6 January 2023

ఇస్లాం యొక్క విప్లవాత్మక పాత్ర The Revolutionary Role of Islam

 


అజ్ఞానం ఫలితంగా ప్రకృతి ఆరాధన అని పిలువబడే చెడు సంప్రదాయం మానవ సమాజంలో పుట్టింది. మానవుడు జీవులకు దైవత్వాన్ని ఆపాదించాడు. మానవుడు ప్రపంచంలోని అన్ని వస్తువులను దేవతలుగా భావించి పూజించడం ప్రారంభించాడు. దీనితో విగ్రహారాధన మానవ నాగరికత యొక్క లక్షణంగా మారిపోయింది.

 

వేలాది మంది దైవ ప్రవక్తలు మరియు సంస్కర్తలు కూడా ఈ స్థితిలో ఎటువంటి మార్పును తీసుకురాలేకపోయారు. ప్రవక్తల తిరస్కరణ, తిరస్కారులకు దేవుని శిక్షను తెచ్చిపెట్టింది కాని షిర్క్ (విగ్రహారాధన) నుండి మానవ సమాజం మారలేదు. దీనితో దేవుని  జోక్యం అవసరమైనది. మానవ చరిత్రలో ఈ దైవిక జోక్యం యొక్క ప్రధాన అభివ్యక్తిగా  ప్రవక్త ముహమ్మద్(స) నిలిచారు.  అమెరికన్ ఎన్సైక్లోపీడియా ప్రవక్త ముహమ్మద్(స) రాక "మానవ చరిత్ర గమనాన్ని మార్చింది" అని వివరించింది.

 

ఫ్రెంచ్ చరిత్రకారుడు హెన్రీ పిరెన్నే అభిప్రాయం లో  ఇస్లాం మానవ ప్రపంచాన్ని మార్చింది.  చరిత్ర యొక్క సాంప్రదాయ పద్దతిని మార్చింది.”

 

దైవిక జోక్యం యొక్క లక్ష్యాన్ని నిర్వచించడంలో దివ్య ఖురాన్ ఇలా చెప్పింది:

“అల్లాహ్ యే తన ప్రవక్తకు మార్గదర్సకత్వాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు- దానికి ఇతర మత ధర్మాలన్నిoటి పై ఆధిక్యతను వొసగాలని! సాక్షిగా అల్లాహ్ యే చాలు.”- (48:28)

 

“ఈ ప్రజలను సన్మార్గంలోకి తీసుకురానంత వరకు, దేవుడు నిర్ణయించిన విధంగా అతను ఈ లోకాన్ని విడిచిపెట్టడు”-(ఫతుల్ బారీ 449-8)- సహీహ్ అల్-బుఖారీ

 

పూర్వపు ప్రవక్తలకు కమ్యూనికేషన్ మాత్రమే అవసరమని, ప్రవక్త ముహమ్మద్ (స) కోసం కేవలం కమ్యూనికేషన్ మాత్రమే కాకుండా అమలు కూడా అవసరమని ఇది తెలియజేస్తుంది.

 

పూర్వ ప్రవక్తల పని ప్రజలకు పూర్తి సందేశాన్ని అందించడంతో పూర్తయింది. కానీ ప్రవక్త ముహమ్మద్ (స) ను ప్రపంచానికి పంపడంలో దేవుని ఉద్దేశం ఆచరణాత్మక విప్లవాన్ని తీసుకురావడమే. ప్రవక్త ముహమ్మద్ (స) సందేశం కేవలం సైద్ధాంతిక దశలో ఉండలేకపోయింది.

 

మానవ సామర్థ్యానికి మించిన అంతిమ ఫలితం గా ప్రవక్త సందేశం ఉంది.దేవుడు ప్రవక్త(స)కు అందించిన ప్రత్యేక దైవిక సహాయం వల్ల ఇది సాధ్యమైంది. దైవిక ప్రణాళిక రెండు ప్రాథమిక అంశాలను కలిగి ఉంది. ఒకటి, ప్రవక్త(స)కు శక్తివంతమైన మరియు విశ్వసనీయమైన బృందాన్ని అందించడం మరియు మరొకటి ఏకేశ్వరోపాసన  యొక్క శత్రువులను గణనీయంగా బలహీనపరచడం, తద్వారా ప్రవక్త(స) మరియు అతని సహచరులు తమ ప్రత్యర్థులపై సులభంగా ఆధిపత్యం చెలాయించగలరు.

 

ఈ దైవిక ప్రణాళిక యొక్క మొదటి భాగం రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం అరేబియాలోని జనాభా లేని ఎడారిలో ప్రవక్త ఇబ్రహీం కుమారుడు ఇస్మాయిల్ స్థిరనివాసం లో పూర్తి చేయబడింది. ఆ సమయంలో ఇది నాగరికత కేంద్రాలకు దూరంగా ఉన్న ప్రదేశం. ఎడారి వాతావరణంలో ఇస్మాయిల్ ఇబ్న్ ఇబ్రహీం ఒక సమాజాన్ని అభివృద్ది చేసారు. ఈ సమాజం లోని ఎడారి నివాసుల మానవ లక్షణాలు పూర్తిగా సంరక్షించబడ్డాయి. అది విశాలమైన సహజ శిక్షణా శిబిరంలా ఉంది.

 

ఒక పాశ్చాత్య పండితుడు "నేషన్ ఆఫ్ హీరోస్" అని పిలవబడేంత ఉన్నత స్థాయి దేశాన్ని అభివృద్ధి చేయడానికి రెండు వేల సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పట్టింది. అరబ్బుల చరిత్రలో, ఈ జాతిని ఇస్మాయిల్‌లుగా పిలుస్తారు. మతపరమైన వక్రబుద్ధి ఉన్నప్పటికీ, మానవీయ విలువలలో అరబ్బులు చాలా విశిష్టతను కలిగి ఉన్నారు.

 

బనూ ఇస్మాయిల్(ఖురేషులలో) యొక్క విశిష్ట సభ్యులలో ఒకరైన  ప్రవక్త ముహమ్మద్ (స)మక్కాలో సుమారు పదమూడు సంవత్సరాలు మరియు మదీనాలో పదేళ్లు పోరాడారు. అంతిమంగా, లక్ష మందికి పైగా ప్రజలు ప్రవక్త ముహమ్మద్ (స) ని విశ్వసించారు మరియు వారి  సందేశాన్ని స్వీకరించారు. ప్రవక్త ముహమ్మద్ (స) సహచరులలో ప్రతి ఒక్కరూ బలమైన మరియు విశ్వసనీయమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు.   ప్రవక్త ముహమ్మద్ (స) అసాధారణమైన రీతిలో, ప్రవక్తల సందేశాన్ని ఫలవంతం చేయగల బృందాన్ని ఏర్పరిచారు. ప్రవక్త (స) తన ధార్మిక సందేశాన్ని సైద్ధాంతిక దశ నుండి ఆచరణాత్మక దశకు తీసుకువెళ్లారు.

 

దైవిక ప్రణాళిక యొక్క తదుపరి భాగం ఏకేశ్వరోపాసన వ్యతిరేక శక్తులను బలహీనపరచడం. అంతిమ ప్రవక్త, ముహమ్మద్ (స)  వారిని లొంగదీసుకుని, ధార్మిక విప్లవానికి నాంది పలికారు. అరేబియా లోని గిరిజన తెగలు చాలా కాలం పాటు రక్తపాత, అంతర్గత యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి.

 

ప్రవక్త ముహమ్మద్ (స) ప్రపంచానికి పంపబడినప్పుడు, అరేబియాలోని విగ్రహారాధన చేసే తెగలు, తమను తాము బలహీనపరచుకున్నందున, వారి ప్రతిఘటన ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇది ప్రవక్త ముహమ్మద్ (స) యొక్క  దైవిక కార్యంను సులభం చేసింది మరియు అరేబియాలో తక్కువ వ్యవధిలో విగ్రహారాధనను పూర్తిగా నిర్మూలించడానికి వీలు కల్పించింది.

 

ఆ రోజుల్లో అరేబియా వెలుపల రెండు గొప్ప సామ్రాజ్యాలు ఉండేవి. ఈ సామ్రాజ్యాలు ఆసియా మరియు ఆఫ్రికాలోని ప్రధాన ప్రాంతాలను తమ పూర్తి నియంత్రణలో ఉంచుకున్నాయి. వారి శక్తి చాలా గొప్పది, అరబ్బులు వాటిని అధిగమించాలని కలలో కూడా ఊహించలేరు. ఈ విపరీతమైన వ్యత్యాసం ఉన్నప్పటికీ, మొదటి తరానికి చెందిన అరబ్బులు ఈ రెండు సామ్రాజ్యాలు-సస్సానిద్ మరియు రోమన్లను జయించి ఆ ప్రాంతాలలో ఏకేశ్వరోపాసన యొక్క ఆధిపత్యం ఏర్పరచారు. ఒక ప్రత్యేక దైవిక వ్యూహం కారణంగా ఈ అద్భుతం వాస్తవమైంది:

 

అలీఫ్-లామ్-మీమ్. రోమన్లు ఓడిపోయారు. తమ సమీప భూభాగం లో. వారు ఈ ఓటమి తరువాత అనతి కాలం లోనే విజయం సాధిస్తారు. (ఖురాన్, 30:1-3)

 

602 నుండి 628 A.D వరకు, ఈ రెండు గొప్ప సామ్రాజ్యాల మధ్య చాలా అసాధారణమైన సంఘటనలు జరిగాయని చరిత్ర చూపిస్తుంది.మొదట, ఆయా దేశాల్లోని రాజకుటుంబాలు అంతర్గతంగా ఒకరితో ఒకరు ఘర్షణ పడ్డారు, ఫలితంగా అనేక మంది గొప్ప రాజకీయ వ్యక్తులు మరణించారు.

 

నిజానికి, ఈ వైషమ్యాలు ఈ సామ్రాజ్యాలను  చావుదెబ్బ తీశాయి, వాటి మూలాలను కుదిపేశాయి. తదనంతరం, కొన్ని కారకాలు ఈ సామ్రాజ్యాలు ఒకదానితో ఒకటి విధ్వంసక ఘర్షణకు దారితీశాయి. మొదట సస్సానిడ్ సామ్రాజ్యం యొక్క సైన్యాలు రోమన్ సామ్రాజ్యంపై దాడి చేయడానికి సరిహద్దును దాటాయి. పరిస్థితులు అనుకూలించాయి మరియు వారు విజయం సాధించారు. రోమన్ చక్రవర్తి హెరాక్లియస్ కాన్స్టాంటినోపుల్‌లోని తన ప్యాలెస్ నుండి పారిపోయాడు. అయితే హెరాక్లియస్ తను  కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందాడు మరియు సస్సానిడ్ సామ్రాజ్యంపై దాడి చేసి, వారి సాయుధ దళాలను నాశనం చేసి, జెరూసలేం ఆక్రమించాడు.

 

దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు సాగిన ఈ అంతర్యుద్ధాలు ఈ రెండు సామ్రాజ్యాలను గణనీయంగా బలహీనపరిచాయి. అందువల్ల, కాలిఫేట్ సమయంలో అరబ్ దళాలు రోమన్ మరియు సస్సానిడ్ సామ్రాజ్యాలలోకి ప్రవేశించినప్పుడు, వారు గొప్ప వేగంతో ముందుకు చొచ్చుకు పోయారు.


చారిత్రక విప్లవం:

ఇస్లామిక్ సామ్రాజ్యం యొక్క ఈ విస్తరణ కేవలం రాజకీయ సంఘటన కాదు. వాస్తవానికి, చరిత్రలో విప్లవాత్మక ప్రక్రియను ప్రారంభించడం దీని లక్ష్యం. ఈ ప్రక్రియ మక్కాలోనే ప్రారంభించబడింది. అది మక్కా నుండి మదీనాకు, డమాస్కస్ మరియు బాగ్దాద్‌లకు ప్రయాణించి అక్కడ నుండి స్పెయిన్‌లోకి ప్రవేశించింది. తర్వాత ఇది యూరప్ అంతటా మరియు ప్రపంచం మొత్తం వ్యాపించింది. ఈ ప్రక్రియ యొక్క పరాకాష్టను 20వ శతాబ్దం  చూసింది.

 

ఈ ఉద్యమo లో  రెండు ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఒకటి మతపరమైన హింసకు ముగింపు. (ఈ రకమైన హింసను ఖురాన్‌లో ఫిత్నాగా పేర్కొనడం జరిగింది).-(8:39) ఈ ప్రక్రియ విగ్రహారాధన ముగింపుతో ప్రారంభమైంది మరియు ప్రవక్త(స) జీవితకాలంలో పూర్తయింది.

 

మరొకటి, ధర్మబద్ధమైన కాలిఫేట్ సమయంలో మతపరమైన స్వేచ్ఛ లబించినది.  సస్సానిడ్ మరియు బైజాంటైన్ వంటి గొప్ప సామ్రాజ్యాల విచ్ఛిన్నంతో- -మతపరమైన హింస నిర్మూలించబడినది. మత స్వేచ్ఛ అందరికి లబించినది. ఏ గొప్ప విప్లవమూ అకస్మాత్తుగా కార్యరూపం దాల్చదు, సుదీర్ఘ చారిత్రక ప్రక్రియ ద్వారా మాత్రమే ఫలవంతం అవుతుంది మరియు ఇస్లామిక్ విప్లవం ఈ నియమానికి మినహాయింపు కాదు.

 

వ్యక్తిగత మరియు సామూహిక ప్రయత్నాల ద్వారా ఇస్లాం ప్రారంభించిన మానవ విముక్తి ప్రక్రియ అనేక రూపాల్లో పురోగతి సాధించడానికి చాలా కాలం పాటు కొనసాగింది. రెండవ ఖలీఫా, ఉమర్ ఫరూక్ తన గవర్నర్‌లలో ఒకరిని మరియు అతని కుమారుడిని ఒక సందర్భంలో ఉద్దేశించి ఇలా అన్నాడు: "ప్రజలను వారి తల్లులు స్వాతంత్ర్యంతో జన్మనిచ్చినప్పుడు మీరు వారిని ఎలా  బానిసలుగా చేస్తారు?" (అల్-అబ్కారియత్ అల్-ఇస్లామియా).

 

ఈ స్వరo  పదకొండు వందల సంవత్సరాల తర్వాత సుప్రసిద్ధ ఫ్రెంచ్ సంస్కర్త రూసో యొక్క  “ది సోషల్ కాంట్రాక్ట్”  గ్రంధం,  'మానవుడు  స్వేచ్ఛగా జన్మించాడు, కానీ సర్వత్రా సంకేళ్ళలలో బందీ అయి ఉన్నాడు” అనే ప్రసిద్ధ వాక్యంతో ప్రారంభమైంది. మేధో మరియు మతపరమైన స్వేచ్ఛ భావన 20వ శతాబ్దం చివరి నాటికి పూర్తిగా పరిపక్వం చెందింది. ఐక్యరాజ్యసమితి స్థాపనతో, ప్రపంచంలోని అన్ని దేశాలు ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చార్టర్‌పై సంతకం చేశాయి. మేధో మరియు మతపరమైన స్వేచ్ఛ ప్రతి మానవుని యొక్క తిరుగులేని హక్కు అని మరియు దానిని ఏ కారణంతోనూ రద్దు చేయలేమని ప్రకటించారు.

 

ఎంపిక స్వేచ్ఛ

 

తనకు నచ్చిన మతాన్ని స్వీకరించడానికి మరియు ఆ మతాన్ని ప్రచారం చేయడానికి మానవుడు సంపూర్ణ హక్కును పొందాడు. ప్రపంచంలో వచ్చిన ఈ మార్పు, ఏకేశ్వరోపాసన” మార్గం ను సుగమనం చేసింది.

 

దివ్య ఖురాన్‌లో ఈ విధంగా ప్రస్తావించబడింది: "సదాచరణ చేసేవారెవరో పరీక్షించడానికి ఆయన జీవన్మరణాలను సృష్టించాడు. ఆయన మహా శక్తిశాలి, క్షమాశాలి. మీలో ఎవరు ఉత్తమమైనవారో ప్రయత్నించడానికి మరణాన్ని మరియు జీవితాన్ని సృష్టించాడు." (67:2)

 

ఈ లక్ష్యాన్ని సాధించడానికి, ఈ ప్రపంచంలో స్వేచ్ఛా వాతావరణం నెలకొనడం, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రతి ఒక్కరూ తమ పాత్రను పోషించడం చాలా అవసరం. స్వేచ్ఛ లేకుండా, ఎవరికీ బహుమతి లేదా శిక్ష విధించబడదు. భగవంతుని పథకం ప్రకారం మనిషి సృష్టించబడ్డాడు మరియు ఈ ప్రపంచంలో ఉంచబడ్డాడు. అందుకే శతాబ్దాల నుంచు వస్తున్న  నిరంకుశత్వంపై ఆధారపడిన  పాలనలను కూలదోయవలసి వచ్చింది.

 

ఇటీవలి కాలంలో, 1917 నాటి కమ్యూనిస్ట్ విప్లవం బలవంతపు వ్యవస్థపై ఆధారపడి విస్తారమైన సామ్రాజ్యాన్ని స్థాపించడానికి ప్రయత్నించింది. కానీ ఇది దైవిక ప్రణాళికకు విరుద్ధంగా నడిచినందున, 1991లో సోవియట్ యూనియన్ పతనానికి దారితీసింది. మనిషికి మళ్లీ స్వేచ్ఛ లభించింది.


మూఢ నమ్మకాల శకం ముగింపు:

 

ఇస్లామిక్ విప్లవం ద్వారా వచ్చిన మరో మార్పు ఆధునిక కాలంలో శాస్త్రీయ ప్రాతిపదికన మూఢ ఆలోచనలను తొలగించడం  మరియు వాస్తవాలపై ఆధారపడిన శాస్త్రీయ  ఆలోచనలను  వ్యాప్తి చేయడం.

 

పురాతన కాలంలో విగ్రహారాధన జీవన విధానం మరియు ఆలోచనలు కొనసాగినవి. దీనికి కారణం ప్రకృతి గురించి మానవుల గల అజ్ఞానం. ప్రాచీన మానవుడు సహజ వస్తువులను పవిత్రంగా భావించి పూజించడం ప్రారంభించాడు. మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా, ఈ ప్రాకృతిక వస్తువులు,  సృష్టికర్తలు కాదని, కేవలం జీవులు మాత్రమే అని ప్రజలను ఒప్పించడంలో ఇస్లాం విజయం సాధించింది. ప్రాకృతిక వస్తువులు  మనిషి యొక్క యజమానులు కాదు.

 

ఈ విప్లవం నేపథ్యంలో, విగ్రహారాధన యొక్క సైద్ధాంతిక పునాది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. పవిత్రంగా ఉంచబడిన అన్ని వస్తువులు మనిషి చేత ఉపయోగించబడటానికి సిద్దంగా ఉన్నాయి మరియు మనిషి వాటికి బానిస కాదు. పురాతన కాలంలో సూర్యుడిని దేవుడిగా భావించి పూజించేవారు; నేటి మనిషి సూర్యుడిని సౌరశక్తిగా మారుస్తున్నాడు. ప్రాచీన మానవుడు చంద్రుడిని పవిత్రంగా భావించాడు; ఆధునిక మానవుడు దానిపై తన అడుగు పెట్టాడు. పురాతన మానవుడు నదిని దేవుడన్నాడు; ఆధునిక మానవుడు నదులను ఆవిరి శక్తిగా మార్చాడు.

 

ఈ విధంగా, ప్రాచీన మానవుడు గౌరవప్రదంగా చూసే ప్రాకృతిక విషయాలు ఇప్పుడు పరిశోధనా వస్తువులుగా మారడం మానవ చరిత్రలో మొదటిసారి జరిగింది. మరో మాటలో చెప్పాలంటే, ఇస్లాం శాస్త్రీయ విచారణ ప్రక్రియను ప్రారంభించింది.

 

దివ్య ఖురాన్ మనిషిని విశ్వంలోని వస్తువులను శోదించమని పదేపదే ఆజ్ఞాపిస్తుంది. ఇది సాధారణ విషయం కాదు. విశ్వం లోని వస్తువుల  స్వభావాన్ని గురించి ఆలోచించే చర్య(జ్ఞానం) ఇస్లాంలో ఆరాధన హోదాను పొందింది. ఈ ఆలోచనా ఫలితం చరిత్రలో మొదటిసారిగా, విశ్వంలోని అన్ని విషయాలు పరిశోధనకు లోబడి ఉన్నాయి.

 

ఇస్లాం యొక్క ప్రారంభ కాలంలో ప్రారంభించబడిన శాస్త్రీయ ఆలోచనా విధానం, ఆధునిక యుగo లోని   పాశ్చాత్య ప్రపంచంలో ఒక దేశం నుండి మరొక దేశానికి విస్తరించే ప్రక్రియగా కొనసాగింది. శాస్త్రీయ ఆలోచన ఇస్లాం ద్వారానే సాద్యమైన విప్లవంగా మారింది.

 

శాస్త్రీయ విప్లవం తర్వాత, మానవ చరిత్రలో మొట్టమొదటిసారిగా విగ్రహారాధన దాని సైద్ధాంతిక పునాదిని పూర్తిగా కోల్పోయింది. సహజ వస్తువుల యొక్క పవిత్రత యొక్క భావన ఇప్పుడు ఒక మూఢనమ్మకం. ఎందుకంటే ఆధునిక శాస్త్రీయ పరిశోధన ఈ రకమైన నమ్మకం నిరాధారమైనదని నిరూపించింది.

 

జరిగినదంతా, ఖచ్చితంగా దైవిక ప్రణాళిక ప్రకారం జరిగింది, ప్రవక్త(స) మరియు అతని సహచరులను  ఈ దైవిక పథకాన్ని అమలు చేయమని కోరారు: "పీడన(ఫిత్నా) సమసిపోనంత వరకూ ధర్మం పూర్తిగా దైవానిదే కానoత వరకూ, వారితో పోరాడండి. " (8:39). దేవుని మార్గంలో మనిషి ఎంపిక చేసుకోవడానికి ఇకపై ఎలాంటి అడ్డంకి లేదని దీని అర్థం.

 

ప్రవక్త ముహమ్మద్ (స) మరియు ఆయన సహచరులు తీసుకొచ్చిన విప్లవం యొక్క చివరి లక్ష్యం ఇదే. ఒకరి మతం గురించిన వ్యక్తిగత నిర్ణయాలకు అడ్డుకట్ట వేసే బలవంతపు నిరంకుశ వ్యవస్థ తొలగించబడినది. ఇది సైద్ధాంతిక పరంగా అడ్డంకుల ముసుగును కూడా తొలగించింది. సిద్దాంత  పరమైన  అడ్డంకుల ముసుగు, ప్రజలను గందరగోళానికి గురిచేసింది మరియు వారిని తప్పుదారి పట్టించింది, దీని ఫలితంగా వారు సృష్టికర్తలుగా భావించే జీవులను పూజించడం ప్రారంభించారు. (మరిన్ని వివరాల కోసం రచయిత యొక్క పుస్తకం, ఇస్లాం: ది క్రియేటర్ ఆఫ్ ది మోడర్న్ ఏజ్ చూడండి).

 

దివ్య ఖురాన్ మతం విషయంలో ఎటువంటి బలవంతం లేదని చెబుతుంది, నిజమైన మార్గదర్శకత్వం మరియు అపోహలు పూర్తిగా వేరు చేయబడినవి. (2:256)

 

సూర్యుడు ఉదయించిన తర్వాత వెలుగు మరియు చీకటి వలె సత్యం మరియు అసత్యం ఒకదానికొకటి స్పష్టంగా వేరువేరుగా ఉంటాయి. ఇస్లామిక్ విప్లవం తర్వాత- చీకట్లో తడుముతూ ఎవరూ ఉండలేదు. మరియు దేవుణ్ణి తిరస్కరించినందుకు ఎవరూ ఎటువంటి సాకులు చెప్పలేరు వాస్తవికతను సందేహం లేకుండా గ్రహించవచ్చు.

 

నిజం బట్టబయలైంది:

 

ఈ ప్రత్యేక లక్ష్యం కోసం, దేవుడు మానవ చరిత్రలో పైన పేర్కొన్న విధంగా విప్లవాలను తీసుకువచ్చాడు. ఇప్పుడు సత్యం మరియు అసత్యం స్పష్టంగా ఉన్నాయి. మధ్యలో ఎటువంటి ముసుగు లేదు: స్పష్టీకరణ పని చాలా క్షుణ్ణంగా నిర్వహించబడింది. నేటి మనిషికి ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు భగవంతుని వైపు ప్రయాణంలో మనిషికి ఎలాంటి ఆటంకం కలగదు.

 

ఇస్లామిక్ అభివృద్ధిలో ముస్లిమేతరుల పాత్ర:

 

ఇస్లాం ప్రకృతి యొక్క మతం, మరియు దాని మార్గంలో నడవడం వివక్షత లేనిది, సమాజంలోని ప్రతి విభాగానికి అందులో స్థానం ఉంది మరియు సరళత్వం దాని లక్షణం.

 

ప్రవక్త ముహమ్మద్ (స)ప్రకారం: సర్వశక్తిమంతుడైన దేవుడు ఈ మతాన్ని [ఇస్లాం] ఫజీర్ (నిజమైన ముస్లిం కాని వ్యక్తి) ద్వారా కూడా బలపరుస్తాడు.” (సహీహ్ అల్-బుఖారీ.)

 

ఈ ప్రపంచంలో, సహజ ప్రక్రియ వివిధ అంశాల ప్రమేయంతో ప్రారంభమవుతుంది. మొత్తంగా మానవాళి ఒకదానిపై ఒకటి ఆధారపడిన శరీరం మరియు ఇస్లాం కూడా దీనికి మినహాయింపు కాదు.

 

ఇస్లాం అనేది మానవ అభివృద్ధిని లక్ష్యంగా చేసుకున్న భావజాలం మరియు మానవాళి ప్రమేయం లేకుండా మానవ అభివృద్ధి ప్రక్రియ ముందుకు సాగదు.

 

ఇస్లాం చరిత్రలో అనేక దశలు ఉన్నాయి:


ప్రవక్త ముహమ్మద్ (స) తన మొదటి పదమూడు సంవత్సరాల ప్రవక్తత్వాన్ని మక్కాలో గడిపారు. ఆ సమయంలో మక్కాలో గిరిజన వ్యవస్థ ఉండేది. ఆధునిక కోణంలో వ్యవస్థీకృత రాజ్యం లేదు. ప్రతి ఒక్కరు గిరిజన ముఖ్యుల రక్షణ పొందడం తప్పనిసరి. ప్రవక్త(స) ఇద్దరు స్థానిక గిరిజన పెద్దల రక్షణను పొందారు - అబూ తాలిబ్ మరియు ముతీమ్ బిన్ ఆది, ఇద్దరూ ముస్లిమేతరులు.

మక్కాలో పదమూడు సంవత్సరాలు గడిపిన తరువాత, ప్రవక్త మదీనాకు వలస వెళ్ళారు. ఇది చాల ప్రమాదకరమైన ప్రయాణం. ప్రవక్త(స)ప్రత్యర్థులు ప్రవక్త శిరస్సును తీసుకువచ్చే వారికి వంద ఒంటెల బహుమతిని ప్రకటించారు. అయినప్పటికీ, ప్రవక్త తన ప్రత్యర్థి సమూహంలోని సభ్యుడు “అబ్దుల్లా బిన్ ఉరైకిత్” ని తన  ప్రయాణానికి మార్గదర్శిగా ఎంచుకున్నారు. అబ్దుల్లా బిన్ ఉరైకిత్ తన వృత్తిలో నిజాయితీ గల వ్యక్తిగా ప్రసిద్ధి చెందాడు. అబ్దుల్లా బిన్ ఉరైకిత్ ముస్లిమేతరుడు మరియు మక్కాలో ముస్లిమేతరుగా మరణించాడు.

 

ప్రవక్త(స) యొక్క వలస తరువాత, ప్రవక్త(స) మరియు అతని ప్రత్యర్థుల మధ్య వరుస సాయుధ పోరాటాలు జరిగాయి. ఇస్లామిక్ చరిత్రలో ఘజ్వా అల్-అహ్జాబ్ అని పిలువబడే ప్రవక్త(స) ప్రత్యర్థుల సాయుధ పోరాటo  చాలా వినాశకరమైనది. దివ్య ఖురాన్ కూడా దీనిని ఇస్లామిక్ చరిత్రలో అత్యంత భయానక క్షణాలలో ఒకటిగా పేర్కొంది. ఆ సమయంలో, ముస్లింలు తమ ప్రత్యర్థులపై చాలా నిస్సహాయంగా మారారు. ఈ అత్యంత క్లిష్ట పరిస్థితులను సులభతరం చేసినది ఒక మదీనావాసి  నిర్వహించిన మధ్యవర్తి పాత్ర.

 

మదీనాను శత్రు దళాలు చుట్టుముట్టిన రాత్రి మదీనాకు చెందిన ఒక వ్యక్తి ప్రవక్త(స) వద్దకు వచ్చాడు. అతను ఇలా అన్నాడు, “నేను నా హృదయంలో ముస్లిం అయ్యాను, కానీ అది నేను ఇంకా బహిరంగపరచలేదు. కాబట్టి ముష్రిక్‌లు మరియు యూదులు ఇద్దరూ నాపై నమ్మకం ఉంచారు. ఈ వ్యక్తి మాత్రమే రెండు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పగల పాత్రను పోషించగలడని గ్రహించిన ప్రవక్త(స), "మా ఇరుపక్షాలలో నమ్మకం ఉన్న వ్యక్తి మీరు మాత్రమె” అని అన్నారు.

 

మదీనావాసి రెండు పక్షాల మధ్య చర్చలు జరపడం ప్రారంభించాడు మరియు రెండు పక్షాల మద్య శాంతికి మార్గం సుగమం చేసాడు. మదీనావాసి ప్రయత్నాల కారణంగానే శత్రువులు మదీనా నగరం ముట్టడిని ఎత్తివేసి తమ ఇళ్లకు తిరిగి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

 

ఇస్లామిక్ చరిత్రలో ఇస్లాం అభివృద్ధిలో ముస్లిమేతరులు పోషించిన పాత్రకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇస్లామిక్ అభివృద్ధిలో ముస్లిమేతర ప్రమేయం ఒక వ్యక్తి స్థాయి నుండి మొత్తం సమూహ స్థాయికి కూడా విస్తరించబడింది.

 

పాశ్చాత్య నాగరికత అభివృద్ధి చెందినప్పటికీ, ఇది ఇస్లాంకు అనేక అంశాలలో సహాయపడుతుంది. ఉదాహరణకు పాశ్చాత్య నాగరికత చివరకు మతపరమైన హింసను అంతం చేసింది మరియు మత స్వేచ్ఛ మరియు దావా కోసం తలుపులు తెరిచింది. అదేవిధంగా, పాశ్చాత్య నాగరికత, ఆధునిక కమ్యూనికేషన్ సాధనాలను అభివృద్ధి చేసింది, ఇది ముస్లింలకు ప్రపంచ స్థాయిలో దావా పని చేయడం లో తోడ్పడినది.  అలాగే, పాశ్చాత్య దేశాల్లో జరిగిన ఆధునిక శాస్త్రీయ ఆవిష్కరణలు, ఇస్లాం విశ్వాసాలను శాస్త్రీయ ప్రాతిపదికన నిరూపించడానికి మార్గం సుగమం చేశాయి.

 

మునుపటి కాలంలో, ఇస్లాం యొక్క సత్యాలు ప్రత్యక్ష ఆధారాల ద్వారా రుజువు కావని భావించబడింది. కానీ ఆధునిక శాస్త్రం, ఇస్లాం యొక్క సత్యాలు ప్రత్యక్ష ఆధారాల ద్వారా  రుజువు అవుతాయని అనడం సాధ్యం చేసింది. ఈ పరిణామం ఇస్లామిక్  శాస్త్రీయ సిద్ధాంతాలు, సత్యాన్ని నిరూపిస్తాయని రుజువు చేసాయి.

 

ముస్లిమేతరులు కూడా ఇస్లాం యొక్క అభివృద్దికి అనేక విధాలుగా సహాయకారిగా ఉన్నారు. ఇస్లామిక్ అభివృద్ధి అనేది ఒక సార్వత్రిక ప్రక్రియ, ముస్లిం మరియు ముస్లిమేతర శక్తులన్నీ దానిని నెరవేర్చుటకు దోహదం చేస్తాయి.

 

ఇస్లాం అభివృద్ధిలో ముస్లిమేతరుల  పాత్ర కొనియడతగినది, దీని వలన ముస్లింల హృదయాలు ఇతరుల పట్ల ద్వేషం, శత్రుత్వం మరియు అపనమ్మకం కాకుండా ప్రేమతో నిండిపోయేల మరియు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల పట్ల ముస్లింలకు  సానుభూతిని కలిగేట్టుగా చేస్తుంది.

 

ఇస్లాం మతానికి ముస్లిమేతరుల సహకారం ఇస్లామిక్ చరిత్ర అంతటా కొనసాగింది. ప్రస్తుత కాలంలో ముస్లిమేతరులు చేసిన  రచనలు, ముఖ్యంగా శాస్త్రీయ ఆవిష్కరణల రంగంలో, గతంలో కంటే చాలా ఎక్కువ

 

శాస్త్రీయ ఆవిష్కరణలు అంటే ఏమిటి? నిజానికి అవి ప్రకృతి యొక్క ఆవిష్కరణలు. ప్రకృతి, లేదా దివ్య ఖురాన్ పదాలలో, "ఆకాశాలు మరియు భూమి యొక్క అన్ని విషయాలు" దేవుని సంకేతాలు. దీని ప్రకారం, విశ్వంలోని అన్ని విషయాలు ఇస్లామిక్ బోధనలకు శాస్త్రీయ వాదనగా పనిచేస్తాయి.

 

ప్రకృతి యొక్క ఆవిష్కరణలు నిజానికి దైవిక వాస్తవాల ఆవిష్కరణలు. ఇవి ఇస్లాం బోధనల సత్యానికి సాక్ష్యమిస్తున్నాయి. నేను వ్రాసిన ఇతర పుస్తకాలలో ఈ విషయం గురించి చాలా వివరంగా చెప్పాను. ఇక్కడ నేను నా అభిప్రాయాన్ని వివరించడానికి ఒక ఉదాహరణ మాత్రమే ఇవ్వాలనుకుంటున్నాను.

 

దివ్య ఖురాన్‌లో ఒక ఆయతు ఉంది: అందుకే, ఈ రోజు మేము నీ  పార్ధివ శరీరాన్ని నీ భావితరాల వారికి ఒక సూచనగా భద్రపరుస్తాము-యదార్ధమేమిటంటే జనులలో అనేకులు మా సూచనల పట్ల అలసత్వం ప్రదర్సిస్తారు. (10:92)

 

ఇది ఈజిప్టు పాలకుడు, మోషే ప్రవక్త యొక్క సమకాలీనుడైన ఫారోను సూచిస్తుంది. ఫారో సముద్రపు లోతైన నీటిలో దేవునిచే మునిగిపోయాడు. ఆ సమయంలో దేవుడు ఫారో శరీరాన్ని కాపాడాలని నిర్ణయించాడు, అది భవిష్యత్తు తరాలకు దేవునికి చిహ్నంగా ఉంటుంది.

 

ఏది ఏమైనప్పటికీ, దివ్య ఖురాన్ అవతరించబడిన సమయంలో లేదా వెయ్యి సంవత్సరాల తర్వాత కూడా, ఫారో శరీరానికి సంబంధించి ఎవరికీ ఎటువంటి జ్ఞానం లేదు; అది ముస్లిం ప్రపంచానికి కూడా పూర్తిగా తెలియదు. పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు ఈ సంరక్షించబడిన శరీరం కనుగొనబడలేదు. కాని దివ్య ఖురాన్ యొక్క ఈ ఆయత్ అక్షరాల రుజువైనది. అయితే, ఈ పనిని ముస్లిమేతరులు నిర్వహించారు.

 

ఫ్రెంచ్ పండితుడు, ప్రొఫెసర్ లోరెట్, కింగ్స్ వ్యాలీలోని థెబ్స్‌లో ఫారో యొక్క మమ్మీ మృతదేహాన్ని కనుగొన్నాడు.  అక్కడ నుండి, ఫారో మమ్మీ మృతదేహాo,  కైరోకు రవాణా చేయబడింది. ప్రొఫెసర్ ఇలియట్ స్మిత్. జూలై 8, 1907న దాని చుట్టూ ఉన్న గుడ్డను  తొలగించాడు. ఇలియట్ స్మిత్ తన పుస్తకం, ది రాయల్ మమ్మీస్” (1912)లో ఈ ఆపరేషన్ మరియు శరీర పరీక్ష గురించి వివరంగా వివరించాడు.

 

జూన్ 1975లో, ఫారో మృత దేహాన్ని పరిశీలించేందుకు డాక్టర్ మారిస్ బుకైల్ ను ఈజిప్టు అధికారులు అనుమతించారు. నిపుణుల బృందంతో కలిసి శవపరీక్షలో ఫారో మమ్మీ మృత దేహాo పై  ప్రత్యేక పరిశోధనలు చేశారు. రేడియోగ్రఫీ, కార్బన్-14 డేటింగ్ మరియు ఎండోస్కోపీ వంటి అనేక ఆధునిక పద్ధతుల ద్వారా, మమ్మీ శరీరం యొక్క ఖచ్చితమైన కాలం రుజువు చేయబడినది. పాశ్చాత్య నిపుణుల బృందం అనేక సంవత్సరాల పాటు అధ్యయనం మరియు పరిశోధన తర్వాత, ఈ శరీరం ఖచ్చితంగా మోషే కాలానికి చెందినదని శాస్త్రీయంగా నిరూపించబడింది.

 

ఈ ఫారో మునిగిపోవడం వల్ల లేదా అతను మునిగిపోయిన క్షణం ముందు చాలా హింసాత్మక షాక్‌ల వల్ల మరణించాడని కూడా ఎటువంటి సందేహం లేకుండా నిర్ధారించబడింది.

 

ఫ్రెంచ్ రచయిత, డా. మారిస్ బుకైల్, తన పుస్తకం, ది బైబిల్, ది ఖురాన్ మరియు సైన్స్‌” లోని 'ది ఎక్సోడస్' అనే అధ్యాయాన్ని ఈ ఉత్కంఠభరితమైన పదాలతో ముగించారు:

 

పవిత్ర గ్రంథాల యథార్థత యొక్క రుజువు కోసం ఆధునిక డేటాలో వెతుకుతున్న వారు ఈజిప్షియన్ మ్యూజియం, కైరోలోని రాయల్ మమ్మీల గదిని సందర్శించడం ద్వారా ఫారో యొక్క శరీరంతో సంబంధం ఉన్న దివ్య ఖురాన్ ఆయతుల యొక్క అద్భుతమైన రుజువును  కనుగొంటారు. (p 241)

 

 

 

No comments:

Post a Comment