24 February 2025

400 భాషల్లో ప్రావీణ్యం సంపాదించిన యువ మహమూద్ అక్రమ్ Young Mahmood Akram, Masters 400 Languages

 



 

న్యూఢిల్లీ

చెన్నైకి చెందిన 19 ఏళ్ల మహమూద్ అక్రమ్ 400 భాషల్లో ప్రావీణ్యం సంపాదించడం ద్వారా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. చాలా చిన్న వయసులోనే అద్భుతమైన భాషా సామర్థ్యం మహమూద్ అక్రమ్ కి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చిపెట్టింది.

మహమూద్ అక్రమ్ తండ్రి ప్రఖ్యాత భాషావేత్త.  తండ్రి మార్గదర్శకత్వంలో పెరిగిన అక్రమ్ కు భాషలపై చిన్నప్పటి నుండే ఆసక్తి పెరిగింది. 6 సంవత్సరాల వయస్సులో, తన తండ్రి యొక్క భాషా జ్ఞానాన్ని అధిగమించాడు, 8 సంవత్సరాల వయస్సులో, అక్రమ్ ప్రపంచ రికార్డును సాధించి, అతి పిన్న వయస్కుడైన బహుభాషా టైపిస్ట్ అయ్యాడు.

12 సంవత్సరాల వయస్సులో అక్రమ్. 400 భాషలలో నిష్ణాతుడైనాడు. అక్రమ్ బాషానైపుణ్యానికి  జర్మన్ భాషా శాస్త్రవేత్తల బృంద౦ ఆశ్చర్యపడినారు. అక్రమ్ యొక్క అద్భుతమైన నైపుణ్యాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాషావేత్తలు, విద్యావేత్తలు మరియు భాషా ఔత్సాహికుల దృష్టిని త్వరగా ఆకర్షించాయి.

అక్రమ్ ప్రకారం  భాషలు కేవలం పదాలు మాత్రమే కాదు, అవి ప్రజల మధ్య వారధి, మరియు బహుళ భాషలను నేర్చుకోవడం వల్ల ప్రపంచంలోని అనేకమంది తో కనెక్ట్ అవ్వడానికి వీలు కలుగుతుందని అని అన్నాడు.

14 సంవత్సరాల వయస్సులో, అక్రమ్ భాషలను బోధించడానికి YouTube ఛానెల్‌ను ప్రారంభించినాడు.  అక్రమ్ ఆన్‌లైన్ పాఠాలు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను ఆకర్షించాయి, ప్రపంచంలోని వివిధ మూలల నుండి విద్యార్థులు అక్రం నుండి వివిధ బాషలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అక్రం బోధనా పద్ధతులు అతన్ని విద్యా సమాజంలో ప్రముఖ వ్యక్తిగా మార్చాయి.

2024 నాటికి, అక్రమ్ అనేక దేశాలలో భాషా వర్క్‌షాప్‌లను నిర్వహించడం ద్వారా తన పరిధిని మరింత విస్తరించాడు. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ రెండింటిలోనూ అక్రమ్ నిర్వహిస్తున్న వర్క్‌షాప్‌లు అన్ని వయసుల అభ్యాసకులకు వేదికగా మారాయి 

అక్రమ్ బహుళ విశ్వవిద్యాలయ డిగ్రీలను కూడా అభ్యసిస్తున్నాడు, తన విద్యా మరియు వ్యక్తిగత వృద్ధి రెండింటిపట్ల  అంకితభావాన్ని ప్రదర్శిస్తున్నాడు మరియు  ఇతరులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాడు.

ఒకరి భాషలను మరొకరు అర్థం చేసుకోవడం ద్వారా, మరింత సామరస్యపూర్వకమైన ప్రపంచాన్ని నిర్మించగలమని అక్రం అభిప్రాయం.  

No comments:

Post a Comment