6 March 2020

సిరాజ్ ఉద్-డౌలా



Image result for siraj ud daulah


అంతపుర కుట్రలతో మొఘల్ సామ్రాజ్యం పతనం అయిన తరువాత ప్రాంతీయ రాజ్యాలు బలవంతం అయినవి. అటువంటి రాజ్యాలలో బెంగాల్ సుభా (బెంగాల్, ఒరిస్సా మరియు బీహార్) ముఖ్యమైనది. బెంగాల్ ప్రావిన్సు చరిత్రలో మీర్జా ముహమ్మద్ సిరాజుద్దౌలా పేరు ప్రముఖమైనది.


మీర్జా ముహమ్మద్ సిరాజుద్దౌలా 1733 లో జైనుద్దీన్ అహ్మద్ ఖాన్ మరియు అమీనా బేగం దంపతులకు జన్మించాడు. ఆయన పుట్టిన వెంటనే, సిరాజ్ తాత మీర్జా ముహమ్మద్ అలీవర్ది ఖాన్ బీహార్ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులయ్యారు. అలీవర్ది ఖాన్‌కు కుమారులు లేరు అలీవర్ది ఖాన్‌ ఇంట్లో సిరాజ్ ఉద్ దౌలా ఇంట్లో చదువుకున్నాడు మరియు  పరిపాలన కళతో సహా అనేక విషయాలలో  శిక్షణ పొందాడు.


1746 ఆగస్టులో ఇరిజ్ ఖాన్ అనే కులీనుడి కుమార్తె ఉమ్దతున్నిసాతో సిరాజుద్దౌలా వివాహం జరిగింది. కొంతకాలం తర్వాత ఉమ్దతున్నిసా అనారోగ్యం తో మరణించినది  మరియు సిరాజుద్దౌలా లుట్ఫునిసా బేగం ను వివాహం చేసుకొన్నాడు.  వారికి ఒక కుమార్తె జోహ్రా బేగం పుట్టింది.


మే 1752 లో అలివర్ది ఖాన్ తన వారసుడిగా సిరాజుద్దౌలాను ప్రకటించాడు. దీనికి బెంగాల్‌లోని యూరోపియన్ వాణిజ్య సంస్థలు కూడా  తమ మద్దతును ప్రకటించాయి. 1756 ఏప్రిల్ 17 న అలీవర్ది ఖాన్ మరణించాడు. తన మరణానికి ముందు, అలీవర్ది ఖాన్ ప్రావిన్స్ లోని ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని, ప్రజలతో  స్నేహాన్ని పెంపొందించుకోవాలని, తన వారసత్వాన్ని అనుసరించాలని  సిరాజుద్దౌలా ను కోరాడు.


తుచ్ఛమైన అసూయ మరియు ద్వేషంతో, సిరాజుద్దౌలా తల్లి సోదరి ఘాసేటి బేగం, మీర్ జాఫర్, శావ్కట్ జంగ్ మరియు రాజా రాజ్‌బల్లాబ్ సహకారం తో కుట్రలు చేయసాగింది.  సిరాజుద్దౌలా కుట్రదారులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకొన్నాడు. అతను మోతీజీల్ ప్యాలెస్ నుండి ఘసేటి బేగం సంపదను స్వాధీనం చేసుకుని ఆమెను నిర్బంధంలో ఉంచాడు.




తరువాత సిరాజుద్దౌలా ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కి వ్యతిరేకంగా ప్రవర్తిoచసాగాడు. తన అనుమతి లేకుండా వారు ఫోర్ట్ విలియం చుట్టూ కోటను బలోపేతం చేశారని, వాణిజ్య అధికారాలను తీవ్రంగా దుర్వినియోగం చేశారని, దీని వల్ల ప్రభుత్వం కస్టమ్ సుంకాలను భారీగా కోల్పోయిందని మరియు వారు ప్రభుత్వ నిధులను ఖజానా నుండి అపహరించిన  రాజా రాజ్‌బల్లాబ్ కుమారుడు క్రిస్నాదాస్ వంటి తన శత్రువులకు ఆశ్రయం కల్పించారని కంపెనీపై తీవ్ర  ఆరోపణలు చేసాడు.


ఆంగ్లేయులు తన ఫిర్యాదులను పరిష్కరించి  వాణిజ్య నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉంటే వారితో స్నేహసంభంధాలను కొనసాగిస్తానని  సిరాజ్ ఉద్ దౌలా తన ఉద్దేశాలను స్పష్టం చేశాడు. కానీ కంపెనీ సిరాజ్ ఉద్ దౌలా డిమాండ్లను పట్టించుకోలేదు. పైగా అతనిని అవమాన పరచే విధంగా ప్రవర్తించారు.



 కోపంతో ఉన్న నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా కాసేంబజార్‌పై దాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నాడు మరియు అక్కడ ఉన్న ఆంగ్లేయులందరినీ అదుపులోకి తీసుకున్నారు. కాసేంబజార్ నుండి సిరాజుద్దౌలా కలకత్తాపై దాడి చేసినాడు.  కలకత్తా కోటను రక్షించడానికి డచ్ మరియు ఆంగ్లేయులతో సహా 160 మంది సిపాయిలు కలరు.


సిరాజుద్దౌలా సైన్యం తన విజయ పరంపరను  కొనసాగించింది. గవర్నర్ డ్రేక్, నది మధ్యలో ఉన్న ఓడకు తప్పించుకున్నాడు, జోన్ హోల్వెల్ గవర్నర్ మరియు కలకత్తా కమాండర్గా వ్యవరించసాగాడు. హోల్వెల్ ఆదేశాలను అతని సైనికులు వినలేదు. డచ్ బృందం నవాబు సిరాజుద్దౌలా సైన్యంతో చేతులు కలిపింది. ఆంగ్లేయులు  లొంగిపోయారు. సిరాజుద్దౌలా సిక్కు బ్యాంకర్ మరియు బుర్ద్వాన్ రాజా యొక్క దివాన్ అయిన మణిక్‌చంద్ కు బాధ్యతలను విడిచిపెట్టి కలకత్తా వెడలినాడు.


జూన్ 1756 లో, నవాబ్ సిరాజుద్దౌలా తన నమ్మకాని తిరిగి పొందిన  మీర్ జాఫర్‌తో కలిసి అధికారికంగా కలకత్తా కోటలోకి ప్రవేశించారు.నవాబ్ కోట యొక్క ఖజానాలో కేవలం 50 వేల రూపాయలు మాత్రమే కనుగొన్నాడు. సుమారు 50 మంది ఆంగ్లేయులను అదుపులోకి తీసుకున్నారు, వారిలో కొంతమందిని మరింత ప్రశ్నించడానికి 18x15 అడుగుల కొలత గల ఒక తలుపు మరియు చిన్న కిటికీతో ఉన్న  ఒక గది 'బ్లాక్ హోల్' లోకి విసిరివేశారు,ఈ గది నుంచి 23 మరియు ఒక మహిళ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.


సిరాజ్ ఉద్ దౌలా యొక్క యువ కజిన్, దుల్లార్డ్, తనకు అనుకూలంగా ముస్నాద్ ను విడిచిపెట్టమని కోరుతూ సిరాజ్కు ఒక లేఖ రాశాడు. ఈ లేఖను అందుకున్న సిరాజుద్దౌలా, మీర్ జాఫర్ మరియు రాజా మోహన్ లాల్ కాశ్మీరీలను సైన్యంతో సహా  వెంటనే పూర్నియాకు వెళ్లమని ఆదేశించాడు.



రెండు సైన్యాలు పూర్నియాకు దగ్గరగా కలుసుకున్నాయి మరియు ఘర్షణలో  షాకాట్ చనిపోయాడు. మోహన్ లాల్ పూర్ణియాలోకి ప్రవేశించి, షావ్కత్ కుటుంబం మరియు సంపదను స్వాధీనం చేసుకుని ముర్షిదాబాద్కు తిరిగి వచ్చాడు.


ఇది ఇలా ఉండగా  ఆంగ్లేయులు సిరాజుద్దౌలాను పడగొట్టడానికి మరియు అతని స్థానంలో ఒక తోలుబొమ్మను తిరిగి స్థాపించడానికి తీవ్రమైన రాజకీయ మరియు రహస్య కార్యకలాపాలను చేయసాగారు.. ఇందుకోసం కంపెనీ మీర్ జాఫర్, జగత్ శేత్ మరియు ఇతరుల సహకారంతో నవాబు సిరాజుద్దౌలాకి  వ్యతిరేకంగా కుట్రలు పన్నసాగినది. రాబర్ట్ క్లైవ్ మరియు చార్లెస్ వాట్సన్ ఆధ్వర్యంలోని కంపెని దళాలు ముర్షిదాబాద్ వైపు వెళ్ళాయి.



ప్లాస్సీ దగ్గిర నవాబ్ సిరాజ్ ఉద్ దౌలా కంపెని దళాలను దృడ నిశ్చయంతో ఎదుర్కొన్నాడు. రెండు వైపుల నుండి భారీ ఫిరంగి దాడి ప్రారంభమైంది. సిరాజ్ ఉద్ దౌలా సైన్యం యొక్క కమాండర్ అయిన మీర్ మార్డెన్ ఫిరంగి దెబ్బకు సిరాజ్ ఉద్ దౌలా కళ్ళముందు చనిపోయాడు.  యుద్దంలో ఓటమిని ఎదుర్కొంటున్న సిరాజుద్దౌలా దేశ గౌరవాన్ని కాపాడాలని మీర్ జాఫర్‌ను వేడుకున్నాడు.


కాని మీర్ జాఫర్ నమ్మక ద్రోహం తో సిరాజుద్దౌలాకు సహాయం చేయలేదు. నవాబ్ సిరాజుద్దౌలా నమ్మకమైన కాపలాదారులతో కలిసి తన రాజధాని ముషిరాబాద్ వైపు తప్పించుకొన్నాడు.  ముర్షిదాబాద్ నుండి వెడలి  అతను పిర్జాడా డానా షా వద్ద ఆశ్రయం పొందాడు.


పిర్జాడా డానా షా అతన్ని మర్యాదపూర్వకంగా ఆహ్వానించినప్పటికీ, సిరాజ్‌ గురించిన సమాచారం మీర్ కసెం అలీ ఖాన్‌కు అందజేశారు.. మీర్ కసెం అలీ ఖాన్  సిరాజుద్దౌలాను  బంధించి  సిరాజ్ మరియు అతని సహచరులను ముర్షిదాబాద్‌కు పంపి అక్కడ సిరాజ్ ను  మీర్ జాఫర్ కుమారుడు మీరాన్‌కు అప్పగించారు.


మిరాన్ సిరాజ్‌ను జైలులో పడవేసినాడు అక్కడ అతను ముహమ్మద్ బేగ్ చే హత్య చేయబడినాడు. సిరాజుద్దౌలా మృత శరీరం ముర్షిదాబాద్ వీధుల్లో కవాతు చేయబడింది.


ఈ విషాదం విన్న సిరాజ్ తల్లి అమీనా బేగం మరణించినది. మీర్ జాఫర్ మరియు మీరాన్ సిరాజ్ ప్యాలెస్‌లోకి ప్రవేశించి అతని ఆభరణాలు, నిధులను స్వాధీన పరుచుకొన్నారు.


రక్తం రక్తాన్ని మోసం చేస్తుంది. సిరాజుద్దౌలా ఒక గొప్ప భారత స్వాతంత్య్ర సమరయోధుడు, తన ప్రజల మంచి కోసం ఆంగ్లేయులను ఎదిరించాడు. చివరకు ఆంగ్లేయుల కుటిల నీతికి బంధువుల స్వార్ధానికి, నమ్మక ద్రోహానికి బలి అయ్యాడు.

No comments:

Post a Comment