తాజ్ మహల్ నిర్మాణం లో చార్మినార్
యొక్క నాలుగు మినారెట్స్ పరిపూర్ణత సాధించినవి.
చార్మినార్ యొక్క డిజైన్, ముఖ్యంగా నాలుగు
మినార్లు, తాజ్ మహల్
రూపకల్పనకు బలంగా ప్రేరేపించాయని
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఆర్కియాలజీ ఎం ఎ ఖైయుమ్ అన్నారు.
హైదరాబాద్‌లో మీడియా ప్లస్ ఫౌండేషన్ నిర్వహించిన 'గ్లోరీ ఆఫ్ తాజ్' అనే తన ప్రసంగంలో మాట్లాడుతూ, తాజ్ మహల్ యొక్క
నాలుగు మినార్లు షాజహాన్ తండ్రి జహంగీర్ మరియు అతని తండ్రి అక్బర్ సమాధుల ద్వారా కూడా
ప్రభావితమయ్యాయి అని అన్నారు. హైదరాబాద్ దక్కన్ మరియు తాజ్ మహల్లలో కనిపించే మొఘల్
నిర్మాణలలో బలమైన సారూప్యతలు ఉన్నాయి.
"
వాస్తవానికి, చార్మినార్‌లో
నాలుగు మినార్లు ఉన్నాయి. దీని నిర్మాణం షాజహాన్ జన్మించిన సమయంలోనే అనగా 1591 లో పూర్తయింది.
నలభై సంవత్సరాల తరువాత, తాజ్ మహల్
నిర్మాణం 1631 లో
ప్రారంభమైంది. 1612 లో అక్బర్ సమాధి
నిర్మించబడింది మరియు దానికి నాలుగు మినార్లు ఉన్నాయి. తదనంతరం 1627 లో నూర్ జహాన్ తన
భర్త జహంగీర్ కోసం ఒక సమాధిని నిర్మించినది అది కూడా నాలుగు మినార్లు కలిగి గొప్ప నిర్మాణంగా
ఉన్నది. ఈ మినార్లు మొత్తం సమాధి నిర్మాణం పై ఆధిపత్య ప్రభావాన్ని చూపుతాయి.
"షాజహాన్ మరియు అతని భార్య ఒకప్పుడు దక్కన్
ప్రాంతం (ఇప్పుడు హైదరాబాద్) గుండా ప్రయాణించారు మరియు తాజ్ మహల్ రూపకల్పనలో చార్మినార్ చే ప్రభావితం అయ్యారు. " అని ఆయన అన్నారు.
తాజ్ మహల్ నిర్మాణం ను
ప్లాన్ చేసినప్పుడు కళాకారులు నిర్మాణానికి నమూనాలను ప్రదర్శించడం
ప్రారంభించినప్పుడు, షాజహాన్ మనస్సులో
హైదరాబాద్లోని ఒరిజినల్ చార్మినార్ యొక్క నాలుగు
మినార్లు కలవు మరియు అతని తండ్రి జహంగీర్ మరియు తాత అక్బర్ సమాధుల నిర్మాణాలు కూడా
నాలుగు మినార్లతో ఉన్నాయి.
"తాజ్ మహల్ డిజైన్, దాని నిర్మాణం దాని
అందం మరియు హుందాతనం వాస్తుశిల్పులను
ఆశ్చర్యపరుస్తుంది. మినార్ల నిర్మాణ రూపకల్పన తాజ్ మహల్ నిర్మాణంలో పరిపూర్ణతను సాధించింది.
తాజ్ మహల్ యొక్క మినార్లు
కొద్దిగా బయటికి వాలుగా రూపొందించబడ్డాయి. భూకంపం సంభవించినప్పుడు మినార్లు
కూలిపోతే తాజ్ మహల్ ను రక్షించడానికి ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. "ఈ నిర్మాణం
యమునా నది అంచున ఉంది మరియు రాణి
అర్జుమండ్ బానో యొక్క చివరి కోరికను తీర్చటానికి ఈ నిర్మాణం నిర్మించబడింది.
ముంతాజ్ మహల్ గా
ప్రసిద్ది చెందిన అర్జుమాండ్ బానో, తన కోసం ప్రపంచం ఎన్నడు చూడని అద్భుతంగా సమాధిని
నిర్మించాలని రాజును కోరుకున్నది మరియు ఆమె మరణించిన తరువాత రాజు ఎప్పటికీ వివాహం
చేసుకోవద్దని రాణి కోరింది.
మొఘల్ చక్రవర్తి షాజహాన్
మొఘల్ యుగంలో తెలివైన మరియు ప్రభావవంతమైన రాజులలో ఒకడు. దేశంలోని వివిధ ప్రాంతాల
నుండి వచ్చిన కళాకారులతో అద్భుతమైన సాటిలేని నిర్మాణాన్ని నిర్మించమని
ఆయన ఆజ్ఞాపించాడు. తాజ్ మహల్ను అలంకరించే అనేక ఆభరణాలు హైదరాబాద్ నుండి రవాణా
చేయబడ్డాయ.
ప్రయాణంలో మరియు అంతపురం
లో ఎప్పుడూ తన పక్కన ఉండే తన ప్రియమైన
భార్య కోరికను నెరవేర్చే ప్రయత్నంలో షాజహాన్ నిపుణులైన డజన్ల కొద్దీ వాస్తుశిల్పులు, ఇంజనీర్లు మరియు మేస్త్రిల
పర్యవేక్షణలో 20,000 మందికి పైగా
కార్మికులను నియమించారు. 350 సంవత్సరాల
తరువాత కూడా తాజ్ ప్రతి సంవత్సరం మిలియన్ల మంది సందర్శకులను
ఆకర్షిస్తూనే ఉంది.
తాజ్ మహల్ యొక్క కేంద్ర
గోపురం ఏ బలోమైన పదార్థాల సహాయం లేకుండానే
ఉంది, మరియు అది 1631 లో చక్రవర్తి
భార్య ప్రసవ సమయంలో మరణించిన తరువాత నిర్మించబడింది.
శాశ్వత ప్రేమ కు గొప్ప చిహ్నం
అయిన తాజ్ మహల్ ను 1983 లో యునెస్కో ప్రపంచ వారసత్వ సైట్ గా ప్రకటిoచినది.
[సయ్యద్ ఖలీద్ షాబాజ్. ఆంగ్ల జర్నలిస్ట్, హైదరాబాద్
సౌజన్యం తో]
No comments:
Post a Comment