13 March 2020

మార్మిక వాది/మిస్టిక్ అయిన “బ్యాంకీ”


మిస్టిక్ మంత్ర:

మార్మిక వాది/మిస్టిక్ అయిన   బ్యాంకీ ఒకసారి వారాల పాటు కోనసాగే ఏకాంత ధ్యాన సమావేశాలను నిర్వహించారు. ద్యాన సెషన్లకి  జపాన్ లోని వివిధ ప్రాంతాల నుండి అనేక మంది విద్యార్ధులు హాజరైనారు.

ఒక సమావేశంలో ఒక విద్యార్థి దొంగిలిస్తు పట్టుబడ్డాడు. ఇతర విద్యార్థులు అతనిని బహిష్కరించాలన్న అభ్యర్థనతో ఈ విషయాన్ని బ్యాంకీకి నివేదించారు.
బ్యాంకే ఈ అబ్యర్దనను పట్టించుకోలేదు

తరువాత అదే విద్యార్థి తిరిగి దొంగతనం చేస్తూ మరోసారి పట్టుబడ్డాడు మరియు ఈసారి కోపంతో ఉన్న తోటి విద్యార్థులు ఆ దొంగను బహిష్కరించలని కోరుతూ  ఒక పిటిషన్ను సమర్పించారు లేకుంటే తామంత కలిసి సమావేశాల నుండి నిష్క్రమిస్తారని పేర్కొనారు.

పిటిషన్ చదివిన బ్యాంకీ తన ముందు కు అందరు విద్యార్ధులను పిలిచారు మరియు అక్కడ  ఉన్న ప్రతి విద్యార్ధిని పిలిచి, "మీరు తెలివైన విద్యార్ధులు. ఏది సరైనది మరియు ఏది సరైనది కాదో మీకు తెలుసు. వేరే చోట చదువుకోవాలనుకుంటే మీరందరూ వెళ్ళగలరు. కాని ఈ పేద విద్యార్ధికి  ఒప్పు మరియు తప్పు మధ్య తేడా తెలియదు. నేను కాకపోతే ఎవరు అతనికి నేర్పుతారు? మీరందరూ బయటకి వెళ్ళినప్పటికీ  నేను అతనిని ఇక్కడే ఉంచబోతున్నాను! " అని  అన్నారు.

దొంగిలించిన విద్యార్ధి మొఖం కన్నీటి ప్రవాహం తో  శుభ్రపడినది మరియు అతనిలో   దొంగిలించాలనే కోరిక మటుమాయమైంది.

No comments:

Post a Comment