30 March 2020

షోయబ్ ఉల్లాఖాన్ Shoyabulla Khan1920-1948




Journalist Shoaibullah Khan - Telangana Sayuda Poratam - 99tv ...
.


షోయబుల్లాఖాన్ (అక్టోబరు 171920 - ఆగష్టు 221948) తెలంగాణా సాయుధ పోరాట యోధుడు. త్యాగధనుడు, నిర్భయ జర్నలిస్ట్, మత దురహంకారానికి వ్యతిరేకి.

షోయబుల్లా ఖాన్ కుటుంబం ఉత్తరప్రదేశ్ నుంచి హైదరాబాద్ స్టేట్  కు వలస వచ్చి స్థిరపడింది. షోయబ్ ఉల్లాఖాన్ 1920అక్టోబరు 17  ఖమ్మం జిల్లా సుబ్రవేడులో జన్మించారు. తండ్రి హబీబుల్లాఖాన్ నిజాం రైల్వేస్  లో పని చేసేవాడు. తల్లి లాయహున్నీసా బేగం. షోయబుల్లాఖాన్ వీరికి ఏకైక సంతానం.. షోయబ్ భార్య ఆజ్మలున్నిసా బేగం. వీరికి ఇద్దరు కుమార్తెలు కలరు.

షోయబ్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి బిఎ, జర్నలిజం డిగ్రీ చేశాడు. బొంబాయిలో ఇంటర్మీడియట్ గ్రేడ్ డ్రాయింగ్ పరీక్ష కూడా పాసయ్యాడు. షోయబ్ ను ఆయన తండ్రి షోయబుల్లా గాంధీఅని ముద్దుగా పిలుచుకునే వాడు. గాంధీలాగానే షోయబ్ కూడా తానూ నమ్మినదానిని ఆచరిచడం లో నిబధ్ధతను, మొండితనాన్ని ప్రదర్శించేవాడు. విశాలభావాలు కలవాడు మరియు ప్రోగ్రెసివ్ మూవ్మెంట్ లో పాల్గొన్నాడు.

షోయెబుల్లా ఖాన్ రచనా జీవితం తేజ్ పత్రికలో ప్రారంభమైంది. నిజాం నిరంకుశత్వాన్ని వ్యతిరేకిస్తూఖాసిం రజ్వీ దురాగతాల్ని ఖండిస్తూ విశ్లేషణాత్మక కథనాలు రచించాడు. ఈ కారణంగా నిజాం ప్రభుత్వం తేజ్ పత్రికను నిషేధించింది. ఆ తరువాత రయ్యత్  పత్రికలో ఉప సంపాదకునిగా బాధ్యతలు చేపట్టారు. రయ్యత్ పత్రిక కూడా నిజాం నిరంకుశత్వాన్ని ఎదిరించినది. షోయబ్  పాలకవర్గాల దౌర్జన్యాలను, దోపిడీని చీల్చి చెండాడాడు ఆ పత్రికను కూడా నిజాం ప్రభుత్వం నిషేధించింది.

1947 కు ముందు ఎం.ఎన్.రాయ్ ప్రారంభించిన "Independent India " పత్రికను షొయబుల్లాఖాన్ అందరికి పంచేవాడు. షోయబుల్లాఖాన్ మంచి పెయింటర్. పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. రవీంద్రనాథ్ ఠాగూర్‌ది పెద్ద పోట్రయిట్ గీసాడు. ఉర్దూ, ఇంగ్లీష్ సాహిత్యాలంటే ప్రాణం పెట్టేవాడు

రయ్యత్ నిషేధానికి గురయ్యాకా షోయబుల్లాఖాన్ తన తల్లి-భార్య నగలునట్రా అమ్మి ఇమ్రోజ్ను స్థాపించారు. ఉర్దూలో ఇమ్రోజ్ అంటే ఈ రోజు అని అర్ధం. ఆ పత్రికకు సంపాదకత్వ బాధ్యతలు షోయబుల్లా స్వీకరించారు. ఇమ్రోజ్‌ ప్రథమ సంచిక 1947 నవంబరు 15న విడులయ్యింది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడ్తున్నా, ఇమ్రోజ్‌ను ప్రజల పత్రికగా షోయబ్  తీర్చిదిద్దారు. నిజం ప్రభువుల నిరంకుశత్వం, ఉన్మాదుల మత దురహంకారం మీద తిరుగులేని సమరం కొనసాగించారు.

నిజాం రాజ్యం లో రాజకీయ స్థితిగతులు అప్పటికే వేడెక్కాయి.  హైదరాబాద్ రాజ్యానికి చెందిన ఏడుగురు ముస్లిం పెద్దలు హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్‌లో రాజ్యాన్ని విలీనం చేయడమే సరైన నిర్ణయమని నిజాం రాజుకీ, ఆయన ప్రజలకీ విజ్ఞప్తి చేస్తూ  ఒక పత్రాన్ని తయారుచేశారు. ఈ పత్రాన్ని ఇమ్రోజ్ పత్రికలో యధాతథంగా షోయబుల్లా ఖాన్ ప్రచురించారు. నిజాం మొండితనానికి, రజాకార్ల ఉన్మాదానికి ఎక్కువ బలవుతోంది పేద ముస్లిం కుటుంబాలు, యువకులేనని ఎన్నో సార్లు ఆయన ఆవేదన చెందాడు.

1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించింది. దేశంలోని సంస్థానాలన్నీ క్రమంగా ఇండియన్‌ యూనియన్‌లో కలసి పోతున్నాయి. జునాఘడ్‌, రాంపూర్‌ మరియు  నైజాం సంస్థ్ధానాధీశులు ఇండియన్‌ యూనియన్‌లో తమ సంస్థానాలను విలీనం చేయడానికి నిరాకరించారు.హైదరాబాద్ ఇండియాలో విలీనం కావాల్సిందేనని తన రాతలతో షోయబ్ స్పష్టం చేసేవాడు. నిజామ్‌కు వ్యతిరేకంగా ఉన్న ముస్లిం విద్యావంతుల అభిప్రాయాలను ప్రచురించేవాడు. కమ్యూనిస్టులు, ఆర్యసమాజ్ వారు, విద్యార్థులు, యూత్ లీగ్ ఎవరు పోరాటాలు చేసినా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వార్తలన్నీ ప్రముఖంగా ప్రచురించాడు

హైదరాబాద్ ఇండియాలో విలీనం కావడమనేది షోయబుల్లాఖాన్ కల మరియు  లక్ష్యం. నైజాం సంస్థానాన్ని ఇండియన్‌ యూనియన్‌లో విలీనం చేయాలని కోరుతూ సంపాదకీయాలు రాశారు. ఇమ్రోజ్‌ రాతల ప్రభావం వలన రోజురోజుకూ విలీనానికి అనుకూలంగా మేధావులు, ప్రజలు స్పందించసాగారు.

ఈ పరిణామాలు నిజాం పాలకవర్గాలకు కంటక ప్రాయమయ్యాయి. కలం యోధుడు షోయాబుల్లాను నయానా, భయానా నచ్చచెప్పి ఆయన కలాన్ని నియంత్రించాలని పాలక వర్గాలు శతవిధాల ప్రయత్నించాయి. అన్నిరకాల ఆశలు చూపాయి. తమ ప్రయత్నాలు ఏమాత్రం నెరవేరకపోవడంతో, భయంకర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, చివరికి పరోక్షంగా, ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీ చేశాయి. షోయాబుల్లా ఖాన్‌ ఆ హెచ్చరికలను ఎదుర్కొంటూ వజ్ర సంకల్పంతో ముందుకు దూసుకు పోసాగాడు.

ఇమ్రోజ్ పత్రిక ద్వారా నిరంకుశ నిజాం పాలనను వ్యతిరేకంగా రాసినందుకు, నిజాం వ్యతిరేక ప్రజాపోరాటాలను బలపర్చినందుకు మత దురహంకారులు 1948ఆగష్టు 22  రజాకార్లు పత్రికా కార్యాలయం నుంచి ఇంటికి వెళుతున్న సమయంలో షోయబ్ అతిక్రూరంగా కాల్చిచంపారు. తుపాకి గుండ్లకు గురైన షోయబుల్లా నేల కూలారు. ఆ హంతక ముఠా ఆయనను తరిమి తరిమి నైజాం పాలకుల ఉద్దేశ్యాలకు వ్యతిరేకంగా వ్యాసాలు, సంపాదకీయాలు రాసిన షోయాబుల్లా ఖాన్‌ చేతులను నరికి వేసింది. ఆ దుర్మార్గాన్ని అడ్డుకున్న షోయాబుల్లా ఖాన్‌ సహచరులు ఇస్మాయిల్‌ కూడా దాడికి గురయ్యారు. ఆయన కేకలు వేశారు. ఆ కేకలకు సమీపంలోగల ప్రజానీకం ఇళ్లనుండి బయటకు రావడంతో కిరాతకులు పరారయ్యారు. తుపాకి కాల్పుల వలన, కత్తుల దాడి వలన బాగా గాయపడి రక్తంవోడుతున్న షోయాబుల్లా ఖాన్‌ను ప్రజలు ఆసుపత్రికి తరలించారు.ఆసుపత్రిలో షోయబుల్లా ఆగష్టు 221948 తెల్ల వారుజామున కన్నుమూసారు.

కలంయోధుడు షోయబుల్లా అంతిమ యాత్రకు నైజాం ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. షోయాబుల్లా ఖాన్‌ భౌతికకాయాన్ని గోషామహాల్‌ మాలకుంట ఎదురుగా ఉన్న ఖబరస్థాన్‌లో ఖననం చేశారు.

భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్ర తొలిదశ లో ఢిల్లీ అక్బార్‌ పత్రిక సంపాదకులు మౌల్వీ ముహమ్మద్‌ బాకర్‌, మలదశ లో ఇమ్రోజ్‌ పత్రిక సంపాదకులు షోయాబుల్లా ఖాన్‌ ప్రాణ త్యాగాలు చేసి భారతీయ పత్రికారంగానికి ఎనలేని గౌరవప్రతిష్ఠలు సమకూర్చిపెట్టారు. స్వేచ్ఛ-స్వాతంత్య్రాల కోసం అక్షరాలను ఆయుధంగా చేసుకుని చివరి శ్వాసవరకు పోరాడిన హైదరాబాద్‌ యోధుడు షోయాబుల్లా ఖాన్‌

"షోయబుల్లాఖాన్ హత్య జరిగేనాటికి ఆయనకు రెండు సంవత్సరాల కూతురు, భార్య నిండు చూలాలు. షోయబ్ చనిపోయాక ఆ కుటుంబాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఆ కుటుంబం ఉత్తరప్రదేశ్‌లోని కాయంగంజ్‌కు వలస వెళ్లింది. షోయబ్ తండ్రి కూడా కొంతకాలం తరువాత కోడలి దగ్గరికి వెళ్లిపోయాడు.

మలక్‌పేటలో ఆయన పేరు మీద ఒక గదితో లైబ్రరీ, చుట్టూ చిన్న పార్కు ఏర్పాటు చేయబడినది.

షోయబుల్లాఖాన్ ను చంపేసిన చోట ఆయన విగ్రహం పెట్టాలనీ, కాచిగూడ చాపెల్ రోడ్డుకు ఆయన పేరు పెట్టాలనీ జర్నలిస్టుల డిమాండు.
ఆధార గ్రంధాలు:
1.   వికీ పెడియా-తెలుగు.
2.   ప్రముఖ చరిత్రకారుడు నసీరుద్దిన్ సాహెబ్ రచనలు
3.   ప్రముఖ సోషలిస్ట్ రావేల సోమయ్య అభిప్రాయాలు’

No comments:

Post a Comment