18 March 2020

మొహమ్మద్ అలీ జౌహర్-భారత స్వాతంత్ర సమర యోధుడు Mohammad Ali Jauhar-Indian Freedom Fighter.




Image result for Mohammad Ali Jauhar-Indian Freedom Fighter.

భారత స్వాత్రంత పోరాట యోధులలో అలీ బ్రదర్స్(షోకత్ అలీ- మొహమ్మద్ అలీ)  ప్రముఖులు. వీరిలో చిన్నవాడు అయిన మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ అని పిలువబడే ముహమ్మద్ అలీ జౌహర్ (10 డిసెంబర్ 1878 - 4 జనవరి 1931), భారతీయ స్వాతంత్ర సమర యోధుడు, పాత్రికేయుడు మరియు కవి. ఇతడు ఖిలాఫత్ ఉద్యమ ప్రముఖ నాయకుడు.

మొహమ్మద్ అలీ జౌహర్ అలీఘర్ ఉద్యమ వారసుడు. అతను 1923 లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై  కొన్ని నెలలు పాటు పదవిలో కొనసాగినాడు. అతను అఖిల భారత ముస్లిం లీగ్ వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులలో ఒకడు.

మొహమ్మద్ అలీ 1878 లో నజీబాబాద్ (ఉత్తర ప్రదేశ్, భారతదేశం) లో జన్మించాడు. అతని తండ్రి అబ్దుల్ అలీ ఖాన్, అతని ఐదేళ్ళ వయసులో మరణించాడు. అతని సోదరులు ఖిలాఫత్ ఉద్యమానికి నాయకుడైన షౌకత్ అలీ మరియు జుల్ఫికర్. అతని తల్లి అబాది బేగం (1852-1924) ను అందరు ఆప్యాయంగా బి అమ్మ అని పిలుస్తారు, ఆమె తన కుమారులను  వలసరాజ్యాల పాలన నుండి స్వేచ్ఛ కోసం పోరాడే ధీరులుగా తిర్చిదిద్దారు.. ఆమె తన కుమారులకు ఆధునిక ఆంగ్ల విద్య నేర్పించారు.

జౌహర్ అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో చదివాడు మరియు 1898 లో ఆక్స్ఫర్డ్ లోని లింకన్ కాలేజీలో ఆధునిక చరిత్రను అభ్యసించాడు.

భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత, అతను రాంపూర్ రాష్ట్రానికి విద్యా డైరెక్టర్‌గా పనిచేశాడు, తరువాత బరోడా సివిల్ సర్విస్ లో  చేరాడు. అతను టైమ్స్, లండన్, ది మాంచెస్టర్ గార్డియన్ మరియు ది అబ్జర్వర్ వంటి ప్రధాన బ్రిటీష్ మరియు భారతీయ వార్తాపత్రికలలో వ్యాసాలు వ్రాస్తూ, వక్తగా మరియు దూరదృష్టిగల రాజకీయ నాయకుడిగా రూపుదిద్దబడ్డారు.

అతను 1911 లో కలకత్తాలో ది కామ్రేడ్ అనే ఆంగ్ల వారపత్రికను ప్రారంభించాడు. 1913 లో ఉర్దూ భాషా దినపత్రిక “హామ్‌దర్ద్”  ను ప్రారంభించాడు. అతను 1902 లో అమ్జాది బానో బేగం ను వివాహం చేసుకున్నాడు. అమ్జాది బేగం జాతీయ మరియు ఖిలాఫత్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.

ముహమ్మద్ అలీ జౌహర్  అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడ్డాడు మరియు 1920 లో జామియా మిలియా ఇస్లామియా యొక్క సహ వ్యవస్థాపకులలో ఒకడు, తరువాత దీనిని డిల్లి కి తరలించారు.

1906 లో డక్కాలో జరిగిన అఖిల భారత ముస్లిం లీగ్ వ్యవస్థాపక సమావేశానికి జౌహర్ హాజరయ్యారు మరియు 1918 లో దాని అధ్యక్షుడిగా పనిచేశారు. అతను 1928 వరకు లీగ్‌లో చురుకుగా ఉన్నాడు. మొహమ్మద్ అలీ జౌహర్ దేశంలోని అతి ముఖ్యమైన రాజకీయ పార్టీలు-ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ మరియు ఖిలాఫత్ ఉద్యమం. కు ప్రాతినిద్యం వహించారు.


అతను 1919 లో ఇంగ్లాండ్ వెళ్ళిన ముస్లిం ప్రతినిధి బృందానికి ప్రాతినిధ్యం వహించాడు, బ్రిటిష్ ప్రభుత్వం వారి డిమాండ్లను తిరస్కరించడంతో ఖిలాఫత్ కమిటీ ఏర్పడింది, ఇది భారతదేశం లోని  ముస్లింలను బ్రిటిష్ ప్రభుత్వాన్ని నిరసిస్తూ బహిష్కరించాలని ఆదేశించింది.

1921 లో మౌలానా అనే గౌరవనీయమైన బిరుదును పొంది ఆనాటి ముస్లిం జాతీయవాదులైన షౌకత్ అలీ, మౌలానా ఆజాద్, హకీమ్ అజ్మల్ ఖాన్, ముక్తార్ అహ్మద్ అన్సారీ, సయ్యద్ అటా ఉల్లా షా బుఖారీ మరియు మహాత్మా గాంధీలతో బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఐక్యతను ప్రదర్శిస్తూ ఒక విస్తృత కూటమి ఏర్పచినాడు. జాతీయ పౌర ప్రతిఘటన ఉద్యమం కోసం గాంధీ పిలుపుని కూడా జౌహర్ హృదయపూర్వకంగా సమర్థించారు మరియు భారతదేశం అంతటా అనేక వందల నిరసనలు మరియు సమ్మెలకు ప్రేరణ ఇచ్చారు. ఖిలాఫత్ కాన్ఫరెన్స్ సమావేశంలో దేశద్రోహ ప్రసంగం చేసినందుకు అతన్ని బ్రిటిష్ అధికారులు అరెస్టు చేసి రెండేళ్లపాటు జైలులో పెట్టారు.

ఖిలాఫత్ ఉద్యమం యొక్క వైఫల్యం మరియు 1922 లో చౌరి చౌరా సంఘటన కారణంగా గాంధీ నాన్-కోపరెషన్  ఉద్యమాన్ని నిలిపివేయడం వలన జౌహర్ నిరాశ చెంది  తన “హమ్దార్డ్”  దిన పత్రికను  తిరిగి ప్రారంభించాడు మరియు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టాడు.

సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శించాడు. మొహమ్మద్ అలీని బ్రిటిష్ ప్రభుత్వం జైలులో పెట్టారు. మోతీలాల్ నెహ్రూ నివేదికను ఆయన వ్యతిరేకించారు నెహ్రూ నివేదికపై అన్ని పార్టీల సమావేశానికి షౌకత్ అలీ, బేగం మొహమ్మద్ అలీ మరియు సెంట్రల్ ఖిలాఫత్ కమిటీలోని 30 మంది సభ్యులు పాల్గొన్నారు, ఇందులో అబ్దుల్ మజీద్ దర్యాబాది, ఆజాద్ సుభానీ, మఘ్ఫూర్ అహ్మద్ అజాజీ, అబుల్ మొహసిన్ మొహమ్మద్ సజ్జాద్ తదితరులు పాల్గొన్నారు.

ముస్లింల కోసం ప్రత్యేక నియోజక వర్గాలను నెహ్రూ రిపోర్ట్ తిరస్కరించడాన్ని మొహమ్మద్ అలీ వ్యతిరేకించారు మరియు ముహమ్మద్ అలీ జిన్నా మరియు ముస్లిం లీగ్ యొక్క పద్నాలుగు పాయింట్లకు మద్దతు ఇచ్చారు. అతను గాంధీకి విమర్శకుడయ్యాడు, గాంధీ మరియు భారత జాతీయ కాంగ్రెస్‌కు మద్దతునిస్తూన్న  తోటి ముస్లిం నాయకులైన మౌలానా ఆజాద్, హకీమ్ అజ్మల్ ఖాన్ మరియు ముక్తార్ అహ్మద్ అన్సారీలతో విడిపోయాడు



మొహమ్మద్ అలీకి డయాబెటిస్ మరియు జైలులో ఉన్నప్పుడు సరైన పోషకాహారం లేకపోవడం అతన్ని చాలా అనారోగ్యానికి గురిచేసింది. ఆరోగ్యం విఫలమైనప్పటికీ, అతను 1930 లో లండన్‌లో జరిగిన మొదటి రౌండ్ టేబుల్ సమావేశానికి హాజరు కావాలని అనుకున్నాడు. లండన్‌లో జరిగిన 'కాన్ఫరెన్స్'కు (ముస్లిం ప్రతినిధి బృందానికి సర్ ఆగా ఖాన్ ఛైర్మన్) హాజరయ్యారు. బ్రిటీష్ ప్రభుత్వానికి ఆయన చెప్పిన మాటలు, "దేశం విముక్తి పొందకపోతే నేము సజీవంగా భారతదేశానికి తిరిగి రాను. మరియు మీరు మాకు స్వరాజ్యం ఇవ్వకపోతే నాకు మీరు ఇక్కడ ఒక సమాధి ఇవ్వాలి.

అతను జనవరి 4, 1931 న లండన్లో స్ట్రోక్తో మరణించాడు మరియు అతని బంధువులు, స్నేహితులు మరియు అనుచరుల ఎంపిక ద్వారా జెరూసలెంలో ఖననం చేయబడ్డాడు. డోమ్ ఆఫ్ ది రాక్ సమీపంలో అతని సమాధిపై వ్రాసిన శిలా పలకం ఇలా చెబుతోంది: "ఇక్కడ అల్-సయ్యద్ ముహమ్మద్ అలీ అల్-హిందీ నిద్రిస్తున్నారు "Here lies al-Sayyid Muhammad Ali al-Hindi."

ఖ్యాతి Legacy
వివిధ ప్రదేశాలకు/సంస్థలకు  మొహమ్మద్ అలీ జౌహర్ పేరు పెట్టారు.:
·        మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ హాల్, హాల్ ఆఫ్ బాయ్స్ రెసిడెన్స్, జామియా మిలియా ఇస్లామియా, న్యూ డిల్లి,ఇండియా
·        మౌలానా ముహమ్మద్ అలీ జౌహర్ హాల్, హాల్ ఆఫ్ బాయ్స్ హోస్టల్, పంజాబ్ విశ్వవిద్యాలయం, లాహోర్ పాకిస్తాన్.
·        మౌలానా ముహమ్మద్ అలీ (MMA) హాస్టల్, మొహ్సినుల్-ఉల్-ముల్క్ హాల్, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగర్, ఇండియా
·        మౌలానా ముమ్మద్ అలీ జౌహర్ మార్గ్, న్యూ డిల్లి  
·        సదా ఇ జౌహర్ మ్యాగజైన్, ఇస్లామిక్ స్టడీస్ విభాగం, జామియా మిలియా ఇస్లామియా, న్యూ డిల్లి.
·        ముహమ్మద్ అలీ రోడ్, దక్షిణ ముంబై
·        గులిస్తాన్-ఎ-జౌహర్ పాకిస్తాన్లోని కరాచీ పరిసరాలు
·        ముహమ్మద్ అలీ పార్క్, సెంట్రల్ కోల్‌కతాలో, భారతదేశం
·        పాకిస్తాన్లోని కరాచీలో మొహమ్మద్ అలీ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ (M.A.C.H.S.)
·        పాకిస్తాన్- లాహోర్లోని జోహార్ టౌన్
·        జౌహరాబాద్, పాకిస్తాన్-పంజాబ్ లోని ఒక నగరం
·         పాకిస్తాన్‌- కరాచీలోని జౌహరాబాద్ ప్రాంతం
·        సింగపూర్‌లోని మౌలానా ముహమ్మద్ అలీ మసీదు
·        గాంధీ ముహమ్మద్ అలీ మెమోరియల్ ఇంటర్మీడియట్ కాలేజ్, ఉత్తర ప్రదేశ్, భారతదేశంలోని బల్లియా జిల్లాలోని బిల్తేరా రోడ్ పట్టణంలోని సీనియర్ సెకండరీ స్కూల్.
·        మొహమ్మద్ అలీ జౌహర్ విశ్వవిద్యాలయం, రాంపూర్, ఉత్తర ప్రదేశ్, ఇండియా
·        మౌలానా మొహమ్మద్ అలీ జౌహర్ అకాడమీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్, జామియా మిలియా ఇస్లామియా, న్యూ డిల్లి.
·        అతని ఇంగ్లీష్ జర్నలిజం చేత ప్రేరణ పొందిన, ప్రపంచ ప్రఖ్యాత ఇస్లామిక్ సెమినరీ దారుల్ ఉలూమ్ నద్వాతుల్ ఉలామా, లక్నో, ఇండియాలో ఒక ప్రత్యేక ఆంగ్ల లైబ్రరీ స్థాపించబడింది.
·        జౌహర్ హాస్టల్, సింధ్ అగ్రికల్చర్ యూనివర్శిటీ టాండో జామ్, సింధ్- పాకిస్తాన్.
·        ముహమ్మద్ అలీ జౌహర్ హయ్యర్ సెకండరీ స్కూల్, ఎలెట్టిల్, కాలికట్ జిల్లా, కేరళ, ఇండియా, 673572. ఇది సీనియర్ సెకండరీ పాఠశాల. ఉత్తర కేరళలోని వెనుకబడిన ప్రాంతంలో విద్యను ప్రోత్సహించడంలో ఈ పాఠశాల ఎంతో కృషి చేసింది.
·        మౌలానా మొహమ్మద్ అలీ రోడ్ (సాధారణంగా MM అలీ రోడ్ అని పిలుస్తారు), కేరళలోని కోజికోడ్ నగరంలో బిజీగా ఉన్న వీధి.
·        • 1978 లో అతని  జన్మదినం సందర్భంగా పాకిస్తాన్ పోస్టల్ సర్వీసెస్ మొహమ్మద్ అలీ జౌహర్ పేర  తన 'పయనీర్స్ ఆఫ్ ఫ్రీడం' సిరీస్‌లో స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది.
·        మౌలానా మొహమ్మద్ అలీ కాలేజ్, టాంగైల్, బంగ్లాదేశ్.
·        మౌలానా మొహమ్మద్ అలీ బీచ్, కాలికట్, కేరళ, అక్కడ అతను ఖిలాఫత్ ఉద్యమ సమయంలో ప్రసంగం చేశాడు.
·        మౌలానా మొహమ్మద్ అలీ రోడ్ (సాధారణంగా MM అలీ రోడ్ అని పిలుస్తారు), ధంపారా, చటోగ్రామ్, బంగ్లాదేశ్.

'యునైటెడ్ ఫెయిత్స్ ఆఫ్ ఇండియా' అనే పాత కలని నేను ఇప్పటికీ కల కంటున్నాను. "- మొహమ్మద్ అలీ; అధ్యక్ష ప్రసంగం  నుండి, I.N.C. సెషన్, 1923, కోకనాడ (ఇప్పుడు కాకినాడ).

No comments:

Post a Comment