29 January 2023

'జంహూర్ Jamhoor’ ఉర్దూ పత్రిక, అలీఘర్: ప్రజాస్వామ్య విలువల విజేత Jamhoor, Aligarh: Champion of Democratic Values

 



భారత రాజ్యాంగం 26 జనవరి 1950న రూపొందించబడింది. రాజ్యాంగం యొక్క అమలు భారతదేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి  నాంది పలికింది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున, అంటే 1950 జనవరి 26న అలీఘర్ నుండి ఉర్దూ పత్రిక 'జంహూర్' ప్రారంభించబడింది. ఇది నెలకు మూడు సార్లు  అనగా 6, 16, మరియు 26వ తారీఖులలో ప్రచురించబడుతుంది.

అలీఘర్‌కు చెందిన సుప్రసిద్ధ సాహిత్యవేత్త మరియు ఉర్దూ అభిమాని మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి (1924-2003) 'జంహూర్' పత్రికకు యాజమాని  మరియు సంపాదకీయుడు.  మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి ఉర్దూ సాహిత్య కార్యకలాపాలను మరియు ఉర్దూ విద్యను ప్రోత్సహించడానికి కృషి చేశాడు.


మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి మంచి కవి మరియు “సమర్” అనే మారుపేరును కలిగి ఉన్నాడు.  అంజుమన్ తారకీ ఉర్దూ, అలీఘర్ మరియు జాతీయ కమ్యూనల్ వ్యతిరేక కమిటీ కార్యదర్శి పదవులను మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి నిర్వహించారు.అలీగఢ్ కాంగ్రెస్ కమిటీకి ఉపాధ్యక్షుడిగా కూడా పనిచేశారు.

1957లో, మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి తన సంపాదకీయాల్లో, ప్రభుత్వ వర్గాలలో అవినీతికి వ్యతిరేకంగా తన నిరసనను మరియు ప్రజలకు వ్యతిరేకంగా దాని విధానాలను తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి ప్రశ్నిoచేవారు.  అప్పటి ప్రభుత్వం మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి అభిప్రాయాలను ఆమోదించలేదు మరియు అరెస్టు చేసి జైలుకు పంపారు.

మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి విడుదల కోసం అలీఘర్‌లో నిరసనలు మొదలయ్యాయి. 1958లో జిల్లా కోర్టు, మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి ని గౌరవప్రదంగా నిర్దోషిగా విడుదల చేసింది. విడుదలైన తర్వాత కూడా మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి 'జంహూర్'''ని ఎడిట్‌ చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వ పనితీరును ప్రశ్నించడం, విశ్లేషించడంపైనే ప్రజాస్వామ్య వ్యవస్థ బలం ఆధారపడి ఉంటుందని మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి అభిప్రాయపడ్డారు. మహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి 77 సంవత్సరాల వయస్సులో 16 మార్చి 2003న మరణించాడు.

ప్రతి సంవత్సరం, గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా,  'జంహూర్' ప్రత్యేక సంచిక 'జంహూరియత్ నంబర్'ను ప్రచురించేది, ఇందులో భారత ప్రజాస్వామ్యాన్ని నిశితంగా పరిశీలించి, ప్రభుత్వంలోని అవినీతి మరియు  దేశంలోని వాస్తవ సమస్యలు- రంగం, విద్యా అసమానత, పేదరికం, నిరక్షరాస్యత, మైనారిటీ సమస్యలు మరియు మతపరమైన సమస్యలు మొదలగు వాటిని చర్చించేవారు. ఈ ప్రత్యేక సంఖ్య పదమూడు సంవత్సరాలు అనగా1962లో దాని ప్రచురణ ఆగిపోయే వరకు నిరంతరంగా ప్రచురించబడేవి,

జమ్‌హూర్ భారత ప్రజాస్వామ్యంపై ప్రత్యేక కథనాల పరంపరను ప్రచురించడం ప్రారంభించింది, దీనికి దాదాపు పదేళ్లుగా ఈ ధారావాహిక నిరంతరం ప్రచురితమవుతోంది. డా. మహ్మద్ హషీమ్ కిద్వాయ్, అప్పుడు AMUలో పొలిటికల్ సైన్స్ యొక్క యువ అసిస్టెంట్ ప్రొఫెసర్  తన కథనాలలో గత సంవత్సరంలో భారతదేశానికి సంబంధించిన రాజకీయ కార్యకలాపాలను విశ్లేషించేవారు. భారత ప్రజాస్వామ్యం బలహీనపడటానికి దోహదపడే అంశాలను ఎత్తిచూపేవారు..

1951 'జంహూర్' గణతంత్ర దినోత్సవ ప్రత్యేక సంచిక కవర్ పేజీలో 'భారత స్వాతంత్య్ర వీరులు' శీర్షికన మహాత్మా గాంధీ, మౌలానా అబుల్ కలాం ఆజాద్, పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ఆచార్య కృపలానీ, సర్దార్ పటేల్‌ల ఫోటోలు ప్రచురించబడ్డాయి. అదే సంచికలో డా. పరాస్రామ్, మరియు మహ్మద్ హషీమ్ కిద్వాయ్, వరుసగా "రిపబ్లిక్ ఆఫ్ ఇండియాలో మైనారిటీల స్థానం" మరియు "ప్రజాస్వామ్యంలో  కొన్ని కలతపెట్టే ఆలోచనలు“Position of Minorities in the Republic of India” and “Some Disturbing Thoughts on Democracy " అనే శీర్షికలు వ్రాసారు.

జాతీయ ఐక్యత మరియు సమగ్రతను పెంపొందించడం ద్వారా మరియు పాకిస్తాన్ ప్రచారాన్ని తిప్పికొట్టడం ద్వారా స్వాతంత్య్రానంతర కాలంలో ప్రతి దశలో నిస్సహాయులైన ముస్లింలకు 'జంహూర్' సహాయం చేసింది. 'జంహూర్' లోని సంపాదకీయాలు మరియు కాలమ్‌ల ద్వారా, 'జంహూర్' ముస్లిములను న్యూనతా భావం  నుండి బయటకు తీసి, వారి భవిష్యత్తు భారతదేశంలోనే సురక్షితంగా  ఉందని ఒప్పించే ప్రయత్నం చేసింది. ముస్లిములు భారతదేశంలోనే  పూర్తిగా సురక్షితంగా ఉన్నారు మరియు ఏ విధంగానైనా వారు పాకిస్తాన్ యొక్క దుష్ప్రచారానికి గురికాకూడదు. ఈ ప్రయోజనం కోసం, ఇది ఎప్పటికప్పుడు జాతీయ నాయకుల సందేశాలు, ప్రకటనలు మరియు ప్రసంగాలను 'జంహూర్'ప్రచురిస్తుంది, తద్వారా దేశంలో శాంతి మరియు ప్రశాంత వాతావరణం కొనసాగుతుంది.

జర్నలిజం రంగంలో 'జంహూర్' తనకంటూ ఓ ప్రత్యేకతను, చెరగని ముద్ర వేసింది. దాని సంపాదకీయాలు మరియు కాలమ్‌లు స్వతంత్ర భారతదేశంలో ప్రజల ఆందోళనలు మరియు సమస్యలను హైలైట్ చేశాయి. 'జంహూర్' యొక్క ఈ లక్షణాలు దాని విజయానికి మరియు దాని ప్రజాదరణను పెంచాయి.

స్వాతంత్ర్యం తరువాత  ప్రారంభ సంవత్సరాల్లో, జంహూర్' వార్తాపత్రిక జాతీయ ఐక్యతను పెంపొందించడంలో మరియు శాంతియుత సమాజ స్థాపన లో గణనీయమైన పాత్ర పోషించింది. జమ్‌హూర్ పత్రిక ప్రజల సమస్యలను ప్రభుత్వానికి తెలిపి హిందువులు మరియు ముస్లింలు ఇద్దరూ సహనంతో దేశాభివృద్ధికి అడుగులు వేయాలని ఉద్బోధించినది.

ఎందరో ప్రముఖ పండితులు, డా. హషీమ్ కిద్వాయ్, రియాజుర్ రెహ్మాన్ షేర్వానీ, ముక్తాదా ఖాన్ షేర్వానీ, వసీమ్ అలీగ్, డా. అష్రఫ్, హరూన్ ఖాన్ షేర్వానీ, డా. పరాస్రామ్, జియా అహ్మద్ బదావోనీ, అబ్దుల్ షాహిద్ షెర్వానీ, జహీర్ అహ్మద్ సిద్ధిఖీ, అబూ అంజుమ్ కమర్ సోహౌరి, అజీజ్ అహ్మద్ సిద్ధిఖీ, తదితరులు తమ రచనల ద్వారా జంహూర్' కు ఎనలేని సహకారం అందించారు.

రెఫెరెన్స్/ప్రస్తావనలు:

·       ఫరూఖీ, అసద్ ఫైసల్. అలీఘర్ కే సహఫత్, ఎడ్యుకేషనల్ బుక్ హౌస్, 2016

·       జామ్‌హూర్, అలీఘర్ (1951-1960) MAL లైబ్రరీ, AMUలో భద్రపరచబడింది.

·       ఇదారా-ఇ-ఇల్మ్-ఓ-అదాబ్, సలానా నివేదిక, 1959 (వార్షిక నివేదిక, మొహమ్మద్ ఉమర్ ఖాన్ చత్తర్వి సమర్ సంకలనం)

 

 

No comments:

Post a Comment