13 January 2023

ఇస్లాంలో ఆరోగ్య సంరక్షణ

 



దివ్య ఖురాన్‌లో, అల్లాహ్ మనం

·       "భూమిపై ధర్మసమ్మతమయిన, పరిశుద్దమయిన వస్తువులను తినండి” అని అన్నాడు.-(2:168).

దివ్య ఖురాన్ ను మరింత  శోధిస్తే, మనం ఏ ఆహారాలు మనకు ప్రయోజనకరమో గుర్తించగలము: వీటిలో తేనె (16: 68-69), మొక్కజొన్న, మూలికలు, (55:12, 80:27-32) కూరగాయలు మరియు ఆలివ్‌లు, ఖర్జూరాలు, ద్రాక్షలు, దానిమ్మపండ్లు (6: 99,141) మరియు అరటిపండ్లు ( 56: 28-33) కలవు.

మనం కొన్ని జంతువుల మాంసం మరియు వాటి పాలు, అలాగే తాజా చేపలు మరియు పక్షులను కూడా తినమని అల్లాహ్ సిఫార్సు చేశాడు.

   "ఆయనే  పశువులను కూడా  సృష్టించాడు, వాటిలో మీకు దుస్తులూ ఉన్నాయి. వాటిలో కొన్నింటిని మీరు తింటారు కూడా"-(16:5, 22:28).

·       నిశ్చయంగా మీ కొరకు పశువుల్లోను గుణపాఠo ఉంది. మేము వాటికడుపులలోని పెదకు-రక్స్తానికి మద్య నుండి మీకు స్వచ్చమైన పాలు త్రాపిస్తున్నాము. త్రాగేవారికి అది ఎంతో కమ్మనిది. " (16:66).

·       "మీరు అందులో  నుండి తీసిన తాజా (చేప) మాంసం తినటానికి, సముద్రాన్ని సృష్టించినవాడు ఆయనే" (16:14, 35:12).

·       "వారికి ఇష్టమైన పిట్టల మాంసం సమర్పించబడుతుంది. " (56:21).

అయితే, అటువంటి ఆహారాలన్నీ మితంగా తినాలని గమనించడం చాలా అవసరం:

·       తినండి, త్రాగండి కాని మితిమీరకండి. నిశ్చయంగా మితిమీరే వారిని దేవుడు ఇష్టపడడు.” (7:31).

ఉపవాసం అనేది ఇస్లాం (2:183)లో అవసరమైన మరియు సూచించబడిన ఆహార అభ్యాసం మరియు ఇది భౌతిక ప్రయోజనాలను కలిగి ఉంది.ముఖ్యంగా అధిక బరువు ఉన్నవారికి. ఉపవాసం ఒక నెల పూర్తి చేసిన వారిలో బరువు తగ్గడం, రక్తంలో చక్కెర తగ్గడం మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అదనంగా స్వీయ-నియంత్రణ, స్వీయ-నిగ్రహం మరియు క్రమశిక్షణ ద్వారా ఊబకాయం మరియు హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచే ఆహార పదార్థాల వినియోగాన్ని నివారించవచ్చు. అదనంగా, ఈ స్వీయ-నియంత్రణ మరియు సంకల్పం అనేది మన జీవితంలోని ఇతర కోణాలను బలోపేతం చేయడానికి మరియు ఆధ్యాత్మికంగా ముందుకు సాగడానికి  శక్తినిస్తాయి.

ఒక హదీసులో  ప్రవక్త(స) అతిగా తినకుండా సలహా ఇచ్చారు:

·       "అతిగా తినడంలో మునిగిపోకండి ఎందుకంటే అది మీ హృదయాలలో విశ్వాసం యొక్క కాంతిని చల్లారుస్తుంది."

మరొక ప్రసిద్ద హదీసు

·       కడుపులో మూడింట ఒక వంతు ఆహారంతో, మూడింట ఒక వంతు నీటితో నింపాలని మరియు మూడింట ఒక వంతు ఖాళీగా ఉంచాలని” సిఫార్సు చేస్తోంది.

అహ్లుల్-బైట్ Ahlul-Bait లో చెప్పిన ఆహారపు అలవాట్లలో  ప్రవక్త(స) మరియు అలీ ఇబ్న్ అబూ తాలిబ్ శుద్ధి చేసిన పిండి నుండి రొట్టె తినడం మానేసారని   మరియు బార్లీ మరియు ఊక ఉన్న వాటిని తిన్నారని  వివరించబడింది.

ప్రవక్త(స) మరియు అలీ ఇబ్న్ అబూ తాలిబ్, ఇద్దరూ కూడా చాలా అరుదుగా మాంసాన్ని తీసుకుంటారు, అది బహుశా నెలకు ఒకసారి కంటే తక్కువ. శాఖాహారం ఉత్తమం అని చెప్పబడినది.

మరొక హదీసులో  

·       "మీ కడుపు జంతువులకు స్మశానవాటికగా మారనివ్వవద్దు" అని అలీ(స) చెప్పినట్లు నివేదించబడింది.

ఆహారం, మరియు దివ్య ఖురాన్‌లో పేర్కొన్న విధంగా మరియు అహ్లుల్-బైట్లో  ఆచరించిన విధం ఈనాటి సమతుల్య ఆహారంతో సరిగ్గా సరిపోతాయి. ఉదాహరణకు: దిఇవ్య ఖురాన్‌లో పేర్కొన్న మాంసానికి పండ్లు మరియు కూరగాయల నిష్పత్తి దాదాపు 3:1 అని నివేదించబడింది. ఇది బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ (BHF) యొక్క సిఫార్సులకు అనుగుణంగా ఉంది. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ (BHF) “సమృద్ధిగా పండ్లు మరియు కూరగాయలు, కొంత మాంసం, చేపలు మరియు ప్రోటీన్ యొక్క ఇతర పాలేతర వనరులు non-dairy sources "సిఫార్సు చేసింది.

శారీరక శ్రమను సమర్ధించే సూచనలు దివ్య ఖురాన్ మరియు హదీసులలో కలవు. ఇవి శారీరక శ్రమను ప్రోత్సహిస్తాయి. విధిగా ప్రార్థనలు, హజ్ తీర్థయాత్ర మరియు పవిత్ర రంజాన్‌లో ఉపవాసంతో సహా తేలికపాటి సాధారణ వ్యాయామాలు ఇస్లాం యొక్క ప్రధాన సిద్ధాంతాలలో ఉన్నాయి. అటువంటి చర్యలకు ప్రాథమిక కారణం ఆధ్యాత్మిక ప్రయోజనం కోసం అయినప్పటికీ, భౌతిక ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

నిజానికి, అల్లాహ్ ప్రసన్నతను పొందటం కోసం  మంచి శారీరక ఆరోగ్యం కోసం ప్రయత్నించడం ఒక రకమైన ఆరాధన అని మనం గుర్తుచేయవలసి ఉంటుంది.

 

No comments:

Post a Comment