6 March 2020

మౌల్వి అల్లావుద్దీన్ Maulvi Allauddin



Image result for mouulvi allavuddin



అండమాన్ సెల్యులార్ జైలు రికార్డుల నుండి మౌల్వి అల్లావుద్దీన్ యొక్క అన్డేటెడ్ చిత్రం

మౌల్వి అల్లావుద్దీన్ గా పిలవబడే సయ్యద్ అల్లావుద్దీన్ హైదర్ 1824సంవత్సరం లో ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాలో జన్మించాడు మరియు అతని తండ్రి పేరు హఫిజుల్ల. ఇతను హైదరాబాద్ లోని మక్కా మసీదు కు చెందిన భోధకుడు మరియు ఇమాం. మౌల్వి అల్లావుద్దీన్ పెర్షియన్, ఉర్దూ, తెలుగు మరియు పదునైన బుద్ధిగల మేధావి.

భారతదేశం యొక్క దక్షిణ భాగంలో కూడా అనేక స్వాతంత్ర్య పోరాటాలు జరిగాయి. మౌల్వి అల్లావుద్దీన్ హైదరాబాద్ రాజ్యం లో 1857 నాటి తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు.

1857-07-17న నిజం రాజ్యం హైదరాబాద్ లో బ్రిటీష్ రెసిడెన్సీ పై జరిగిన  దాడికి నాయకత్వం వహించి ప్రసిద్ది చెందారు. జమీందర్ చీదా ఖాన్‌ను బ్రిటిష్ వారు అరెస్టు చేసి హైదరాబాద్‌లోని రెసిడెన్సీ భవనంలో బంధించినప్పుడు బ్రిటిష్ దళాలపై దాడి చేయాలని నిర్ణయించుకున్నాడు. నమాజ్ తరువాత 1857 జూలై 17, మౌల్వి అల్లావుద్దీన్ తన స్నేహితుడు తుర్రేబాజ్ ఖాన్ మరియు 500 మంది ఇతర స్వాతంత్ర్య సమరయోధులతో కలసి   బ్రిటిష్ రెసిడెన్సీ భవనంపై దాడి చేశారు. నాటి 1857  తిరుగుబాటు సమయం లో ఈ దాడి జరిగింది.


బ్రిటిష్ దళాలు కాల్పులు జరిపాయి నిరసనకారులు కొన్ని గంటలు ఎదురుదాడిని ఎదుర్కొన్నారు, కాని తరువాత వెనక్కి వెళ్ళవలసి వచ్చింది. నిజాం మంత్రి సాలార్ జంగ్ మౌల్వి మరియు అతని స్నేహితుడికి ద్రోహం చేసి బ్రిటిష్ వారి పక్షాన ఉండటంతో ఈ దాడి విఫలమైంది. తుర్రేబాజ్ ఖాన్ అరెస్టు చేయబడగా, మౌల్వి అలావుద్దీన్ పారిపోగలిగాడు.

మౌల్వి అల్లావుద్దీన్‌ను త్వరలోనే అతన్ని బంధించి భారతీయ శిక్షాస్మృతి కింద విచారించారు.. అతనికి జీవిత ఖైదు విధించి అండమాన్ సెల్యులార్ జైలుకు పంపారు (దీనిని కాలా పానీ అని కూడా పిలుస్తారు). 1859 జూన్ 28 న అతన్ని హైదరాబాద్ నుండి సెల్యులార్ జైలుకు పంపించారు.

రెసిడెన్సీపై దాడి సమయంలో తుపాకీ కాల్పుల కారణంగా మౌల్వి కుడి చేయి స్తంభించిపోయింది. అతని భుజం మరియు నుదిటిపై కత్తి గాయాలు అయినవి. ఆరోగ్యం మరియు మంచి ప్రవర్తన ఆధారంగా విడుదల చేయాలని మౌల్వి పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ అవి  తిరస్కరించబడ్డాయి. దాదాపు 30 సంవత్సరాలు జైలులో ఉండి  ఆయన 64-65 ఏళ్ల వయస్సు లో 1889 లో సెల్యులార్ జైలులో  మరణించాడు.

అండమాన్ సెల్యులార్ జైలులో  శిక్ష అనుభవించిన మొదటి భారత ఖైదీ ఇతడు. దురదృష్టవశాత్తు భారతదేశం మరియు హైదరాబాద్ ప్రజలకు  అతని గురించి తెలియదు.  

2005 సంవత్సరంలో వాయిస్ ఆఫ్ తెలంగాణ (VOT) పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మౌల్వి అల్లావుద్దీన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని అభ్యర్థించారు.

No comments:

Post a Comment