం కాదు, వారి మనస్సులను
మార్చడం మరియు వారి హృదయాలను ఆధ్యాత్మికత వైపు మళ్లించడం. ప్రజలకు దైవ ఆధారిత జీవనాన్ని నేర్పించడం ద్వారా వారి వ్యక్తిత్వమును దైవికo గా
మార్చడం.
పై విశ్లేషణ నుండి, ముహమ్మద్ ప్రవక్త(స)
శాంతి ప్రవక్త యేగాని హింస ప్రవక్త కాదని స్పష్టంగా తెలుస్తుంది. ముస్లిం మరియు లౌకిక జీవితచరిత్ర రచయితలు
ప్రవక్త(స) జీవిత చరిత్రకు అనుసరించిన విధానం సరైనది కాదు.
చివరి మాట:
మహమ్మద్ ప్రవక్త(స)
గురించి ప్రపంచవ్యాప్త పండితుల అభిప్రాయాలు:
సర్ జార్జ్ బెర్నార్డ్
షా:
నేను ముహమ్మద్ (ప్రవక్త)-అనే
అద్భుతమైన వ్యక్తి గురించి అధ్యయనం చేసాను మరియు నా అభిప్రాయం ప్రకారం, ముహమ్మద్(స) ను సర్వమానవాళి
రక్షకుడిగా పిలవాలి.
మహాత్మా గాంధీ:
నేటికి లక్షలాది
మంది మానవుల హృదయాలపై చెరగని ముద్ర వేసిన వ్యక్తి
(ముహమ్మద్ ప్రవక్త(స)) జీవితంలోని ఉత్తమమైన వాటిని తెలుసుకోవాలనుకున్నాను. ఇస్లాం
పెరుగుదలకు కారణం కత్తి కాదని, దాని సరళత, ప్రవక్త(స) యొక్క
వ్యక్తిత్వం, ప్రతిజ్ఞల పట్ల
నిష్కపటమైన గౌరవం, స్నేహితులు మరియు
అనుచరుల పట్ల తీవ్రమైన ప్రేమ, ప్రతి అడ్డంకిని
అధిగమించే నిర్భయత, భగవంతుడు మరియు స్వంత
మిషన్‌పై ఉన్న సంపూర్ణ దృఢమైన విశ్వాసం ముందున్న ప్రతిదాన్ని మోసుకెళ్లింది అని నేను గతంలో కంటే ఎక్కువగా నమ్మాను.
ఎడ్వర్డ్ గిబ్బన్ మరియు
సైమన్ ఓక్లే:
మొహమ్మద్
జీవితంలోని గొప్ప విజయం పరిపూర్ణమైన నైతిక శక్తితో జరిగింది.
అల్ఫోన్స్ డి లా
మార్టైన్:
మానవ మేధస్సు యొక్క మూడు ప్రమాణాలు: ప్రయోజనం యొక్క గొప్పతనం, చిన్నతనం మరియు ఆశ్చర్యపరిచే
ఫలితాలు. అయితే, చరిత్రలో ఏ గొప్ప
వ్యక్తినైనా మహమ్మద్‌తో పోల్చడానికి ఎవరు ధైర్యం చేయగలరు?
మైఖేల్ హార్ట్:
ప్రపంచంలోని
అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితాలో ముహమ్మద్(స)ను నేను ఎంపిక చేసుకున్నాను, ఇది కొంతమంది పాఠకులను ఆశ్చర్యపరచవచ్చు మరియు
ఇతరులు ప్రశ్నించవచ్చు, కానీ చరిత్రలో
లౌకిక మరియు మతపరమైన స్థాయిలలో అత్యున్నత విజయం సాధించిన ఏకైక వ్యక్తి ముహమ్మద్(స).
అన్నీ బిసెంట్:
అరేబియా యొక్క
గొప్ప ప్రవక్త యొక్క జీవితం మరియు లక్షణాన్ని అధ్యయనం చేసే ఎవరికైనా, అతను ఎలా
బోధించాడో మరియు ఎలా జీవించాడో తెలిసిన వారికి, సర్వోన్నత గొప్ప దూతలలో ఒకరైన ఆ శక్తిమంతుడైన
ప్రవక్త పట్ల గౌరవం తప్ప ఇతర అనుభూతి కలగటం అసాధ్యం. ముహమ్మద్(స) గురించి చాలామందికి నాకు తెలిసిన
అనేక విషయాలను చెబుతాను. అవును, నేను ఆయన గురించి
తిరిగి చదివినప్పుడల్లా, ఆ గొప్ప అరేబియా
గురువు పట్ల అభిమానం, గౌరవం భావం
పెరుగుతుంది.
దివాన్ చంద్ శర్మ:
ముహమ్మద్(స) దయ
యొక్క ఆత్మ మరియు అతని ప్రభావం
అతని చుట్టూ ఉన్నవారు అనుభవించారు మరియు
ఎప్పటికీ మరచిపోలేరు.
ఈ అంశంపై వీడియో
ఉపన్యాసాన్ని చూడటానికి, దయచేసి లింక్‌ని
సందర్శించండి:
https://www.youtube.com/watch?v=z0RvkPqrZ5Y
మరింత చదవండి:
మౌలానా
వహీదుద్దీన్ ఖాన్ (పెంగ్విన్ బుక్స్) రచించిన ది ప్రొఫెట్ ఆఫ్ పీస్ www.goodwordbooks.com
మౌలానా
వహీదుద్దీన్ ఖాన్ స్థాపించిన CPS ఇంటర్నేషనల్ యొక్క మిషనరీలు, ప్రవక్త(స) యొక్క శాంతి మిషన్‌లో ఉన్నారు. అనేక
శాంతి పురస్కారాలను అందుకున్న మౌలానా వహిద్దుదిన్ ఖాన్, భారత దేశ రెండవ అత్యున్నత
పౌర పురస్కారం పద్మవిభూషణ్ పొందారు. 2021లో మరణించిన మౌలానా వహీదుద్దీన్ ఖాన్ తన
జీవితాన్ని, శాంతి మరియు సానుకూలత
వైపు ప్రజల మనస్సులను మార్చడానికి తన వనరులను అంకితం చేశారు. మౌలానా వహిద్దుదిన్
ఖాన్ అవిశ్రాంతంగా శాంతి కోసం పనిచేశారు. ‘ఉగ్రవాదం అనేది హింసాత్మక భావజాలమని, శాంతి భావజాలంతో
దాన్ని ఎదుర్కోవాలని’ మౌలానా
వహిద్దుదిన్ ఖాన్ అన్నారు.
మౌలానా ఇస్లాం
యొక్క నిజమైన చిత్రాన్ని ప్రదర్శిస్తారు., ఇస్లాం, అంటే ప్రకృతి మతం.
ఇస్లాం గురించిన
ప్రశ్నలకు సమాధానాలు మరియు మరింత చదవడం కోసం దయచేసి మా వెబ్‌సైట్‌లను చూడండి:
www.cpsglobal.org
www.facebook.com/maulanawkhan
www.spiritofislam.co.in
www.peacemission.in
మౌలానా చివరి మాటలు:
“ఈ ప్రపంచంలో
గొప్ప విజయం ఏమిటంటే, మీరు ఏ
వ్యక్తిపైనా ప్రతికూల ఆలోచనలు కలిగి ఉండకూడదనే రీతిలో జీవితాన్ని గడపడం. మీరు
పూర్తిగా సానుకూల దృక్పథంతో ఈ ప్రపంచం నుండి నిష్క్రమించాలి. ఈ ప్రపంచంలో ఇది నా
చివరి ఆవిష్కరణ." - మౌలానా వహీదుద్దీన్ ఖాన్ (1925-2021).
మూలం: మౌలానా వహీదుద్దీన్ ఖాన్
తెలుగు సేత: ముహమ్మద్
అజ్గర్ అలీ.
No comments:
Post a Comment