వృక్షశాస్త్ర పరిశోధనలో ఫాతిమా చేసిన కృషికి గుర్తింపుగా నాసా ఒక
గ్రహశకలానికి asteroid సౌదీ శాస్త్రవేత్త ఫాతిమా బింట్ అబ్దెల్ మోనీమ్ అల్ షేక్
పేరు పెట్టింది. గ్రహశకలమును అల్ షేక్ 33535 అని పిలుస్తారు.
2016లో ఇంటెల్ ఇంటర్నేషనల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫెయిర్ (ఇంటెల్ ISEF)లో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన ఫాతిమా $1,500 బహుమతి గెల్చుకోన్నది మరియు NASA గుర్తింపు పొందింది. ఇంటెల్ ISEFని “సొసైటీ ఫర్ సైన్స్ & ది పబ్లిక్” ప్రతి సంవత్సరం పోటీ నిర్వహిస్తుంద. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ ప్రీ-కాలేజ్ సైన్స్ పోటీ. దీనిలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 1,800 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొంటారు.
సౌదీ అరేబియాలోని విద్యా
మంత్రిత్వ శాఖ, కింగ్ అబ్దుల్ అజీజ్ ఫౌండేషన్ ఫర్ గిఫ్టెడ్‌నెస్ & క్రియేటివిటీ ద్వారా నిర్వహించబడే వార్షిక ఈవెంట్ “నేషనల్
ఒలింపియాడ్ ఫర్ సైంటిఫిక్ క్రియేటివిటీ” ను గెలుచుకున్న తర్వాత అల్-షేక్ ISEFకి ఆహ్వానించబడ్డారు.
ఫాతిమా బింట్ అబ్దెల్
మోనీమ్ అల్ షేక్ 19 ఏళ్ళ వయసులో, అనేక జాతీయ మరియు
అంతర్జాతీయ అవార్డులు పొందింది మరియు ఒక గ్రహ
శకలం/ఆస్త్రరాయిడ్ కు ఫాతిమా పేరు పెట్టబడింది. ఫాతిమా బ్రౌన్ యూనివర్సిటీలో తన చదువును
కొనసాగించాలని యోచిస్తోంది.
నాసా ఒక యువ శాస్త్రవేత్త
పేరు మీద గ్రహశకలం పేరు పెట్టడం ఇదే మొదటిసారి కాదు. 2016లో, ఇద్దరు
విద్యార్థులు సాధించిన విజయాలకు గుర్తింపుగా వారు NASA చే గౌరవించబడ్డారు.
2013లో ఇంటెల్ ISEFలో రెండవ స్థానం పొంది గణితశాస్త్రంలో చేసిన
పరిశోధనకు గాను జోర్డానియన్ విద్యార్థి సలాహల్దీన్ ఇబ్రహీం అబు-అల్షేక్ పేరు మీద NASA ఒక చిన్న
గ్రహానికి minor planet అబు-అల్షైక్ 28831అని పేరు
పెట్టింది.
సౌదీ విద్యార్థి అబ్దుల్
జబ్బార్ అబ్దుల్‌రజాక్ అల్హమూద్ 2015లో ప్లాంట్ సైన్స్ లో ఇంటెల్ ISEFలో మొదటి
స్థానాన్ని గెలుచుకున్న తర్వాత 31926 గ్రహశకలానికి సౌదీ విద్యార్ధి అల్‌హమూద్ పేరు నాసా
పెట్టింది.
యాస్మిన్ యెహియా మౌస్తఫా
తన ఎర్త్ అండ్ ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ ప్రాజెక్ట్ కోసం 2015 యొక్క ఇంటెల్ ISEF లో మొదటి స్థానం పొందినప్పుడు యాస్మిన్ పేరు ఒక గ్రహశకలంకు
పెట్టడానికి NASA ఎంపిక చేసింది.
పోటీదారులందరూ ఇరవై సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
గ్రహశకలాలకు నాసా మీ పేరుపెట్టాలని,
మీరు ఆసక్తిగా ఉన్నారా? ఇంటెల్ ISEF అవార్డులో
పోటీపడి గెలవడమే అందుకు వేగవంతమైన మార్గo.
No comments:
Post a Comment