"ఒకరు (ముస్తఫా కెమాల్
అతాతుర్క్) ఒక హీరో, మరొకరు (మహాత్మా
గాంధీ) ఒక ప్రవక్త (నబీ)" అని ప్రముఖ ఈజిప్షియన్ జర్నలిస్ట్ అబ్బాస్ మహమూద్
అల్-అక్కాద్ 1923లో ప్రచురించబడిన అబ్తాల్ అల్-వతానియా
(నేషనలిస్ట్ హీరోస్)లో రాశారు. ఈ పుస్తకంలో ఈజిప్టులో గౌరవించబడే ఐదుగురు జాతీయవాద
వీరులు ఉన్నారు మరియు వారిలో మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ ఒకరు.
కోల్‌గేట్ యూనివర్శిటీలో
చరిత్రను బోధించే నూర్-ఐమాన్ ఖాన్, "ఈజిప్టు జాతీయవాద
ఉద్యమానికి భారతదేశానికి మద్య ఉన్న సంబంధం సార్వభౌమాధికారం విషయంలో మినహా అన్ని
అంశాలలో ఈ వివరణకు (బెనెడిక్ట్ ఆండర్సన్ యొక్క దేశం యొక్క నిర్వచనం) సరిపోతుందని
నమ్ముతాను” అని అన్నారు.
భారతదేశం మరియు
ఈజిప్టులోని ప్రసిద్ధ చరిత్రకారులు, బ్రిటీష్ వలసవాదం నుండి విముక్తి కోసం పోరాడుతున్న
రెండు దేశాల జాతీయవాదుల మధ్య గల సంబంధాలను విస్మరించారు. నా మునుపటి వ్యాసలో, మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ముస్తఫా కమిల్
పాషా మరియు మహ్మద్ ఫరీద్ నేతృత్వంలోని ఈజిప్షియన్లతో సావర్కర్ మరియు శ్యామ్‌జీ
కృష్ణవర్మ నేతృత్వంలోని ఇండియా హౌస్ ఎలా సహకరించిందో వివరించాను.
మొదటి ప్రపంచ యుద్ధం
తర్వాత, ఈజిప్టు జాతీయవాదులు కాంగ్రెస్‌తో కలిసి
పనిచేస్తున్న భారతీయ జాతీయవాదులతో సన్నిహిత సంబంధాలను పెంచుకున్నారు. వి.డి.
సావర్కర్, భికాజీ కామా, ఛటోపాధ్యాయ
మొదలైన వారు ఈ రెండు దేశాలను దగ్గర చేయడంలో కీలకపాత్ర పోషించారు. తరువాత, లాలా హర్దయాల్ మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో రెండు
దేశాలను దగ్గర చేసే కృషి నిర్వహించారు.
ప్రపంచ యుద్ధానంతర
ప్రపంచంలో మారిన భౌగోళిక-రాజకీయ పరిస్థితులలో గాంధీ అత్యంత ఉన్నత భారతీయ రాజకీయ
నాయకులలో ఒకరిగా ఎదిగారు. ప్రొఫెసర్ నూర్-ఐమాన్ ఇలా వ్రాశాడు, "ఈజిప్టు జాతీయవాదులను గాంధీ కంటే ఎక్కువ ఏభారతీయుడు
ఉత్తేజపరచలేదు". ఈజిప్టు జాతీయవాద వార్తాపత్రికలు గాంధీజీ ని “అల్-రూహ్
అల్-అజీమ్:” అని సూచించాయి. ఇది మహాత్మా అనే
అరబిక్ పదం.
1929 మరియు 1931లో ఈజిప్టులోని ఒక జాతీయవాద సంస్థ వాఫ్డ్ పార్టీ, గాంధీజీ యొక్క శాంతియుత పద్ధతులలో బహిష్కరణ మరియు నిష్క్రియాత్మక ప్రతిఘటనకు పిలుపునిచ్చింది. అల్-బలాగ్ అల్-ఉస్బుయి వంటి వార్తాపత్రికలు గాంధీ యొక్క పద్ధతులు శక్తివంతమైన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎలా భయభ్రాంతులకు గురి చేశాయో వివరిస్తూ అనేక కథనాలను ప్రచురించాయి.
1931 సెప్టెంబరు 7న లండన్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి
హాజరయ్యేందుకు వెళుతున్న సమయంలో సూయజ్ కెనాల్ గుండా వెళుతున్నప్పుడు మహాత్మా గాంధీ
పోర్ట్ సెడ్‌లో కొన్ని గంటలపాటు బస చేశారు. గాంధీ ప్రయాణిస్తున్న ఓడ రాజ్‌పుతానాపై
బ్రిటిష్ వారు తీవ్ర నిఘా ఉంచారు, ఎందుకంటే గాంధీ
సాధారణ ప్రజలను కలుసుకునే అవకాశాన్ని చూసి బ్రిటిష్ వారు భయపడ్డారు. ఓడ కొన్ని
గంటలపాటు ఆగినప్పటికీ ఈజిప్టులో కలకలం సృష్టించింది.
ఆ సమయంలో వాఫ్ద్ పార్టీ
అధ్యక్షుడిగా ఉన్న మోస్తఫా నహాస్ లండన్ నుండి తిరిగి రాగానే ఈజిప్ట్
సందర్శించాల్సిందిగా గాంధీజీ కి ఆహ్వానం పంపారు. చాలా మంది జర్నలిస్టులు గాంధీని
కలుసుకుని, ఆయనను కీర్తిస్తూ రచనలు చేశారు. అల్-అహ్రమ్‌కు
చెందిన మహ్మద్ అబుల్-ఫాత్ తన జీవితంలో మరపురాని గంటను గాంధీతో గడిపానని, ప్రతి ఈజిప్షియన్‌కు ఈ అవకాశం దక్కాలని
ఆకాంక్షించారు. అబ్బాస్ అల్-అక్కాద్ మరియు అనేక మంది గాంధీని “సన్యాసిSaint” అని
పేర్కొన్నారు.
గాంధీ లండన్ నుండి తిరిగి
వచ్చినప్పుడు, ఈజిప్టులోని బ్రిటిష్ అధికారులు ఆందోళన
చెందారు. గాంధీ పర్యటన ఏదైనా అంతర్గత రాజకీయ గందరగోళాన్ని సృష్టిస్తే చర్య
తీసుకుంటామని హైకమిషనర్ గాంధీజీని బెదిరించారు. గాంధీ ఓడ నుండి బయటకు వెళ్లకూడదని
నిర్ణయించుకున్నాడు మరియు అనేక మంది ఈజిప్టు నాయకులు అతనిని ఓడరేవులో కలుసుకొని ఓడలో ఒక రాత్రి గడిపారు.
1930లలో ఫాతీ రద్వాన్ చేత “మిస్ర్ అల్-ఫతా” (యంగ్ ఈజిప్ట్) స్థాపించబడింది. ఈజిప్టు రాజకీయాల్లో రద్వాన్‌కు ముఖ్యమైన స్థానం ఉంది. 1934లో ఫాతీ రద్వాన్ గాంధీజీ పై ఒక పుస్తకం రాశారు.
గాంధీ ఈజిప్టులో కీర్తి
పొందారు. జరుపుకున్నారు. గాంధీ తూర్పు నాగరికతకు చిహ్నంగా భావించబడ్డారు. ఈజిప్టు
జాతీయవాదులకు దేశమే ప్రధానం, మతం కాదు.
ఈజిప్టు నేషనలిస్ట్
పార్టీ అయిన వాఫ్ద్ అవిభక్త భారత దేశంను సమర్ధించినది. 1939లో ముస్లిం లీగ్
ప్రత్యేక ముస్లిం భూమి డిమాండ్ ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, నేతాజీ సుభాష్ చంద్రబోస్
అధ్యక్షతన జరిగిన త్రిపుర కాంగ్రెస్ సమావేశానికి వాఫ్ద్ ఒక ప్రతినిధి బృందాన్ని
పంపారు. ప్రతినిధి బృందంలో మహమూద్ అల్-బస్యుని (సెనేట్ అధ్యక్షుడు), అహ్మద్ హంజా, అహ్మద్ ఖాసిం గౌడ
మరియు మహమూద్ అబుల్-ఫాత్ ఉన్నారు. ముస్లిం లీగ్ మొదట్లో వాఫ్ద్ ప్రతినిధి బృందంను ఆహ్వానించినది అయితే ఆహ్వానం ను వాఫ్ద్ తిరస్కరించినప్పుడు జిన్నా బహిరంగంగా వాఫ్ద్ ప్రతినిధి బృందంను విమర్శించినాడు.
అహ్మద్ ఖాసిం గౌడ్ “అన్ని రైల్వే స్టేషన్‌లలో 'ముస్లింలకు నీరు' మరియు దాని పక్కన
'హిందువులకు నీరు' అని ఉన్న కుండలను
చూసారు. ముస్లింలు మరియు హిందువుల మధ్య వివక్షతను ప్రోత్సహించడంలో బ్రిటిష్ వారు ముందజలో
ఉన్నారు అని భావించారు.
మతోన్మాద శక్తులకు ఎలాంటి
సహాయం చేయకుండా వాఫ్ద్ ప్రతినిధి బృందం చాలా జాగ్రత్తగా ఉంది. "ఫ్రాంటియర్
గాంధీ" యొక్క రెడ్‌షర్ట్‌లు వాఫ్ద్ ప్రతినిధి బృందంను అభినందించడానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. సందర్శించే ఈజిప్షియన్ వాఫ్ద్ ప్రతినిధి బృందం అందుకున్న
అనేక ఆహ్వానాలలో ముస్లిం లీగ్ రిసెప్షన్‌కు హాజరవ్వడం కూడా ఒకటి. ఈజిప్షియన్లు
ఆహ్వానం గురించి చర్చించారు మరియు ఇది మతపరమైన కారణానికి మద్దతుగా భావించబడుతుందని
వారు భయపడి రిసెప్షన్‌కు రాలేమని తమ విచారం వ్యక్తం చేసారు.
ఇండియా హౌస్‌తో
సన్నిహితంగా పనిచేసిన మరో జాతీయవాద జర్నలిస్ట్ ముహమ్మద్ లుత్ఫీ గోమా, విభజన మతపరమైన ముస్లిం రాజకీయ నాయకులను
విమర్శిస్తూ ఇలా వ్రాశారు, “భారతీయ ముస్లింలు
స్వేచ్ఛ కోసం ఉదాత్తమైన శాంతియుత పోరాటానికి దూరంగా ఉన్నారు. భారతదేశం కేవలం
హిందువుల కోసం మాత్రమే కాదు, ఇది అందరి దేశం.
మౌలానా ఆజాద్ మత భావాలకు తావివ్వని భారతీయులకు నిజమైన నాయకుడని కొనియాడారు.
గోమా, భారతీయ ముస్లింలను “తూర్పు పునరుజ్జీవనం అనేది ముస్లిం ప్రజల పునరుజ్జీవనo
లేదా అరబ్ దేశాల పునరుజ్జీవనo లేదా
హిందువుల పునరుజ్జీవనానికి పరిమితమైనది కాదు, ఇది సాధారణమైన మానవ
పునర్జన్మ అని హెచ్చరించినాడు. దీనిని
సావర్కర్ లేదా క్రిష్ణవర్మ రాసారని నూర్-అమిన్ పేర్కొన్నాడు,
భారతీయ మరియు ఈజిప్షియన్ జాతీయవాదులు కనీసం 1906 నుండి, సన్నిహితంగా
పనిచేశారు. అజీముల్లా ఖాన్ 1857లో ఈజిప్ట్‌తో
పరిచయాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాడని ప్రస్తావనలు ఉన్నాయి, కాని అవి ధృవీకరించబడని వార్తలు. వాటి గురించి
మనకు పెద్దగా తెలియదు. ఈ సంబంధాల ఆధారం అణచివేయబడిన జాతీయతలు మరియు తూర్పు
నాగరికత. ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా ఉమ్మడి జాతీయ పోరాటం ఆధారంగా ఈజిప్టు
జాతీయవాదులు (ముస్లిం లీగ్, వారి సహ-మతవాదుల
డిమాండ్‌లకు వ్యతిరేకంగా) భారతీయ జాతీయవాదులతో పాటు నిలిచారు.
-ఆవాజ్ ది వాయిస్.ఇన్ సౌజన్యం
తో
తెలుగు సేత :ముహమ్మద్
అజ్గర్ అలీ.
No comments:
Post a Comment