ఆధ్యాత్మికత అంటే ఏమిటి?
భౌతికేతర వాస్తవాలపై
మనస్సు ను కేంద్రీకరింఛి ఒక ఉన్నత సమతలానికి మానవ స్థితిని పెంచడంను ఆధ్యాత్మికత లేదా దివ్య ఖురాన్ లో రబ్బానియత్ అంటారు. ఆధ్యాత్మికతకు
వ్యతిరేకత భౌతికవాదం. వర్తమాన ప్రపంచంలో
చాలా తరచుగా అనుసరించబడేది భౌతికవాదం.
భౌతికవాదంను అనుసరించే
వ్యక్తి తన దృష్టిని లౌకిక విషయాలపైనే కేంద్రీకరించబడి భౌతికవాదిగా పరిగణించబడతాడు. దీనికి విరుద్ధంగా, భౌతికేతర
విషయాలపై ఆసక్తిని కలిగి ఉన్న వ్యక్తిని ఆధ్యాత్మిక లేదా దైవభక్తి కలిగిన వ్యక్తిగా
పరిగణిస్తారు.
దైవభక్తి కలిగిన వ్యక్తి,
ప్రజలను "మీరు దైవ సేవకులవoడి అనoటాడు.” (3:79) లేదా, "ఓ ప్రజలారా, అల్లాహ్ యొక్క
సేవకులుగా ఉండండి." అనoటాడు.
భౌతికవాదం అంటే ఏమిటో
అర్థం చేసుకోవడానికి, మీరు ఒక రాజభవన
గృహాన్ని చూసినట్లు లేదా వీధిలో ఒక ఆకర్షణీయమైన కారు నడుపుతున్నట్లు ఊహించుకోండి!
మీ ఆధీనంలో అలాంటి వాటిని కలిగి ఉండాలనే ఒక బలమైన కోరిక మీలో ఉంటె, అది భౌతికవాదం.
అది మీ జీవితంలో ప్రధాన ప్రేరేపిత కారకం
అనటానికి స్పష్టమైన సూచన. అదే విషయాలను చూస్తాడు,
కానీ వాటిని పొందాలనే కోరిక లేనివాడు ఆధ్యాత్మిక వాది.
భౌతిక ప్రపంచంలో ఎటువంటి
ఆకర్షణను చూడని వాడు ఆధ్యాత్మిక వాది. జీవితంలోని వాస్తవాలలో నిమగ్నo అయినవాడు బౌతిక
వాది. ఆధ్యాత్మిక వాది ఆత్మ, ఆధ్యాత్మికత
యొక్క చాలా లోతైన స్థాయిలో ఉంటుంది.
ప్రాపంచిక సుఖాల కోసం
జీవించేవారు భౌతిక వస్తువులతో తప్ప సంతృప్తి పొందలేరని నమ్ముతారు. కానీ ఈ ఆలోచన
పూర్తిగా నిజం కాదు. ప్రాపంచిక ఆనందం వారు అనుభవించిన వారు, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందినట్లయితే, వారు ఖచ్చితంగా
భౌతిక ఆనందాన్ని మరచిపోయేవారు. భౌతిక వస్తువుల నుండి పొందే ఆనందం ప్రకృతిలో పరిమితo
మరియు స్వల్పకాలికం. అయితే ఆధ్యాత్మిక ఆనందo శాశ్వతం.
రుచికరమైన ఆహారాన్ని
తినడం వల్ల మనకు ఖచ్చితంగా ఆనందo కలుగు తుంది మరియు ఆధునిక కారులో ప్రయాణించడం కూడా
ఆనందదాయకంగా ఉంటుంది. కానీ వాస్తవికత లోతైన అవగాహన నుండి వచ్చే ఆనందం అంటే. కార్లు, విమానాలు మరియు
మనిషి సౌకర్యాల కోసం సృష్టించబడినవి అని తెలుసుకొన్నప్పుడు
అద్వితీయమైన దేవుని శక్తి పట్ల కలిగే భయం చాలా గొప్పది.
భౌతికవాది తానూ నిజంగా
అనుభవించే దానిలో మాత్రమే ఆనందాన్ని పొందగలడు. కానీ ఆధ్యాత్మిక వ్యక్తి, మరొకరి ఆధీనంలో
ఉన్న వస్తువులను చూసినప్పుడు కూడా అతని హృదయంలో దేవుని పట్ల కృతజ్ఞత
వెల్లివిరుస్తుంది. మరొకరి భౌతిక ఆనందం అతనికి ఆధ్యాత్మిక ఆనందంగా మారుతుంది.
భౌతికంగా ఆలోచించే
వ్యక్తి కేవలం జీవిని మాత్రమే చూస్తాడు, అయితే ఆధ్యాత్మికంగా ఇష్టపడే వ్యక్తి
సృష్టికర్త యొక్క వైభవాన్ని, జీవి ద్వారా చూస్తాడు. సృష్టికర్త ఆవిష్కరణ నుండి పొందే
ఆధ్యాత్మిక సంపద కేవలం సృష్టి యొక్క వస్తువులను కనుగొనటం ద్వారా పొందలేము అనేది స్పష్టం.
ఆధ్యాత్మిక ప్రపంచంలో
సౌలభ్యం మరియు లేమి మధ్య పెద్ద తేడా లేదు.
భౌతిక ఆనందం యొక్క అనుభవాల నుండి వ్యక్తి పొందేది చాలా తక్కువ విలువను కలిగి
ఉంటుంది. బాధ యొక్క కన్నీళ్లు, ఆనందం యొక్క నవ్వు కంటే చాలా ఎక్కువ సంతృప్తిని
ఇస్తాయి. భగవంతుని స్మరణలోనే ఆనందానికి మూలం ఉంది.
“విశ్వసించిన వారి హృదయాలు దైవస్మరణ వాళ్ళ కుదుట
పడతాయి. వినండి! దైవస్మరణ వల్ల హృదయాలకు నెమ్మది ప్రాప్తిస్తుంది.” అని దివ్య ఖురాన్-(13:28) పేర్కొంటుంది.
ఇక్కడ సౌలభ్యం అంటే కేవలం
దైనందిన సౌలభ్యంలో లభించే తాత్కాలిక ఓదార్పు మాత్రమే కాదు, సర్వశక్తిమంతుడైన
భగవంతుని నుండి మాత్రమే వచ్చేది నిజమైన ఓదార్పు. సహజంగా మానవుడు ఆదర్శ జీవి.
నిజమైన మరియు శాశ్వతమైన సౌలభ్యం పరిపూర్ణత ద్వారా మాత్రమే సాధించబడుతుంది.
భౌతికవాదo మరియు పశుత్వo
ఒకేలా ఉంటాయి. భౌతికవాది, నిస్సారత యొక్క
ఒక రూపం. ఆధ్యాత్మికత వాది, ఆనందం తో కూడిన నిజమైన మనిషి. భౌతికవాదంలో నవ్వు యొక్క
ఆనందం ఉంటే, ఆధ్యాత్మికతలో
నొప్పి యొక్క ఆనందం ఉంటుంది. భౌతికవాదం పరిమితుల తో జీవితాన్ని గడపటం అయితే ఆధ్యాత్మికత
అపరిమితంగా జీవించడం లాంటిది.
విశ్వం—దైవ స్ఫూర్తికి
మూలం:
విశ్వం ను, దేవుడు మనిషికి ఆధ్యాత్మిక ప్రేరణగా
రూపొందించాడు. దివ్య ఖురాన్ ప్రకారం, ‘తవస్సు’ యొక్క నాణ్యత- (నిశ్చయంగా ఇందులో విషయాన్నీ పరికిoచే వారికి పలు
సూచనలున్నాయి-(15:75)) విశ్వంలో పొందేలా
ఒక వ్యక్తిని ప్రేరేపిస్తుంది. తవస్సు అంటే ఏమిటి? ప్రకృతి లోని సంకేతాలను అర్థం చేసుకోగల
సామర్థ్యం. అనగా విశ్వంలోని దృగ్విషయాలను గమనించి వాటి నుండి పాఠాలు నేర్చుకోవడం
మరియు భౌతిక సంఘటనల నుండి ఆధ్యాత్మిక పోషణను పొందడం.
తవస్సు అనేది ఒక కోణంలో, ఆవు శరీరంలోకి
ప్రవేశించే గడ్డి సహజ ప్రక్రియ ద్వారా పాలుగా రూపాంతరం చెందడం వంటిది. అదేవిధంగా, నిజమైన దార్మికవాది, భౌతిక సంఘటనలను ఆధ్యాత్మిక
పాఠాలుగా మార్చగలడు. దార్మికవాది, భౌతిక వస్తువుల నుండి ఆధ్యాత్మిక పోషణను
సంగ్రహిస్తాడు.
దివ్య ఖురాన్‌లో
వివరించబడిన తెలివైన వ్యక్తుల ప్రత్యేక లక్షణం ఏమిటంటే, వారు తమ పరిసరాలనుండి
నుండి నిరంతరం అటువంటి జీవనోపాధిని పొందుతారు, తద్వారా తమ మేధో మరియు ఆధ్యాత్మిక శ్రేయస్సును
కాపాడుకుంటారు.
“వారు నిల్చొని ఉన్నా, కూర్చొని ఉన్నా,
పడుకొన్నా-దైవాన్ని స్మరిస్తూ ఉంటారు. భూమ్యాకాశాల సృష్టిపై ఆలోచిస్తూ ఉంటారు.
వారు (అప్రయత్నంగా) ఇలా అంటారు: మా ప్రభూ!నీవు ఇదంతా లక్ష్యరహితoగా సృష్టించ లేదు.
నీవు పరమ పవిత్రుడవు. మమ్మల్లి నరకాగ్ని
శిక్ష నుండి కాపాడు.”-దివ్యఖురాన్ (3:191)
ఒక వ్యక్తిగత అనుభవం:
అది గురువారం ఉదయం, 17 జూన్ 1999. నేను ఇంగ్లండ్‌లోని
మాంచెస్టర్‌లో అరబ్ సోదరుడు అలరేఫ్ అహ్మద్ ఇంట్లో ఉన్నాను. నేను పై అంతస్తులో నా
గదిలో కూర్చొని ఉండగా, నాకు తలుపు
తట్టిన శబ్దం వినబడింది. తెరిచి చూసేసరికి ఓ ఐదేళ్ల బాలిక కనిపించింది. ఆమె ఖనిత, సోదరుడు అలరేఫ్
యొక్క మొదటి కుమార్తె. ఆమె అమాయకత్వం మరియు సౌమ్యతతో, “మీకు ఏదైనా
అవసరమా?” అని అడిగింది.
(తురిడు హాజ).
బహుశా ఖనిత తల్లి, ఖనిత
ను పంపి ఉండవచ్చు! ఇది ఒక సాధారణ ప్రశ్న, కాని ఆ అమాయక స్వరానికి నేను చాలా మురిసిపోయాను. నా నోటి నుండి సమాధానం
రాలేదు. ఇది ఒక సాధారణ సంఘటన, కానీ నా మనస్సులో, ఇది ఒక అసాధారణ
సంఘటనగా రూపాంతరం చెందింది. పిల్లలు దేవుని పువ్వులు మరియు చిన్న దేవదూతల
వంటివారు. నా అవసరాలను కనుగొని తీర్చడానికి దేవుడే నాకు ఒక దేవదూతను పంపినట్లు
నేను భావించాను.
ఆ సమయంలో, ఒక హదీసు గుర్తుకు వచ్చింది:
“మీ ప్రభువు ప్రతిరోజూ ఈ భూప్రపంచానికి దిగి, తన సేవకులను
చూస్తూ, 'అవసరం ఉన్నవారు
ఎవరైనా ఉన్నారా మరియు నేను అతనికి ఏమైనా ఇవ్వాలని కోరుతున్నారా?' ” (సహీ ముస్లిం, హదీస్సు నం. 758).
‘నీకేమైనా అవసరమా?’ అని ఒక అమాయకమైన ఆత్మలోంచి వచ్చిన చిన్న ప్రశ్న, నా అంతరంగంలో
పెను విప్లవం తెచ్చింది. ఆధునిక పండితులు దీనిని 'మస్తిష్క విప్లవం ‘brainstorming ' అని పిలుస్తారు.
కాసేపటికి నా మనసు లో విశ్వం
మొత్తం చూడగలననే ఫీలింగ్ కలిగింది. ఇది మానవ పదాలలో వ్యక్తీకరించలేని గొప్ప
ఆధ్యాత్మిక అనుభవం. ప్రారంభంలో, దేవుడు ఒక చిన్న దేవదూత ద్వారా, “ఓ నా సేవకుడా, నీకు ఏదైనా
అవసరమా?” అని అంటున్నట్లు
అనిపించింది. అప్పుడు, ఈ విషయం స్వర్గం
మరియు భూమితో కూడిన మొత్తం విశ్వానికి విస్తరించింది.
నిజానికి, నా గది తలుపు వద్ద ఉన్నది ఒక చిన్న అమ్మాయి
మాత్రమే, కానీ "మీకు ఏదైనా అవసరమా?" అని మొత్తం విశ్వం,
ఒకే ప్రశ్న అడుగుతున్నట్లుగా ఉంది.
విశాలమైన స్వర్గం ఇలా
చెబుతోంది, “మీకు ఆశ్రయం
అవసరమా? నేను
అందించాలనుకుంటున్నాను, ఎందుకంటే దేవుడు
నన్ను అలా చేయమని ఆదేశించాడు. మెరుస్తున్న సూర్యుడు అంటున్నాడు, “నీకు వెలుతురు
కావాలా? దానిని సరఫరా
చేయడానికి మరియు చీకటిని వెలుగుగా మార్చడానికి నేను ఉన్నాను. గంభీరమైన పర్వతాలు
ఇలా అంటున్నాయి , “మీరు మొత్తం
మానవాళిలో అత్యున్నత స్థాయిలో ఉండాలనుకుంటున్నారా? ఆ ఉన్నత స్థానానికి చేరుకోవడానికి నేను మీ
సేవలో ఉన్నాను.”
నదీ గర్భాలలో ప్రవహించే
నీరు అంటున్నది “నీ ఆత్మను శుద్ధి
చేసుకోవడానికి ఆధ్యాత్మిక స్నానం చేయాలనుకుంటున్నావా? నీటిని మీకు
అందించడానికి నేను ఇక్కడ ఉన్నాను. ” మరియు గాలి అడుగుతోంది, “మీరు దేవుని
అద్భుత సంకేతాలను చూడటానికి విశ్వంలో పర్యటించాలనుకుంటున్నారా? అటువంటి దివ్య
ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీ కోసం ఇక్కడ ఉన్నాను.” చెట్లు
గుసగుసలాడుతున్నాయి, “మీకు మా అంతటి
ప్రకాశవంతమైన వ్యక్తిత్వం కావాలని ఉందా? మీ కోరికను నిజం చేయడానికి మేము ఇక్కడ ఉన్నాము.
” చెట్ల కొమ్మలపై ఉన్న పండ్లు మరియు పొలం లోని పంటలు, "మీ మేధో మరియు
ఆధ్యాత్మిక జీవితానికి పోషణను కోరుకుంటే, మేము దానిని మీకు అందించడానికి ఇక్కడ
ఉన్నాము" అని ప్రకటిస్తున్నాయి.
ఇంతలో పక్షుల
కిలకిలారావాలు విన్నాను,
“ఓ దేవుని సేవకుడా! మీ కోసం ఇక్కడ శుభవార్త ఉంది: మీకు ఒక అవసరం ఉంటే, మీ అవసరాలను
తీర్చడానికి దేవుడు మొత్తం విశ్వాన్ని సృష్టించాడు. దేవుడు చాలా ఉదారుడు, అతను పగలు మరియు
రాత్రి మీ సేవలో ఉండటానికి విశ్వం మొత్తాన్ని సృష్టించాడు. దీనితో పాటు, మీరు దేవునికి
కృతజ్ఞత చూపిస్తే, అతను మీకు
వీటన్నింటి కంటే గొప్పదాన్ని - శాశ్వతమైన స్వర్గం ఇస్తాడు దీనిలో భయం లేదా మనోవేదన
ఉండదు" (6:48).
అప్పుడు, ఈ క్రింది ఖురాన్
వాక్యం గుర్తుకు వచ్చింది: "ఇంకా మీరు అడిగిన ప్రతిదీ అయన మీకు ప్రసాదించాడు. "
(14.34). అంటే మనిషి ఈ
భూమి మీద మంచి జీవితం గడపడానికి ఏది అవసరమో అది దైవం ముందుగానే ప్రత్యక్షంగానో
లేదా పరోక్షంగానో సిద్ధం చేసాడు. ఉదాహరణకు, గుర్రాలు నేరుగా సృష్టించబడ్డాయి; అయితే విమానాలు
పరోక్షంగా అందించబడ్డాయి. గాలి ద్వారా వాయిస్ ప్రయాణించడం ప్రత్యక్ష ఏర్పాటుకు ఒక
ఉదాహరణ, అయితే
ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా దాని ప్రసారం పరోక్ష సదుపాయం యొక్క ఒక రూపం.
“ఆయనే అశ్వాలను, కంచర గాడిదలను, గాడిదలను సృష్టించాడు-మీరు
వాటిపై స్వారీ చేస్తారని, అవి మీకు శోభను కూడా ఇస్తాయి. ఇంకా, మీకు తెలియని ఎన్నో
వస్తువులను ఆయన సృజిస్తున్నాడు.” దివ్య ఖురాన్-(16:8).
సర్వశక్తిమంతుడైన దేవుడు
ఇలా అంటున్నాడు, “ఓ
విశ్వసించినవారలారా! మేము మీకు అందించిన మంచి వస్తువులను తినండి. మరియు మీరు
అల్లాహ్‌ను ఆరాధిస్తే ఆయనకు కృతజ్ఞులుగా ఉండండి” (2:172). దీనర్థం, సర్వశక్తిమంతుడైన దేవుడు ఊహించదగిన మరియు
ఊహించలేని గొప్ప మరియు చిన్న, ప్రతిదాన్ని అత్యంత ఖచ్చితమైన రూపంలో సృష్టించాడు;., అతను మనిషికి
ఇవన్నీ ఉచితంగా ఇచ్చాడు. ఈ అంతులేని ఆశీర్వాదాలకు చెల్లించాల్సిన ఏకైక మూల్యం కృతజ్ఞత; దేవుడు ఇచ్చేవాడు
మరియు మనిషి స్వీకరించేవాడు అని మనిషి తన హృదయ లోతు నుండి గుర్తు ఉంచుకోవాలి.
దివ్య ఖురాన్ దేవుని
లబ్ధిదారులకు ఉదాహరణగా సబాలోని ప్రజలను పేర్కొంది.’ సభా వారికీ వారి స్వస్థలం లోనే ఒక సూచనా ఉండేది. వారి కుడి
వైపునా, ఏడ వైపునా రెండు తోటలు! “మీ ప్రభవు ప్రసాదించిన జీవనోపాధి నుండి తినండి.
ఆయనకు కృతజ్ఞలై ఉండండి(అని వారి తో
అన్నాము.పట్టణమేమో పచ్చతోరణం లాంటిది!ప్రభువేమో క్షమాసాగరుడు! : (34:15). దీనర్థం, మనిషి కృతజ్ఞత
చెల్లించినట్లయితే, అతను ఈ ఆశీర్వాదాలను పొందేందుకు అనుమతించబడడమే కాకుండా, శాశ్వతమైన
స్వర్గంతో బహుమతి పొందుతాడు. ఇది ప్రస్తుత అసంపూర్ణ ప్రపంచానికి దేవుని పరిపూర్ణ
సంస్కరణ.
సర్వశక్తిమంతుడైన దేవుడు
మనిషికి ఈ భూమిపై మంచి జీవితాన్ని గడపటానికి అవసరమైన భౌతిక వస్తువులన్నింటినీ ప్రసాదించాడు.
ఈ విషయాలన్నీ నిశ్శబ్దంగా క్రింది సందేశాన్ని అందజేస్తున్నాయి “ఓ మనిషి! వీటన్నింటి
కంటే గొప్పదాని మీరు వెతుకుతున్నారా? భౌతిక శాంతితో
పాటు మీకు ఆధ్యాత్మిక శాంతి కావాలా? ఈ అసంపూర్ణ ప్రపంచం తర్వాత మీకు పరిపూర్ణ
ప్రపంచం కావాలా? ఈ అశాశ్వతమైన
లోకంలో భగవంతుని ఆశీర్వాదాలను రుచి చూసిన తర్వాత అనంతలోకంలో వాటిని రుచి
చూడాలనుకుంటున్నారా? ఈ క్షణికావేశంలో
పరీక్షగా పొందిన తర్వాత, ఈ సుఖాలన్నీ
రాబోవు లోకంలో ఆశీర్వాదంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ప్రస్తుత
ప్రపంచంలో మీ సామర్థ్యాల పరిమితిని అనుభవించిన తర్వాత మీరు మీ పూర్తి
సామర్థ్యాన్ని గ్రహించాలనుకుంటున్నారా?"
దేవుడు మనిషికి శాశ్వతమైన
నివాసంగా పరిపూర్ణమైన మరియు సంపూర్ణమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ శాశ్వతమైన
ప్రపంచంలో నివసించడానికి ఎవరు అర్హులో తెలుసుకోవాలనుకున్నాడు. అందుకోసం ఒక అసంపూర్ణ
నివాసాన్ని సృష్టించాడు. కాబట్టి ఈ జీవితం ఒక పరీక్ష మాత్రమే. మనిషి నిరంతరం తన
ప్రభువు పరిశీలనలో ఉంటాడు. ప్రతి ఉచ్ఛారణ మరియు కదలికతో, మనిషి తన
శాశ్వతమైన విధిని తానే వ్రాస్తాడు. తన మరణానికి ముందు కాలంలో, మంచి ప్రవర్తన
ద్వారా వ్యక్తి, తన మరణానంతర
కాలంలో, శాశ్వతమైన
ప్రపంచంలో ప్రవేశానికి బహుమతి పొందుతాడు.
ఇతరులు, నరకం లోనికి శాశ్వతo గా విసిరివేయబడతారు. కాబట్టి, వారు రెండు
ప్రపంచాలను, ప్రస్తుత
అసంపూర్ణ ప్రపంచాన్ని అలాగే తదుపరి, పరిపూర్ణమైన మరియు శాశ్వతమైన ప్రపంచాన్ని
కోల్పోతారు.
దేవుడు తనను తాను రెండు
పుస్తకాలలో-దివ్య ఖురాన్ మరియు విశ్వంలో వెల్లడించాడు. దివ్య ఖురాన్ అనేది దేవుని వాక్యం
యొక్క అక్షర రూపం.విశ్వం లేదా ప్రకృతి దాని యొక్క ఆచరణాత్మక ప్రదర్శన. దైవ మార్గం లో జీవితాన్ని
గడపాలని కోరుకునే మనిషికి ఈ రెండు ఆధ్యాత్మిక ప్రేరణ యొక్క ప్రాథమిక మూలాలు.
దైవిక ప్రేరణ యొక్క ఈ
ద్వంద్వ మూలం దివ్య ఖురాన్‌లో ప్రస్తావించబడింది: “అల్లాహ్ యే ఆకాశాలను మీకు కనిపించే స్తంభాలు లేకుండా అంతేసి
ఎత్తున నిలిపి ఉంచినవాడు. తరువాత అయన తన అధికార పీఠాన్నిఅలంకరించాడు. ఆయనే
సూర్యచంద్రులను శాసన నిబద్దత కలిగి ఉండేలా
చేసాడు.- ప్రతిదీ ఒక్కో నిర్ధారిత వేళ ప్రకారం నడుస్తుంది. దేవుడే సమస్త
వ్యవహారములను నిర్వహిస్తున్నాడు. ఆయన తన సూచనలను స్పష్టంగా విడమరచి చెబుతున్నాడు.
మీరు మీ ప్రభువును కలుసుకోవటం పై దృడ నమ్మకం కలిగి ఉండాలని.” (13:2). కాబట్టి, ఖురాన్ ఒక
మార్గదర్శక పుస్తకం లాంటిది. ఇది మనస్సును సిద్ధం చేస్తుంది, తద్వారా ఒకరు
విశ్వాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటారు మరియు భగవంతుడు కోరుకున్నట్లు దానిలో జీవించవచ్చు.
మోమిన్/mu’min (నిజమైన
విశ్వాసి) ఖచ్చితంగా అలాంటి సిద్ధమైన మనస్సును కలిగి ఉంటాడు. విశ్వం పూర్తిగా
పొందికగా పనిచేయడాన్ని చూసినప్పుడు, విశ్వాసి ఇలా అంటాడు: “ఒకే దేవుడు తప్ప
మరే దేవుడు లేడు!” మరియు విశ్వాసి దానిని
పరిశీలించినప్పుడు, దాని విశాలతలో చాలా
క్లిష్టమైన సంఘటనలు ఉన్నాయని కనుగొంటాడు. విశ్వంలోని ప్రతి భాగం అత్యంత
ఊహించదగినదని విశ్వాసి కనుగొన్నాడు. దీంతో తను ఊహించదగిన పాత్రను నిర్వహించాలని దేవుడు
సూచించినట్లుగా విశ్వాసి గ్రహించాడు.
విశ్వంలోని వివిధ భాగాలు
సంపూర్ణ సామరస్యంతో పనిచేస్తాయని విశ్వాసి గమనించినప్పుడు, తను కూడా అదే విధంగా సమాజంలోని
ప్రతిఒక్కరితో ద్వేషం లేదా విద్వేషం
లేకుండా పూర్తి సామరస్యంతో జీవించాలని గ్రహించాడు. విశ్వంలోని సంఘటనలకు అర్థవంతమైన
ముగింపు ఉన్నప్పుడు మనిషి జీవితానికి కూడా
అర్థవంతమైన ముగింపు ఉంటుందని విశ్వాసి గ్రహిస్తాడు. కాబట్టి విశ్వాసి ఇలా
కోరుకొంటాడు: “ మా ప్రభూ! నీవు ఇదంతా లక్ష్య రహితంగా సృష్టించ
లేదు. నీవు పరమ పవిత్రుడవు.మమల్లి నరకాగ్ని శిక్ష నుండికాపాడు.” (3:191).
విశ్వం సర్వశక్తిమంతుడైన
భగవంతుని గుణాల యొక్క అభివ్యక్తి. భూమిపై దైవిక జీవితాన్ని గడపాలనుకునే వారి
ఆధ్యాత్మిక పోషణకు మూలం. వారికి, మొత్తం విశ్వం ఆధ్యాత్మిక పరిపూర్ణతను చేరుకోవడానికి గొప్ప
సాధనంగా మారుతుంది. ఈ ఆధ్యాత్మిక అభివృద్ధి ప్రక్రియ యొక్క అంతిమ ఫలితంగా, దివ్య ఖురాన్ 'రబ్బానీ ఆత్మ' అని పిలిచే అత్యున్నత
ఆధ్యాత్మికత స్థాయిని వారు పొందుతారు. అలాంటి వారు పరలోకంలో అత్యంత దయగల వారని
చెప్పబడతారు.“స్వర్గం లో ప్రవేశించండి. ఇక మీకు భయం ఉండదు. దుఃఖమూ ఉండదు.ప్రభువు: "
(7:49)
ఇస్లాంలో ఆధ్యాత్మికత ఒక
విశ్వాసి సృష్టికర్త మరియు అతని సృష్టి గురించి ఆలోచిస్తున్నప్పుడు జరిగే మేధో
వికాసం యొక్క ప్రత్యక్ష ఫలితం. ఆధ్యాత్మిక ప్రక్రియలో విశ్వాసి ఏదైనా పొందుతాడు. ఇస్లామిక్
ఆధ్యాత్మికత యొక్క మూలం పరిశీలన మరియు ప్రతిబింబం.
దివ్య ఖురాన్ సన్యాసాన్ని
తిరస్కరించింది, దానిని బిదత్
(ఆవిష్కరణ) అని సూచిస్తుంది. (57:27)
దివ్య ఖురాన్ నుండి మనం విశ్వం
యొక్క సృష్టిలో, దేవుని సంకేతాలు
మన చుట్టూ దాగి ఉన్నాయి అని తెలుసుకొంటాము. చురుకైన అవగాహన ఉన్న వ్యక్తి,
జీవులలోని సృష్టికర్తను చూడడానికి వస్తాడు. అంతిమంగా, విశ్వం
ఆధ్యాత్మిక ప్రేరణ యొక్క శాశ్వత మూలం అవుతుంది. విశ్వ పరిశీలన విశ్వాసి లో దాగిఉన్న
దైవిక లక్షణాలను మేల్కొల్పుతుంది.
విశ్వం యొక్క ఈ పరిశీలన
మరియు ధ్యానం యొక్క ఫలితం అతని సాధారణ జీవితానికి దూరంగా ఉండటానికి దారితీయదు. విశ్వాసి
ప్రపంచం కు దూరం కాక, అందులో నివసిస్తున్నాడు, దాని అన్ని కార్యకలాపాలలో పాల్గొంటాడు. ప్రాపంచిక ప్రపంచం లో తన కర్తవ్యాలు, బాధ్యతలు అన్నీ నిర్వర్తించినా విశ్వాసి హృదయం
మాత్రం ప్రాపంచిక వ్యవహారాలకు అంటిపెట్టుకోలేదు.
విశ్వాసి ప్రపంచంలో
నివసిస్తున్నట్లు కనిపిస్తాడు, కానీ దాని నుండి వేరుగా ఉంటాడు. విశ్వాసి అద్భుతమైన
ఆధ్యాత్మిక లాభాలను పొందుతాడు.
అటువంటి వ్యక్తుల గురించి
ప్రవక్త ముహమ్మద్(స) ఇలా చెప్పారు:"ప్రపంచం పట్ల విముఖత చూపేవారి హృదయంలో దేవుడు
జ్ఞానాన్ని నాటాడు."
ఆధ్యాత్మికతలో మనిషికి
జీవితం ఉంది: ఇది నిజంగా మనిషికి నిజమైన జీవితం
మూలం: మౌలానా
వహిద్దిద్దిన్ ఖాన్
తెలుగు సేత: ముహమ్మద్
అజ్గర్ అలీ.
No comments:
Post a Comment