ప్రముఖ ముస్లిం భారత స్వాతంత్ర సమర యోధుడు:
.
హబీబ్ ఉర్ రెహ్మాన్ (1913-1978) బ్రిటిష్ వలసరాజ్య పాలనలో
భారతీయ జాతీయవాది, మరియు ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎINA) లో అధికారి. అతను సింగపూర్‌లో సుభాస్ చంద్రబోస్ యొక్క చీఫ్ ఆఫ్
స్టాఫ్‌గా పనిచేశాడు మరియు బోస్‌తో కలిసి తైపీ నుండి టోక్యోకు బోస్ చివరి విమాన
ప్రయాణం లో ఉన్నాడు. " హిజ్ మెజిస్టి ది కింగ్ ఎంపరర్ ".His Majesty the King Emperor".కి వ్యతిరేకంగా
యుద్ధం" చేసినట్లు అతనిపై అభియోగాలు మోపారు.
రాజా మంజూర్ అహ్మద్ ఖాన్ కుమారుడు హబీబ్ ఉర్ రెహ్మాన్ 22 డిసెంబర్ 1913 న జమ్మూ కాశ్మీర్‌లోని భీంబర్ జిల్లాలోని పంజేరి
గ్రామంలో జన్మించాడు. పంజేరిలోని పాఠశాల విద్యనభ్యసించిన తరువాత ఆయన జమ్మూలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు మరియు డెహ్రాడూన్
లోని ప్రిన్స్ ఆఫ్ వేల్స్ రాయల్ ఇండియన్ మిలిటరీ కాలేజీలో (తరువాత అది ఇండియన్
మిలిటరీ అకాడమీ గా పిలువబడినది.) చేరారు.
హబీబ్ ఉర్ రెహ్మాన్ భారత సైన్యoలో అధికారిగా నియమింపబడి 14వ పంజాబ్ రెజిమెంట్ యొక్క 1వ బెటాలియన్కు
పంపబడ్డాడు, దీనిని "షేర్ దిల్ పాల్టన్" అని పిలిచారు..
అతను లెఫ్టినెంట్‌గా పదోన్నతి పొందినాడు మరియు అనేక తూర్పు ఆసియా దేశాలలో మరియు
కెనడా లో పనిచేసాడు. రెండో ప్రపంచ యుద్ధం లో తూర్పు ఆసియా లో బ్రిటిష్ దళాలు
బేషరతుగా జపనీయులకు లొంగిపోయాయి.
ఓడిపోయి మరియు నిరాశకు గురైన భారత సైనికులు సింగపూర్‌లోని ఫారర్ పార్క్ లో
సమావేశయ్యారు. POW లను ఉద్దేశించి ప్రసంగించిన జపనీస్ మేజర్ ఫుజివారా, స్వేచ్ఛా మరియు స్వతంత్ర భారతదేశం లేకుండా ప్రపంచ శాంతి మరియు ఆసియా విముక్తి
సాధించలేమని దృడమైన నమ్మకం వ్యక్తం చేశారు.
మలయాలోని భారతీయ పిడబ్ల్యులు తమ మాతృభూమి యొక్క స్వాతంత్ర్యాన్ని సాధించడానికి
బ్రిటిష్ సామ్రాజ్యవాదంతో పోరాడటానికి సిద్ధంగా ఉంటే, ఇంపీరియల్ జపాన్ ప్రభుత్వం వారికి మద్దతును ఇస్తుందని ఆయన అన్నారు. అందుకు
గాను భారత జాతీయ సైన్యాన్ని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. మలయాలోని అందరు POW/పిడబ్ల్యులను కెప్టెన్
మోహన్ సింగ్, జి.ఓ.సి.అఫ్ ఇండియన్ నేషనల్ ఆర్మీ కి అప్పగించారు..
ఫారర్ పార్క్ లో కెప్టెన్ మోహన్ సింగ్
POW/పిఒడబ్ల్యులను ఉద్దేశించి ప్రసంగించారు మరియు భారత జాతీయ సైన్యం ఏర్పాటు
చేయాలని నిర్ణయించుకున్నారు. పూర్వపు POW లు ఇప్పుడు భారతదేశం యొక్క "ఆర్మీ ఆఫ్ లిబరేషన్" యొక్క సైనికులుగా
మారారు.
కెప్టన్ మోహన్ సింగ్ మరియు హబీబ్ ఉర్ రెహ్మాన్
ఒకే యూనిట్ నుండి వచ్చారు.. అతను హబీబ్ ఉర్ రెహ్మాన్ కు సన్నిహితుడు.
తూర్పు ఆసియా లో బ్రిటిష్
తరుపు యుద్ద ఖైదీలు ఉన్న చాంగి క్యాంప్ జపనీస్ మరియు INA కు
చెందిన హబీబ్ ఉర్ రెహ్మాన్ సైనిక నియంత్రణలో ఉంది. హబీబ్ ఉర్ రెహ్మాన్ ఖైదీలలో
జాతీయ ఐక్యత, క్రమశిక్షణ మరియు విధి యొక్క గొప్ప భావనలను
వ్యక్తిగతంగా రోజువారీ ఉపన్యాసాల ద్వారా ప్రేరేపించాడు. చాంగి క్యాంప్ వద్ద కొంత
సమయం తరువాత హబీబ్ ఉర్ రెహ్మాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతన్ని సెలెటార్
క్యాంప్‌కు పంపించి POWపిఓడబ్ల్యు ఆసుపత్రిలో చేర్చారు.
INA ను రూపొందించడం
సెలెటార్ క్యాంప్‌లో హబీబ్ ఉర్ రెహ్మాన్ ఆరోగ్యం మెరుగుపడింది. ఏప్రిల్ 24, 1942 న సింగపూర్‌లోని బిదాదరి క్యాంప్‌లో కెప్టెన్ మోహన్ సింగ్ పిలిచిన బిదాదరి
సమావేశానికి ఆయనతో పాటు భారతీయ యుద్ధ ఖైదీల నుండి ముప్పై మందికి పైగా
ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సమావేశం యొక్క తీర్మానాలను బిదాదరి తీర్మానాలు అని
పిలుస్తారు. ఇవి INA ఏర్పడటానికి ప్రధాన కారణం.
తూర్పు ఆసియా దేశాలలో నివసించిన భారతీయుల ప్రతినిధుల సమావేశం జూన్ 15, 1942 న బ్యాంకాక్‌లో జరిగింది, ఇది 10 రోజులు కొనసాగింది. భారత యుద్ధ ఖైదీలలో మోహన్ సింగ్ నామినేట్ చేసిన ముప్పై
ఐఎన్ఎ వాలంటీర్లు దీనికి హాజరయ్యారు. బ్యాంకాక్ రిజల్యూషన్ అని పిలువబడే ఈ
సమావేశంలో ఒక తీర్మానం ఆమోదించబడింది.
1 సెప్టెంబర్ 1942 న హబీబ్ ఉర్ రెహ్మాన్ తన జాతీయ కమిషన్ పొందాడు మరియు
10 సెప్టెంబర్ 1942 న మేజర్గా నియమించబడ్డాడు. అతను ఇంకా అనారోగ్యంతో ఉన్నాడు కాబట్టి అతను INA
రి-ఇంఫోర్సుమేంట్ గ్రూప్కు జతచేయబడ్డాడు.
1942 అక్టోబర్ 2 న మునిసిపల్ భవనాల ముందు సింగపూర్ పడాంగ్ వద్ద INA యొక్క మొదటి సమీక్ష సమావేశం జరిగింది, హబీబ్ ఉర్ రెహ్మాన్ ఈ కార్యక్రమానికి పరిశీలకుడిగా హాజరయ్యారు.
ఇంతలో, సుభాస్ చంద్రబోస్ (నేతాజీ) తూర్పుకు రావడానికి
ప్రయత్నిస్తున్నాడు. నేతాజీ రాకను ఊహించి, పునరుద్ధరించిన ఐఎన్ఎను దాని కొత్త ప్రధాన
కార్యాలయంలో డైరెక్టరేట్ ఆఫ్ మిలిటరీ బ్యూరో (డిఎంబి) గా మార్చారు, కల్నల్ జె. ఆర్. భోంస్లే డైరెక్టర్‌గా ఉన్నారు. ఆర్మీ ప్రధాన కార్యాలయంలోని
"క్యూ" బ్రాంచ్‌లో హబీబ్ ఉర్ రెహ్మాన్ డిప్యూటీ క్వార్టర్ మాస్టర్ జనరల్
(డిక్యూఎంజి) గా నియమితులయ్యారు. అతను టెక్నికల్ బ్రాంచ్ ను చూసుకోవలసి ఉంది మరియు
వసతికి కూడా బాధ్యత వహించాడు.
INA లొంగిపోవటం
17 మే 1945 న శత్రువు భారత జాతీయ సైన్యాన్ని చుట్టుముట్టారు. వారు
లొంగిపోయారు. వారిని పెగులో జైలులో పెట్టారు. ఆగష్టు 1945 న, షా నవాజ్, సహగల్, ధిల్లాన్ మరియు ఖాన్లను సంయుక్తంగా సేవల వివరణాత్మక
విచారణ కేంద్రానిCombined
Services Detailed Interrogation Centreకి మొదటిసారి పిలిచారు. ఇది ఎర్రకోటలో మొదటి INA విచారణకు నాంది. 17 సెప్టెంబర్ 1945 న వారికి చార్జిషీట్ కాపీని అందించారు. ప్రధాన అభియోగం రాజుపై యుద్ధం చేయడం.
విచారణ వార్తలను ప్రెస్ మరియు ఆల్ ఇండియా రేడియో ద్వారా బహిరంగపరిచారు.
INA ట్రయల్స్
యుద్ధం ముగింపులో, బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న
కొంతమంది ఐఎన్ఎ సైనికులను దేశద్రోహ ఆరోపణలపై విచారణకు తీసుకువచ్చింది. దోషులుగా తేలితే
ఖైదీలకు మరణశిక్ష, జీవిత ఖైదు లేదా జరిమానా విధించవచ్చు. యుద్ధం తరువాత, లెఫ్టినెంట్ కల్నల్ షహనావాజ్ ఖాన్, కల్నల్ హబీబ్ ఉర్ రెహ్మాన్ ఖాన్, కల్నల్ ప్రేమ్ సెహగల్ మరియు కల్నల్ గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్లను " హిజ్ మెజిస్టి
ది కింగ్ ఎంపరర్ Majesty the King Emperor".కి వ్యతిరేకంగా యుద్ధం" చేసినందుకు డిల్లి లోని ఎర్రకోట వద్ద విచారణ చేసారు.
ఎర్రకోట వద్ద గుర్బక్ష్ సింగ్ ధిల్లాన్, ప్రేమ్ కుమార్ సహగల్, షా నవాజ్ ఖాన్ మరియు హబీబ్ ఉర్ రెహ్మాన్ 1945 నవంబర్ 5 న రాజుపై యుద్ధం అభియోగం పెట్టి జనరల్ కోర్ట్
మార్షల్ విచారణ ప్రారంభమైంది.
ఈ నలుగురు ముద్దాయిల తరుపున సర్ తేజ్
బహదూర్ సప్రూ, జవహర్‌లాల్ నెహ్రూ, భూలాభాయ్ దేశాయ్ మరియు ఇతరులు వాదించారు.వారిని యుద్ధ ఖైదీలుగా పరిగణించబడాలి, ఎందుకంటే వారు కిరాయి సైనికులు కాదు. వారు చట్టబద్ధమైన ప్రభుత్వానికి చెందిన సైనికులు. స్వేచ్ఛా భారతదేశ
తాత్కాలిక ప్రభుత్వం, లేదా అర్జి హుకుమాటే ఆజాద్ హింద్ Arzi Hukumate Azad Hind కు చెందినవారు. వారు స్వేచ్ఛా భారత రాజ్య సార్వభౌమత్వాన్ని గుర్తించారు మరియు బ్రిటిష్ సార్వభౌమాధికారాన్ని కాదు అని వారి తరుపున వాదించారు.
విచారణ ప్రారంభమైనప్పుడు ఎర్రకోట వెలుపల ప్రజా సామూహిక ప్రదర్శన జరుగుతుంది.
ప్రజలు ట్రయల్స్ పై తమ తీవ్ర ఆగ్రహానికి స్వరం ఇచ్చారు:
లాల్ ఖైలే సే ఆయే ఆవాజ్, సహల్, ధిల్లాన్ హబీబ్, షా నవాజ్,
చారూన్ కి హో ఉమర్ దరాజ్
(అర్థం - ఎర్రకోట ప్రతిధ్వనిస్తుంది. “సహగల్, ధిల్లాన్, హబీబ్, షా నవాజ్, నలుగురు దీర్ఘకాలం జీవించుగాక ”)
31 డిసెంబర్ 1945 విచారణ చివరి రోజు. ఈ విచారణ భారతదేశ స్వాతంత్ర్య
పోరాటంలో ఒక ముఖ్యమైన మలుపు గా మారింది. కల్నల్ హబీబుర్ రెహమాన్ ఖాన్తో పాటు అతని
ముగ్గురు సహచరులు కల్నల్ ప్రేమ్ కుమార్ సాహిల్, కల్నల్ ధిల్లాన్ మరియు మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్ భారతదేశం స్వేచ్ఛ కోసం
పోరాడుతున్న చిహ్నంగా మారారు.
విచారణ తీర్పు 1946 జనవరి 1 న వచ్చింది. ఈ నలుగురూ రాజు చక్రవర్తిపై యుద్ధం చేసినందుకు దోషులుగా తేలారు.కమాండర్-ఇన్-చీఫ్, క్లాడ్ ఆచిన్లెక్ ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, జీవిత బహిష్కరణకు శిక్ష deportation of life విధించాలని నిర్ణయించుకున్నాడు
మరియు తరువాత వారు విడుదలయ్యారు.
INA యొక్క నలుగురు సభ్యుల విడుదల సంఘటన జాతీయ స్థాయిలో ముఖ్యమైనది. భారత జాతీయ
సైన్యం ప్రారంభించిన స్వాతంత్ర్య పోరాటం యొక్క విశ్వసనీయత INA యొక్క మరియు చట్టబద్ధతను పెంచింది. విడుదలైన మరుసటి
రోజు, 4 జనవరి 1946, డిల్లి దాని పరిసరాలన్నీ డిల్లి చరిత్రలో ఎప్పుడూ
నిర్వహించని ర్యాలీ తో నిండి పోయినవి.
హబీబ్ ఉర్ రెహ్మాన్-కుటుంభం
హబీబ్ ఉర్ రెహ్మాన్ బాద్షా బేగంను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక
కుమారుడు, కుమార్తె ఉన్నారు.
మరణం :
1978 లో హబీబ్ ఉర్ రెహ్మాన్ మరణించాడు మరియు 26 డిసెంబర్ 1978 న పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని భీంబర్లోని తన
పూర్వీకుల గ్రామమైన పంజేరిలో ఖననం చేయబడ్డాడు.
No comments:
Post a Comment