24 March 2020

ఉదయయిస్తున్న నూతన భారతీయ ముస్లిం మహిళ



Image result for Image result for hindian flag waving  indian muslim women 


ఇటీవలి సంవత్సరాలలో సరికొత్త  ముస్లిం మహిళ ఆవిర్భావం చూశాము. ఆమె ధైర్యంగా, నిర్భయంగా  మాట్లాడుతుంది. ఆమె తన ఇంటి నాలుగు గోడలకు పరిమితం కావడానికి ఇష్టపడలేదు మరియు దేశంలో జరుగుతున్న ప్రజాస్వామ్య ప్రక్రియ లో పాల్గొనాలని కోరుకుంటుంది. ముఖ్యముగా సనాతన మతాధికారులు తనకు ప్రాతినిధ్యం వహిస్తారని ఆమె విశ్వసించుటలేదు. ఒక పౌరుడిగా మరియు ఒక ముస్లింగా తన హక్కుల గురించి ఆమెకు తెలుసు.  తన హక్కులను ఎవరైనా ఉల్లంఘించడాన్ని ఆమె సహించదు.


సాధారణ ముస్లిం మహిళలు మతాన్ని పౌరసత్వానికి అర్హత గా మార్చే వివక్షత మరియు అన్యాయపూరితమైన  చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు.


ముస్లిం మహిళలు మేము భారతీయులం, మేము ముస్లింలు అని గర్వంగా చెబుతున్నారు.

రాజ్యాంగంలో పొందుపరచబడిన న్యాయం, సమానత్వం, లౌకికవాదం మరియు ప్రజాస్వామ్య విలువలను ప్రేరేపించే కొత్త వ్యవస్థకు శ్రీకారం చూడుతున్నారు.


జనాభా లెక్కలు మరియు ఇతర అధికారిక సమాచారం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ముస్లింలు వెనుకబాటుతనం మరియు పేదరికంలోకి ఉన్నారని సూచిస్తున్నాయి. లౌకిక రాజకీయ పార్టీలు వారిని ఓటుబ్యాంక్లుగా పరిగణించాయి. వారి నిజమైన సంక్షేమం మరియు వారి  రాజకీయ  ప్రాతినిద్యం గురించి పెద్దగా ఏమి చేయలేదు.


ముస్లింలు తక్కువ విద్య స్థాయిలతో, అధికారిక ఉద్యోగాలు లేకుండా, రుణ మరియు ఆరోగ్య సంరక్షణ విషయాలలో ప్రభుత్వ సౌకర్యాలు/సదుపాయాలు  లేకుండా ఘెట్టోల్లో నివసిస్తున్నారు.

100 మంది ముస్లింలలో నలుగురు మాత్రమే గ్రాడ్యుయేట్లు, మరియు కేవలం 13% మంది జీతాల(Salary) ఉద్యోగాలు కలిగి ఉన్నారు.


వివిధ రాజకీయ పార్టీలు పాటిస్తున్న మత రాజకీయాలకు ముస్లిం ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. ముస్లిం సమాజంలో ప్రజాస్వామ్య నాయకత్వం లేకపోవడం సమస్యకు మరింత దోహదపడింది. కానీ మహిళల ప్రజాస్వామ్య నాయకత్వం విషయాలను మార్చగలదు.



ప్రస్తుత దశాబ్దంలో మహిళల నాయకత్వం కొత్త స్వరం రూపుదిద్దుకుంటోంది. ఇది అందరికీ పరస్పర గౌరవం, సామరస్యం మరియు న్యాయం కోరుకునే స్వరం. తోటి భారత పౌరులు గొంతును స్వాగతిస్తున్నారు. ఇది  మన ప్రజాస్వామ్యానికి ఒక మంచి సంకేతం
.

మహిళల స్వరం సమాజంలో కూడా బలాన్ని మరియు అందరి మద్దతును పొందుతోంది. మహిళలు ఖురాన్ మరియు దానిలోని లింగ న్యాయ సూత్రాల గురించి అనర్గళంగా మాట్లాడుతున్నారు. సాధారణ మహిళలు CAA మరియు NRC కలయిక నుండి తమ పౌరసత్వానికి వచ్చే ముప్పును గ్రహించారు.దేశంలోని వివిధ ప్రాంతాల్లోని విద్యార్థుల నేతృత్వంలోని నిరసనల్లో పాల్గొనడం ద్వారా వారు తమ భారతీయతను నొక్కిచెప్పారు.


జాతీయ జెండాను పుతున్న తోటి స్వదేశీయులతో కలిసి నిరసన తెలిపిన ముస్లిం మహిళలు అద్భుతమైన దేశభక్తికి ఉదాహరణ. ఇది భారతదేశం యొక్క వైవిధ్యం మరియు బహుళత్వం కు సoకేతం.



No comments:

Post a Comment