29 January 2023

అంటువ్యాధులు మరియు మహమ్మారిల నివారణలో ముస్లిముల సహకారం Contribution of Muslims in the Eradication of Epidemics, Pandemics and Contagion

 



మానవజాతి చరిత్రలో, అంటు వ్యాధులు మరియు  మహమ్మారిలు లక్షలాది ప్రాణాలను బలిగొన్నవి  మరియు జనాభా, రాజకీయాలు మరియు ఆర్థిక వ్యవస్థలపై శాశ్వత ప్రభావాన్ని చూపినవి. ఇస్లామిక్ స్వర్ణ యుగ  నాగరికత, అనేక వందల సంవత్సరాలు(6-14శతాబ్దాలు) ఇస్లామిక్ ప్రాంతాలలో వర్ధిల్లింది మరియు స్పెయిన్ నుండి చైనాలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించింది.

ముస్లిం ప్రపంచంలోని పండితులు, వైద్యులు మరియు సాధారణ పౌరులు మానవజాతి యొక్క అత్యంత పురాతనమైన మరియు వినాశకరమైన కొన్ని వ్యాధులకు వైద్యపరంగా,శాస్త్రీయయపరంగా నివారణలు సూచించారు.   

ఆధునికాలం లో అంటువ్యాధులను అర్థం చేసుకోవడానికి జెర్మ్ సిద్ధాంతాన్ని ఉపయోగిస్తారు. సూక్ష్మజీవులు (జెర్మ్స్) శరీరంపై దాడి చేయడం వల్ల అంటు వ్యాధులు సంభవిస్తాయని జెర్మ్ సిద్ధాంతం పేర్కొంటున్నది. ఒక వ్యక్తి ఎల్లప్పుడూ పరిశుబ్రతా నియమాలను పాటించాలని ఆరోగ్య నియమాలు చేబుతున్నావి.

ఇస్లాo  పరంగా పరిశుబ్రతా నియమాలు:

ఇస్లాంలో, హదీసులు   మార్గదర్శకత్వంలో దివ్య ఖురాన్ తర్వాత రెండవ అత్యంత ముఖ్యమైనవిగా పరిగణించబడుతున్నవి.

ప్రవక్త(స)హదీసు ప్రకారం ఒక దేశంలో ప్లేగు వ్యాధి వ్యాప్తి చెందుతుందని మీరు విన్నట్లయితే, అందులో ప్రవేశించవద్దు; అయితే మీరు ఒక ప్రదేశంలో ఉండగా ప్లేగు వ్యాధి విజృంభిస్తే, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టవద్దు.

నేడు, ఈ మార్గదర్శకత్వంకు  ఆధునిక దిగ్బంధం ( ఐసోలేషన్/క్వారెంటైన్)  చాలా దగ్గిర పోలిక ఉంది. కు చాలా పోలి ఉంటుంది.

ఒక హదీసు ప్రకారం శుభ్రత విశ్వాసంలో సగం

ఈ హదీసు ఇస్లాంలో పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యతను వివరిస్తుంది. ముస్లింలు  రోజుకు 5 సార్లు వజూ చేసి ప్రార్థించడం  చేస్తారు. వజూ ద్వారా ముస్లిములు తమ శరీర భాగాలను శుబ్రపరుచుకొంటారు.

వైద్య విధానాలకు సంబంధించిన అనేక ఇతర హదీత్‌లు: వీటిలో సమతుల్య ఆహారం తీసుకోవడం మరియు త్రాగునీటి వనరులను, టాయిలెట్ వ్యర్థాల నుండి వేరుగా ఉంచడం వంటివి మొదలగునవి.

అంటు వ్యాధుల వ్యాప్తిని నిరోధించడంలో హదీసులు ఎంత ముఖ్యమైనవో దీనిని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు.

మియాస్మా సిద్ధాంతం సాంప్రదాయ గ్రీకు కాలం (5వ-4BCE) నాటిది మరియు హిప్పోక్రేట్స్ చేత అభివృద్ధి చేయబడింది. హిప్పోక్రేట్స్ ను  ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. హిప్పోక్రేట్స్ ప్రకారం శారీరక ద్రవాలు (నలుపు పిత్తం, పసుపు పిత్తం, కఫం మరియు రక్తం black bile, yellow bile, phlegm and blood)) ప్రతి వ్యక్తి యొక్క ప్రత్యేక లక్షణాలు, స్వభావం మరియు ఆరోగ్యం కు కారణమని నమ్మాడు. వీటిమధ్య సమతుల్యత చెదిరిపోతే, అనారోగ్యం లేదా మరణానికి దారితీయవచ్చు. విష/కలుషిత వాయులను పీల్చినప్పుడు, మియాస్మాటా సమతౌల్యానికి భంగం కలిగి వ్యక్తి అనారోగ్యానికి పాలవుతాడని  నమ్ముతారు.

9వ శతాబ్దంలో అనువాద ఉద్యమం కారణంగా, అంటు వ్యాధుల యొక్క మియాస్మా సిద్ధాంతం ముస్లిం నాగరికతలో ప్రబలంగా మారింది. మియాస్మా సిద్ధాంతం అంటువ్యాధులు  విషపూరితమైన మరియు కుళ్ళిన ఆవిర్లు లేదా మియాస్మాటా వల్ల సంభవిస్తాయని  వివరించింది.

ముస్లిం శాస్త్రవేత్తలు గ్రీకు, భారతీయ, పర్షియన్ వైద్య పద్దతులను నేర్చుకొని వాటిని అభివృద్ధి చేశారు. అల్-టబారీ, అల్-రాజీ మరియు ఇబ్న్ సినా వంటి నాటి ముస్లిం ప్రముఖ వైద్యులు  కుష్టు వ్యాధి మరియు ప్లేగు వంటి కొన్ని వ్యాధులను అంటువ్యాధిగా పరిగణించారు. మియాస్మా సిద్ధాంతాన్ని ఉపయోగించి, ఈ వ్యాధులు సూక్ష్మజీవుల బదిలీ కాకుండా కలుషిత గాలి ద్వారా సంక్రమించాయని వారు విశ్వసించారు (ఇది ఈనాడు అంటువ్యాధి గురించి మన అవగాహనను ద్రువపరుస్తుంది.

మధ్య యుగాలలో కుష్టువ్యాధి అత్యంత భయంకరమైన వ్యాధి, మరియు రోగులు తరచుగా సమాజం నుంచి  దూరంగా ఉండేవారు.

అయితే, ముస్లిం ప్రపంచంలో కుష్టురోగులు ఇతరుల నుండి వేరు చేయబడ్డారు, కానీ మానవత్వంతో శ్రద్ధ వహించబడి  చికిత్స పొందారు. ఇస్లామిక్ ప్రపంచంలో మొట్టమొదటి ప్రజా ఆసుపత్రి (బిమరిస్తాన్) ను  707 CEలో ఖలీఫా  వలీద్ ఇబ్న్ అబ్ద్ అల్-మాలిక్ నిర్మించినాడు. బీమరిస్తాన్‌లో  ప్రత్యేక కుష్టు వ్యాధి వార్డులు కలవు. కుష్టు రోగులను సమాజం నుండి  బహిష్కరించబడకుండా ప్రత్యేక వైద్యులచే మెరుగైన చికిత్స అందించబడింది

మధ్యయుగ ఇస్లామిక్ నాగరికతలలోని ఆసుపత్రులను బిమరిస్తాన్‌లుగా పిలిచేవారు. బిమరిస్తాన్లు బహుళ ప్రత్యేక(మల్టీ-స్పెషాలిటి) మానసిక మరియు శారీరక ఆరోగ్య సంరక్షణ సేవలను, అలాగే వైద్య విద్యను అందిస్తాయి. అవి ఆధునిక ఆసుపత్రులకు చాలా పోలి ఉండేవి!

1284నాటి కైరోలోని అల్-మన్సూర్ ఖలావున్ కాంప్లెక్స్‌లోని  ఆసుపత్రి చికిత్స కోసం ఎటువంటి ఖర్చు లేదని ప్రకటించింది:

బ్లాక్ డెత్ అనేది బుబోనిక్ ప్లేగు మహమ్మారి, ఇది 14వ శతాబ్దం మధ్యలో ఆసియా, యూరప్ మరియు ఉత్తర ఆఫ్రికాలను నాశనం చేసింది (తరువాతి దశాబ్దాలలో అనేకసార్లు పునరావృతమయ్యే ప్లేగు వ్యాధి మరణాల రేటు దాదాపు 30-60% వరకు ఉంటుంది.

అండలూసియన్ వైద్యుడు మరియు పండితుడు ఇబ్న్ ఖతిమా అల్-అన్సారీ (1299-1369) ప్లేగు వ్యాధి (బ్లాక్ డెత్) వ్యాప్తి చెందినప్పుడు అంటువ్యాధిని గమనిస్తూ మరియు వివరాలను రికార్డ్ చేస్తూ రోగులకు చికిత్స చేశాడు

అల్-అన్సారీ తన పరిశీలనలన్నింటిని “తషిల్ ఘరాడ్ అల్-ఖాషిద్ఫీ తఫ్షిల్ అల్-మరాద్ అల్-వాఫీద్” పేరుతో ఒక పుస్తకంలో డాక్యుమెంట్ చేశాడు. అల్-అన్సారీ మియాస్మా సిద్ధాంతాన్ని అనుసరించాడు, తీవ్రమైన అనారోగ్యంతో మరియు మరణిస్తున్న రోగుల నుండి విడుదలయ్యే కుళ్ళిన ఆవిరి ద్వారా ప్లేగు వ్యాపిస్తుందని నమ్మాడు.

 అల్-అన్షారీ,  అల్-లఖ్మీ (బి. 1327) వంటి మధ్యయుగ ముస్లిం వైద్యులు ప్లేగు వ్యాధి వ్యాప్తిని నిరోధించడంపై అనేక ప్రజారోగ్య మార్గదర్శకాలను రచించారు.

 మశూచి అనేది ఒక పురాతన వ్యాధి, ఇది సోకిన ముగ్గురిలో మందిలో ఒకరు మరిణించాచారు. మశూచి అత్యంత ప్రమాదకరమైన  అంటువ్యాధి, మశూచి జ్వరం, వాంతులు మరియు పొక్కులు చర్మం 'స్ఫోటములు' (పాక్స్)లక్షణాలు కలిగి ఉంటుంది.  ఈ వ్యాధి 1979లో వ్యాక్సినేషన్ ద్వారా ప్రపంచం నుండి నిర్మూలించబడినది.

ప్రఖ్యాత ముస్లిం వైద్యుడు అబూ బకర్ ముహమ్మద్ ఇబ్న్ జకారియా అల్-రాజీ (మ. 925) (లేదా లాటిన్‌లో రేజెస్) “కితాబ్ ఫి అల్-జదరీ వా-ల్-హసబా” (మశూచి మరియు మీజిల్స్ పై ఒక ట్రీటీస్) అనే గ్రంధం రచించినాడు.

మశూచి మరియు తట్టు మధ్య నిర్దిష్ట వ్యత్యాసాలను వివరించిన మొదటి వ్యక్తి అల్-రాజీ; దీనికి ముందు, రెండు వ్యాధులను ఒకేలా పరిగణించేవారు. “కితాబ్ ఫి అల్-జదరీ వా-ల్-హసబా” పుస్తకం మశూచి యొక్క ప్రసారం, చికిత్స, నిర్వహణ మరియు రోగ నిరూపణ గురించి అన్వేషించింది.

“కితాబ్ ఫి అల్-జదరీ వా-ల్-హసబా” గ్రంథం చాలా ముఖ్యమైనది. ఇది అనేక భాషలలో పునర్ముద్రించబడింది. అల్-రాజీ గ్రంధం ఇబ్న్-సీనావంటి ప్రముఖ  ఇస్లామిక్ స్వర్ణయుగం యొక్క వైద్యులను ప్రభావితం చేసింది.

అల్-రాజీ యొక్క పరిశీలనలలో ఒకటి మశూచి నుండి బయటపడిన వారు మళ్లీ వ్యాధితో బాధపడలేదు: ఇది టీకాకు పునాది.

మశూచి వ్యాక్సిన్ కనుగొనబడక ముందు, ప్రాణాంతక వ్యాధి నుండి రక్షించడానికి వేరియోలేషన్ అని పిలువబడే ఒక అభ్యాసం ఉపయోగించబడింది.వేరియోలేషన్ అనేది తేలికపాటి లక్షణాలు ఉన్న  రోగి నుండి కొద్ది మొత్తంలో చీము pus తీసుకోవడం మరియు రోగనిరోధక శక్తిని పొందిన వ్యక్తి యొక్క అవయవాలపై చిన్న గీతలు small scratches ద్వారా లోనికి పంపడం. ఇది సాధారణంగా వ్యాధి యొక్క తేలికపాటి రూపానికి దారి తీస్తుంది మరియు కోలుకున్న తర్వాత, రోగి రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడు.

వేరియోలేషన్ చాలా పాత సంప్రదాయం. 1549లో చైనాలో వేరియోలేషన్ గురించి మొట్టమొదటి స్పష్టమైన సూచన చేయబడింది. తర్వాత ఇది ఆఫ్రికా, ఆసియా, పర్షియా మరియు టర్కీ అంతటా ఉపయోగించబడింది.

1716లో, లేడీ మేరీ మోంటాగు,  తన భర్త ఇస్తాంబుల్‌లో బ్రిటిష్ రాయబారిగా నియమించినప్పుడు అతనితో పాటు వెళ్లింది. ఇక్కడ లేడీ మేరీ మోంటాగు వేరియోలేషన్ యొక్క అభ్యాసాన్ని గమనించింది మరియు తన పిల్లలిద్దరికీ టీకాలు వేసింది. టీకా ప్రక్రియ తరువాత ఇంగ్లాండ్‌లో ఆమోదించబడింది

1796లో, వేరియోలేషన్ అభ్యాసం ఆధారంగా, ఆంగ్ల వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ కౌపాక్స్ వ్యాధి సోకిన పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు వేసాడు..

 

No comments:

Post a Comment