1909లో బ్రిటిష్
అధికారి కర్జన్ వైలీని హత్య చేసినందుకు భారతీయ విప్లవవాది మదన్ లాల్ ధింగ్రాను
ప్రశంసిస్తూ ఈజిప్టు కవి అలీ అల్-గయాటిజ్ రాసిన కవిత ఈజిప్టు జాతీయవాద
వార్తాపత్రిక అల్-లివాలో ప్రచురింపబడినది.
1909లో బ్రిటిష్
అధికారి కర్జన్ వైలీని హత్య చేసినందుకు భారతీయ విప్లవవాది మదన్ లాల్ ధింగ్రాను
ప్రశంసిస్తూ ఈజిప్టు కవి అలీ అల్-గయాటిజ్ రాసిన కవిత ఈజిప్టు జాతీయవాద
వార్తాపత్రిక అల్-లివాలో ప్రచురింపబడినది.
బ్రిటీష్
సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఈజిప్టు మరియు భారత దేశం లో జరిగే జాతీయవాద పోరాటం అరుదుగా అధ్యయనం చేయబడుతోంది. అనేక భారతీయ జాతీయవాదులు మరియు ఈజిప్టు
జాతీయవాదులు 20వ శతాబ్దం ప్రారంభంలోనే బ్రిటిష్ వలసవాదానికి
వ్యతిరేకంగా పరస్పరం సహకరించుకోవటం ను చరిత్రకారులు నిర్లక్ష్యం చేశారు.
భారతీయులు, ఈజిప్టు
జాతీయవాదానికి ప్రేరణకర్తలుకాగా, భారత-ఈజిప్ట్ జాతీయవాదులు తమ ఉమ్మడి శత్రువును
ఎదుర్కొవటానికి పరస్పరం ఐక్యతను ఏర్పరచుకోన్నారు.
భారతీయ మరియు ఈజిప్టు జాతీయవాదుల
విప్లవాత్మక పరిచయాలను 1906 వరకు
గుర్తించవచ్చు. అప్రసిద్ధ
డెన్షావై సంఘటనల తరువాత, ఈజిప్టు జాతీయవాద
నాయకుడు ముస్తఫా కామిల్ పాషా, లండన్ లో భారతీయ జాతీయవాద విప్లవవీరులను కలుసుకున్నారు.
పాషాలో మిత్రుడిని కనుగొన్నందుకు భారతీయువిప్లవకారులు చాలా సంతోషంగా ఉన్నారు.
లండన్లోని ఇండియన్ హోమ్ రూల్ సొసైటీ వైస్
ప్రెసిడెంట్ బహిరంగ సభలో, పాషా తో "మీరు మీ ప్రియమైన దేశానికి తిరిగి వెళ్ళoడి
మరియు స్వేచ్ఛ కోసం పోరాటాన్ని కొనసాగించండి" అని అన్నారు.
1908లో శ్యాంజీ
కృష్ణవర్మ యొక్క ఇండియా హౌస్ India House మరియు మొహమ్మద్
ఫరీద్ యొక్క యంగ్ ఈజిప్ట్ Young Egypt విప్లవకారులతో లండన్లో
ఇండో-ఈజిప్టు సమాజం Indo-Egyptian Society ఏర్పడింది.
వి.డి. సావర్కర్, వీరేంద్రనాథ్
చటోపాధ్యాయ, హైదర్ రాజా, అలీ ఖాన్, బిపిన్ చంద్ర పాల్, మరియు ఆచార్య కృష్ణవర్మ వంటి ప్రముఖ భారతీయ
విప్లవకారులు ఇండో-ఈజిప్టు సమాజం Indo-Egyptian Society ఏర్పాటుకు
ముఖ్యులు.
లండన్లోని ఇండియా హౌస్
వద్ద జరిగిన ఇండో-ఈజిప్టు సమాజం Indo-Egyptian Society సమావేశానికి ఈజిప్టు
నాయకుడు మొహమ్మద్ ఫరీద్ దగ్గరి సహాయకులు హాజరయ్యారు.
ఇండో-ఈజిప్టు సమాజం Indo-Egyptian Society యొక్క ముఖ్య లక్ష్యం
"భారతీయులు మరియు
ఈజిప్షియన్ల మధ్య సామాజిక సంభందాలను ప్రోత్సహించడం, తద్వారా రెండు
దేశాలు స్వాతంత్రం పొందటానికి రెండు దేశాల
విప్లవ నాయకులు ఒకరితోనొకరు దగ్గిర
సంబంధాలు పెట్టుకోవడం”.
భారతదేశంలో జరుగుతున్న
విప్లవాత్మక కార్యకలాపాలకు మద్దతుగా ముస్తఫా కామిల్ నడుపుతున్న వార్తాపత్రిక “అల్-లివా”
రాయడం ప్రారంభించినది. ఈజిప్టు జాతీయవాదులు తమ అనుచరులను బ్రిటిష్ వారిపై
పోరాడటానికి భారతీయుల నుండి ప్రేరణ పొందాలని కోరారు. మరొక వార్త పత్రిక ‘అల్-హుర్య Al-Hurriya’ ఈజిప్షియన్లను స్వాతంత్ర్యం
పొందటానికి విప్లవ మార్గాలను భారతీయుల నుండి నేర్చుకోవాలని కోరింది.
ఈజిప్టు మరియు భారతీయ
విప్లవకారులు ఐరోపాలో కలసి పనిచేసారు. పి.టి,
ఆచార్య, మసూర్ రిఫాయత్, మొహమ్మద్ ఫరీద్, వీరెంద్రనాథ్ చటోపాద్యాయ, తమ అనుభవాలను తరువాత రాసిన లేఖలలో వివరంగా
పేర్కొన్నారు.
లండన్లోని ఇండో-ఈజిప్టు సొసైటీ సమావేశాలలో కలిసిన ఇద్దరు
యువ విప్లవకారులు మదన్ లాల్ ధింగ్రా మరియు ఇబ్రహీం నాసిఫ్ ఎల్ వార్డాని తమ దేశ
జాతీయ ఉద్యమానికి 'శత్రువులను' హత్య చేసినందుకు గాను ఉరి తీయబడ్డారు.
భారత జాతీయ వాది ధింగ్రా, కర్జన్ వైలీని చంపాడు మరియు జాతీయవాద ఈజిప్టు
ప్రెస్‌లో ఈ చర్యకు ప్రశంసలు అందుకున్నాడు. తొమ్మిది నెలల తరువాత, 1910 లో, వార్డానీ ఈజిప్ట్
ప్రధాన మంత్రి బుట్రస్ ఘాలిని చంపారు. ఈ హత్యకు ఈజిప్టు జాతీయవాదులకు, భారత
జాతీయవాది ధింగ్రా ప్రేరణ అని బ్రిటిష్ ప్రెస్ ఆరోపించింది. వారు వార్డాని -
"ధింగ్రా విద్యార్థి" అని పిలిచారు
ఇండియా హౌస్ India House కు చెందిన కృష్ణవర్మ ఈజిప్టు జాతీయవాది వార్డానీ
యొక్క చర్యను ప్రశంసించాడు.
“సోషియాలజిస్ట్” అనే వార్తాపత్రికలో, కృష్ణవర్మ, వార్డానీ యొక్క ప్రకటన మరియు కవితలను
ప్రచురించాడు.
కొన్ని నెలల తరువాత, 1910 లో, 150 మందికి పైగా
భారతీయ మరియు ఈజిప్టు విప్లవకారులు-మొహమ్మద్ ఫరీద్, ముహమ్మద్ లుట్ఫీ
గోమా, అల్-హహ్లీ, మన్సూర్ రిఫాట్, మరియు ఇతర ఈజిప్టు జాతీయవాదులు. కృష్ణవర్మ, ఎస్.ఆర్. రానా, నిటిసేన్
ద్వార్కాదాస్, మేడమ్ కామా, పి. నౌరోజీ, సి. నౌరోజీ, చటోపాధ్యాయ, గోవింద్ అమిన్, ఆచార్య, అయ్యర్, హర్ దయాల్ మరియు
ఇతర ప్రముఖ భారతీయ జాతీయవాదులు పారిస్‌లో కలుసుకున్నారు..
హార్డయాల్, అల్-అహ్లీ యొక్క
ప్రసంగం రాశారు, ఇది ఈజిప్షియన్లను భారతదేశం లాగా ఈజిప్టును
నాశనం చేయడానికి ఇంగ్లాండ్ ను అనుమతించవద్దని కోరింది.
ఈ పరస్పర చర్యల ఫలితంగా, రెండు దేశాలు దగ్గరయ్యాయి. సోషియాలజిస్ట్, బందే మాతరం, తల్వర్ వంటి
విప్లవాత్మక పత్రికలు అల్-లివా వంటి ఈజిప్టు జాతీయవాద ప్రెస్ నుండి అనువదించబడిన
కథనాలను స్వేచ్ఛగా ప్రచురించారు. ఈజిప్టుకు స్వేచ్ఛను ఎలా గెలుచుకోవాలో తెలిపే ఒక
వ్యాసం కోసం కృష్ణవర్మ "అమరవీరుడు వార్డాని" జ్ఞాపకార్థం నగదు బహుమతిగా 1000 ఫ్రెంచ్ ఫ్రాంక్‌లు French
francs ప్రకటించారు.
విప్లవకారుల పరస్పర అనురాగం
ప్రగాఢమైనది మరియు ముహమ్మద్ లుత్ఫీ గోమా, భారతీయ
పార్సీ మహిళ జాతీయవాది మేడమ్ కామా మరణించిన సంవత్సరం తరువాత కామా జ్ఞాపకార్ధం ఒక
యులోజి eulogy /స్తోత్రాన్ని
రాశారు.
తమ దేశాల స్వాతంత్ర్య
పోరాట సమయంలో, రెండు దేశాలు నిజమైన స్నేహితుల వలె సహకరించాయి.
-ఆవాజ్ ది వాయిస్.ఇన్
సౌజన్యం తో
No comments:
Post a Comment