18 January 2023

బాగ్ హజారికా Bagh Hazarika

 



 

బాగ్ హజారికాగా ప్రసిద్ధి చెందిన ఇస్మాయిల్ సిద్ధిఖ్ 17వ శతాబ్దపు యోధుడు. బాగ్ హజారికా భారతదేశంలోని అస్సాంలోని గర్హ్‌గావ్‌లో జన్మించారు మరియు అహోం రాజ్యం పట్ల విధేయత ప్రదర్శించాడు.

ఇస్మాయిల్ సిద్ధిఖ్ అహోం రాజ్యం కోసం మొఘల్‌లకు వ్యతిరేకంగా పోరాడాడు. ఇస్మాయిల్ సిద్ధిఖ్ సాంస్కృతికంగా "అస్సామ్‌లోని ఇండిజినస్ ముస్లిం కమ్యూనిటీస్ హీరో"గా పేరు గాంచాడు.ఇస్మాయిల్ సిద్ధిఖ్ అస్సాంలోని ఘర్‌గావ్ సమీపంలోని ధేకేరిగావ్ గ్రామంలో అస్సామీ ముస్లిం కుటుంబంలో జన్మించాడు. 

 అస్సాం లో బాగా ప్రచలితమైన ఒక జానపద గాధ  తన గ్రామంలోకి ప్రవేశించిన పులిని ఇస్మాయిల్ సిద్ధిఖ్ నిరాయుధుడై, ఒట్టి చేతులతో చంపాడని చెబుతుంది. ఈ శౌర్యం గురించిన వార్త అహోం రాజు చక్రధ్వజ్ సింహకు చేరింది మరియు తన శక్తిని ప్రదర్శించడానికి ఇస్మాయిల్ సిద్ధిఖ్ ను  తన ఆస్థానానికి పిలిచాడు. ఇస్మాయిల్ సిద్ధిఖ్ బలప్రదర్శనకు ముగ్ధుడై రాజు ఇస్మాయిల్‌ను “హజారికా”గా అనగా  1000 పైచిలుకు పైక్స్ ఉన్న అహోం కార్యాలయ అధిపతిగా నియమించాడు.

సరైఘాట్ యుద్ధం(1671):

ధైర్య బాగ్ (అస్సామీ భాషలో "టైగర్") హజారికా (ఇస్మాయిల్ సిద్ధిఖ్) సరైఘాట్ యుద్ధంలో ధైర్యసాహసాలను ప్రదర్శించాడు. మొఘలులతో, అహోం సైనిక దళాలకు  జరిగిన సంఘర్షణలో, మొఘల్ దళాలు బ్రహ్మపుత్ర నది ఉత్తర ఒడ్డున ఉన్న కొండలపై భారీ ఫిరంగులతో  మొహరించారు. బాగ్ హజారికా(ఇస్మాయిల్ సిద్ధిఖ్),  అహోమ్ జనరల్ లచిత్ బోర్ఫుకాన్, రాజ మంత్రి అటాన్ బుర్హాగోహైన్ మరియు ఇతర జనరల్స్‌కు మొఘల్ ఫిరంగులను ఎలా పనికిరాకుండా చేయాలో ఒక ప్రణాళికను సూచించాడు. ఈ ప్రణాళికకు ముగ్ధులై, వారు బాగ్ హజారికాకు ఆపరేషన్‌కి నాయకత్వం వహించే బాధ్యతను అప్పగించారు.

ఆ రాత్రి, బాగ్ హజారికా నేతృత్వంలోని అడ్వాన్స్ పార్టీ కొంతమంది సైనికులతో కలిసి బ్రహ్మపుత్రను పడవలో దాటి నది ఉత్తర ఒడ్డున దిగి సరైన క్షణం కోసం వేచి ఉన్నారు. మొఘల్ సైనికులు తమ ఫజ్ర్ లేదా తెల్లవారుజామున ప్రార్థనలు చేస్తూ నిమగ్నమై ఉండగా, బాగ్ హజారికా మరియు అతని సైనికులు మొఘల్ ఫిరంగులలోకి నీరు పోసి, వాటిని పనికిరాకుండా చేసారు.

కొంత సమయం తరువాత, అహోం సైన్యం బాకాలు ఊదుతూ తమ ముందస్తు ప్రతిఘటనను ప్రకటించింది. ప్రతిస్పందనగా, మొఘల్ సైనికులు వారి స్థావరాలకు  పరుగెత్తుకొంటు వెళ్లి  ముందుకు సాగుతున్న అహోం దళాలపై ఫిరంగులను కాల్చడానికి ప్రయత్నించారు. కానీ, తడి ఫిరంగులు పనిచేయలేదు. అహోం దళాలు తమ ఫిరంగులను ఉపయోగించారు మరియు అహోం సైన్యం ఉత్తర ఒడ్డున సురక్షితంగా దిగింది మరియు మొఘల్ సైనికులు నిస్సహాయంగా వెనక్కి తగ్గడంతో వారిపై దాడి చేశారు.

ఈ విజయం బాగ్ హజారికా యొక్క ధైర్యం మరియు పరాక్రమాన్ని రుజువు చేసింది మరియు బాగ్ హజారికా, అహోం  రాజుచే సత్కరింపబడ్డాడు. బాగ్ హజారికా అత్యంత నైపుణ్యం కలిగిన ఫ్రంట్ ర్యాంకింగ్ సైనిక అధికారిగా అస్సాం చరిత్రలో నిలిచిపోయారు 

మూలం: వికీ పీడియా.

 

 

 

 

No comments:

Post a Comment