“బి అమ్మ” గా ప్రసిద్ది
చెందిన అబాది బానో బేగం మహిళలకు ముఖ్యంగా ముస్లిం మహిళలకు ఒక ఆదర్శప్రాయమైన
ఉదాహరణ. రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న మొట్టమొదటి ముస్లిం మహిళలలో అబాది బానో బేగం
ఒకరు మరియు ఆమె భారత స్వాతంత్ర ఉద్యమo లో
ప్రముఖ పాత్ర వహించారు.
1850 లో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ జాతీయవాద కుటుంబం లో జన్మించిన ఆమె, అబ్దుల్ అలీ ఖాన్‌ను వివాహం చేసుకుంది. ఈ దంపతులకు ఒక
కుమార్తె మరియు ఐదుగురు కుమారులు కలరు. బి అమ్మ ధైర్యవంతురాలు మరియు తెలివైన మహిళ.
చిన్న వయస్సులో భర్త మరణించిన తరువాత పిల్లలను చూసుకోవలసిన బాధ్యత ఆమెపై పడింది. ఆమె
తన పిల్లలను క్రమశిక్షణ తో ముహమ్మద్ ప్రవక్త (స)ప్రవచించిన సూక్తుల ప్రకారం పెంచింది అని రాజ్‌మోహన్ గాంధీ కొనియాడారు.
అబాది బానో బేగంకు
ఎటువంటి ఫార్మల్ విద్య లేదు, కానీ ఆమె తన పిల్లలను ఇంగ్లీష్-మీడియం పాఠశాలకు పంపారు. ఆమె
కుమారుడు మౌలానా ముహమ్మద్ అలీ, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి
చేసిన తరువాత, ఆధునిక చరిత్రను
అధ్యయనం చేయడానికి 1898 లో ఇంగ్లాండ్
లోని లింకన్ కాలేజ్ ఆక్స్ఫర్డ్ వెళ్ళారు. తిరిగి వచ్చిన తరువాత, అతను బరోడా
సివిల్ సర్వీసులో చేరాడు మరియు అక్కడ ఏడు సంవత్సరాలు పనిచేశాడు.
ఆమె కుమారులు, మౌలానా మొహమ్మద్
అలీ జౌహర్ మరియు మౌలానా షౌకత్ అలీ(ఆలి సోదరులు) ఖిలాఫత్ ఉద్యమం మరియు భారత స్వాతంత్ర్య
ఉద్యమంలో ప్రముఖ నాయకులు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన నాన్-కోపరేషన్ ఉద్యమంలో వారు
ప్రముఖ పాత్ర వహించారు.
ఆబాది బానో బేగం (బి అమ్మ)
రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు మరియు ఖిలాఫత్ కమిటీలో సబ్యురాలు. ఖిలాఫత్
ఉద్యమంలో చురుకుగా పాల్గొన్న స్వాతంత్ర్య సమరయోధురాలు.. 1917 లో అన్నీ బెసెంట్
మరియు తన ఇద్దరు కుమారులను జైలు నుండి
విడుదల చేయటానికి ఆమె ఆందోళన చేసింది. ఆమె బుర్కా ధరించి స్వాతంత్ర సమావేశాలలో
ప్రసంగించేది. ఈ ధైర్యవంతురాలు అయిన మహిళ
దేశంలో విస్తృతంగా పర్యటించి పెద్ద సంఖ్యలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేవారు. స్వాతంత్య్ర
ఉద్యమంలో మహిళల సహాకారం పొందటం కోసం మహాత్మా గాంధీ ఆమెను మాట్లాడమని ప్రోత్సహించేవారు.
ఆమె 1917 లో ఆల్ ఇండియా
ముస్లిం లీగ్ యొక్క సమావేశాలలో శక్తివంతమైన ప్రభావంతమైన ప్రసంగం చేసింది. ఇది బ్రిటిష్
ఇండియా లోని ముస్లింలపై ముఖ్యం గా ముస్లిం మహిళల పై శాశ్వత ముద్ర వేసింది.
ఖిలాఫత్ ఉద్యమానికి
మద్దతుగా ఆమె భారతదేశం అంతటా విస్తృతంగా
పర్యటించింది. ఖిలాఫత్ ఉద్యమం మరియు భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నిధుల సేకరణలో ఆబాది
బానో బేగం ఒక ముఖ్యమైన పాత్ర పోషించారు. బేగం హస్రత్ మోహని, బసంతి దేవి, సరళా దేవి
చౌధురానీ మరియు సరోజిని
నాయుడులతో కలిసి ఆమె తరచూ మహిళల సమావేశాలలో ప్రసంగించేది. బి అమ్మ ఖిలాఫత్
ఉద్యమంలో మరియు స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొంది మరియు స్వాతంత్య్ర
ఉద్యమంలో ఎక్కువ మంది మహిళలు పాల్గొనాలని మహిళలను ప్రోత్సహించెది.
భారత స్వాతంత్ర్య ఉద్యమం
కోసం లోకమాన్య బాల గంగాధర్ తిలక్ ఏర్పాటు చేసిన “తిలక్ స్వరాజ్ ఫండ్”కు విరాళం
ఇవ్వమని ఆమె మహిళలను ప్రోత్సహించారు.
ఆమె హిందూ-ముస్లిం
ఐక్యతకు పాటుపడినది. భారత దేశం స్వేచ్ఛను సాధించడానికి మత సామరస్యం తప్పనిసరి అని ఆమె
మత సామరస్యం కోసం తీవ్రంగా ప్రచారం చేశారు. ఆమె హిందువులను మరియు ముస్లింలను
"భారతదేశం యొక్క రెండు కళ్ళు" అని పిలిచింది మరియు రెండు వర్గాల మధ్య
స్నేహం కోసం అవిరామంగా పనిచేసింది.
ప్రగతిశీల ఆలోచనాపరురాలు:
ఆమె ప్రగతిశీల
ఆలోచనాపరురాలు మరియు ఆధునిక ఆంగ్ల విద్యకు ప్రాముఖ్యత ఇచ్చింది. ఆమె
తన జీవితమంతా పర్దాను పాటించినది కాని జాతీయవాద ఉద్యమం లో పాలుపంచుకోంది. మహాత్మా గాంధీతో
పాటు ఆమె కుమారులు జైలు పాలైనప్పుడు, మహిళలు స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతుగా పెద్ద
సంఖ్యలో పాల్గొనాలని కోరింది. ఆమెకు ఎటువంటి ఫార్మల్ విద్య లేనప్పటికీ, ఉపఖండంలోని ముస్లింలకు ఆధునిక విద్యను పొందడం
వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆమె కృషి చేసింది.
ఆమె 1924 లో మరణించే వరకు
స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది
1924 లో 73 సంవత్సరాల
వయసులో అబాది బానో బేగం మరణించారు
న్యూ డిల్లి లోని జామియా
మిలియా ఇస్లామియాలో బీ అమ్మ పేర గర్ల్స్
హాస్టల్ ఏర్పాటు చేయబడినది.
పాకిస్తాన్ పోస్ట్ ఆఫీస్ ఆమె
గౌరవార్థం 'పయనీర్స్ ఆఫ్ ఫ్రీడం' సిరీస్‌లో భాగంగా స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
No comments:
Post a Comment