13 March 2020

: కెప్టెన్ అబ్బాస్ అలీ: నిజమైన దేశభక్తుడు Captain Abbas Ali: a true patriot


Image result for Captain Abbas Ali

Captain Abbas Ali
కెప్టెన్ అబ్బాస్ అలీ 1920 జనవరి 3 న ముస్లిం రాజ్‌పుట్ జమీందార్ కుటుంబంలో ఉత్తర ప్రదేశ్‌లోని బులంద్‌షహర్ జిల్లాలోని ఖుర్జాలో జన్మించాడు. అతను స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందినవాడు మరియు అతని తాత రుస్తం అలీ ఖాన్ 1857 నాటి ప్రధమ భారత తిరుగుబాటులో అంగ్లేయులచే ఉరితీయబడినాడు. అతని తండ్రి జనబ్ అయూబ్ అలీ ఖాన్ బ్రిటిష్ సైన్యం లో దఫదర్ (Dafadar) గా   మొదటి ప్రపంచ యుద్ధంలో ఏడెన్ (యెమెన్) లో పనిచేశారు. తన ప్రారంభ రోజుల నుండి కెప్టెన్ అబ్బాస్ అలీ విప్లవాత్మక ఆలోచనల నుండి ప్రేరణ పొందాడు మరియు భారత స్వాతంత్య్ర ఉద్యమం పట్ల ఆకర్షితుడయ్యాడు.

లాహోర్‌లో 1931 మార్చి 23 న షాహీద్-ఎ-అజామ్ భగత్ సింగ్‌ను ఉరితీసినప్పుడు, కెప్టెన్ అబ్బాస్ అలీ పదకొండు సంవత్సరాల వయస్సులో షహీద్ భగత్ సింగ్ కు విధించిన మరణశిక్షను వ్యతిరేకిస్తూ ఖుర్జా లో 1931 మార్చి 25 న జరిగిన నిరసన ప్రదర్శనలో పాల్గొన్నాడు. నిరసన ప్రదర్శన లో షహీద్ భగత్ సింగ్ జ్ఞాపకార్థం “భగత్ సింగ్ తుమ్హైన్ ఫిర్ సే ఆనా పడేగా, హుకుమత్ కో జల్వా దిఖానా పడేగా”  అనే దేశభక్తి గీతాన్ని పాడారు:

కెప్టెన్ అబ్బాస్ అలీ భగత్ సింగ్ స్థాపించిన “నౌజవన్ భారత్ సభNBS” లో సబ్యునిగా చేరాడు మరియు అతను పాఠశాల రోజులలో  “ఎన్బిఎస్NBS” కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొన్నాడు.

1937 లో హైస్కూల్ పూర్తి చేసిన తరువాత, ఉన్నత చదువుల కోసం అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి వెళ్ళాడు. అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో అతనికి అప్పటి గొప్ప కమ్యూనిస్ట్ నాయకుడు ప్రొఫెసర్ కున్వర్ ముహమ్మద్ అష్రాఫ్‌తో పరిచయం ఏర్పడింది. అతని ప్రేరణతో అతను 1936 లో స్థాపించబడిన వామపక్ష పార్టీల విద్యార్థి విభాగం ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ (AISF) లో చేరాడు, తరువాత రెండవ ప్రపంచ యుద్ధం (1939-45) సమయంలో 1939 లో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (JCO) గా బ్రిటిష్ ఆర్మీ (RIASC) లో చేరాడు.


రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కెప్టెన్ అబ్బాస్ అలీ రాయల్ ఇండియన్ ఆర్మీ సప్లై కార్ప్స్ RIASC లో ఉన్నాడు మరియు అప్పటి యునైటెడ్ ఇండియా మరియు సౌత్ ఈస్ట్ ఆసియాలోని వివిధ ప్రదేశాలలో ఆఫీసర్స్ ట్రైనింగ్ స్కూల్ బెంగళూరు, RIASC డిపో ఫిరోజ్‌పూర్ (పంజాబ్), వజీరిస్తాన్ (NWFP), నౌషెరా (ఎన్‌డబ్ల్యుఎఫ్‌పి) ఖాన్‌పూర్ క్యాంప్ (డిల్లి), బరేలీ కంటోన్మెంట్ (యునైటెడ్ ప్రావిన్స్), భివాండి ఆర్మీ ట్రైనింగ్ క్యాంప్ (మహారాష్ట్ర), సింగపూర్, ఇపో, పెనాంగ్, కౌలాలంపూర్ (మలయా ఇప్పుడు మలేషియా) మరియు అరకాన్, రంగూన్ (ఇప్పుడు యాంగూన్-బర్మా-మేన్మార్) లో పనిచేసాడు.

సౌత్ ఈస్ట్ ఆసియాలోని  బ్రిటిష్ దళాలపై జపనీస్ దళాలు దాడి చేసినప్పుడు, కెప్టెన్ అబ్బాస్ అలీ జపనీస్ దళాలతో పోరాడారు, కాని జపాన్ వారు  రెండు ప్రధాన బ్రిటిష్ యుద్ధ నౌకలను నాశనం చేసిన తరువాత బ్రిటిష్ జనరల్ పెర్సివాల్ బ్రిటిష్ సైన్యాలతో లొంగిపోయినప్పుడు, కెప్టెన్ అబ్బాస్ అలీ జపనీస్ సైన్యానికి యుద్ధ ఖైదీ అయ్యాడు (POW). ఈ బందిఖానాలో ఉన్నప్పుడు అతను జనరల్ మోహన్ సింగ్ స్థాపించిన ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) లేదా ఆజాద్ హింద్ ఫౌజ్‌లో చేరాడు.

1945 లో, నేతాజీ సుభాష్ చంద్రబోస్ సింగపూర్ చేరుకుని, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను పునర్వ్యవస్థీకరించినప్పుడు, కెప్టెన్ అబ్బాస్ అలీ  “మిషన్ దిల్లీ చలో” లో చురుకుగా పాల్గొన్నాడు. నేతాజీ ఆనాటి చివరి మొఘల్ రాజు బహదూర్షా జాఫర్ సమాధి వద్ద భారత జాతీయ సైన్యాన్ని ఉద్దేశించి ప్రసంగించినప్పుడు, అబ్బాస్ అలీ అక్కడ ఉన్నారు.

తరువాత, అతను అరకాన్(బర్మా) లో  INA తరుపున  బ్రిటిష్ భారత సైన్యంతో పోరాడాడు, కాని జపనీస్ దళాలు మిత్రరాజ్యాల ముందు లొంగిపోయినప్పుడు అబ్బాస్ అలీతో పాటు అరవై వేల మంది సైనికులను అరెస్టు చేశారు.

ఐఎన్ఎ హీరోలలో ముగ్గురు ధిల్లాన్, సెహగల్ మరియు షహనావాజ్లను ఎర్ర కోటలో ఉంచి అక్కడ వారిపై విచారణ జరిపారు. అబ్బాస్ అలీని అతని ముగ్గురు సహచరులతో కలిసి ముల్తాన్ కోటలో ఉంచి  విచారించారు మరియు కోర్టు మార్షల్ చేసి 1946 లో మరణశిక్ష విధించారు. ఈలోగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ 3 సెప్టెంబర్ 1946 న తాత్కాలిక ప్రధానమంత్రి అయ్యారు మరియు 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. ఆయనను భారత ప్రభుత్వం విడుదల చేసింది.
1947 లో విడుదలైన తరువాత, కెప్టెన్ అబ్బాస్ అలీ స్వేచ్ఛా భారత సైన్యంలో చేరాలని అనుకొన్నాడు కాని అప్పటి ఇండియన్ ఆర్మీ చీఫ్ జనరల్ కారియప్ప, మాజీ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ యొక్క మాజీ సైనికులను స్వతంత్ర భారతదేశం యొక్క కొత్త సైన్యంలోకి తీసుకోలేనని ప్రకటించాడు. అతని ఆదేశాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆమోదించింది.

త్యాగాలు చేసిన INA సైనికులకు భారత ప్రభుత్వం ఎటువంటి పరిహారం ఇవ్వలేదు మరియు డెబ్బైల ప్రారంభంలో వీరిని స్వాతంత్య్ర సమరయోధులుగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కాని ఆయన స్వాతంత్ర్య సమరయోధుల పెన్షన్ కోసం ఎప్పుడూ దరఖాస్తు చేయలేదు.

దేశ విభజన తరువాత అతని కుటుంబ సభ్యులు చాలా మంది పాకిస్తాన్కు వలస వచ్చారు, కాని అతను మరియు అతని తండ్రి ఇక్కడే ఉండి తమ మాతృభూమికి సేవ చేయాలని నిర్ణయించుకున్నారు.

1948 లో కెప్టెన్ అబ్బాస్ అలీ ఆచార్య నరేంద్ర దేవ్, జయప్రకాష్ నారాయణ్ మరియు డాక్టర్ రామ్మనోహర్ లోహియా నేతృత్వంలోని సోషలిస్ట్ పార్టీలో చేరారు మరియు 1977 లో జనతా పార్టీ తో విలీనం అయ్యే వరకు అన్ని సోషలిస్ట్ పార్టీలతో అనగా  సోషలిస్ట్ పార్టీ, ప్రజ సోషలిస్ట్ పార్టీ, సoయుక్త సోషలిస్ట్ పార్టీ మరియు సోషలిస్ట్ పార్టీలతో సంబంధం కలిగి ఉన్నారు.

1966-67లో ఆయన సంయుక్త సోషలిస్ట్ పార్టీ (ఎస్ఎస్పి) యొక్క ఉత్తర ప్రదేశ్ యూనిట్ యొక్క జనరల్ సెక్రటరీ మరియు 1973-74లో సోషలిస్ట్ పార్టీ యొక్క ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు మరియు సోషలిస్ట్ పార్టీ యొక్క జాతీయ కార్యనిర్వాహక సభ్యుడు మరియు 1974-77 దాని పార్లమెంటరీ బోర్డు సభ్యుడుగా వ్యవరించారు..

1967 లో అతను /సoయుక్తా సోషలిస్ట్ పార్టీSSP రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నప్పుడు, చౌదరి చరణ్ సింగ్ నేతృత్వంలో ఉత్తర ప్రదేశ్ లో మొదటి కాంగ్రేసేతర సంయుఖ్త విదాయక్  దళ్ (ఎస్విడిSVD) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు.

సోషలిస్ట్ ఉద్యమంలో (1948-74) ఆయన 50 కన్నా ఎక్కువసార్లు అరెస్టు చేయబడ్డారు. ఎమర్జెన్సీ లో జైలు శిక్ష అనుభవించారు, మరియు 1977 లో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసినప్పుడు మరియు జనతా పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అతను జనతా పార్టీ ఉత్తర ప్రదేశ్ యూనిట్ మొదటి అధ్యక్షుడు.

1978 లో యూపీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌కు ఆరేళ్లపాటు ఎన్నికయ్యారు. అతను ఆరు సంవత్సరాలు యుపి సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు సభ్యుడిగా ఉన్నాడు మరియు ఆలీగర్  లో 2014 అక్టోబర్ 11 న కన్నుమూశారు.


No comments:

Post a Comment