13 March 2020

షా నవాజ్ ఖాన్ (జనరల్)Shah Nawaz Khan (general)INA


 Image result for shaw nawaj khan INA


షా నవాజ్ ఖాన్ జనవరి 24, 1914 రావల్పిండి, బ్రిటిష్ ఇండియా లో జన్మించారు.ఇతడు రెండవ ప్రపంచ యుద్ధంలో భారత జాతీయ సైన్యం(INA)లో అధికారిగా పనిచేసినాడు. యుద్ధం తరువాత అతన్ని విచారించి దేశద్రోహానికి పాల్పద్డాడు అనే నేరం పై  బ్రిటీష్ ఇండియన్ ఆర్మీ నిర్వహించిన బహిరంగ కోర్ట్ మార్షల్ లో  మరణశిక్ష విధించారు. దేశంలో అశాంతి మరియు నిరసనల నేపథ్యంలో భారత సైన్యం యొక్క కమాండర్-ఇన్-చీఫ్ ఈ శిక్షను రద్దు చేశారు.

షా నవాజ్ ఖాన్ 1914 జనవరి 24 న రాజ్‌పుత్-జంజువా వంశానికి చెందిన పంజాబీ ముస్లిం కుటుంబంలో బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ కెప్టెన్‌గా పదవీ విరమణ చేసిన టిక్కా ఖాన్‌కు జన్మించాడు, అతని స్వగ్రామం ప్రస్తతం పాకిస్తాన్ రావల్పిండి జిల్లా లోని మాటోర్‌లో ఉంది.
అతనిది సైనిక కుటుంభం అతని బంధువులు అందరు సైన్యంలో ఉన్నతాధికారులు.  అతను తన సైనిక విద్యను ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (ఇప్పుడు రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ) పొందాడు.

భారత సైన్యంలో కెప్టెన్ హోదాకు ఎదిగిన ఖాన్, 1942 లో సింగపూర్ పతనం తరువాత జపనీయుల చేత పట్టుబడ్డాడు. సింగపూర్‌లో యుద్ధ ఖైదీగా ఉన్న అతను సుభాస్ చంద్రబోస్ ప్రసంగాల వల్ల బాగా ప్రభావితమయ్యాడు. యుద్దఖైదిలను ఇండియన్ నేషనల్ ఆర్మీ లో చేరి స్వతంత్ర భారతదేశం కోసం పోరాడమని కోరినాడు.

బోస్ యొక్క దేశభక్తి ప్రసంగాలతో ఆకట్టుకున్న నవాజ్ 1943 లో INA లో చేరారు. బోస్ చేత ఏర్పడిన “అర్జీ హుకుమాత్-ఇ-ఆజాద్ హింద్ (INA) Arzi Hukumat-e- Azad Hind (INA)  కేబినెట్‌లో స్థానం పొందినాడు. బోస్ ఐఎన్ఎ యొక్క మేరికలలాంటి (creem) యోధులతో కూడిన రెజిమెంట్నుఎంపిక చేసి  భారతదేశంలోకి ముందడుగు వేయడానికి action/చర్యకు పంపాలని నిర్ణయించుకున్నాడు. షా నవాజ్ ఖాన్ సైన్యాన్ని ఈశాన్య భారతదేశంలోకి నడిపించాడు, కొహిమా మరియు ఇంఫాల్‌లను స్వాధీనం చేసుకొని కొంతకాలం  వీటిని జపనీయుల అధికారం క్రింద INA స్వాధీనం లో ఉంచబడినవి. డిసెంబర్ 1944 లో, షా నవాజ్ ఖాన్ మాండలే వద్ద 1 వ డివిజన్ కమాండర్‌గా నియమితులయ్యారు.

డిల్లి లోని ఎర్రకోట వద్ద జరిగిన బహిరంగ కోర్టు మార్షల్ లో "బ్రిటిష్ చక్రవర్తికి వ్యతిరేకంగా యుద్ధం చేసినందుకు" జనరల్ ప్రేమ్ సహ్గల్ మరియు కల్నల్ గుర్బక్ సింగ్ ధిల్లాన్లతో కలిసి షా నవాజ్ ఖాన్ ను విచారించారు. సర్ తేజ్ బహదూర్ సప్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, అసఫ్ అలీ, భూలాభాయ్ దేశాయ్, కైలాష్ నాథ్ కట్జు వారి తరుఫున న్యాయ స్థానం లో వాదించారు. విచారణ అంతంతరం ఖాన్ కు కోర్టు మరణశిక్ష విధించింది, కాని ఆ శిక్షను భారత సైన్యం యొక్క కమాండర్-ఇన్-చీఫ్ క్యాషియరింగ్కు cashieringతగ్గించారు.

విచారణ తరువాత, షా నవాజ్ ఖాన్ తాను ఇకపై గాంధీ ప్రవచించిన అహింస మార్గాన్ని అనుసరిస్తానని ప్రకటించాడు మరియు అతను కాంగ్రెస్ పార్టీలో చేరాడు. మీరట్ నుండి 1952 లో మొదటి లోక్‌సభకు ఎన్నికైన  షా నవాజ్ ఖాన్ మంచి పార్లమెంటేరియన్ గా రాణించారు.
నిర్వహించిన రాజకీయ పదవులు:
పార్లమెంటరీ కార్యదర్శి మరియు రైల్వే మరియు రవాణా శాఖ సహాయ మంత్రి 11 సంవత్సరాలు (1952-1956) & (1957-1964 (రెండవ టర్మ్ ))
·         ఫుడ్ ఆహార మరియు వ్యవసాయ మంత్రి (1965)
·          కార్మిక, ఉపాధి మరియు పునరావాస మంత్రి (1966)
·          స్టీల్ & మైన్స్ మంత్రి మరియు పెట్రోలియం & కెమికల్ ఇండస్ట్రీస్ మంత్రి (1971-1973)
·          వ్యవసాయం మరియు నీటిపారుదల మంత్రి (1974-1975)
·         వ్యవసాయ మరియు నీటిపారుదల మంత్రి (1975-1977)
·         నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్.
·         ఛైర్మన్, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.

1951, 1957, 1962 మరియు 1971 లో మీరట్ నియోజకవర్గం నుండి లోక్‌సభకు నాలుగుసార్లు ఎన్నికయ్యారు. ఖాన్ రాజకీయ భావాలు వామపక్ష, భూ సంస్కరణలకు మరియు ప్రజా పంపిణీకి మద్దతు గా ఉండేవి.  1967 ఎన్నికల్లో ఆయన ఓటమికి పొందినాడు.  1969 లో, ఇందిరా గాంధీతో కలిసి నడిచినాడు మరియు  1971 ఎన్నికలలో మీరట్ నుండి మళ్ళీ ఎంపిగాఎన్నికైనాడు.. 1977 ఎన్నికలలలో ఓటమి పొందిఆడు.  ఆయన మరణించే వరకు (9 December 1983) కాంగ్రెస్ సేవాదళ్ అధిపతిగా కొనసాగారు.


1956 లో, షా నవాజ్ ఖాన్ అధిపతిగా సుభాస్ చంద్రబోస్ మరణం పై నిజా-నిజాలను వెలికి తెయడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో బోస్ అన్నయ్య సురేష్ చంద్రబోస్ కూడా ఉన్నారు. ఈ కమిటీ తన పనిని ఏప్రిల్ 1956 లో తన పని ప్రారంభించింది మరియు నాలుగు నెలల తరువాత ముగ్గురు సభ్యులలో ఇద్దరు (సురేష్ చంద్ర బోస్ మినహా) ఫార్మోసా (ఇప్పుడు తైవాన్) లోని తైహోకు (జపనీస్ ఫర్ తైపీ) వద్ద జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించాడని నిర్ధారించారు. 18 ఆగస్టు 1945 అతని అస్థికలను జపాన్‌లోని రెంకోజీ ఆలయంలో ఉంచారని, వాటిని తిరిగి భారతదేశానికి రప్పించాలని వారు పేర్కొన్నారు.

ప్రసిద్ది:
·        నేతాజీ సుభాస్ చంద్రబోస్2005 చిత్రం: “ది ఫర్గాటెన్ హీరో”లో షా నవాజ్ ఖాన్ పాత్రను నటుడు సోను సూద్ పోషించారు.
·        రెడ్ ఫోర్ట్ ట్రయల్స్ పై 2017 చిత్రం “రాగ్‌దేశ్‌” లోనటుడు షా నవాజ్ ఖాన్ పాత్రను నటుడు  కునాల్ కపూర్ పోషించారు
·        అతను బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కి  తండ్రి తరుపు బంధువు.


No comments:

Post a Comment