·
(ప్రవక్తా!) మేము
నిన్ని లోకవాసుల కోసం కారుణ్యంగా చేసి పంపాము. (అల్-అంబియా 21:107)
మానవాళికి దైవిక సందేశాన్ని వ్యాప్తి చేయడానికి ప్రవక్త (స) అనుసరించిన
పద్ధతులను ఈ క్రింది విధంగా వివరించవచ్చు:
1. తన (ముహమ్మద్ PBUH) నుండి ఒక ఉదాహరణ ఇవ్వడం.
2. తన సహచరులను మానవాళికి రోల్ మోడల్స్ గా తీర్చిదిద్దడం.
3. దావా భావనను బోధించడం లేదా ఇస్లాం కోసం పిలుపు.
మొదటి పద్ధతికి సంబంధించి, ప్రవక్త (స) మానవాళికి అద్భుతమైన మానవుని ఉదాహరణగా చూపడం
ద్వారా ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేశారు. ప్రవక్త (స)ఆదర్శ ఉపాధ్యాయుడు,
స్నేహితుడు, భర్త, తండ్రి, తాత, వక్త,
పొరుగువాడు, యజమాని మొదలైనవారు.
ప్రవక్త(స)తన జీవితంలో పోషించిన అన్ని పాత్రలలో, పరిపూర్ణతను ఎలా చేరుకోవాలో మానవత్వానికి ఉదాహరణలను ఇచ్చాడు
మరియు ఇస్లాం సందేశాన్ని ప్రజలలో వ్యాప్తి పొందటానికి ఇది ప్రధాన మార్గం.
జాఫర్ ఇబ్న్ అబీ తాలిబ్‌ను అప్పటి ఇథియోపియా రాజు అల్-నజాషి అడిగినప్పుడు
ముహమ్మద్(స) గురించి, జాఫర్(ర) ఇలా అన్నాడు:
·
“అతను (ముహమ్మద్)
మనల్ని నిజాయితీగా, పవిత్రంగా, మన బంధువులతో
మంచిగా ఉండమని అడిగే వ్యక్తి”.
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం భార్య అయిన ఆయిషాను, ప్రవక్త(స)మర్యాద
గురించి అడిగినప్పుడు, ఆయిషా(ర)ఇలా చెప్పింది:
·
ప్రవక్త(స)మర్యాదలు
దివ్య ఖురాన్. (అహ్మద్)
·
ప్రవక్త(స)భూమిపై
నడిచే దివ్య ఖురాన్. (అహ్మద్)
మరియు, సర్వశక్తిమంతుడైన
అల్లాహ్ తన దూత (స) గురించి ఇలా అన్నాడు:
·
“నిశ్చయంగా నీవు గుణగుణాల
దృష్ట్యా అత్యున్నత స్థానం లో ఉన్నావు”.-(అల్-ఖలామ్ 68:4)
ఇస్లాం వ్యాప్తికి తోడ్పడిన రెండవ అంశం ఏమిటంటే ప్రవక్త(స)సహచరులు తమ గురువు
ముహమ్మద్ (స) ద్వారా విద్యాభ్యాసం చేసిన విధానం. దీనివల్ల వారు రోల్ మోడల్‌లుగా
ఉండగలిగారు. ప్రవక్త(స) మరణించిన తర్వాత తమ ప్రయాణాలలో ప్రవక్త(స)సహచరులు
ప్రదర్శించిన అద్భుతమైన ప్రవర్తన ద్వారా ఇస్లాం ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో
వ్యాపించింది.
కొందరు భావించినట్లుగా, ఇస్లామిక్ రాజ్యం, ప్రజలను ముస్లింలుగా మారమని బలవంతం చేయదు.
ఆసియా మరియు ఆఫ్రికాలోని విస్తారమైన ప్రాంతాలలో ఇస్లాం వ్యాపించిన మార్గం
సహచరులు మరియు వారి విద్యార్థులు మరియు అనుచరులు (అట్-తాబీన్) ప్రజలకు అందించిన
అద్భుతమైన ఉదాహరణ.
తూర్పు ఆసియాలో నేడు అతిపెద్ద ఇస్లామిక్ జనాభా ఇండోనేషియా లో ఇస్లాం వ్యాప్తి అఖ్లాక్ (మంచి మర్యాద మరియు నైతికత) ద్వారా జరిగిది.
ప్రవక్త (స) ఇస్లాం సందేశాన్ని వ్యాప్తి చేసిన మూడవ పద్ధతి దావా (ఇస్లాం కోసం
పిలుపు) అనే భావనను బోధించడం.
·
ప్రవక్త ముహమ్మద్(స)
తన సహచరులకు మరియు ముస్లింలందరికీ, ఒక మంచి పనికి పిలిచే వ్యక్తికి అతని లేదా ఆమె పిలుపులో
అతనిని అనుసరించే వారికి సమానమైన ప్రతిఫలం లభిస్తుందని బోధించారు.-(అల్-బుఖారీ)
ప్రవక్త (స) తన ప్రజలకు ఇలా కూడా సలహా ఇచ్చారు:
·
నా తర్వాత ఒక ఆయత్
సందేశాన్ని అయినా తెలియజేయండి. (అల్-బుఖారీ)
అల్లా, ప్రవక్త(స) యొక్క మార్గాన్ని
ఇలా వర్ణించాడు:
·
“వారికి చెప్పు: "ఇది నా మార్గం:నా దార్శనికత ఆధారంగా
నేను దేవుని వైపునకు పిలుస్తున్నాను. నా వెంట ఉన్న సహచరులు కూడా(అదే చేస్తున్నారు)
దేవుడు పరమ పవిత్రుడు, బహు దైవారాధన చేసే వారితో నా కెట్టి సంబంధం లేదు.” (యూసుఫ్ 12:108)
ప్రాథమికంగా, ఈ మూడు పద్ధతులద్వారా ప్రవక్త(స) ఇస్లాం
సందేశాన్ని వ్యాప్తి చేశారు.
ప్రవక్త ముహమ్మద్ (స) ఉమ్మీ అనగా ఎప్పుడూ చదవడం లేదా వ్రాయడం నేర్చుకోలేదు.
·
“మేము దివ్యవాణి
(వహీ) ద్వారా నీవద్దకు పంపిన ఈ ఖురాన్ మూలంగా నీకు అత్యుత్తమమయిన గాధను
వినిపిస్తున్నాము. లోగడ దీని గురించి నీకు అసలు ఏమి తెలియదు.”-(యూసుఫ్ 12:2)
·
“(ప్రవక్తా!)ఇదేవిధంగా మేము
ఖురాన్ నీ అరబీలో అవతరిoప జేశాము. ఇందులో మేము పలు రకాల హెచ్చరికలు చేసాము.-
తద్వారా జనులు భయభక్తుల వైఖరిని అవలంబిస్తారని లేదా వారి అంతరంగాలావు
ఆలోచనాత్మకమైయిన విషయం నాటాలని!’” (తా-హ 20:113)
·
“ఇది ఒక గ్రంధం. దీని వచనాలు స్పష్టంగా విడమరిచి చెప్పబడ్డాయి.-
అరబీ ఖురాన్ గా! విషయ పరిజ్ఞానం గల జనుల కోసం!’” (ఫుసిలాట్ 41:3)
No comments:
Post a Comment